100వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమావేశం

స్వార్డ్‌ టీం, సిద్దిపేట
మార్చి 12వ తేదీన  ఐఇజుష్ట్రఈ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్‌క్లబ్‌నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సభ ఏర్పాటు చేయడమైనది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌  వరూధిని గారూ ప్రత్యేక ఆహ్వానితులుగా, గౌరవనీయులు ష్ట్రఈం హనుమంతురావు గారూ, గౌరవనీయులు ఈఐఆ శశికుమార్‌గారూ, ప్రత్యేక అతిధిగా స్త్రీవాద పత్రిక భూమిక ఎడిటర్‌ సత్యవతి గారూ,  గీతా సోషల్‌ వర్కర్‌ గారూ, లెక్చరర్‌  నందిని సిద్దారెడ్డి గారూ, జననీ ఫౌండేషన్‌ అధ్యక్షులు   తుమ్మనపల్లి శ్రీనివాస్‌గారు విచ్చేసారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత స్వార్డ్‌ సెక్రెటరీ  శివకుమారిగారు వహించారు.
ఈ కార్యక్రమము యొక్క ముఖ్యోద్దేశము  శివకుమారిగారూ వివరిస్తూ 100వ అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జుఆఇశ్రీ నుండి వారోత్సవాలు జరపడంలో భాగంగా ఈ రోజు సిద్దిపేటనందు కార్యక్రమమును ఏర్పాటుచేసుకొన్నాము. 100 సంవత్సరాలు అయినా ఇంకా, సమానహక్కులు – సమాన అవకాశాలు గురించే ఈ అంతర్జాతీయ దినోత్సవంను జరుపుకోవడం చూస్తే మహిళలు ఎంత అభివృద్ధి సాధించారో అర్థమవుతుంది. అభివృద్ధి దశలో చూస్తే ఇంకా 40% స్థాయిలోనే నేటి మహిళలు ఉన్నారు. ముఖ్యంగా స్త్రీలపై జరుగుతున్న హింసకు సంబంధించిన గణాంకాలు చూస్తే రాష్ట్రం ప్రథమస్థానంలో ఉంది. కావున ఈ సమానహక్కులు – సమాన అవకాశాలు మహిళలు పొందాలి. అంటే మహిళలపై జరిగే హింసని సామాజిక సమస్యగా గుర్తించి దీనిపై వ్యవస్థలు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముఖ్యఅతిథి  వరూధిని గారూ మాట్లాడుతూ గృహహింస చట్టం 2005-2006 అక్టోబర్‌ నుండి అమలులోనికి వచ్చింది. ఈ చట్టాన్ని మహిళలు ఉపయోగించుకొని మెజీస్ట్రేట్‌ నుండి రక్షణ ఉత్తర్వులు పొందవచ్చని రక్షణాధికారి, సర్వీస్‌ ప్రొవైడర్‌, మెజీస్ట్రేట్‌, పోలీస్‌లు ఈ నలుగురు వద్దకు బాధిత మహిళ ఫిర్యాదు చేయవచ్చునని మన సిద్దిపేట ఆంగా ష్ట్రఈం గారూ, సర్వీస్‌ ప్రోవైడర్‌గా ఐఇజుష్ట్రఈ సంస్థ ఉన్నారని బాధితురాలి కోరిన మేరకు ఈ|ష్ట్ర నింపిన 60 రోజులలో తుది తీర్పు అందుతుందని, బాధిత మహిళలకు ఉన్న ఇతర |ఆ్పు చట్టాలని ఉపయోగిస్తే చాలా కాలయాపన అవుతుంది. ఈఙ జుబీశిలో మాత్రం సత్వరన్యాయం పొందగలుగుతారని చట్టాలపైన మహిళలు అవగాహనపొంది వాటిని సరైన టైంలో వినియోగించు కోవాలని ఈ ఈఙ జుబీశి ద్వారా పొందే రక్షణ, ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా, ఇంటనుండి వెళ్లగొట్టడం, పిల్లల సంరక్షణ తీసుకొని హింసించడంలాంటివి అన్నీ కుటుంబహింసకి నిర్వచనంగా ఉన్నాయని వీటన్నింటి నుండి స్త్రీలు ఈ చట్టం ద్వారా రక్షణ పొందవచ్చును. గ్రామస్థాయిలోని మహిళలలో చైతన్యం తీసుకొని రావడం కోసం స్వార్డ్‌ సంస్థ చేస్తున్న కృషిని కొనియాడారు.
సత్యవతి గారూ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళాదినోత్సవం అనేది శ్రామిక మహిళలు హక్కులు పోరాటంలో భాగమే మహిళాదినోత్సవంగా 1975 నుండి ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న జరుపుకుంటున్నామని పురుషునితో సమానహక్కులు పొందగలిగినప్పుడే స్త్రీల అభివృద్ధి జరుగుతుందని అన్నారు. స్త్రీల అభివృద్ధే దేశాభివృద్ధి అనే విషయం ఐక్యరాజ్యసమితి చెప్పి భారతదేశం కూడా స్త్రీలపై హింసలు జరగనివ్వమని ప్రపంచదేశాలలో సంతకాలు ఒప్పందం చేస్తాయని వాటి ఫలితాలే ఈ మహిళా చట్టాలని దీని వెనుక ఎంతోమంది స్త్రీలు పోరాటం చేస్తేనే ఈ చట్టాలు సాధించామని నేడు అమలులో ఉన్న ఎన్నో ఆటంకాల వలన హక్కులు సక్రమంగా పొందలేకపోవడం దురదృష్టకరమని ఇందుకు వ్యవస్థలు కృషిచేయాలన్నారు.
ఈఐఆ  శశికుమార్‌ గారూ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా ఇంతమంది మహిళలను కలుసుకోవడం సంతోషం. నేడు సమాజంలో స్త్రీలు రక, రకాల ఇబ్బందులు, హింసలకి గురౌతున్నారు. వీటినుండి స్త్రీలు విముక్తి పొందాలి అంటే ప్రతి మహిళ చైతన్యవంతురాలు అయి తన హక్కులు తెలుసుకొని, ఆ దిశగా వెళ్ళాలన్నారు. తమపై జరుగుచున్న హింసని వ్యతిరేకించాలని వరకట్న వేధింపుల చట్టం1984 ప్రకారం ఎన్నో కేసులు నమోదు అవుతున్నాయి. అంటే వరకట్నం నిషేధ అమలు జరగటం లేదు. అందుకే ప్రతి ఆడపిల్లలను బాగా చదివించి వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడి ధైర్యంగా తనపై జరిగే హింసని వ్యతిరేకించాలన్నారు.
నందిని సిద్దారెడ్డి గారూ మాట్లాడుతూ అనాది నుండి ఈ పురుషాధిక్య సమాజంలో స్త్రీలు వివక్షతకు, చిన్నచూపుకు గురవటం వలన సామాజిక, రాజకీయ, సాంఘిక సంఘాలలో స్త్రీలు ఎదగలేకపోతున్నారు అనడానికి నిదర్శనమే చట్టసభలలో స్త్రీలు – స్త్రీల ప్రాతినిధ్యం 33% ప్రక్రియ 14 ఏళ్ళుగా పోరాటం చేస్తున్నామని అందుకే స్త్రీలు ఎప్పటికప్పుడు పోరాడాలి. ఇది సాధించాం అయిపోయిందని అనలేకపోతున్నాం. ఆధునీకరణ పేరుతో సైబర్‌క్రైమ్‌ ఎక్కువ అయ్యిందని ఈ టెక్నాలజీ పేరుతో స్త్రీలపై హింస అధికం చేస్తున్నారని అందుకే స్త్రీలు మాట్లాడాలి, వ్యతిరేకించాలి అని పిలుపునిచ్చారు.
శ్రీ శ్రీనివాస్‌  మాట్లాడుతూ మహిళలకు ఎన్నో చట్టాలు, హక్కులు వున్నాయని వాటిని ప్రతి మహిళా వినియోగించుకోవాలి అంటే చట్టాలపై అవగాహన పొందాలని ఇందుకు ఐఇజుష్ట్రఈ కృషి చేయాలన్నారు.
శ్రీ ష్ట్రఈం హనుమంతరావు గారూ మాట్లాడుతూ 100వ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, కుటుంబహింస చట్టం తెచ్చుకొన్నాం అంటే మహిళపై హింస జరుగుతున్నదని నిదర్శనం. మనిషిని మనిషిగా గుర్తించాలని, మహిళపై హింస మానవహక్కుల ఉల్లంఘనే అనే విషయం ప్రతీ ఒక్కరూ గుర్తించాలని, చట్టాన్ని, హక్కులను ఉల్లంఘించడం నేరమని, ప్రతి ఒక్కరూ తెలుసుకొంటే స్త్రీలు సమానహక్కులు – సమాన అవకాశాలు పొందగలుగుతారని అప్పుడే మహిళా సాధికారత ఉంటుందన్నారు. ఈ కార్యక్రమాన్ని  అంజమ్మ  వందన సమర్పణతో ముగించడమైనది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో