ఆర్‌.టి.ఐ. చట్టం

సెంట్రల్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ కమిషన్‌ (కేంద్ర సమాచార కమిషన్‌) (సిఎసి), రాష్ట్ర సమాచార కమిషన్‌ / స్టేట్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ కమిషన్‌ లకు సెక్షన్‌ 18 సమాచార హక్కు చట్టం ననుసరించి ఫిర్యాదు చేయబడిన అధికారిపై విచారణ జరిపే హక్కును పొందియున్నవి. ఇందులో అధికారులపై అనగా ప్రభుత్వ సంస్థ, పబ్లిక్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ ఆఫీసర్‌ (ఆ|ం), మొదటి అప్పీలేట్‌ అథారిటీలు (ఎఫ్‌.ఎ.ఎ.). సమాచారహక్కు చట్టం ననుసరించి తీసుకోదగిన సమాచారాన్ని ఇవ్వడంలో దరఖాస్తుదారుడు/అప్పీలెంట్‌లకు సమస్యలు సృష్టించినట్లయితే పైన పేర్కొన్న అధికారులపై ఇవి విచారణ చేసి, చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ దరఖాస్తుదారుడు/అప్పిలెంట్‌ ముఖ్యమైన సమస్యలను (ఈ చట్టపరిధిలో) తొలగించడంలో సహాయపడుతుంది/తోడ్పడుతుంది.
ఫిర్యాదు చేయవలసిన పరిస్థితులు :
ప్రభుత్వ సంస్థ ద్వారా సిఐఓ లేదా ఎపిఐఓ లేదా ఎఫ్‌ఎఎలు నియమించకపోయినట్లయితే.
పిఐఓ/ఎపిఐఓ/ఎఫ్‌ఎఎలు దరఖాస్తు/అప్పీలును స్వీకరించడాన్ని తిరస్కరిస్తే.
చట్టప్రకారం నిర్దేశించిన కాలపరిమితి లోపల పిఐఓ, ఎఫ్‌ఎఎలు సమాధానాన్ని/సమాచారాన్ని అందించకపోయినట్లయితే.
పిఐఓ నుంచి వచ్చిన సమాచారం పట్ల మీరు అసంతృప్తితో ఉన్నా, సంబంధించినది కాదు/అసంబద్ధమైన, చదవడానికి వీలులేని, తప్పుద్రోవ పట్టించేలా ఉండడం, అస్పష్టంగా ఉండటం, తప్పుడు/అబద్దపు సమాచారం, లేదా అసంపూర్తిగా ఉన్న సమాచారం మొదలగునవి.
సమాచారాన్ని ఇవ్వడానికి తప్పుగా, న్యాయసమ్మతంకాని పద్ధతులలో తిరస్కరించినపుడు.
దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వడానికి ఈ చట్టంలోని రూల్స్‌ నందు ఆ సమాచారాన్ని ఇచ్చేందుకు నిర్దేశించిన రుసుము కన్నా ఎక్కువ చెల్లించనపుడు.
పిఐఓ/ఎపిఐఓలు/ప్రత్యక్షంగా లేదా పోస్ట్‌ ద్వారా సంప్రదించడానికి/కలవడానికి అందుబాటులో లేకుండా, అతని ఉనికి గుర్తించడం కష్టసాధ్యమైనపుడు/ముఖ్యంగా ప్రముఖంగా కన్పించనపుడు.
ఈ చట్టంలోని సెక్షన్‌ 4(1) ననుసరించి సమాచారాన్ని సానుకూలంగా వెల్లడిచేయకపోతే లేదా అది ప్రజలకు సులభంగా అందుబాటులో/తెలుసుకొనేలా ఏర్పాటుచేయనట్లయితే.
పిఐఓ/ఎఫ్‌ఎఎ పబ్లిక్‌ సంస్థకు చెందిన రికార్డుల పరిశీలన నిమిత్తం దరఖాస్తుదారుడు/అప్పిలెంట్‌ చేసిన విజ్ఞప్తిని సరియైన కారణాలు లేకుండా/తప్పుడు పద్ధతులలో తిరస్కరిస్తే లేదా వాటిని పరిశీలించే సమయంలో అవసరమైన సహాయ సహకారాలందించకపోయినట్లయితే.
ఈ చట్టం నుంచి దరఖాస్తుదారుడు సంక్రమించిన హక్కులను వినియోగించుకోవడాన్ని పిఐఓ, ఎఫ్‌ఏఏ లేదా ఇతరులెవరైనా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా అడ్డుకున్నా, తిరస్కరించినా లేదా అవమానపరచినా, లేదా వాటిని పొందకుండా ఒత్తిడికి గురిచేసినట్లయితే.
కేంద్ర/రాష్ట్ర సమాచార కమిషన్‌ల ఉత్తర్వులను పిఐఓ/ఎస్‌ఎఎలు బేఖాతరు చేసినట్లయితే.
ఈ చట్టం ప్రకారం సమాచారం పొందగల హక్కు కలిగియున్న పౌరుడిని ఆ హక్కు వినియోగించుకోనీయకుండా తప్పుడు పద్ధతులలో నిర్బంధించడం/తిరస్కరించిన ఏ విధమైన ఇతర పరిస్థితులలో.
ప్రభుత్వ సంస్థ, పిఐఓ లేదా ఎఫ్‌ఎఎలు ఈ చట్టంలోని ప్రోవిజన్స్‌ను అతిక్రమించినట్లయితే వీటిలో ఏది జరిగినా మీరు సిఐఎస్‌/ఎస్‌ఐఎస్‌లకు ఫిర్యాదు చేయవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార కమీషన్‌ :
గ్రౌండ్‌ ఫ్లార్‌,  అసెంబ్లీ ఎదురుగా, హక్కాభవన్‌, హైద్రాబాద్‌ -500 004
ఫోన్‌. 040 -23230596/04027674114 /9866773624

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.