సెకండ్ సెక్స్

(కొనసాగింపు)

“పురుషుడెపుడూ తన ఆధిక్యతను నిలబెట్టుకోడానికే ప్రయత్నిస్తాడు. తన ప్రాముఖ్యతను నమ్మి కాపాడుకోడానికే యత్నిస్తాడు. తన సహచరితో సమానత్వాన్ని అంగీకరించలేడు. ఆమె శక్తియుక్తులపై నమ్మకం లేనట్లు తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తాడు. ఇదెట్లా వుంటుందంటే, చిరకాలంగా అణచివుంచబడిన వర్గం, తమను అణచివేతకు గురిచేసిన వర్గంతో ఘర్షించినట్లు వుంటుంది. అణచబడ్డ వర్గం తన సహజ హక్కుల్ని అడుగుతున్నపుడు, సహజంగా అణచివేతదారులు తమ ఆధిక్యతను కాపాడుకోడానికి వీలైనంతగా ప్రయత్నిస్తారు. స్త్రీత్వం అంటూ తనకి ఆపాదింపబడ్డ గుణాలను ఆమె నిలిపి వుంచుకోవాలనుకున్నంత కాలం పురుషుడామెను అలా వుంచడానికే కృషి చేస్తాడు. ఈ విషవలయాన్ని ఛేదించడం చాలా కష్టం. ఎందుకంటే వీరిద్దరు కూడా ఏక కాలంలో రెండు పాత్రల్ని పోషిస్తున్నారు కనుక. ఆమెను అదుపులో వుంచే నిరంతర ప్రయత్నంలో అతను కూడా ఒక రకంగా పీడితుడే అవుతున్నాడు. స్వతంత్రంలేనివాడు. హాయిగా వుండలేనివాడు. ఇందులో ఎవరూ స్వతంత్ర జీవులు కారు. స్వతంత్రం కల ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక అంగీకారం కుదరడం సులువు… ఘర్షణ వల్ల వొరిగేదేమీలేదని వాళ్ళకి తెలుసు. అసలు ఈ మొత్తం వ్యవహారం సంక్లిష్టం కావడానికి కారణం ప్రత్యర్ధులిద్దరూ ఒకరికొకరు సహకరించటమే… అంటే స్త్రీలింకా ఆధీనులుగా వుండడానికీ పురుషులింకా తమ ఆధిక్యతని కాపాడుకోటానికి ప్రయత్నించడం. అయినా మళ్ళీ ఇద్దరూ తమ తమ అసౌకర్యాలకి రెండోవారిని నిందిస్తూ వుంటారు. స్త్రీ పురుషులు ఒకరినొకరు ఈ విధంగా నిందించుకుంటూ వుండడానికి కారణం వారిలోని అల్ప స్వభావమే. పురుషుడెప్పుడూ తన స్త్రీలో తన నీడని చూసుకోవాలనుకుంటాడు. ఆమెలో తన ఆధిపత్యాన్ని, పురుషత్వాన్ని చూసుకుంటాడు. అయితే ఇంకొక విధంగా అతనూ ఒక బానిసే. ఇందులో అతను సాధించే విజయం స్త్రీల చపలచిత్తం మీద ఆధారపడి వుంటుంది. తనెప్పుడూ ముఖ్యమైన వ్యక్తిగా, ఆమెకన్నా అధికుడిగా వున్నట్లు భావిస్తాడు. అలా నటిస్తాడు. ఆమెకూడా అతని ఆధిక్యాన్ని అంగీకరిస్తున్నట్లు నటిస్తూ వుంటుంది. స్త్రీలంటే వుండే భయమే వారిపట్ల ప్రతికూలతకి కారణం. స్త్రీలగురించి మాట్లాడడానికీ, వారిని తప్పుద్రోవ పట్టించడానికి చాలా సమయాన్ని వెచ్చిస్తాడు. కానీ స్త్రీలను విముక్తం చెయ్యడం ద్వారానే తను విముక్తి పొందుతానని తెలుసుకోడు. అతను భయపడే విషయం అదే. అందుకే స్త్రీలను గురించిన భ్రాంతి భావనలను కాపాడుతూ వుంటాడు. ఇది ఆమెను మభ్య పెట్టడమేనని చాలా మంది పురుషులకు తెలుసు.

“ స్త్రీగా వుండడం ఎంత దురదృష్టం. ఆ విషయం తెలుసుకోకుండా వుండడమే ఆ దురదృష్టం” అంటాడు కీర్క్ గార్డ్.

చాలాకాలం ఈ “తెలుసుకోకుండా వుండడమనే దురదృష్టాన్ని దాచిపెట్ట”టం జరిగింది. ఉదాహరణకి, స్త్రీలకి అదివరకుండే గార్డియన్లను తీసివేశారు. కానీ వారి బదులు ‘రక్షకుల’ను నియమించారు. ఈ రక్షకులకి గార్డియన్స్కుండే అధికారాలన్నీ ఇచ్చారు. ఇదికూడా” స్త్రీల భద్రత” కోసమే!

ఉద్యోగం చెయ్యకుండా ఇంట్లో వుంచటం కూడా ఆమె సుఖసంతోషాల కోసమేనట! ఇక గృహిణీత్వం మీదా, మాతృత్వం మీద ఎంత భావుకతని కవితావేశాన్ని వెదజల్లారో తెలీనిది కాదు. ఈవిధంగా ఆమె స్వేచ్ఛా స్వతంత్రాలను కోల్పోయి, “ స్త్రీత్వం” అనే తప్పుడు సంపద సాధించింది.
ఈ పన్నాగం ఒక ప్రసిద్ధ కవి పురుషులకిచ్చిన సలహాలో స్పష్టమౌతుంది. చూడండి ఆయనిలా అంటాడు- “ ఆమెకి మహారాణివి నువ్వు అని చెబుతూ బానిసలా చూడు” చాలామంది పురుషులలాగే ‘స్త్రీలు చాలా అదృష్టవంతులు’ అని నమ్మింపజూస్తారు. ఇదెలా వుంటుందంటే, అమెరికన్ సాంఘిక శాస్త్రవేత్తలు కొందరు ‘నిమ్నవర్గ లాభాల’ గురించి మాట్లాడినట్లు, నిమ్న వర్గాలు అనుభవించే సుఖాలగురించన్నమాట. ఫ్రాన్స్లో కూడా ఇలాంటి వాదనే ఒకటుంది. కార్మికులకి నిత్య జీవితంలో నటించే అవసరం లేదట!… ప్రతి దేశంలోనూ కూడా మొదటినుంచీ తక్కువ అదృష్టవంతుల్ని చూసి మెరుగైన జీవితం గడిపేవారు ఈర్ష్యపడటం (ఆశ్చర్యకరమైన విషయమైనా) వుంది, పెట్టుబడిదార్లు, వలసపాలకులు, పురుషాధికులు ఎప్పుడూ అందరికన్నా ఒక మెట్టుపైన వుండడానికే చూస్తారు. పీడితులలో పీడకులు చూసే ‘కాంప్లిసిటి’ కన్న స్త్రీలలో పురుషులకు దొరికేది ఎక్కువ. అందుకే వాళ్ళు “స్త్రీలు స్వచ్ఛందంగానే ఆధీన స్థితిని కోరుకుంటున్నార”ని సిగ్గులేకుండా చెబుతారు. అసలు మొదటినించీ స్త్రీలు నడచివచ్చిన దారి, ఎటువంటి సాహస చర్యలకూ తిరుగుబాట్లకూ ఆస్కారం లేనిది. ఆమె శిక్షణ అటువంటిది. ఆమె తల్లితండ్రులతో సహ యావత్ సమాజమూ ఆమెకు ప్రేమా ఆరాధనా, త్యాగమూ వంటి గుణాలను వైభవీకరించి చెబుతుంది. కానీ ఆమె భర్త గానీ సంతానంగానీ వీటినంతగా పాటించరు. అధీనతలోనే ఆమె ఆనందం వున్నదని నమ్మిస్తారు. మొదటినుంచీ తన బాధ్యత తనను తీసుకోనీకుండా పెంచి, ఇతరులనించీ రక్షణ, శ్రద్ధ ఆశించేలా చేసింది ఎవరు? అందుకు ప్రోత్సహించింది ఎవరు? అందుకే పరస్పర నిందారోపణలు. “ నువ్వు అసమర్దురాలివి, నీకేం తెలీదు” అని అతను “ అలా చేసింది నువ్వే” అని ఆమె. ఎవరూ తమ బాధ్యతని అంగీకరించరు. తన పెత్తనాన్ని కొనసాగించుకోడానికి పురుషుడు వేసుకునే ముసుగూ, తన పిరికితనాన్ని కప్పిపుచ్చు కోటానికి ఆమె వేసుకునే ముసుగూ! అట్లా నిరంతర సంఘర్షణ! తనకు సిద్ధాంతపరంగా లభించిన సమానత్వాన్ని గురించి ఆమె మాట్లాడితే, ప్రస్తుతం సమాజంలో నెలకొన్న అసమానత గురించి అతను మాట్లాడతాడు. ఇచ్చిపుచ్చుకోడం అనే విషయానికి అర్థం లేకుండా పోతుంది. తన సర్వస్వాన్నీ అతనికే ధారపోశానని ఆమె, తన సర్వస్వం ఆమెకే అర్పించానని అతడూ! రాజకీయ ఆర్ధిక శాస్త్రంలోని ఒక ముఖ్య సూత్రాన్ని స్త్రీలు గుర్తుపెట్టుకోవాలి. సరుకుల విలువ కొనేవారిని బట్టి నిర్ణయింపబడుతుంది గానీ అమ్మేవారిని బట్టికాదు. ఆమె విలువ వెలకట్టలేనిదని చెప్పి ఆమెను మోసం చెయ్యడం జరిగింది. నిజానికి పురుషునికి ఆమె ఒక వినోదం, ఒక విలాసం, ఒక తోడు, ఒక అవసరంలేని వరం. కానీ ఆమె ఉనికికే అతను సార్ధకత, ఆమె జీవన సారం. ఈ అసమానత వారి జీవన విధానంలోనే అర్ధమౌతుంది. తను ఏమాత్రం ప్రేమించని స్త్రీని జీవితాంతం భరించి పోషించాల్సిన పురుషుడు తను బలైపోయినట్లు భావిస్తాడు. అయితే తన జీవితాన్నే పణంగా పెట్టి అతన్ని పెళ్ళాడిన ఆమెను వదిలేస్తే ఆమె బలైపోతుంది. ఈ దుస్థితి వ్యక్తుల వలన సంభవించింది కాదు, ఇద్దరూ కూడా తలపడలేని మరొక శక్తి వలన ఏర్పడినది. స్త్రీలు పరాన్న జీవుల వలె మరొకరికి అతుక్కుని బ్రతికినంతవరకు వారు మరొకరికి భారమే. వారు తమ జీవశక్తిని స్వయంగా సంపాదించు కోగలగాలి. స్వంతంగా ప్రపంచాన్ని ఎదుర్కుని తమని తాము నిలబెట్టుకోగలగాలి. అప్పుడే ఆమె అధీనత మాయమౌతుంది. దానితో పాటే పురుషుని అధీనత కూడా… ఈ కొత్త పరిస్థితి ఇద్దర్నీ విముక్తుల్ని చేస్తుంది.

ఇటువంటి ఒక కొత్త లోకాన్ని సోవియట్ యూనియన్ వాగ్దానం చేసింది, మొగపిల్లలతో సమానంగా అదే వాతావరణంలో పెరిగి, వారితో సమానంగా అదే వాతావరణంలో, అదే వేతనంతో స్త్రీలు పనిచేస్తారు. స్త్రీలకి లైంగిక స్వేచ్ఛ, ఉద్యోగం చేసుకునే స్వేచ్ఛ వుంటాయి. వివాహం ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక స్నేహ ఒడంబడికలా వుంటుంది. ఏ ఒకరికి రెండోవారితో కలిసి జీవించడం కష్టమనిపించినప్పుడు వారికి విడిపోయే హక్కు వుంటుంది. మాతృత్వం స్త్రీల ఇష్టంపై ఆధారపడి వుంటుంది. కుటుంబ నియంత్రణ, గర్భస్రావం చట్టబద్దమౌతాయి. వివాహబంధంలోని సంతానంతో సమానమైన హక్కులు వివాహేతర సంతానానికి కూడా వుంటాయి. రాజ్యం స్త్రీలకు ప్రసవానంతర సెలవు ఇవ్వడమే కాక పిల్లల బాధ్యత కూడా వహిస్తుంది.

అయితే చట్టాలు మార్చినంత మాత్రాన స్త్రీ పురుష సమానత్వం సిద్ధించినట్లేనా? కొంతమంది నిరాశావాదులు ‘స్త్రీలెప్పుడూ స్త్రీలే’ అంటారు. స్త్రీలు తమ ‘స్త్రీత్వా’న్ని కోల్పోతే, పురుషుల వలె కాక రాక్షసుల వలె తయారవుతారని మరికొందరు వాదిస్తారు. స్త్రీలు తమ సహజ గుణాలను కోల్పోతారట! మానవ సమాజంలో ఏదీ సహజసిద్ధం కాదు. స్త్రీలు కూడా నాగరికతాభివృద్ధి క్రమంలో తయారుకాబడినవారే! ఆమెను మలచడంలో ఇతరుల ప్రమేయమే మూలకారణం. స్త్రీలు తమ హార్మోన్ల వల్ల కానీ సహజాతాల వల్ల కానీ “స్త్రీత్వా”న్ని పొందలేదు. స్త్రీ విముక్తి సాధించాలంటే ఆమె ఉనికిని ఆమె స్థిర పరచుకోవాలి. స్త్రీ పురుషులిద్దరూ ఒకరినొకరు స్వతంత్ర వ్యక్తులుగా గుర్తించాలి. ఇందువలన పరస్పర సహకారం, స్నేహం పెరుగుతుంది. అలాగే కాంక్ష, ప్రేమ, కలలు, సాహసాలు, వాటి వాటి అర్ధాలను కోల్పోవు. అంతేకాక, మానవజాతిలోని ఒక సగానికున్న బానిసత్వాన్ని, తద్వారా సమాజంలో నెలకొని వున్న ద్వంద్వ నీతినీ, నిర్మూలించినప్పుడు, మానవ దంపతుల నిజమైన రూపాన్ని మనం దర్శించగలం. సూటి అయిన, సహజమైన, అవసరమైన మానవసంబంధాన్ని మనం స్త్రీ పురుష సంబంధంలో చూడవచ్చు.

మార్క్స్ చెప్పినట్లు, స్త్రీ పురుష సంబంధం అనేది మనిషికీ మనిషికీ వుండే సహజ సంబంధం కావాలి. స్త్రీ పురుషుల మధ్య సౌభ్రాతృత్వాన్ని (సిమోన్ brotherhood అనే మాట వాడుతుంది) సాధించాలి.

“అరవై సంవత్సరాల క్రింద వ్రాసిన ఈ పుస్తకం ఇప్పుడు ఎందుకు చదవాలని” అడిగేవారిని సిమోన్ అడిగే ప్రశ్న ఈ సౌభ్రాతృత్వంను సాధించటానికి ఇప్పటి స్త్రీ పురుషులు చేస్తున్న కృషి ఏమిటి? ఎంతవరకు సాధించారు? నేటి సమాజంలో స్త్రీ పురుష సంబంధాలెలా వున్నాయి?

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో