నిర్బంధ 01-04-2010 నుండి అమలులోకి వచ్చింది
ప్రతి వ్యక్తి జీవితంలో విద్య అతి ముఖ్యమైనది. విద్య ద్వారా మనిషి మేధస్సు వికసిస్తుంది. తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అవగాహన చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. తద్వారా సుఖమయమైన జీవితాన్ని గడపడానికి దోహదపడుతుంది.
విద్యకు ఉన్న ఈ ప్రాముఖ్యాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం బాలల ఉచిత, నిర్బంధ విద్యా హక్కు చట్టం (ష్ట్రఊజూ) తెచ్చింది. దీని ద్వారా భారత రాజ్యాంగములో విద్య ప్రాథమిక హక్కుల జాబితాలో చేరింది. 1-4-2010 నుండి ఈ చట్టం అమలులోకి వచ్చింది. ఇది దేశ చరిత్రలో ఒక మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఇది శుభదినం.
ష్ట్రఊజూ 2009 చట్టంలోని ముఖ్యాంశాలు
ఓ పిల్లలందరు ఉచిత, నిర్బంధ ఎలిమెంటరీ విద్య పొందే హక్కు కలిగి ఉంటారు.
ఓ పాఠశాలల ఏర్పాటు, పాఠశాల భవనం, బోధనా సిబ్బంది, బోధనాపరికరాలతో సహా మౌలిక సదుపాయాలను ప్రభుత్వం ఏర్పాటుచేయాలి.
ఓ పిల్లలందరినీ తప్పకుండా బడిలో చేర్చి, బడి మానకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు తల్లిదండ్రులపై ఉంటుంది.
ఓ బడి బయట ఉన్న పిల్లలను వారి వయస్సుకు తగిన తరగతులలో చేర్చి ప్రత్యేక శిక్షణను ఇవ్వాల్సి ఉంటుంది.
ఓ బడిలో ప్రవేశం పొందిన పిల్లలను అదే తరగతిలో మళ్లీ కొనసాగించడం లేదా బడి నుండి తీసివేయడం చేయకూడదు.
ఓ బాలలను శారీరకంగా, మానసికంగా వేధించడం లాంటివి చేయకూడదు. ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తే వారిపై చర్యలు తీసుకోబడును.
ఓ పాఠశాలలన్నీ చట్టంలో పేర్కొన్నట్లు సరైన ప్రమాణాలు పాటించాలి. పాటించని పాఠశాలలకు గుర్తింపు రద్దు చేయబడును.
ఓ ప్రైవేట్ పాఠశాలలు తప్ప అన్ని పాఠశాలల్లో బడి యాజమాన్య కమిటీలు ఏర్పాటు చేయాలి. ఈ కమిటీలు పాఠశాలల పనితీరును సమీక్షించడం, నిధుల వినియోగాన్ని పర్యవేక్షించడం వంటి విధులను నిర్వహిస్తుంది.
ఓ కనీస విద్యార్హతలు ఉన్నవారినే ఉపాధ్యాయులుగా నియమించాలి.
ఓ ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం, సకాలంలో పాఠ్యాంశాలు బోధించడం, తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం వంటి విధులను నిర్వహించాలి.
ఓ అన్ని పాఠశాలల్లో చట్టంలో పేర్కొన్న విధముగా తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాలి. అలాగే పాఠశాలలన్నింటికి కనీస సదుపాయాలు కల్పించాలి.
ఓ ఈ చట్టం అమలు తీరును పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ ఏర్పాటు చేయాలి.
సార్వత్రిక ఎలిమెంటరీ విద్యా సాధనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమమే ”సర్వశిక్ష అభియాన్”, ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో 2001-02 నుండి రాజీవ్ విద్యా మిషన్ ద్వారా అమలు చేయబడుతుంది.
ప్రాధాన్యతాంశాలు :
గీ 5 సం||లు నిండిన పిల్లలందరినీ ఒకటో తరగతిలో చేర్పిద్దాం.
గీ బడి బయట పిల్లలను, బాల కార్మికులను పాఠశాలల్లో చేర్పిద్దాం.
గీ బాలికల విద్యను ప్రోత్సహిద్దాం.
గీ 100% విద్యార్థులను, క్రింది తరగతుల నుండి పై తరగతులకు పంపిద్దాం.
గీ ”ప్రత్యేక అవసరాలు” గల పిల్లలకు అందరితో సమానంగా విద్యను అందిద్దాం.
గీ ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ & బలహీనవర్గాలవారిపై ప్రత్యేక శ్రద్ధ.
గీ పిల్లలందరికీ విద్యనందించే దిశగా అడుగులేద్దాం.
లక్ష్యాలు :
గీ బడి ఈడుగల బాలలందరు 2010-2011 విద్యాసంవత్సరంలోగా ఎలిమెంటరీ విద్యలో 8వ తరగతి వరకు పూర్తిచేసేలా కృషి చేయడం.
గీ ఇందుకోసం నాణ్యతతో కూడిన ప్రయోజనకరమైన ఎలిమెంటరీ విద్యపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం.
గీ 2010-2011 సంవత్సరంలోగా ఎలిమెంటరీ విద్యాస్థాయిలో బాలురు, బాలికల విద్యా వివక్షతను, సామాజిక వర్గాల మధ్య వ్యత్యాసాలను తొలగించడం. గీ 2010-2011 విద్యా సంవత్సరంలోగా సార్వత్రిక నిలుపుదలను సాధించడం.
రాజీవ్ విద్యా మిషన్ (ఐఐజు) ద్వారా అమలు అవుతున్న కార్యక్రమములు
జి ప్రతి ఆవాస ప్రాంతంలోని బడి ఈడు గల బాలబాలికలందరికీ ఒక కిలోమీటరు పరిధిలో ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రాథమికోన్నత పాఠశాల, లేదా ప్రత్యామ్నాయ విద్యా సౌకర్యం కలిగించడం. అవసరం మేరకు ఉపాధ్యాయులను, విద్యా వాలంటీర్లను నియమించడం.
జి పాఠశాల భవన నిర్మాణాలు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, ప్రహరిగోడలు, మంచినీరు మొదలైన మౌలిక సదుపాయాలు కలిగించడం.
జి సగటున ప్రతి పాఠశాలకు ప్రతి సంవత్సరం భవన నిర్వహణకై నిర్వహణ గ్రాంటు క్రింద ప్రాథమిక పాఠశాలకు రూ.5000/- ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.7500/- అందజేయడం.
జి నూతనంగా ప్రారంభించిన ప్రాథమిక పాఠశాలకు 20,000/- రూపాయలు ప్రాథమికోన్నత పాఠశాలకు 50,000/- రూపాయలు చొప్పున బోధనాభ్యాసన సామాగ్రి గ్రాంటు అందజేయడం.
జి వచ్చే సంవత్సరం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు 5000/- రూపాయలు గ్రాంటుగా అందజేయడం.
జి బోధనాభ్యాసన సామాగ్రి తయారీ కొరకు ప్రతి ఉపాధ్యాయునికి 500/- రూపాయలు గ్రాంటు అందజేయడం.
జి రాజీవ్ విద్యామిషన్ ద్వారా విడుదలైన గ్రాంటుల వివరాలు ప్రజలందరికి తెలియజేయడం కోసం పాఠశాల సముదాయం, మండల విద్యా వనరుల కేంద్రాల వెలుపల బ్లాక్ బోర్డులపై నిధుల ఖర్చుల వివరాలు పొందుపరచడం.
జి ఉపాధ్యాయ శిక్షణలు నిర్వహించడం.
జి ప్రత్యేక అవసరాలు గల పిల్లల విద్య కొరకు శిక్షణ పొందిన రిసోర్స్ టీచరును మండలానికి ఒకరిని నియమించడం, పిల్లలకు ఉపకరణాలు అందించడం, చిన్న చిన్న ఆపరేషనులు చేయించడం.
జి ప్రాజెక్టులో భాగంగా పరిశోధన, మూల్యాంకనం నిర్వహించడం.
జి ప్రాథమిక విద్య, కంప్యూటర్ విద్య మొదలైనవాటికి నిధులు కేటాయించడం.
జి పాఠశాల కేంద్రాల నిర్వహణకై నిధులు సమకూర్చడం.
జి పిల్లలను తరగతులలో చేర్చడానికి వీలుగా రెసిడెన్షియల్, నాన్‌రెసిడెన్షియల్ బ్రిడ్జి కోర్సు కేంద్రాలు వంటి విద్యాసౌకర్యాలను కల్పించడం.
జి బడి మానిన బాలికల కోసం కస్తూరిబాగాంధి విద్యాలయాలను ఏర్పాటు చేయడం.
జి మదర్సాలలో చదువుకున్న విద్యార్థులకు అరబ్బీతోపాటు ఉర్దూ, ఆంగ్లంలో బోధించుటకు వీలుగా సహకారాన్ని అందించడం.
జి బాలికా విద్య కొరకు రాజీవ్ విద్యామిషన్‌లో ఒక విభాగాన్ని నిర్వహించడం.
గుణాత్మక విద్యతోపాటు బాలికల వ్యక్తిత్వ వికాసం, లింగ వివక్ష నిర్మూలన, బాలబాలికల నమోదు, నిలకడ మధ్యగల అంతరాన్ని తగ్గించడం కోసం విద్యతో – వ్యాయామం, అట్టడుగువర్గాల బాలికల కోసం ఆవాస విద్యాలయాలు
కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు, 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఉచిత ఆవాస విద్య, బాలికల సాధికారత, సంపూర్ణ విద్యావికాసం, భద్రమైన భవిత కొరకు ఎలిమెంటరీ స్థాయి బాలికల జాతీయ విద్యాకార్యక్రమం, బాలికల సంపూర్ణ అక్షరాస్యత, సర్వశిక్షా అభియాన్‌లో భాగంగా ఎలిమెంటరీ స్థాయి ”బాలికల జాతీయ విద్యా కార్యక్రమం”
6 నుండి 14 సం||ల వయస్సు గల బాలికల కొరకు ప్రత్యేకంగా అమలు చేయబడుతున్నది.ప్రత్యేక శిక్షణ పొందిన రిసోర్సు ఉపాధ్యాయుల ద్వారా విద్యను అందించడం. వైద్య నిపుణులచే పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి ఉపకరణాలు అందించడం మరియు శస్త్ర చికిత్సలు చేయించడం.
ఈ సైటు సందర్శకులు
-
Recent Posts
Recent Comments
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
- Phani tej on చిగురించిన శిశిరం -ఆకెళ్ళ భవాని
- Uday kiran on చిగురించిన శిశిరం -ఆకెళ్ళ భవాని
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
Meta
Tags