ఒక ఆడపిండం ఆత్మహత్య

హిందీ మూలం : రంజనా జయస్వాల్‌ (గోరఖ్‌పూర్‌)
అనువాదం : డా. వెన్నా వల్లభరావు
నేను పెరుగుతున్న పిండాన్ని
ఇప్పుడిప్పుడే
తల్లి గర్భంలో రూపుదిద్దుకుంటున్నాను
మునుపు నేను రూపు-రంగులేని
ఆడ-మగ భేదం లేని
జ్యోతిపుంజపు అంశని
అంతరిక్షంలో గుండ్రంగా తిరుగుతుండేదాన్ని.
ఒకరోజు
భూమ్మీద ఆడుకుంటున్న చిన్నారిని చూశాను
అంతే, అలాంటి ఆడపిల్లని అవ్వాలని ఉబలాటపడ్డాను
జ్యోతిపుంజానికి నా కోరిక తెలియజేశాను
గంభీరమైన స్వరం నన్ను హెచ్చరించింది –
‘దూరపు కొండలు నునుపు’
నేను ఒప్పుకోలేదు –
ఆడపిల్లగా పుట్టాల్సిందేనని పట్టుపట్టాను.
నా మొండిపట్టు కారణంగా అమ్మ కడుపున పడ్డాను
అమ్మ కడుపులో ఎంత చీకటో, అయినా ఎంతో సంతోషం
నేను రూపుదిద్దుకోసాగాను
అమ్మ ఇప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది
తరచూ వాంతులు చేసుకుంటుంది
అమ్మ వీపు నిమరాలని ఉంది
కాని అమ్మకి ధైర్యం చెప్పలేని అశక్తురాలిని
ఒకరోజు అమ్మ మామిడిపిందె తిన్నది –
‘అబ్బ! ఎంత బాగుందో, పుల్లపుల్లగా’
క్రమక్రమంగా నేను నవరసాలు రుచిచూశాను
ఇప్పుడు నాకు జ్యోతిపుంజమంటే లక్ష్యమేలేదు
నేనెంతో ఆనందంగా ఉన్నాను
ఒకరోజు అమ్మ నాన్నతో ఆసుపత్రికి వెళ్లింది
డాక్టర్‌ ఏదో మిషన్‌తో పరీక్షించింది
నాన్నతో ఏదో మాట్లాడింది
నాన్న ముఖం ఎర్రబారింది
అమ్మతోపాటు నేను కూడా భయపడ్డాను
ఇంటికొచ్చాక నాన్న అమ్మతో పోట్లాడసాగాడు
నేను చెవులురిక్కించి వినే ప్రయత్నం చేశాను
నాన్న మాటలువిని నేను కొయ్యబారిపోయాను
నాన్న నా హత్య గురించి మాట్లాడుతున్నాడు
నేను నిర్ఘాంతపోయాను –
దేవతలు కూడా జన్మించాలని తహతహలాడే
భూమి ఇదేనా?
స్త్రీగా పుట్టటమే నేరమా?
అమ్మ ఏడుస్తుంది, లోలోనే కుమిలిపోతుంది
కాని ఆమె స్త్రీయేగా!
తన గర్భంపై తనకే హక్కులేని స్త్రీ…
నేను అమ్మకు నచ్చజెప్పాలనుకున్నాను –
”అమ్మా! నువ్వు దిగులు పడొద్దు
నేను నీకు ముక్తిని, శక్తిని అవుతాను
‘కంటే ఆడపిల్లనే కనాల’ని ప్రతి స్త్రీ కోరుకునేలా చేస్తాను”
కాని అమ్మకు వినిపించలేదు నా గొంతు
అమ్మ ఓడిపోయింది, క్రుంగిపోయింది
నాకేమీ దివ్యశక్తి లేదే!
ఇప్పుడు అమ్మతోపాటు
నేనొక పెద్ద గదిలో బల్లపై పడుకుని ఉన్నాను
గదిలో చాలా చాలా పనిముట్లున్నాయి
ముక్కుకు, నోటికి గుడ్డలు చుట్టుకున్న నర్సమ్మలున్నారు
నాకు భయం పట్టుకుంది
బలి ఇవ్వబోయే మేకను కట్టినట్టు
అమ్మ కాళ్లు-చేతులు కట్టేస్తున్నారు
ఒక నర్సు సూది చేత్తో పట్టుకుని అమ్మవైపే వస్తుంది
ఉన్నపళంగా నా ఒంట్లో వందలాది సూదులు
గుచ్చుకున్నట్లనిపించింది
భయమేసి కళ్లు గట్టిగా మూసుకున్నాను
మెల్లగా కళ్లు తెరిచి చూశాను –
అమ్మ స్పృహతప్పి పడుంది
పదునైన పనిముట్లేవో నావైపే దూసుకురాసాగాయి
శక్తంతా కూడగట్టుకుని గట్టిగా అరిచాను –
‘అమ్మా! కాపాడు…’
అమ్మ అచేతనంగా పడిఉంది
ఒంటరిగా నేను, ఎదురుగా ప్రమాదకర శత్రువులు!
ఇటో-అటో తప్పించుకునే ప్రయత్నం చేశాను
కాని ఎంతసేపు!
పట్కారు నా గొంతును ఒడిసి పట్టేసుకుంది
ఏదో బలమైన ఆయుధం నా తలను చిదిమేస్తుంది
అమ్మ కడుపులో నాటుకున్న నా మూలాల్ని
కత్తెరొకటి నిర్దాక్షిణ్యంగా కత్తిరించి పారేస్తుంది
ఘనంగా ఉన్న నేను ద్రవంగా మారుతూనే
వెక్కి-వెక్కి ఏడ్చాను క్షీణ స్వరంతో-
‘అమ్మా! నన్ను క్షమించు
నీకు తోడుగా ఉండలేకపోతున్నాను
నీ ఈ కూతురు కూడా
నీలాగే అబలగా మారింది
అమ్మా…! అమ్మా…!’

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

2 Responses to ఒక ఆడపిండం ఆత్మహత్య

  1. buchireddy says:

    నీ లా గె అబల గా మారింధి—-
    చాల భా గ చెప్పారు– సూ ప రు

  2. swathi says:

    చల భగుంది .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో