నవ్వంటే చేదా!

ఇంద్రగంటి జానకీబాల
నవ్వంటే ఎవరికిష్టం వుండదూ? అందరికీ హాయిగా నవ్వుకోవాలనే వుంటుంది అంటారు కొందరు. కానీ అందులో పూర్తి నిజం లేదనిపిస్తుంది. కొందరికి నవ్వడంలో వుండే ఆనందం,సుఖం, ఆహ్లాదం తెలీదు. ఎప్పుడూ సీరియస్‌గా వుంటూ తీక్షణంగా చూస్తూ కాలం గడిపేస్తారు. విట్టీగా, హాస్యంగా మాట్లాడడం తెలీదు అర్ధం కాదు. చలోక్తులను సీరియస్‌గా తీసుకుని బాధ పడి పోతుంటారు. ఆ మధ్య ఒకరు నన్నే నేరుగా అడిగారు.
 ”ప్రపంచంలో ఇన్ని కస్టాలు, కన్నీళ్ళు, దుర్మార్గాలు, దురాగతాలు జరుగతుతూ, కళ్ళముందే అన్యాయాలే జరిగిపోతుంటే మనం నవ్వుకుంటూ చలోపొలోమంటూ ఎలా వుండగలం?-అని-
నా దగ్గర సమాధానం లేదు. సాటివాళ్ళు కష్టాల్లో వుంటే మనకి విహార యాత్రలేమిటి? నవ్వడం నవ్వించటం బంద్‌- బిత్తరపోయాను. అయితే ఏ వెర్రోచ్చినా కష్టమే అన్నట్టుగా ఈ మధ్య ఎలా నవ్వాలా అని తెగ బాధపడిపోతున్నారు కొందరు నవ్వుల క్లబ్బులు పెట్టుకుని పొట్ట చెక్కలైతే బాగుండును అని వాపోతున్నారు.
 కానీ నవ్వడం అనేది సహజంగా రావాలి-,ఎన్నో దు:ఖాలకు ఆలవాలమైన ఈ ప్రపంచంలో ఎన్నో అందాలు వున్నట్లే కష్టాల మధ్యలో, కన్నీళ్ళ మధ్యలో, సరదాలు హాస్యాలు చలోక్తులు చమత్కారాలు వెల్లి విరిసి నవ్వుల పువ్వులవుతూ వుంటాయి. అదే మానవ జీవితం- ఈ ప్రపంచం రచనల్లో హాస్యం సన్నగిల్లిపోయింది. హాస్యరస ప్రధానమైన కథ పత్రికలో కనిపించటమే అరుదైపోయింది – కనిపించినా అందులో హాస్యం పల్చగా వార్చినా గంజిలా వుంటోంది. ఇంక సినిమాల్లో హాస్యపు సన్నివేశాలు పెట్టి ప్రేక్షకుల్ని నవ్వించడానికి తెగ అవస్థ పడుపోతున్నారు-,  మన సినిమాల్లో, అంటే ఇప్పుడొస్తున్న సినిమాల్లో హాస్యం అంటే స్త్రీల సెక్స్‌ మీద అల్లిన చౌకబారు సన్నివేశాలు తప్ప మరేం కనిపించడం లేదు. హాస్యమంటే దొంగతనంగా చేసే శృంగారం అని నిర్ధారించారు. భార్య కళ్ళు గప్పి మరొకామెతో వెకిలి చేష్టలు చేయడం -, ఇద్దరు పెళ్ళాలు, ఒక మొగుడు- వాళ్ళ మధ్య కోట్లాలు, ఆడవాళ్ళ చేత అసహ్యాకరమైన అభినయం చేయించి అదే హాస్యంగా చెలామణి చేస్తున్నారు-, ఇది పాతిక, ముఫ్ఫై సంవత్సరాలుగా తెలుగు సినిమాకి పట్టిన దుస్ధితి, మన జీవితాల్లో – జీవనంలో సున్నితంగా, తమాషాగా జరిగే హాస్య సన్నివేశాల్ని పట్టుకోవడంలో సినిమా రచయితలు పూర్తిగా విఫలమవుతున్నారు.  బహిర్భూమికెళ్ళే సీన్లు, బాత్‌రూందగ్గర క్యూలు చూపించి జిగుత్స కలిగిస్తున్నారు. ఒకప్పుడు సన్నివేశాల్లో, సంభాషణల్లో అద్భుతమైన హాస్యం మన సినిమాల్లో వుండేది అదీకాక, హాస్యంని పాటల్లో  పెట్టి కడుపుబ్బ నవ్వించిన సందర్భాలు మనకెన్నో వున్నాయి. ఆరుద్ర, కొసరాజు, కొడకండ్ల అప్పలాచార్యలాంటి వారు ఎంతో చక్కని హాస్యం పాటలు రాశారు. ఆ దృశ్యాలు చూస్తుంటే, ఆ పాటల్లోని మాటలు వింటుంటే, ఆ ట్యూన్స్‌, ఆ పాడినవారి కంఠాలలోని మెలకువలు ఆస్వాదిస్తుంటే ఎంతో సరదాగా, మనసుకి ఉల్లాసంగా వుంటుంది. కులగోత్రాలు సినిమాలో ‘అయ్యయ్యో జేబుల్లో డబ్బుల పోయేనే’ కృష్ణార్జున యుద్ధంలో’- అంచెలంచెలస్వర్గం, ‘భార్యాభర్తలు’ సినిమాలో చూసి చూసి కళ్ళు కాయలే కాచాయి’ చదువుకున్న అమ్మాయిలులో ‘ఏమిటీ అవతారం – ఎందుకీ సింగారం’- ఓ పంచవన్నెల చిలకా’ అనే పాట అప్పుచేసి పప్పుకూడు సినిమాలో – పాటలన్నీ చెప్పాలంటే కుదిరేపనికాదుగానీ చివరిగా ఒక్క పాట తల్చుకోకతప్పని అత్యంత అద్భుతమైన పాట, వినరా సూరమ్మ కూతురి మొగడా’ అనే పాట’, ఇది ‘ఇల్లు-ఇల్లాలు’ అనే సినిమాలో అప్పలాచార్య రాశారు. మహదేవన్‌ కూర్చిన సంగీతానికి ఎస్‌.జానకి రాజబాబు (నటుడు) ప్రాణం పోశారు. ఎంత చమత్కారం- ఎంత హాస్యం! ఎప్పుడూ సీరియస్‌గా కనుబొమ్మలు ముడిచి, బ్రహ్మమూతి పెట్టుకుని నవ్వనుగాక నవ్వను అని భీష్మించుక్కూర్చున్నవారు సహితం ఈ పాట వింటే నవ్వక తప్పదు. ఆ పాటలోరాని అందమైన హాస్యపు జల్లుకి పెదవులపై చిరునవ్వులు చిందకపోతే ప్రాణాలమీద ఒట్టు.
 ఇలాంటి పాటల్నీ, సంగీతాన్ని, మాటల్నీ, నటుల్నీ, సన్నివేశాల్నీ మనం మళ్ళీ మళ్ళీ రూపొందించుకోలేక పోతున్నామే అనిపించినప్పుడు ఎవరికైనా బాధ కలగక మానదు.
 మన సినిమాల్లోని కొన్ని హాస్యం పాటలు
వినవేబాల, నా ప్రేమగోల, చింతలు రెండు చింతలు, కాశీకి పోయాను రామాహరి, అందమైన బావా-ఆవుపాలకోవా, కనకమా- నా మాట వినుమా, ఇండియాకు రాజధాని ఢిల్లీ, సరదా సరదా సిగరెట్టు , సుందరి నీ వంటి దివ్వస్వరూపం, ఓహోహో మామయ్యా, చవటాయెను నేను నీకంటే పెద్ద చవడాయను.

Share
This entry was posted in పాటల మాటలు. Bookmark the permalink.

2 Responses to నవ్వంటే చేదా!

 1. జానకీ బాల గారి వ్యాసం క్లుప్తంగా ఉన్నా, ఈ నాటి హాస్యం లో ఉన్న చవకబారు పోకడల గురించి స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు చెప్ఫారు. చెప్పొద్దూ, ఈ నాటి సినిమాలలో హాస్యం చూస్తే నవ్వొస్తోంది.
  –వంగూరి చిట్టెన రాజు
  హ్యూస్టన, టెక్సస

  గమనిక: ఈ తె;ఉగు లిపిలో నా పేరులోనూ, మా ఊరి పేరులోనూ ఉన్న ఒక అక్ష్రరం నాకు సరిగ్గా వ్రాయడం ముందు చేతకాకపోవ్ డం నాకే హాస్యం గా ఉంది.

 2. జానకీ బాల గారూ,
  మీ వ్యాసంలో అన్ని విషయాలూ చక్కగానే వున్నాయండీ, ఒకటి తప్ప. మీ వ్యాసం చివరలో మీరు ఉదహరించిన పాట, “వినరా శూరమ్మ కూతురు మొగుడా” అనేది చాలా చెత్త పాట. “మొగుడు” అనే పదమే పరమ వెకిలి పదం మొదటగా. తర్వాత ఈ పాటలో అసలు విషయం: “ఒక అమ్మాయి తల్లి తన చేత వ్యభిచారం చేయించినట్టుగా పాట పాడుతుంది మొదట్లో. ఆ అమ్మాయి భర్త బెంబేలెత్తి పోతూ వుంటాడు పాటలో. చివరలో ఆ అమ్మాయి, ఆ సంఘటన జరిగినప్పుడు తన వయసు ఆరేళ్ళనీ, తనతో పాటు దుప్పట్లో దూరిందీ, ముద్దులు పెట్టిందీ, జడ పట్టుకు లాగిందీ, తల్లి నచ్చజెప్పి గదిలోకి పంపించిందీ తన తాత అనీ వెకిలి హాస్యం చేస్తుంది.”
  ఇది అభ్యుదయంగా వుండే స్త్రీ,పురుషులందరూ తిరస్కరంచాల్సిన పాట అర్థం విషయంలో. ఇది మీకు నచ్చడం చాలా విచిత్రంగా వుంది.

  – సావిత్రి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో