సాక్షర భారత్‌ – పంచాయతీరాజ సంస్థల పాత్ర

సాక్షర భారత్‌ – పగ్రామ ప్రజలకు అతి దగ్గరలో యున్న ప్రజాస్వామ్య పాలన వ్యవస్థ గ్రామ పంచాయితి. ఇట్టి పంచాయితీలు గ్రామ పాలనలో కీలకమైన పాత్ర పోషిస్తాయి. 73 వ రాజ్యాంగ సవరణల ద్వారా ఇట్టి స్థానిక ప్రభుత్వాలు ఇంకా బలో పేతమయినాయి. ఈ సవరణ ప్రకారం పంచాయతీకి దాఖలు పరచవలసిన 29 అంశాలలో వయోజన విద్య ఒకటి. ఇట్టి పరిస్థితులలో పంచాయితీల ద్వారా ”సాక్షర భారత్‌” కార్యక్రమాలు అమలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమం అమలుకు కావలసిన నిధులు, విధులు, సిబ్బందిని పంచాయతి స్థాయిలలోనే ఏర్పాటు చేశారు.
గ్రామస్థాయి పంచాయతీ లోక శిక్ష సమితి ఏర్పాటు
ప్రతి పంచాయతీలోను పంచాయతీ లోక్‌ శిక్షా సమితి ఏర్పాటు చేయాలి. దీనికి పంచాయతీ సర్పంచ్‌ అధ్యక్షులుగా ఉంటారు. సీనియర్‌ మహిళా వార్డు సభ్యులు ఉపాధ్యక్షులుగా ఉంటారు. పంచాయతీ మహిళా సభ్యులు, విద్యా కమిటి సభ్యులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వివిధ సంఘాల ప్రతినిధులు, స్వయం సహాయక సంఘాలు, సామాజిక కార్యకర్తలు ఎస్‌.సి. / ఎస్‌.టి. / మైనారిటీ ప్రతినిధులు, వినియోగదారుల గ్రూపుల ప్రతినిధులు, విద్యావంతులు, ప్రభుత్వోద్యోగులు వంటివారు సభ్యులుగా ఉంటారు. సభ్యులలో కనీసం 50% మంది మహిళలు ఉండాలి. పంచాయతీ కార్యదర్శి ఈ సమితికి సభ కార్యదర్శిగా ఉంటారు.
ప్రతి పంచాయతీలో పంచాయితీ లోక్‌ శిక్షా సమితి ఏర్పాటు చేయాలి. సమితి ఈ క్రింది విధులు నిర్వహిస్తుంది.
ప్రజా విద్యా కేంద్రం నిర్వహించడం, నిర్వహించిన కార్యక్రమ వివరాలు డాక్యుమెంటు చేయడం. పంచాయతీ ప్రజా విద్యా సమితి, అక్షరాస్యతా కేంద్రాల నిర్వహణకు ప్రాజెక్టు నివేదిక తయారు చేయడం. అక్షరాస్యతా అనుకూల వాతావరణ కల్పన,  గ్రామపంచాయితీలో, నిరక్షరాస్య పురుషులు, స్త్రీలను గుర్తించడం, వాలంటీర్లను, ప్రేరకులను ఎంపిక చేయడం. సాక్షర భారత్‌ కార్యక్రమంలో పంచాయితీ లోక్‌ శిక్ష సమితి యొక్క బాధ్యత అతి ప్రధానమైనది. ఒక నిర్దిష్ట కాలములో ఇట్టి సమితి అతి కీలకమైన బాధ్యతలు వహించినట్లయితే కార్యక్రమాలు విజయవంతమవుతాయి.
కమ్యూనిటీ మొబిలైజేషన్‌ (సమీకరణ)
కార్యక్రమంకు అవసరమైన వ్యక్తులను గుర్తించాలి.
స్థానికముగా ఉన్నటువంటి వివిధ కళారంగాలకు చెందిన కళాకారులను గుర్తించాలి. వీరి సేవలను అవసరమయినపుడు వాడుకొనుటకు
ప్రేరణ కల్పించాలి.
స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను గుర్తించి, వారి కార్యక్రమాల ద్వారా అభ్యాసకులను ఇట్టి కార్యక్రమములో పాల్గొనునట్లు చేయవచ్చును.
కుల/మత పెద్దలను సంప్రదించి వారి ద్వారా ఇట్టి కార్యక్రమము విజయవంతమునకు కృషి చేయాలి. ముఖ్యంగా స్వయం సహాయక సంఘాల ప్రతినిధులను ఇట్టి కార్యక్రమములో భాగస్వాములను చేయాలి.
గ్రామ యువజన సంఘాలు, మహిళా మండలాలు మొ|| వాటిని కూడా భాగస్వాములను చేయాలి.
వివిధ రాజకీయ పక్షాల ప్రతినిధులను వారి పార్టీలకు అతీతముగా కార్యక్రమములో పాల్గొనునట్లు చూడవలెను.
గ్రామములో ఉన్న ప్రభుత్వ శాఖలు ఉద్యోగులు మరియు విశ్రాంతి ఉద్యోగులను గుర్తించి వారిని కూడా కార్యక్రమములో పాల్గొనునట్లుగా చూడవలయును.
గ్రామ కో-ఆర్డినేటర్ల గుర్తింపు
గ్రామాభివృద్ధి, అక్షరాస్యత పట్ల ఆసక్తి, అనుభవం ఉన్నవారికి గ్రామాభివృద్ధి కో-ఆర్డినేటర్లుగా గుర్త్తించాలి.
ప్రభుత్వము వారిచ్చిన మార్గదర్శకత్వాల ప్రకారముగా గ్రామ కో-ఆర్డినేటర్లను ఎంపిక చేయవలయును.
ప్రభుత్వము వారిచ్చిన జాబ్‌ చార్టు ప్రకారముగా కో-ఆర్డినేటర్లు విధులు నిర్వహించాలి.
కో-ఆర్డినేటర్ల పనితీరును గ్రామ లోక్‌ శిక్షా సమితి సమీక్షించాలి.
వివిధ అభివృద్ధి సంస్థలతో సమన్వయం
గ్రామ స్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వాములతో పనిచేయుచున్న వివిధ శాఖలతో సమన్వయము ఏర్పాటు చేసుకొని ఈ కార్యక్రమములో భాగస్వాములను చేయాలి.
ప్రభుత్వ శాఖలు అమలు చేయుచున్న అభివృద్ధి పథకాల యొక్క లబ్ధిదారులందరూ కూడా గ్రామాలలోని నిరక్షరాస్యులే కావున అభివృద్ధి శాఖల అధికారులు కూడా ఇట్టి కార్యక్రమము కొరకు పని చేసినట్లయితే వారి ద్వారా అభ్యాసకులు మోటివేట్‌ అవుతారు. (వివిధ రకాల ఫించన్లు, ఇందిరమ్మ ఇండ్లు, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇందిరా క్రాంతి పథకం, చౌక ధరల నిత్యావసరాలు పంపిణీ, దీపం పథకం మొ||)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో