తూనీగలు, కవిత్వ పరిశీలన : పుస్తకావిష్కరణ
Posted By భూమిక on April 1, 2007
తెలంగాణా విశ్వవిద్యాలయంలోని అసిస్టెంట్ ప్రొ. వి. త్రివేణి రచించిన తూనీగలు (నానీలు), చిల్లరిగె స్వరాజ్యలక్ష్మి కవిత్వ పరిశీలన అనే రెండు గ్రంధాలను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య ఎన్. గోపి ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు శాఖ అధ్యక్షురాలు ఆచార్య సుమతీ నరేంద్ర మాట్లాడుతూ తమ పూర్వ విద్యార్ధిని అయిన త్రివేణి చక్కటి పరిశోధకురాలిగా, కవయిత్రిగా ఎదిగినందుకు హర్షాన్ని వ్యక్తపరిచారు. ఆవిష్కర్త గోపి మాట్లాడుతూ వినయం, ప్రతిభ, పరిశ్రమ ముప్పేటలుగా అల్లుకున్న త్రివేణి తన పేరును సార్ధకం చేసుకుందన్నారు. ప్రముఖ రచయిత్రి డా. ముదిగంటి సుజాతారెడ్డి మాట్లాడుతూ త్రివేణికి మంచి భవిష్కత్తు ఉందని దీవించారు. నానీల తొలి కవయిత్రి డా. చిల్లర భవానీ దేవి మాట్లాడుతూ ఈ నానీల్లో స్త్రీ పరమైన సంవేదన ఉందని వ్యాఖ్యానించారు. డా. మసన చెన్నప్ప దంపతులు, కవయిత్రి తల్లిదండ్రులు కృతులు స్వీకరించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిశోధక విద్యార్ధి సంఘం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
Comments
Leave a Reply