ఆడోళ్ళ పండుగ అని గా పండుగ ఉంటదా?

నా పేరు యాదమ్మ, మా వూరు కొరటికల్లు, మోత్కురు . మేము ముగ్గురక్కచెల్లెలు. ఆడోళ్ళ పండుగ యని గా పండుగ ఉంటదా. నాకు దెల్వకడుగుతా?  లేదమ్మా నాకెందెల్సు నీకేమెన్న చదువుకుంటినా ఏమన్నానా ఏదో గీడ నాల్లిండ్లల్ల పన్జేసుకుని బతికెటిదాన్ని
మాకు చదువుకోవాలని దెల్వదుగదా. మా ముగ్గురక్కజెల్లెళ్ళకు ఒక్కడే తమ్ముడు. అమ్మా అయ్య కూల్జేస్తుంటే మేం గూడా బుద్దెరిగినప్పటి నుండి గదే పనికి బోతుంటిమి. తమ్ముడొక్కటికి పదింటిదాకా చదువుజెప్పిచ్చిన్రు. వాడిప్పుడు చిన్న హోటల్‌ బెట్టుకొని బాగానే ఉండు. మేమక్కచెల్లెండ్లం ఇండ్లల పన్జేసుకుని బతుకుతున్నం. అయినాగాని ఆడోళ్ళు మగోళ్ళు ఒక్కలెక్క ఎట్లయితరు? మనం ఒకింటికి బోవాలగద. ఇంగ పన్దెక్కకంటవా ఎప్పుడుగూడ కొట్లాట రాలేదమ్మా. ఒప్పుకున్న కాడికి ఇస్తరు. ఇంట్లపని నేనేజెస్త. పొద్దున నాలుగింటికి లేచి ఇల్లు ఊడ్చి గింత అన్నం కూర జేసి పెట్టి పన్లకు బోత. ఇంట్ల పని ఆయాక బయటనుండి దెచ్చెడిదేమన్నా ఉంటే తెస్తడు. ఏందెయలనేది నేన్చేపుత. కర్సు ఎంతయితదని ఇద్దరం ఆలోచనజేస్తం. ఏదో మా తమ్ముళ్ళ మీద మేం బానే ఉన్నం. అంత మోటు కష్టం ఎండల వానల జేసేది లేదు. కూలిగూడా ఎప్పుడూ ఉండెద్దిగాదు. గిప్పడైతే నెల నెల తప్పక వస్తది.ఎన్నడయినా జొరం వచ్చినా రోగం వచ్చినా నాకొస్తే ఆయన, ఆయనకొస్తే నేను జుసుకుంటాం. మాకు మేం జేసుకోవాలిగదా. మాకిద్దరు ఆడపిల్లలు.ముందు ముందు ఎట్లన్నగాని ఇంగజాలనుకున్నం. మగపిల్లలయితేేే అమ్మ నాయనను జుసుకోవాలె. మా తమ్ముడు అమ్మను నాయనను జొస్తడు. నేను మా అత్తజుస్త. మరి రేపు నన్ను సూడనీకే ఎవరు లేరు గదా. ఆడపిల్లలయినా ఇంగ వాళ్ళే సూడాల. పిల్లలైనా బాగుండాలాఅని ఇద్దరం కష్టపడుతున్నాం.  కూల్జేసుకునేటోడికిగాక ఇంత వ్యవసయం ఉండేటోడికిచ్చి సేయాలని ఉంది. ఇప్పుడందరికి అక్షరాలన్న దెల్వాలికదా. ఏడికన్నా బోవాలన్నా, ఏ బస్సెక్కాలన్నా దెల్వాలిగదా అని చదివిస్తున్న.                                   ఇంటర్వ్యూ : గీత

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో