కుటుంబ హింసనుంచి మహిళలకు రక్షణ నిబంధనలు, 2006

(ముఖ్య నిబంధనలు)

ఈ నిబంధనలు 2006 అక్టోబర్ 26 న అమలులోకి వస్తాయి.
2 (బి) ఫిర్యాదు అంటే, రక్షణాధికారికి, ఏ వ్యక్తి అయినా మౌఖికంగా లేదా లిఖిత పూర్వకంగా అందించే ఆరోపణ.
(సి) ‘కౌన్సెలర్’ అంటే- చట్టంలోని సెక్షన్ 14 (1) కింద కౌన్సెలింగ్ ఇవ్వడానికి అధికారం కలిగిన ‘సర్వీస్ ప్రొవైడర్’ సభ్యులు

3. రక్షణాధికారుల అర్హతలు, అనుభవం:
1) రాష్ట్ర ప్రభుత్వం నియమించే రక్షణాధికారులు ప్రభుత్వ లేదా ప్రభుత్వేతర సంస్థలకు చెంది వుండవచ్చు. మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
2) రక్షణాధికారిగా నియమితులైన వారికి సామాజిక రంగంలో కనీసం మూడేళ్ళ అనుభవం వుండాలి.
3) రక్షణాధికారి పదవీకాలం కనీసం మూడేళ్ళు.
4) ఈ చట్టం, నిబంధనల ప్రకారం పనిచేయడానికి అవసరమైన కార్యాలయ సహకారాన్ని ప్రభుత్వం రక్షణాధికారికి కల్పించాలి.

4. రక్షణాధికారికి సమాచారం:
1) ఏదైనా కుటుంబ హింస జరుగుతూ వుందని గాని, జరిగిందని గాని, జరగబోతోందని గాని నమ్మేందుకు తగిన కారణం వున్న ఏ వ్యక్తి అయినా రక్షణాధికారికి ఈ సమాచారాన్ని మౌఖికంగా లేదా లిఖిత పూర్వకంగా తెలియజేయవచ్చు.
2) ఒక వ్యక్తి సమాచారాన్ని మౌఖికంగా ఇస్తే, రక్షణాధికారి దానిని లిఖితరూపంలో మలచి, సమాచారం ఇచ్చిన వ్యక్తి సంతకం తీసుకోవచ్చు. అయితే, లిఖితపూర్వక సమాచారం ఇచ్చే పరిస్థితిలో లేని వ్యక్తినుంచి, వారి గుర్తింపు వివరాలను తీసి రికార్డులలో భద్రపరచుకోవాలి.
తాను నమోదు చేసిన సమాచారం ఒక కాపీని సమాచారం అందించిన వ్యక్తికి రక్షణాధికారి ఉచితంగా అందించాలి.

5. కుటుంబ హింస సంఘటన నివేదిక (డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్):
1) కుటుంబ హింసకు సంబంధించిన ఒక సంఘటన జరిగినట్టు ఫిర్యాదు అందగానే, రక్షణాధికారి ఫామ్ -1 లో కుటుంబ హింస సంఘటన నివేదికను తయారు చేసి దానిని మేజిస్ట్రేటుకి సమర్పించడంతో పాటు, సంబంధిత ప్రాంత పోలీసు స్టేషన్కు, సర్వీస్ ప్రొవైడర్కు కాపీలు పంపాలి.
2) బాధితురాలు కోరితే, సర్వీస్ ప్రొవైడర్ ఫామ్ -1 లో కుటుంబ హింస సంఘగన నివేదికను తయారు చేసి, సంబంధిత ప్రాంత మేజిస్ట్రేట్కి, రక్షణాధికారికి కాపీలు పంపాలి.

6. మేజిస్ట్రేటుకి దరఖాస్తుః
1) బాధితురాలు సెక్షన్ 12 ప్రకారం చేసే ప్రతి దరఖాస్తునూ ఫామ్ -11 లో, లేదా దీనికి సాధ్యమైనంత దగ్గరగా వుండాలి.
2) సబ్- రూల్ (1) కింద దరఖాస్తు తయారుచేసి, సంబంధిత మేజిస్ట్రేటుకు పంపడానికి బాధితురాలు రక్షణాధికారి సహాయం తీసుకోవచ్చు.
3) బాధితురాలు నిరక్షరాస్యురాలైతే, రక్షణాధికారి దరఖాస్తును ఆమెకు చదివి వినిపించాలి, వివరించాలి.
4) సెక్షన్ 23 లోని సబ్-సెక్షన్ (2) కింద చేయాల్సిన అఫిడవిట్ను ఫామ్ -111 లో దాఖలు చేయాలి.
5) సెక్షన్ 12 కింద దరఖాస్తులను, వాటిపై ఉత్తర్వులను క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, 1973 లోని సెక్షన్ 125 ప్రకారం నిర్వహించాలి.

7. ఎక్స్పార్టీ ఉత్తర్వుల కోసం అఫిడవిట్:
ఎక్స్పార్టీ ఉత్తర్వులకోసం సెక్షన్ 23 (2) కింద అఫిడవిట్లన్నీ ఫామ్ – 111 లో నింపాలి.

8. రక్షణాధికారుల విధులు, కార్యక్రమాలుః
1) బాధితురాలు ఫిర్యాదు చేయాలని కోరితే, ఫిర్యాదు చేయడంలో సహకరించాలి.
2) బాధితురాలికి ఈ చట్టంలో కల్పించిన హక్కులను, ఫామ్ – IV లో తెలిపిన విధంగా – ఇంగ్లీషు లేదా స్థానిక భాషలో తెలియజేయాలి.
3) ఈ చట్టం సెక్షన్ 12, లేక 23 (2) ప్రకారం, లేదా మరే ఇతర దరఖాస్తులు చేసుకోవడానికి సహాయం చేయాలి.
4) బాధితురాలికి పొంచివున్న ప్రమాదాన్ని అంచనా వేశాక, సెక్షన్ 12 కింద దరఖాస్తు చేశాక, ఆమెను సంప్రదించి, ఆమెపై ఇంకా హింస కొనసాగకుండా చూసేందుకు ‘భద్రతా ప్రణాళిక’ (సేఫ్టీ ప్లాన్) ను తయారు చేయాలి.
5) రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అధారిటీ ద్వారా బాధితురాలికి న్యాయ సహాయం అందించాలి.
6) బాధితురాలికి, ఆమె పిల్లలకి ఒక వైద్య సేవల కేంద్రంలో వైద్య సహాయం అందించాలి, ఈ కేంద్రానికి వెళ్ళేందుకు రవాణా సదుపాయం కల్పించాలి.
7) బాధితురాలు, ఎవరైనా పిల్లలు పునరావాస స్థలానికి వెళ్ళేందుకు రవాణా సదుపాయం కల్పించాలి.
8) ఈ చట్టం అమలుకు సేవలు అందించడానికి పేర్లు నమోదు చేయించుకున్న సంస్థలకు వారి సేవలు అవసరమైతే చెప్పాలి, ఈ చట్టంలోని సెక్షన్ 14 (1) ప్రకారం కౌన్సెలర్లుగా లేదా సెక్షన్ 15 ప్రకారం సంక్షేమ నిపుణుల (వెల్ఫేర్ ఎక్స్పర్ట్స్) నియామకం కోసం తమ సభ్యుల వివరాలు పంపాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆహ్వానించాలి.
9) కౌన్సెలర్లుగా నియామకం కోసం వచ్చిన దరఖాస్తులలో ఎంపిక చేసిన వాటిని మేజిస్ట్రేట్కి పంపాలి.
10) మూడేళ్ళకొకసారి కౌన్సెలర్ల జాబితాను సవరించి కొత్త జాబితాను మేజిస్ట్రేటుకి పంపాలి.
11) ఫిర్యాదు చేసినందుకు బాధితురాలు వేధింపులకు, వత్తిడులకు గురికాకుండా సాధ్యమైన అన్ని సహాయాలను అందించాలి.
12) బాధితురాలు/ బాధితులు, పోలీసులు, సేవలు అందించేవారి మధ్య సమన్వయ కర్తగా పనిచేయాలి.
2 (ఎ) బాధితులను కుటుంబ హింస నుంచి ఈ చట్టం ఈ నిబంధనల ప్రకారం రక్షించాలి.
బి) బాధితురాలిపై హింస పునరావృతం కాకుండా ఈ చట్టం, నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలి.

9. అత్యవసర పరిస్థితులలో తీసుకోవలసిన చర్యః
ఒక బాధితురాలి నుంచి లేదా, ఎవరైనా ఒక వ్యక్తి, కుటుంబ హింస జరుగుతూ వుందని గాని, జరగబోతున్నదనిగాని నమ్మకంగా టెలిఫోన్ లేదా ఇ-మెయిల్ ద్వారా రక్షణాధికారికి గాని లేక సేవలు అందించేవారికి గాని సమాచారం అందిస్తే, వారు వెంటనే పోలీసుల సహాయం తీసుకుని సంఘటనా స్థలానికి వెళ్ళి సంఘటన నివేదిక తయారు చేయాలి, దానిని ఈ చట్టం కింద తగిన ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మేజిస్ట్రేట్కు వెంటనే అందజేయాలి.

10. రక్షణాధికారి ఇతర విధులుః
మేజిస్ట్రేటు లిఖితపూర్వకంగా ఆదేశిస్తే, రక్షణాధికారి,
ఎ) ఎక్స్పార్టీ ఆదేశాలు జారీ చేయడం కోసం స్పష్టతకై కోర్టు కోరితే, భాగస్వామ్య కుటుంబ ప్రదేశాన్ని (ఇంటిని) సందర్శించాలి.
బి) తగిన విచారణ జరిపాక, ఆదాయం, ఆస్తులు, బ్యాంకు ఖాతాలు, ఇతర డాక్యుమెంట్లపై నివేదికను కోర్టులో దాఖలు చేయాలి.
సి) బాధితురాలికి కుటుంబంలోని తన భాగాన్ని కానుకలు, నగలతో సహా ఆమెకు చెందిన అన్ని వస్తువులను ఆమెకు స్వాధీనం చేయించాలి.
డి) కోర్టు ఆదేశించిన ప్రకారం బాధితురాలు తన పిల్లలను తన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి, ఆయన పర్యవేక్షణలో ఉన్నవారిని కలవడానికి హక్కును పొందడంలో సహాయం చేయాలి.
ఇ) ఆరోపించబడిన కుటుంబ హింసా సంఘటనలో ఏదైనా ఆయుధాన్ని ఉపయోగించి వుంటే, దానిని స్వాధీనం చేసుకోవడానికి పోలీసుల సహాయం తీసుకోవాలి.

12. నోటీసుల జారీ విధానం:
ఈ చట్టం కింద కోర్టులో హాజరు కావాలని జారీ చేసే నోటీసులలో, కుటుంబ హింసకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల పేర్లు, వారు పాల్పడిన కుటుంబ హింస, ఆ వ్యక్తులను గుర్తించేందుకు అవసరమైన ఇతర వివరాలు వుండాలి.
2) నోటీసులను ఈ కింది పద్ధతులలో జారీ చేయాలిః
ఎ) ఈ చట్టంకింద నోటీసులను ఫిర్యాదుదారు లేదా బాధితురాలు తెలిపిన ప్రకారం భారతదేశంలోని ప్రతివాది ఇంటి చిరునామాకు లేదా, వారు పనిచేసే కార్యాలయం చిరునామాకు రక్షణాధికారి తరపున, రక్షణాధికారి, లేదా వారు అధీకరించిన ఎవరైనా నోటీసులు పంపాలి.
బి) నోటీసులకు ఆ సమయంలో ఆ ప్రదేశానికి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి ఇవ్వాలి, అలా ఇవ్వడం సాధ్యం కానపుడు, ఆ ప్రాంగణంలో బాగా కనిపించే ప్రదేశంలో అతికించాలి.
సి) ఈ చట్టం సెక్షన్ 13 లేదా, మరే ఇతర వెసులుబాటు ప్రకారం నోటీసులను సిఆర్పిసి, 1908 లోని చాప్టర్ – V లేదా సిఆర్పిసి, 1973 లోని చాప్టర్ – VIలలో ఏది వీలైతే దాని ప్రకారం జారీ చేయాలి.
3) ప్రతివాది హాజరు కావడానికి నిర్ణయించిన తేదీన ఒక ప్రకటన లేదా, నోటీసులు జారీచేయడానికి అధీకరించిన వ్యక్తి సమర్పించే నివేదికపై, ఫిర్యాదుదారు, లేదా, ప్రతివాది, లేదా, ఇద్దరి వాదనలు విన్న మీదట కోర్టు మధ్యంతర సహాయం (రిలీఫ్) కోసం పెండింగ్లో ఉన్న దరఖాస్తుపై ఉత్తర్వులు జారీ చేయాలి.
4) భాగస్వామ్య గృహంలోకి ప్రతివాది ప్రవేశాన్ని నిషేధిస్తూ గానీ, ప్రతివాదిని దూరంగా వుండమని గానీ, బాధితురాలితో కలవరాదని గాని రక్షణ ఉత్తర్వులు జారీ అయితే బాధితురాలు ప్రతివాదిని ఆహ్వానించినా చెల్లుబాటుకాదు.
– కోర్టు జారీ చేసిన నిషేధ ఆదేశాలను రక్షణ ఉత్తర్వులలో సెక్షన్ 25 (2) కింద సవరిస్తే తప్ప.
5. రక్షణ ఉత్తర్వుల ఉల్లంఘనః
1) బాధితురాలు, రక్షణ ఉత్తర్వుల, మధ్యంతర రక్షణ ఉత్తర్వులపై రక్షణాధికారికి ఫిర్యాదు చేయవచ్చు.
2) సబ్ -రూల్ (1) ప్రకారం చేసే ప్రతి ఫిర్యాదు లిఖిత పూర్వకంగా వుండాలి, బాధితురాలి సంతకం వుండాలి
3) రక్షణాధికారి, ఈ ఫిర్యాదు నకలును, ఉల్లంఘనకు గురైనట్లు ఆరోపించిన రక్షణ ఉత్తర్వు నకలుకు జతచేసి, తగిన ఆదేశాల కోసం మేజిస్ట్రేట్కి పంపాలి.
4) బాధితురాలు కావాలనుకుంటే, రక్షణ ఉత్తర్వు లేదా మధ్యంతర రక్షణ ఉత్తర్వు ఉల్లంఘనపై నేరుగా మేజిస్ట్రేట్కి లేదా పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు.
5) రక్షణ ఉత్తర్వులు ఉల్లంఘన జరిగిన తర్వాత ఎప్పుడైనా, బాధితురాలు కోరితే, రక్షణాధికారి వెంటనే పోలీసుల సహాయంతో ఆమెను రక్షించాలి, స్థానిక పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయడంలో సహకరించాలి.
6) సెక్షన్ 31 కింద, లేదా, ఇండియన్ పీనల్కోడ్, 1860 లోని సెక్షన్ 498 ఎ కింద, లేదా, మరే ఇతర నేరంకింద అయినా మొత్తంగా విచారించడానికి వీలులేని విధంగా ఆరోపణలను రూపొందిస్తే, కోర్టు అలాంటి నేరాలను సిఆర్పిసి, 1973 కింద విచారించడం కోసం వేరుచేసి, సెక్షన్ 31 కింద రక్షణ ఉత్తర్వుల ఉల్లంఘనను సిఆర్పిసి, 1973 లోని చాప్టర్ ఒఒI ప్రకారం విచారణకు స్వీకరించాలి.
7) ఈ కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను అమలు చేయడానికి ప్రతివాది లేదా ఆయన తరపున వ్యవహరించే మరెవరైనా నిరాకరిస్తే, దానిని ఈ చట్టం కింద జారీ అయిన రక్షణ ఉత్తర్వు, లేదా మధ్యంతర రక్షణ ఉత్తర్వు ఉల్లంఘనగా పరిగణించాలి.
8) రక్షణ ఉత్తర్వు లేదా మధ్యంతర రక్షణ ఉత్తర్వు ఉల్లంఘనను వెంటనే స్థానిక పోలీసు స్టేషన్కు ఫిర్యాదు చేయాలి, దీనిని సెక్షన్ 31, 32 కింద నిర్దేశించిన విధంగా కాగ్నిజబుల్ నేరంగా పరిగణించి చర్య తీసుకోవాలి.
9) ఈ చట్టం కింద అరెస్టు అయిన వ్యక్తిని బెయిల్పై విడుదల చేసేటపుడు, బాధితురాలిని రక్షించడం కోసం, నిందితుడు కోర్టులో హాజరయ్యేలా చేసేందుకోసం, కోర్టు కింది షరతులను ఉత్తర్వుల రూపంలో విధించాలి:
ఎ) నిందితుడు కుటుంబ హింసకి పాల్పడటం లేదా పాల్పడతానని బెదిరించడాన్ని నివారిస్తూ ఉత్తర్వు
బి) బాధితురాలిని వేధించడం, ఫోను చేయడం, లేదా ఏవిధంగానైనా కలవడాన్ని నిరోధిస్తూ ఉత్తర్వు
సి) బాధితురాలి నివాసం నుంచి ఖాళీచేసి, దూరంగా వుండాలని ఆమె సందర్శించే అవకాశం వున్న ప్రదేశాలకు దూరంగా వుండాలని ఆదేశిస్తూ ఉత్తర్వు.
డి) ఎలాంటి ప్రమాదకర ఆయుధాన్ని కలిగి వుండటాన్ని నిషేధిస్తూ ఉత్తర్వు
ఇ) మద్యం సేవించడం లేదా మరే ఇతర డ్రగ్స్ తీసుకోవడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వు
ఎఫ్) బాధితురాలి రక్షణ, భద్రత తగిన ఉపశమనం కోసం మరే ఇతర ఉత్తర్వు అయినా.

16. బాధితురాలికి ఆశ్రయం:
1) బాధితురాలి అభ్యర్థనపై, రక్షణాధికారి లేదా సేవలు అందించేవారు ఒక పునరావాస గృహం ఇన్ఛార్జికి సెక్షన్ 6 కింద ఆమెకు ఆశ్రయం కల్పించాలని లిఖితపూర్వకంగా అభ్యర్థిస్తూ, ఈ అభ్యర్థనను సెక్షన్ 6 కింద చేస్తున్నట్లు స్పష్టంగా తెలియజేయాలి.
2) సబ్-రూల్ (1) కింద రక్షణాధికారి ఒక అభ్యర్థన చేస్తే, దానికి సెక్షన్ 9, సెక్షన్ 10 కింద నమోదు చేసిన కుటుంబ హింస సంఘటన కాపీని జతచేయాలి. ఈ హ్ోంలో ఆశ్రయం కోసం అభ్యర్థన చేసేముందు కుటుంబ హింస నివేదికను దాఖలు చేయలేదన్న కారణంపై బాధితురాలికి ఆశ్రయం నిరాకరించరాదు.
3) బాధితురాలు కోరితే, ఆమె హోంలో ఉన్న విషయాన్ని వెల్లడించరాదు, ఆమె ఎవరిపై ఫిర్యాదు చేశారో వారికి సమాచారం అందించరాదు.

17. బాధితురాలికి వైద్య సదుపాయం:
1) బాధితురాలు, లేదా, రక్షణాధికారి, లేదా సేవలు అందించేవారు ఒక వైద్యసేవల కేంద్రానికి సెక్షన్ 7 కింద లిఖిత పూర్వక అభ్యర్థన చేసి, ఈ అభ్యర్థనను సెక్షన్ 7 కింద చేస్తున్నట్లు స్పష్టంగా పేర్కొనాలి.
2) రక్షణాధికారి ఈ అభ్యర్థనను చేస్తుంటే, దీనికి కుటుంబ హింస సంఘటన నివేదికను జతచేయాలి. వైద్య సహాయం లేదా పరీక్షల కోసం వైద్య సేవల కేంద్రానికి దరఖాస్తు చేసేముందు కుటుంబ హింస సంఘటన నివేదికను దాఖలు చేయలేదన్న కారణంపై బాధితురాలికి వైద్యసేవలు అందించడానికి వైద్య సేవల కేంద్రం నిరాకరించరాదు.
3) వైద్య పరీక్షల నివేదికను, వైద్య సేవల కేంద్రం, ఈ బాధితురాలికి ఉచితంగా అందించాలి.
కుటుంబ హింస – ఉపశమనం దశలివీ
1) హింస సంఘటన జరుగుతుంది /జరుగుతూ వుంటుంది / జరిగే పరిస్థితులు ఏర్పడి వుంటాయి.
2) బాధితురాలు లేదా ఆమె తరపున ఎవరైనా ఆ ప్రాంతపు రక్షణాధికారికి లేదా ఈ చట్టంకింద సేవలందించేందుకు నమోదు చేయించుకున్న సంస్థకు టెలిఫోన్ / స్వయంగా / లిఖితపూర్వకంగా / ఇ – మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు.
3) సమాచారం అందిన వెంటనే రక్షణాధికారి లేదా సేవలందించే సంస్థ ప్రతినిధి సంఘటనా స్థలానికి వచ్చి, ఈ చట్టం కింద బాధితురాలు ఏ ఏ ఉపశమనాలు, సహాయాలు కోరవచ్చో వివరిస్తారు.
4) ఈ చట్టం ద్వారా లభించే ఉపశమనాలతో పాటుగా ఇంకా ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ల కింద ఏ ఏ కేసులు పెట్టవచ్చో వివరిస్తారు.
5) బాధితురాలి తరఫున ఆ నివేదికను తక్షణమే (ఎలాంటి జాప్యం లేకుండా) మేజిస్ట్రేట్కు అందజేస్తారు.
6) కుటుంబ సంఘటన నివేదిక (డి.ఐ.ఆర్) తనకు అందిన రెండు రోజుల్లోగా ప్రతివాదికి సమన్లు అందేలా మేజిస్ట్రేటు చర్యలు తీసుకుంటారు.
7) సంఘటన నమోదైన నాటినుంచి మూడవ రోజుకల్లా విచారణ ప్రారంభమవుతుంది.
8) సంఘటన, పరిస్థితుల దృష్ట్యా బాధితురాలికి మధ్యంతర ఉపశమనాలు అవసరమైతే, మేజిస్ట్రేటు వాటిని వెంటనే, ఒక ప్రతివాది కోర్టుకు హాజరు కాకపోతే, ఎక్స్- పార్టీ ( ప్రతివాది పరోక్షంలో) ఆదేశాలు జారీ చేస్తారు.
9) 60 రోజులలో కేసు విచారణ పూర్తయి, పూర్తి తీర్పు వెలువడుతుంది.
10) ఈ తీర్పులో లభించే ఉపశమనాలు తిరిగి బాధితురాలు లేదా ప్రతివాది ఒక దరఖాస్తు ద్వారా వాటి మార్పు / రద్దు కోరుతూ దరఖాస్తు చేస్తే తప్ప, శాశ్వతంగా అమలులో వుంటాయి.
గమనికః కుటుంబ హింస నుంచి మహిళలకు రక్షణ చట్టం ఎవరినీ శిక్షించదు, బాధిత మహిళకు రక్షణ కల్పించడానికి ఉద్దేశించిన చట్టమిది. నిందితులపై చర్యలు కావాలన్నా చేసే ఆరోపణలు / అభియోగాలు కుటుంబంలోని మహిళలపై అయితే ఐపిసి సెక్షన్లు లేదా ఇతర చట్టాల కింద పోలీసు కేసులు పెట్టాలి. ఈ చట్టంతో పాటుగా మరో చట్టం / ఐపిసి కింద ఒకేసారి కేసులు నడపవచ్చు. రక్షణ ఆదేశాలను ప్రతివాది ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేస్తారు.
ఈ ఉల్లంఘనకు ఏడాది వరకు జైలు, 20 వేల రూపాయల వరకు జరిమానా వుంటాయి.
10. మొదటి తరగతి మేజిస్ట్రేట్ కోర్టులో వెలువడే ఆదేశాలతో సంతృప్తి చెందని బాధితురాలు/ ప్రతివాది, ఈ ఆదేశాలు తమకు అందిన 30 రోజుల లోగా సెషన్స్ కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో