పదునెక్కిన పద శక్తి

(దక్షిణాసియా దేశాల రచయిత్రుల సదస్సు)
ఓల్గా విమెన్స్‌ వరల్డ్‌ (ఇండియా)
మూడు రోజులు. ఐదు దేశాలు. అనేకానేక ఆలోచనలు అనుభవాలు, అనుభూతులు.

ఢిల్లీలో ఫిబ్రవరి 21-23 వరకు దక్షిణాసియా దేశాల రచయిత్రులు తమ జీవితానుభవాలను, వాటిలో నుంచి పుట్టిన సాహిత్య స్రవంతులను కలబోసుకున్నారు. భిన్న నేపధ్యాలలో, సంక్లిష్ట సందర్భాలలో రచనను ఒక రాజకీయ చర్యగా భావించి, ఎన్ని ఆటంకాలనో అధిగమించి, ఎన్ని నిర్భంధాలనో భరించి, ఎన్ని నిష్టూరాలనో సహించి రచనను కొనసాగిస్తున్న కలం యోధులు కొందరు. జైళ్ళు, దేశ బహిష్కారాలు, బెదిరింపులవంటి బహిరంగ నిషేధాలను ఎదుర్కునేవారు కొందరైతే, కుటుంబం, సమాజం, ప్రచురణరంగాలు సాహిత్య పీఠాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా విధించే నిషేధాలకు గురవుతున్నవారు మరి కొందరు.

వీరందరూ మూడు రోజుల పాటు తమ హృదయాలను తెరిచి మాట్లాడారు. ఒకరినొకరు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. రక్తం, కన్నీళ్ళూ కలిపి తమ ప్రాంతాలనుండి తెచ్చిన సాహిత్య సుగంధాన్ని చిలకరించారు.

అమెరికన్‌ స్త్రీవాద ఉద్యమ నిర్మాత గ్లోరియా స్టైనమ్‌ మూడు రోజుల పాటు ఓపికగా ఈ రచయిత్రుల అనుభవాలను విని వారిని ఉత్తేజ పరిచారు. రష్యా నుంచి ఓల్గా, నాడియాలు, పెరూ నుంచి మరియాలా సాలా, అమెరికా నుంచి విమెన్స్‌ వరల్డ్‌ ఇంటర్నేషనల్‌ అధ్యక్షురాలు మెరిడిత్‌ టాక్స్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొని అంతర్జాతీయంగా రచయిత్రుల పరిస్థితిని సమీక్షించారు. పాకిస్తాన్‌ నుంచి ఫరియాల్‌ ఆలి గౌహర్‌, ఫమిదా రియజ్‌ముసీజా షంసీ, కమీలా షంసీ, బంగ్లాదేశ్‌ నుంచి షబ్‌నమ్‌ నాదియ, సీమన్‌, నియాజ్‌ జమాన్‌, నేపాల్‌ నుంచి మంజుశ్రీ ధాపా, శ్రీలంక నుంచి అనోమ రాజకరణ, సునేత్ర, అమీనా హుస్సేన్‌, నిలోఫర్‌ డిమెల్‌. భారతదేశం నుంచి థెమ్యులా (నాగాలాండ్‌) మమంగ్‌దామ్‌ (అరుణాచల్‌ ప్రదేశ్‌), గగన్‌గిల్‌ (హిందీ) తస్లిమా నస్రీన్‌ (బెంగాల్‌) మందాక్రాంత (బెంగాలీ) నవనీతదేవ్‌సేన్‌ (బెంగాలీ) మంగై, బామ (తమిళం) ఓల్గా, చంద్రలత ( తెలుగు) వైదేహీ, ప్రతిభానంద కుమార్‌ (కన్నడ) రుక్మిణి ఛాయానాయర్‌ (ఇంగ్లీష్‌) గీతాంజలీ శ్రీ (హిందీ) అనితా ధంఫి, కె. ఆర్‌. మీరా ( మళయాళం) మేఘన(మరాఠీ) సరూప్‌ధృవ్‌, ఎస్తర్‌ డేవిడ్‌ (గుజరాత్‌) జిలానీబాను(ఉర్దూ) రాధిక (ఇంగ్లీషు, మృదులాగర్గ్‌ (హిందీ) మొ. పాల్గొన్న ఈ సమావేశంలో జరిగిన చర్చల సారాంశాన్ని మే నెల భూమికలో వివరంగా అందిస్తాం.

Share
This entry was posted in సాహిత్య వార్తలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో