స్వతంత భారతంలో పాకీపని -సిగ్గు సిగ్గు

సి. పెన్నోబిలేసు
భారతీయ సమాజంలో పుట్టుక కారణంగా, వృత్తి కారణంగా, కొందరికి దైవత్వాన్ని ఆపాదించి, మరికొందరికి హీనమైన స్థానాన్ని ఇచ్చే హెచ్చుతగ్గుల హోదానిచ్చే దారుణమైన కులవ్యవస్థ పునాదిగా దళిత సఫాయి కర్మచారులమైన మా చేత ”పాకీిపని” చేయించడం మాకు మాత్రమే అవమానకరం కాదు ఇది మొత్తం దేశం నాగరిక ప్రపంచ పౌరులందరు సిగ్గుతో తలదించుకోవలసిన విషయం, మన దేశ ప్రభుత్వ, పౌరుల అమానవీయ మనుగడకు నిదర్శనం.
దళిత సఫాయి కర్మచారులైన, ముఖ్యంగా మా జాతి స్త్రీలచే ఒక చిన్న చీపురు కట్ట, ఒక రేకు, ఒక బుట్ట, సాధానాలుగా ప్రభుత్వం నడిపే డ్రై లెట్రిన్‌లు, ప్రైవేటు వ్యక్తుల మరుగుదొడ్ల నుంచి మనిషి మలాన్ని గంపలో ఎత్తుకుని మోసుకుంటూ ఊరి అవతల పెంట దిబ్బలలో వేయించడం ఎన్నో తరాలుగా మనం చూస్తున్న అణచివేత ప్రక్రియ. ఇంతటి నిరంకుశ నిశ్శబ్ధాన్ని వీడి ఆత్మ గౌరవ నినాదంతో పాకీిపని అంతం చేయడం కోసం అంకురించినదే సఫాయి కర్మచారి ఆందోళన్‌ ఉద్యమం.
1992 సం||లో వివిధ సామాజిక సంస్థలు నిర్వహించిన సర్వేల ప్రకారం భారతదేశంలో 13 లక్షల మంది చేతులతో మానవ మలాన్ని ఎత్తివేసే పద్దతిలో కొనసాగుతున్నట్లుగా నిర్ధారించుకొని ఈ పద్ధతిని నిర్మూలించాలని దేశ అత్యున్నత న్యాయస్థానమైన గౌరవ సుప్రీమ్‌ కోర్టు నందు ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం జరిగింది. అయితే వాద ప్రతివాదనల అనంతరం సుప్రీమ్‌ కోర్టు ఈ పద్ధతిని ఒక మానవీయ కోణ దృక్పథంతో పరిశీలించి ఒక ప్రత్యేక తీర్పు ద్వారా డ్రై లెట్రీన్‌ల నిర్మాణ నిషేదిత చట్టం 1993 ఆఫ్‌ 46 ప్రకారం నేరంగా పరిగణిస్తూ శిక్షలు, జరిమానాలతో కూడిన ఒక చట్టం చేయడం జరిగింది.
సఫాయి కర్మచారి ఆందోళన మరియు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వ భాగస్వామ్యంతో 2001లో మనరాష్ట్రంలో  సర్వే చేయగా 8402 మంది సఫాయి కర్మచారులచేత 25672 కమ్యూనిటీ డ్రై లెట్రీన్‌ల నందు నిషేదింపబడిన పాకీ పని నూటికి నూరు శాతం షెడ్యూల్డు కులాలకు చెందిన దళితుల చేత వంశపారంపర్యంగా చేస్తున్న పనే అని పైగా అది సబబేనని ప్రభుత్వం కూడా చేయించింది. అయితే అవమానాకరమైన పాకీి పనిలో ఉన్న వారిని చైతన్యపరచడం ప్రభుత్వ యంత్రాంగాన్ని, చట్టాన్ని అమలు చేసే స్పృహలోకి తీసుకురావడం అన్ని ప్రయత్నాలను సమన్వయపరచి అందరి సహాయ సహకారాలు తీసుకొని పాకి వృత్తిని ఈ గడ్డమీద లేకుండా సమూలంగా నిర్మూలించి మనుషులందరూ గౌరవప్రదమైన వృత్తులను ఆచరించగలిగిన  మానవత్వం పరమళించే సమాజం కోసం 1995 సం|| నుంచి ఆంధ్ర ప్రదేశ్‌లో సఫాయి కర్మచారి ఆందోళన్‌ కృషి చేస్తున్నది.
సఫాయి కర్మచారి ఆందోళన్‌ జిల్లాల వారిగా పాకీిపని పద్ధతిపై తిరుగుబాటు ఉద్యమ కార్యకర్తలను తయారు చేస్తూ, సఫాయి పనివారి జీవితాలలో ఒక సమగ్రమైన మార్పును తీసుకురావడానికి, వారిని చైతన్యపరస్తూ వివిధ ఆందోళన రూపాల్లో వీరి సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచింది. అయినప్పటికీ ప్రభుత్వం నుండి కాని వివిధ యంత్రిత్వ శాఖల నుండి కాని తగినంత స్పందన రాలేదని గ్రహించి వివిధ దళిత ప్రజా సంఘాలు, కొన్ని ప్రాంతాల సఫాయి కర్మచారులు మరియు సఫాయి కర్మచారి ఆందోళన్‌ల భాగస్వామ్యంతో 2003 సం||లో చేసిన  సర్వే ఆధారంగా కనుగొన్న సాక్ష్యాధారాలతో సుప్రీం కోర్టులో  ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయడం జరిగింది. దాని ఫలితంగా 2-04-2005న భారత సుప్రీం కోర్టు ఆదేశానుసారం జస్టిస్‌ వరియవ మరియు హెచ్‌.కె. సీమ సమక్షంలో వాద ప్రతివాదనల తర్వాత భారత ప్రభుత్వంలోనూ, రాష్ట్ర ప్రభుత్వం లోనూ ప్రతి ప్రభుత్వ శాఖల, శాఖాధిపతి తన శాఖలలో సఫాయి కర్మచారులలో పని చేస్తున్నారా? లేదా? అనే విషయం పరిశీలించి ఈ కోర్టుకు నివేదికలు సమర్పించాలని, ఇంకా పాకీపని కొనసాగిస్తూ ఉంటే వెంటనే వారిని నిలుపుదల చేసి వారికి జీవనోపాదులను కల్పిస్తూ విముక్తిపొందిన సఫాయి కర్మచారుల పునరావాసానికి ఏ నిర్ధిష్టమైన పథకానికి ఎంత డబ్బు కేటాయించింది, ఆ నిధుల వినియోగం ఎంతవరకు జరిగింది అనేది కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టంగా సుప్రీంకోర్టుకు నివేదించాలని సంబంధిత మంత్రిత్వ శాఖలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
సఫాయి కర్మచారి ఆందోళన్‌ మరియు వివిధ ప్రజా సంఘాలు సామాజిక సంస్థల యొక్క సహకారంతో వివిధ ఆందోళన కార్యక్రమాలైన ర్యాలీలు, ధర్నాలు, అవగాహనా సదస్సులు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు, పాదయాత్ర, శవయాత్ర, 18 సం||ల చట్ట అతిక్రమణ నిరసన కార్యక్రమాలు, రాష్ట్రవ్యాప్తంగా డ్రై లెట్రీన్‌లు కూల్చటం, యూజర్స్‌ను చైతన్యపరచుట, కరపత్రాల ద్వారా ప్రచారం, సర్వేలు, రీ సర్వేలు, వివిధ స్థాయిలలో  గ్రామ, మున్సిపాలిటీ, జిల్లా స్థాయి అధికారులకు వినతి పత్రాలు, ఫిర్యాదులు, ఫోటోలు, వీడియోలు, లోకాయుక్త, మాన హక్కుల కమీషన్లకు ఫిర్యాదులు, ప్రజా ప్రతినిధులకు వినతిప్రతాలు, మీడియా సమావేశాలు, పత్రికా ప్రకటనల ద్వారానే కాక, పాకీ పని సాధానాలను తగులపెట్టడం ద్వారా ప్రభుత్వంపైన వత్తిడి తీసుకురావడం జరిగింది.
తదనంతరం 2007 సం|| నాటకి డ్రై లెట్రీన్‌ల రీ సర్వే చేయగా గడచిన కాలానికి సంబంధించి చేసిన ప్రయత్నాల ఫలితంగా కొంత ప్రగతి, ఉద్యమ ఫలితంగా డ్రైై లెట్రీన్ల సంఖ్య తగ్గుతూ వస్తూ కొంత మంది సఫాయి కర్మచారులు విముక్తులు కావడం జరిగింది.
రాష్ట్ర స్థాయి ధర్నా ఫిబ్రవరి 20, 2009న ఇందిరాపార్క్‌, హైదరాబాదులో పాకీపని సాధనాలైన చీపురులను, గంపలను తగులబెట్టి ఆ మంటల సాక్షిగా పౌర సమాజానిక,ి రాష్ట్ర ప్రభుత్వాలకి
”స్వతంత్య్ర భారతంలో పాకీపని – సిగ్గు సిగ్గు” ”మాకు రెండు చేతులే – మీకు రెండు చేతులే”
”పుట్టుక కాదు ఖర్మ – సఫాయి మా పని కాదు” చీపుర్లను వదిలిపెట్టి – గునపాలను ఎక్కుపెట్టి
”డ్రై లెట్రీన్‌లు కూల్చుదాం – మానవత్వాన్ని చాటుదాం”
అంటూ 786 మంది సఫాయి కర్మచారులు నినాదాల ద్వారా ప్రకటిస్తూ  పాకీ పని మేం చేయం, ఎవరినీ చేయనీయం అంటూ ప్రతిజ్ఞ చేశారు. ఆరోజు నుండి డ్రై లెట్రీన్లు కలిగి వుండడానికి వ్యతిరేకంగా జైత్రయాత్ర ఈ రాష్ట్రంలో ఇంకా కొనసాగుతోంది. ఈ ఉద్యమ పోరాటాన్ని మీతో పంచుకోవడం సఫాయి కర్మచారుల విముక్తి వివరాలను మీకు తెలియజేయడం ఒక బాధ్యతగా సఫాయి కర్మచారి ఆందోళన్‌ భావిస్తున్నది.
మీ ప్రాంతంలో ఒకవేళ ఇంకా పాకీపని జరుగుతున్నట్లు మీకు ప్రత్యక్షంగాకాని, పరోక్షంగా కాని తెలిసి ఉంటే సాక్ష్యాధారాలతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఈ విషయాన్ని మాకు కూడా తెలియపరచగలరని కోరుతూ, భారత దేశంలో ముఖ్యంగా మన రాష్ట్ర సరిహద్దుల్లో సైతం ఈ రకమైన అమానవీయ కుల, పితృస్వామ్య వ్యవస్థలకు సాక్షులుగా నిలబడే పాకీ పని అంతమొందించడమే లక్ష్యంగా సాగుతున్న సఫాయి కర్మచారి ఆందోళన్‌ ఉద్యమానికి మీ తోడ్పాటునివ్వాలని కోరుతున్నాం.

Share
This entry was posted in గౌరవసంపాదకీయం. Bookmark the permalink.

One Response to స్వతంత భారతంలో పాకీపని -సిగ్గు సిగ్గు

 1. pullaa rao says:

  సి పెన్నోబులేసు గారూ..,
  మమ్మల్ని క్షమించమని అడిగే అర్హత లేదు మాకు.
  నగరానికి వచ్చి దాదాపు పదిహేనేళ్ళయినా ఇక్కడ ఇంకా కొనసాగుతున్న పాకీ పనివారల గురించి తెలుసుకోలేకపోయినందుకూ,,,
  కనీసం అది కొనసాగవచ్చేమో అనే ఊహ కూడా రానందుకూ,,,
  ఇంకా మేం నాగరీకులమని చెప్పుకుని తిరుగుతున్నందుకూ ,,,
  దీన్ని చదవడం మొదలు పెట్టగానే.., ఏదో రాయాలని రాయడం తప్ప ఇంకా పాకీ పనివాళ్ళెక్కడున్నారు అని చిన్నచూపుతో చదవడం ప్రారంభించినందుకూ,,,
  సిగ్గుతో తల వంచుకుంటున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో