హుషారుగా జరిగిన రచయితుల్ర సమావేశం

– మంజుల

భూమిక ఆధ్వర్యంలో రచయిత్రుల సమావేశం 08.02.07 తేదీన జరిగింది. షుమారు పదిహేను మంది రచయిత్రుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ముందుగా రచయిత్రులు తమనుతాము పరిచయం చేసుకున్నారు.

శిలాలోలిత మాట్లాడుతూ తాను స్త్రీల కవిత్వం మీద పి.హెచ్.డి చేసానని, గుజరాత్లో ఉన్న స్త్రీలమీద కవితలు రాసానని, ‘మానవి’లో వచ్చిందని చెప్పింది.

పంతం సుజాత మాట్లాడుతూ నేను పోయెట్రి వ్రాస్తాను. 20-25 వరకు పబ్లిష్ అయ్యాయి. పది సంవత్సరాలముందు ఆంధ్రజ్యోతిలో ‘ముంగిట్లో మువ్వల శబ్దం’ వచ్చింది. దానిని బుక్లాగా వేద్దామని వుందని చెప్పింది.

శ్రీపాద స్వాతి మాట్లాడుతూ 30 ఏళ్ళనుంచి రాస్తున్నా. విపులలో 20 స్టోరీల దాకా వచ్చాయి. 30 ఏళ్ళలో కిరణ్బేడి ఆత్మకథని ట్రాన్స్లేట్ చేసానని ఆంధ్రజ్యోతిలో వచ్చిందని చెప్పారు.

ముదిగొండ శివకౌముదీ దేవి మాట్లాడుతూ 18 సంవత్సరాలుగా కథలు రాస్తున్నాను. చాలా బహుమతులు వచ్చాయని చెప్పింది.

కె.బి. లక్ష్మి మాట్లాడుతూ 29 ఏళ్ళుగా తాను ‘విపుల’కి ఎడిటర్గా ఉన్నానని చెప్పారు.

కొండేపూడి నిర్మల మాట్లాడుతూ- 20 ఏళ్ళనుండి రాస్తూ ఉన్నాను. నా మొదటి కథ ‘మువ్వ మూగబోయింది’. నటన, నాటకీకరణ అంటే నాకు చాలా ఇష్టం. తాను వ్రాసిన ‘లేబర్ రూం’ ఫెమినిస్ట్ ఉద్యమానికి ఒక రూపమని చెప్పారు.

సమతా రోష్ని మాట్లాడు తూ 1992 లోనే భూమికలో ప్రవేశించాను. ఇప్పటివరకు ఒకేఒక కథ రాసాను. రాయా లని చాలా కోరిక వుంటుంది. కాని రాయలేక పోతున్నానని చెప్పారు.

వి. ప్రతిమ మాట్లాడుతూ తాను సుమారు 80 కథల వరకు రాసానని, కవిత్వం మాత్రం చాలా తక్కువగా రాసానని చెపుతూ భూమిక నా పుట్టింటి సంస్థలాంటి దని చెప్పారు. కథలు రాయడంలో భూమిక వర్క్షాప్ ఉపయోగ పడింది. రాజకీయ కుటుంబం మాది. పంచాయతీ ఎన్నికల సందర్భంలో మా ఊరి రాజకీయ చిత్రాల్ని కథలా మలిచాను. ఏదైనా ఒక సంఘటన అనుభవంలోకి వచ్చినపుడు ఏవిధంగా చెప్తే పాఠకులకు అవగాహన అవుతుందో అలా రాస్తాను. ‘రాచపుండు’ అనే కథకి నంది అవార్డు వచ్చింది. ఓటును డబ్బుతో, మద్యంతో ఎలా కొనుక్కుంటున్నారో అనేది రాసాను. రాజకీయ కుటుంబా ల్లోని స్త్రీలమీద ఎంత ఒత్తిడి వుందో మెయిన్గా రాసాను.

శివలక్ష్మి మాట్లాడుతూ తాను హైదరాబాద్ టెలికాంలో పనిచేస్తున్నానని, సుమారు నాలుగువేల మంది మధ్య పనిచేస్తున్నానని, పిల్లల పుస్తకాలు వేయడం అంటే తనకిష్టమని చెప్పింది.

ఘంటశాల నిర్మల మాట్లా డుతూ తాను ఆంధ్రజ్యోతి లో 19 సంవత్సరాలు పనిచేసానని, పోయెట్రీకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తానని చెప్పింది.

(తర్వాత శాంతసుందరి, శీలా సుభద్రాదేవి, రేణుక అయోల, అబ్బూరి ఛాయాదేవి, సుహాసినిలు తమని తాము పరిచయం చేసుకున్నారు.)

కొండవీటి సత్యవతి మాట్లాడుతూ తాను భూమిక ఎడిటర్గా 15 సంవత్సరాలనుంచి కొనసాగుతున్నానని ‘ఆమెకల’ పేరుతో కథల సంపుటి వేసానని చెప్పారు. ఇంకా సత్యవతి మాట్లాడుతూ ‘భూమిక’ పత్రిక నెలనెలా వస్తోంది కాబట్టి ఆర్టికల్స్, కథలు, పుస్తక సమీక్షలు అవసరం చాలా వుందని చెప్పారు. భూమికను వెబ్సైట్లో పెట్టడం వల్ల రెండు నెలల్లో 1500 మంది చూశారు. ప్రపంచవ్యాప్తంగా భూమికను చూస్తున్నారు దీనికి చైతన్య చాలా సహాయం చేసిందని చెప్పారు. భూమిక హెల్ప్లైన్ కూడా చాలా విజయవంతంగా కొనసాగుతోందని చెప్తూ ఒకమ్మాయిని హౌస్ అరెస్ట్ చేస్తే రక్షించామని, మాల్దీవ్స్లో ఒకమ్మాయిని రక్షించి ఇండియాకి తీసుకురాగలిగామని చెప్పారు. హెల్ప్లైన్ కౌన్సిలర్ నాగమణి మాట్లాడుతూ హెల్ప్లైన్కి ఏ ఏ సమస్యలపైన కాల్స్ వస్తున్నాయో వివరించింది. అనంతరం కేంద్రసాహిత్య అవార్డు గ్రహీత అబ్బూరి ఛాయాదేవి గారిని, నంది అవార్డు గ్రహీత ప్రతిమ గారిని కె. సత్యవతి సత్కరించారు.

Share
This entry was posted in సాహిత్య వార్తలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో