ఈ బిల్లు ఆడోళ్ళందరిదైతే చెమ్మ చెక్క ఆడుకుందుము

జూపాక సుభద్ర
2010   మార్చి 8వ తేదికి వందేళ్ల వసంతాలని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు ధూం ధాంగా దుమ్ము రేపిండ్రు. కేవలం వంద సంవత్సరాల మార్చి ఎనిమిదే కాదు. యిదే రోజు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ బిల్లు కూడా పెట్టబోతోంది. అందికే యీ హల్‌చల్‌. రాజకీయాల్లోని ఆడవాల్లకు కనీసం ఈ రోజన్నా వారి న్యాయకత్వాన సభలు జరిగుంటే బాగుండేది. ఆ పార్టీ మగ మహానాయకులే అధ్యక్షులుగా సభలు నిర్వహించారు. యీ నాయకులు ఈ ఒక్క రోజును కూడా మహిళా సాధికారత యివ్వనీకి గుండెబేజారైతరు. ఎక్కడ సందిస్తే సాంతం ఆక్రమిస్తారని దిగులు. మహిళా సంఘాల మహిళా నేతలు శ్రామిక కింది కులాల మహిళలకు యీ రోజునన్నా సాధికారత యివ్వరు. మార్చి ఎనిమిదంటేనే స్త్రీలు ఒకరినొకరు సంఘీభావం తెలుపుకునే రోజు. తమ లక్ష్యాల్ని ఎవరికీ వారు నిర్దేశించుకుని నిర్ణయించుకునే సందర్భం. స్త్రీలల్లో స్త్రీలకు, పురుషుల్తో స్త్రీలకు సమానత్వం రావాలి.
ఛానల్ల కళ్ళకు బంజారాహిల్స్‌ స్థాయి మహిళలే గానీ బస్తీ మహిళలు కానరారు, పత్రికల అక్షరాలక్కూడా వాల్లు మైళ్ళదూరం.
యేండ్ల తరబడి ఎదురు చూసిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఏమైతేనేమి రాజ్యసభలో ఆమోదం పొందడం ఒక వరకు ఆనందమే.కాని ఈ బిల్లు మహిళలందరికీ వస్తే పూర్తి ఆనందం వుండేది. మహిళలంతా కల్సి రోడ్ల మీదికి వచ్చి చెమ్మచెక్క ఆడుకునేవాల్లం. కాని ఆ సంతోషాలు, సంబరాలు చూడ్డం మగప్రపంచానికి యిష్టముండదు. యిప్పుడు అంబేద్కర్‌ వుంటే బాగుండేది. మహిళలకోసం హిందూ కోడ్‌ బిల్లు బెట్టి అది వీగిపోతే తన న్యాయమంత్రిత్వ పదవికి రాజీనామా చేసి మహిళల్తో చేయి కలిపి పోరాడిండు. అట్లాంటి మహిళా పక్షపాతి యిప్పుడెక్కడ?
మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజ్యసభలో ఆమోదం అయిందని కొద్దిమంది మహిళలు సంబరాలు చేస్కుంటుంటే మహిళా జనాభాలో సగానికన్నా ఎక్కువున్న బిసీ, మైనారిటీ మహిళలు ఆ ఫలాలకు దూరంగా వుంచబడడంవల్ల బాధగా వున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ బిల్లు మహిళల్ని చీల్చిందని చెప్పొచ్చు. మహిళలు రాజకీయ ప్రయోజనాలను పొందే మహిళలు, పొందని మహిళలుగా విభజించబడినారు. సామాజికంగా, రాజకీయంగా స్త్రీలంతా ఒక్కటే వేరు కాదు అనే వాల్లు ఈ విభజన అంతరార్ధమేమిటో గమనించాలి. మహిళలంతా ఒక్కటే, మనుషులంతా ఒక్కటే, ఆడమగ తేడా లేదని, కులం మతం తేడా లేదని చెప్పడం బైటికి గొప్ప ప్రజాస్వామికంగా ఉన్నతంగా అగుపించొచ్చు. కాని ఒక రకంగా లేనపుడు భిన్న వర్గాలుగా, కులాలుగా, మతాలుగా విడివడి వున్నప్పుడు ఒక్కటే అనడం వారి భిన్న అస్తిత్వాల ప్రయోజనాల్ని దెబ్బతీయడమే అవుతుంది. అస్తిత్వాల్ని  అణచివేయడానికి యిపుడు ఐక్యత, సమైక్యత, ఒక్కటిగ అనేవి ఆయుధాలుగా వాడ్తున్నారు. మాలలు 58 ఎస్సీ కులాల మీద, సీమాంధ్రులు తెలంగాణ వాల్ల మీద, ఆధిపత్య కులాల స్త్రీలు దళిత బీసీ, ఆదివాసీ మైనారిటీ స్త్రీల మీద పైకి ప్రజాస్వామికంగా కనబడే యీ పదాలతో దాడి చేస్తుండడం చూస్తున్నాం.
రాజకీయ అవకాశాలున్న మహిళలు, రాజకీయ అవకాశాలులేని మహిళలుగా చట్టం (బిల్లు) విభజించింది. యీ బిల్లు యింకా పెద్ద సమస్యని సృష్టిించింది. మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం యీ బిల్లు చూపించలేదేెమో! ఉన్నత వర్గాల మహిళలే చట్ట సభల్లోకి వెళ్తారు. వాల్ల సమస్యల్నే చర్చించే అవకాశముంటుంది. నిజానికి యీ బిల్లు ఆమోదం పొందనందువల్ల ప్రధానంగా నష్టపోయింది దళిత ఆదివాసీ మహిళలే. రాజ్యాంగ దేశం ప్రకారం 33% మహిళా రిజర్వేషన్స్‌ బిల్లు దళిత ఆదివాసీ మహిళలక్కూడా వర్తిస్తుంది. కాని బీసి మైనారిటీ మహిళలకు వర్తించదు. రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందక పోయినా ఆధిపత్య కులాల స్త్రీలు చట్ట సభల్లోకి కొంత శాతమైనా వెళ్ళగలిగేరు. కాని దళిత ఆదివాసీ స్త్రీలు బిల్లు ఆమోదం పొందక పోవడంవల్ల వారి రిజర్వేషన్స్‌ వృధా అయినవి. వారు చట్ట సభలకు దూరమయ్యారు.
రేపు లోక్‌ సభలో కూడా యీ బిల్లు ఆమోదించబడ్తుందనే ఆశిద్దాం. కాకపోతే అన్ని వర్గాల కులాల మహిళలకు న్యాయం జరగడం లేదనే బాధ. మహిళలందరికిస్తే వీళ్ళ ముల్లెలేంబోతయి. వాల్ల మీద వీల్లు వీల్ల వాల్లు నెపం బెట్టుకొని యిన్నాల్లు ఆలస్యం జేసిండ్రు. నిజానికందరికి భయాలే. వాల్ల సీట్లకు ఎసరొస్తదనే బెంగలు. ఆ విషయంలో మగాల్లంతా వొకటే.
మహిళా సాధికారత సాధించే దిశగా మహిళా బిల్లు మొదటి అడుగే. ఒక జమీందారి, జాగిద్దారి, దొర,పటేలు బిడ్డలు, భార్యలు, తల్లులు రాజకీయ ప్రతినిధులైతే మహిళా సాధికారత కాదు. ఒక అంటరాని కులం మహిళలు, పాకీవృత్తి  చేసే మహిళలు జోగినీ స్త్రీలు, భూముల్లేని అణగారిన స్త్రీలు చట్ట సభల్లో నాయకత్వ స్థానాల్లో వున్నపుడే మహిళలకు అంతిమ విజయం సాధ్యం.

Share
This entry was posted in ధారావాహికలు. Bookmark the permalink.

One Response to ఈ బిల్లు ఆడోళ్ళందరిదైతే చెమ్మ చెక్క ఆడుకుందుము

  1. హె says:

    చెల్లెమ్మా, మీ వ్యాసం చాల బాగుంది. “మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తి స్థాయి పరిష్కారం యీ బిల్లు చూపించలేదేమో!” అన్నారు. ‘ఏమో’ కాదు, చూపలేదు. మీరు అగ్రెసివ్ దూకుడుగా మాట్లాడుతారని అంటూ వుంటారు. (మాట్లాడాలి. అగ్రెషన్ కు గురైన వాళ్లకే అగ్రెసివ్ గా మాట్లాడే హక్కు ఉంటుంది). అలాంటి మీరే ఇలా ‘ఏమో’ అంటున్నారంటే, వ్యవస్థ షడ్యంత్రం ముందు మీరంతా ఎంత డస్సిపోయారో అని దిగులేసింది. “ఉన్నత వర్గాల మహిళలే చట్ట సభల్లోకి వెళ్తారు. వాళ్ల సమస్యల్నే చర్చించే అవకాశముంటుంది.” అన్నారు. మీ వాక్యానికి ఒక చిన్న సవరణ చేస్తున్నాను. వాళ్లు వాళ్ల ‘సమస్యల్నే’ చర్చించడం ఒక్కటే కాదు. వాళ్లు వాళ్ల వర్గ సమస్యల్నే (మగవాళ్లతో కూడిన వాళ్ల వర్గ సమస్యల్నే) చర్చిస్తారు. అందులో ఒక ఉప-విషయంగా ఆ వర్గ పరిధిలోని ఆడవాళ్ల సమస్యల్ని కూడా చర్చిస్తారు. మరొక రకంగా చెప్పాలంటే, ఈ బిల్లు వల్ల, చట్టసభల్లో, పేద వర్గ సమస్యల్ని చర్చించే వాళ్ల సంఖ్య తగ్గుతుంది.
    ఒక న్యాయమైన అంశానికి కట్టుబడి ఉన్నందుకు, బీసీ ఎస్సీ రాజకీయ నాయకులను మీడియా ఎలా చిత్రించిందో చూడండి. వాళ్లు స్త్రీలకు రిజర్వేషన్ కల్పించడానికే వ్యతిరేకులైనట్లు చిత్రించింది. వాళ్లు బిల్లుని వ్యతిరేకించడం లేదు. అది ఇప్పుడు ఉన్న స్థితిలో కాకుండా, మరింత న్యాయబద్ధంగా ఉండాలని కోరారు. ఆ సంగతి పత్రికలు చదివే వాళ్లకు, టీవీలు చూసే వాళ్లకు తెలియలేదు. బీసీ, ఎస్సీ నాయకులు బిల్లును వ్యతిరేకిస్తున్నారనే స్పృహను మాత్రమే కలిగించింది మీడియా. జూపాక సుభద్ర వ్యాసం వంటి వ్యాసాలు మరింత ఎక్కువగా రావాలి. మరింత విపులంగా, మరింత నిర్మొహమాటంగా ఈ చర్చ జరగాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియాను కూడా ఈ చర్చకు ఉపయోగించుకోవాలి. ఎలా చేస్తారో ఏమో ఆ పని జరగాలి. ఒక మంచి వ్యాసాన్ని వెలువరించినందుకు “భూమిక”కు, చక్కని శైలిలో ఒక ముఖ్య విషయాన్ని చర్చించినందుకు జూపాక సుభద్రకు అభినందనలు. … హెచ్చార్కె

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో