ఆడశిశువుల హత్యను ఆపే చట్టమే పి.యన్‌.డి.టి.చట్టం

శిశువుల హత్యను  ఆపే చట్టమే  పి.యన్‌.డి.టి.చట్టం  వైద్య శాస్త్రం మానవ అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ఉండాలి.

కాని ఆడపిల్ల పుడితే భారమని, దురదృష్టకరమని భావించే మన సమాజంలో కడుపులో పెరుగుతున్నది ఆడపిల్ల అని తెలియగానే ఆ శిశువును కడుపులోనే హత్య చేయడానికి వైద్య శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు. దీనిని ఆపడానికి రూపొందించిన చట్టమే గర్భస్థ శిశువు ఆరోగ్యం గురించి చేసే పరీక్షల (నియంత్రణ మరియు దుర్వినియోగ నివారణ) చట్టం. దీనినే పి.యన్‌.డి.టి. చట్టం అని కూడా అంటారు. ఇది 1994లో అమలులోనికి వచ్చింది.
కడుపులో ఉన్నది ఆడ శిశువు అని తెలియగానే అబార్షన్‌ మొదలైన పద్ధతుల ద్వారా ఆ పిండాన్ని తొలగించడం స్త్రీల పట్ల వివక్షను చూపుతుందని, స్త్రీల ఆత్మగౌరవానికి వ్యతిరేకమని ఈ చట్టం భావిస్తుంది. అందుకే ఈ నేరానికి పాల్పడిన వైద్యులకు, పరీక్షలు జరిపిన ఇతర వైద్య సిబ్బందికి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు పదివేల రూపాయల వరకు జరిమానా విధిస్తుంది. అదే నేరాన్ని మళ్ళీ చేస్తే అయిదు సంవత్సరాల వరకు జైలు శిక్ష యాభైవేల వరకు జరిమానా విధిస్తుంది.
పుట్టబోయే పిల్లల లింగాన్ని నిర్ధారించేందుకు పరీక్షలు చేసే వారిది ఎంత తీవ్రమైన నేరమో అలాగే అలాంటి పరీక్షలు జరిపించుకునే తల్లితండ్రులు, వారి బంధువులది కూడా అంతే నేరమని ఈ చట్టం భావిస్తుంది. అందుకే వారిని కూడా ఇదే విధంగా శిక్షిస్తుంది.  వైద్య వృత్తి చేస్తున్న వారు జైలు శిక్షను అనుభవించినట్లైతే వారి గుర్తింపును ప్రభుత్వం రాష్ట్ర మెడికల్‌ కౌన్సిల్‌ నుండి రెండు సంవత్సరాల వరకు తొలగిస్తుంది. దాని వలన వారు రెండు సంవత్సరాల పాటు వైద్య వృత్తి చేయడానికి అవకాశం ఉండదు.
మీరిది మరవకండి
సాధారణంగా ఈ వైద్య పరీక్షలు చేయించుకున్న స్త్రీని ఆమె భర్త బలవంతం పైనే అలా చేసిందని చట్టం భావిస్తుంది. కనుక ఈ చట్ట ప్రకారం ఆమె నేరస్థురాలు కాదు. కాని ఆ విధంగా బలవంతపెట్టిన ఆ భర్త నేరస్థుడవుతాడు.
గర్భంలో ఉండగానే శిశువు యొక్క లింగాన్ని చెప్పే పరీక్షల గురించిన ప్రచారం చేయడం నిషేధం.
పిండం ఎదుగుదల లేక ఆ తల్లికి సంబంధించిన ఆరోగ్య విషయాల దృష్ట్యా పరీక్షలు జరపవలసి వస్తే ఆ విషయాలను వైద్యులు ఆమెకు అర్థమయ్యే భాషలో తెలియచేసి ఆమెనుండి రాతపూర్వక హామీని తీసుకోవాలి.
కడుపులో పెరుగుతున్న పిండం ఆడా? మగా? అనే విషయాన్ని ఎవరూ ఆ స్త్రీకి కాని వారి బంధువులకు కానీ మాటల ద్వారా కానీ సైగల ద్వారా కాని చెప్పకూడదు.
ఈ నేరాన్ని ఆపడానికి చట్టం ఒక కేంద్ర పర్యవేక్షణ మండలిని ఏర్పాటు చేసింది.
అలాంటి వైద్య పరీక్షలు జరుపుతూ పుట్టబోయే శిశువు ఎవరో ముందుగానే చెప్పే ఆసుపత్రుల, జెనెటిక్‌ లాబరేటరీల మరియు క్లినిక్‌ల గుర్తింపు రద్దు చేయబడుతుంది.
ఎవరైతే గర్భంతో ఉన్న స్త్రీ ప్రాణాన్ని కాపాడాలన్న మంచి ఉద్దేశ్యంతో కాకుండా ఆమెకు గర్భస్రావం కల్గించే ప్రయత్నం చేస్తారో వారికి మూడు సంవత్సరాల వరకు జైలుశిక్ష మరియు జరిమానా ఉంటుంది. (సెక్షన్‌ ఐపిసి 312)
ఒకవేళ ఇలాంటి గర్భస్రావాలు గర్భంతో ఉన్న స్త్రీలకు ఇష్టం లేకుండా గాని సమ్మతి తీసుకోకుండా గాని చేయిస్తే అందుకు బాధ్యులైన వారు జీవితకాల శిక్ష గాని లేదా పది సంవత్సరాల జైలుశిక్ష మరియు జరిమానా అనుభవించవలసి వస్తుంది. (సెక్షన్‌ ఐపిసి 313).
గర్భస్థ ఆడశిశువుల హత్యలను నిషేదించే లింగ నిర్ధారణ పరీక్షల చట్టం పిఎన్‌డిటి ఆక్ట్‌ 1994 అమలులోకి వచ్చిన తరువాత, ఈ దారుణాలకు పాల్పడుతున్న వారిని శిక్షించిన దాఖాలలు లేవు.  వీధికొక్క అల్ట్రాసౌండ్‌ మిషీన్‌ పెట్టి లింగ నిర్ధారణ పరీక్షలు చేసి                                (ఇలా చేయడం నేరం అయినప్పటికీ) డాక్టర్లు, మెడికల్‌ ప్రాక్టిషనర్స్‌ అవినీతికి పాల్పడుతున్న పట్టించుకునే నాధుడే లేడు.
ఇలాంటి  నిరాశ పూరిత నేపథ్యంలో ఇటీవల మహారాష్ట్రలో ఈ నేరస్థులను శిక్షిస్తూ రెండు ముఖ్యమైన తీర్పులు వెలుబడ్డాయి.
మహారాష్ట్రలోని జలగావ్‌ మేజిస్ట్రేట్‌ పి.సి.పి.ఎన్‌.డి.టి చట్టం కింద డా. పి.ఎన్‌. గుజరాతీ అనే వైద్యుడికి ఒక సంవత్సరం కఠిన కారాగారశిక్ష, రూ. 5వేలు జరిమానా విధించింది. ఈ తీర్పు 27.7.2010లో వెలువడింది. ఈ డాక్టరు తాను నిర్వహించిన అల్ట్రా సోనోగ్రాఫీ పరీక్షల  రికార్టులను సక్రమంగా నిర్వర్తించనందుకు ఈ శిక్షకు గురైయ్యాడు.
రెండవ కేసులో నిందితుడు డా. పి.కె. పవర్‌, సాతారా జిల్లాలో మెడికల్‌ ఆఫీసరుగా పనిచేస్తున్నాడు. అప్పటికే అతను అవినీతి ఆరోపణలను ఎదుర్కుంటూ సస్పెండ్‌ అయ్యాడు. అంతేకాకుండా  జీవన్‌జ్యోతి హాస్పిటల్‌లో తన క్లయింట్‌  కవితా లోకాండే అనే 5 నెలల గర్భంతో వున్న మహిళ లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహించి ఆ వివరాలు ఆమెకు తెలిపాడు. అతనిపై 2005లో కేసు నమోదై 2010లో తీర్పు వెలుబడింది.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.