కుటుంబ హింసనుంచి మహిళలకు రక్షణ చట్టం, 2005 (చాప్టర్- 2)

కుటుంబ హింస

3. కుటుంబ హింసకు నిర్వచనం ఏమిటి?
ఈ చట్టం కింద, ఈ కింది ఫలితాలను కలిగించే ప్రతివాది చర్యలేవైనా కుటుంబ హింస కిందికి వస్తాయిః
ఎ) బాధితురాలి ఆరోగ్యం, భద్రత, శరీరభాగం, సంక్షేమం, శారీరకంగా గాని, మానసికంగా గాని- హాని లేదా గాయం కలిగించడం, లేదా అలా చేసేందుకు ఉద్యుక్తులు కావడం,భౌతిక,లైంగిక, మాటలు, భావోద్వేగ, ఆర్థిక దుర్వినియోగం, లేదా
బి) చట్ట విరుద్దంగా కట్నం,లేదా,ఇతర ఆస్థి లేదా, విలువైన వస్తువులకోసం ఆమెను లేదా ఆమెకి సంబంధించిన వ్యక్తిని లొంగదీసుకోవడం కోసం ఆమెకు హాని చేయడం, వేధించడం లేదా బెదిరించడం, లేదా
సి) క్లాజ్(ఎ) లేదా క్లాజ్ ( బి) ఉదహరించిన ఏ విధంగానైనా బాధితురాలిని, లేదా, ఆమెకు సంబంధించిన వారిని బెదిరించడం లేదా,
డి) బాధితురాలికి మరే ఇతర విధంగానైనా శారీరక, లేదా మానసిక గాయం, లేదా, హాని కలిగించడం.

వివరణః ఈ సెక్షన్ కోసం:
1). ‘శారీరక దుర్వినియోగం’ అంటే ఏమిటి?
శరీరానికి నొప్పి, హాని, ప్రాణహాని, శరీర భాగానికి హాని, లేదా ఆరోగ్యానికి హాని లేదా, బాధితురాలి ఆరోగ్యాన్ని లేదా అభివృద్ధిని విఘాత పరచడం వంటి నష్టం కలిగించే ఏ ప్రవర్తన (చర్య) అయినా…. దౌర్జన్యం, నేరపూరిత చొరబాటు, నేరపూరిత శక్తి ప్రయోగం.
2) ‘లైంగిక దుర్వినియోగం’ అంటే ఏమిటి?
మహిళలకు ఇబ్బంది కలిగించే, అవమానపరిచే, కించపరిచే లేదా ఏ విధంగానైనా ఆమె గౌరవానికి భంగం కలిగించే ఏదైనా లైంగిక చర్య.
3) మాటల, భావోద్రేక దుర్వినియోగం అంటే ఏమిటి?
ఎ) అవమానాలు,హేళన, చిన్నబుచ్చడం, మారుపేర్లతో పిలవడం, ప్రత్యేకించి పిల్లలులేని తనాన్నో మగపిల్లలు లేని తనాన్నో అవమానించడం లేదా హేళన చేయడం.
బి) బాధితురాలికి ఇష్టమైన వ్యక్తికి శారీరక నొప్పి కలిగిస్తానని అదేపనిగా బెదిరించడం.
4) ఆర్థిక దుర్వినియోగం అంటే ఏమిటి?
ఎ) ఏదైనా చట్ట ప్రకారం, లేదా, సాంప్రదాయం ప్రకారం, లేదా కోర్టు ఉత్తర్వు ప్రకారం, లేదా మరే ఇతర విధంగా బాధితురాలికి ఉన్న ఆర్థిక, నగదు హక్కును ఆమెకు దక్కకుండా చేయడం (నిరాకరించడం), లేదా, బాధితురాలు ఆమె పిల్లల కుటుంబ అవసరాలకు -వీటికి మాత్రమే పరిమితం కాకుండా ఇతర అవసరాలకు కూడా – కావలసిన డబ్బును స్త్రీ ధనం, బాధితురాలు ఒక్కరే లేదా బాధితురాలూ ప్రతివాది ఇద్దరూ ఉమ్మడిగా కలిగి ఉన్న ఉమ్మడి ఆస్థిని, లేదా వారు కలసి వుండే ఇంటి అద్దెను , కుటుంబ నిర్వహణ వ్యయాన్ని ఆమెకు ఇవ్వకపోవడం.
బి) బాధితురాలు సంబంధం వున్న, లేదా, కుటుంబ సంబంధం ద్వారా ఆమెకి కూడా చెందిన, లేదా, బాధితురాలికి, ఆమె పిల్లలకి న్యాయబద్ధంగా అవసరం వుండే ఇంటివస్తువులు, స్థిర, చర ఆస్థులు, విలువైన వస్తువులు, షెర్లు, సెక్యూరిటీలు, బాండ్లు, వగైరా, ఇతర ఆస్థులు, స్త్రీధనం, బాధితురాలి సొంత లేదా ఉమ్మడి ఆస్థి ఏదైనా విక్రయించడం.
సి) బాధితురాలు కలసివుండే ఇంటితో సహా హక్కు వున్న వనరులు సదుపాయాలను ఉపయోగించుకోనీయక పోవడం లేదా పరిమితులు విధించడం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో