ఉచిత న్యాయ సహాయం

న్యాయం దృష్టిలో అందరూ సమానులే. న్యాయానికి గొప్ప బీద అన్న తేడా లేదు. అందిరకీ సమానావకాశాలు కల్పించడానికి ముఖ్యంగా ఏ పౌరుడూ ఆర్థిక కారణాల మూలంగా గాని మరే ఇతర బలహీనతల మూలంగా గాని న్యాయాన్ని పొందే అవకాశాలను కోల్పోకుండా ఉండడం కోసం ఉచిత న్యాయ సహాయం అందించాలని ప్రభుత్వం భావించింది. బీద, బలహీన వర్గాలవారికి న్యాయ విధానం అందుబాటులోకి తేవడం కోసం, వారికి సామాజిక ఆర్థికన్యాయాలు కల్పించడం కోసం ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని నిశ్చయించినారు. ఫలితంగా 1976వ సంవత్సరంలో భారత రాజ్యాంగానికి అధికరణ 39ఎ జతచేసి బీద, బలహీన వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతగా నిర్దేశించినారు.
అంతే కాకుండా ఇందుకోసం ఒక చట్టాన్ని రూపొందించారు. అదే న్యాయ సేవల అధికారిక చట్టం. ఇది కేంద్ర చట్టం. ఈ చట్టం నిర్దేశించినట్లు మన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర హైకోర్టు ఉమ్మడిగా చర్చించి కొన్ని సూత్రాలను నిర్దేశికాలను రూపొందించారు.
అర్హులు : ఈ చట్టం, దాని అనుబంధ సూత్రాల ప్రకారం దిగువ కనబరచిన వారు ఉచితంగా న్యాయ సహాయం పొందడానికి అర్హులుగా నిర్ణయించారు.
షెడ్యూల్డ్‌ కులం లేక తెగకు చెందినవారు
మానవ అక్రమ రవాణా బాధితులు, యాచకులు
స్త్రీలు, పిల్లలు
మతి స్థిమితం లేనివారు, అవిటివారు
సామూహిక విపత్తు, హింసాకాండ, కుల వైషమ్యాలు, అతివృష్టి, అనావృష్టి, భూకంపాలు, పారిశ్రామిక విపత్తులు వంటి విపత్తులలో చిక్కుకున్నవారు.
పారిశ్రామిక కార్మికులు
ఇమ్మోరల్‌ ట్రాఫిక్‌ (ప్రివెన్స్‌న్‌) చట్టం 1956లో సెక్షన్‌ 2(జి)లో తెలిపిన ”నిర్బంధం”, సంరక్షణ నిర్బంధంతో సహా లేక బాల నేరస్తు న్యాయచట్టం 1986 సెక్షన్‌ 2(జె)లో తెలిపిన నిబంధనలో  మెంటల్‌ హెల్త్‌ చట్టం 1987 సెక్షన్‌ (జి)లో తెలిపిన మానసిక వైద్యశాల లేక మానసిక చికిత్సాలయంలో తెలిపిన ”నిర్బంధం”లో వున్న వ్యక్తులు.
వార్షిక ఆదాయం రూ. 50,000/- (యాభై వేలు)కు మించని వ్యక్తులు కూడా ఉచిత న్యాయ సహాయం పొందడానికి అర్హత కలిగి ఉన్నారు. అర్హత గల వాది, ప్రతివాదులు కూడా న్యాయ సహాయం పొందవచ్చును.
దరఖాస్తు చేయు పద్ధతి
న్యాయ సహాయం కోరువారు తమ కేసు యొక్క పూర్వాపరాలు, కావల్సిన పరిష్కారం (రిలీఫ్‌) వివరిస్తూ అఫిడవిట్‌ను, సంబంధిత డాక్యుమెంటులను జత చేస్తూ దరఖాస్తు చేసుకొనవలసి వుంటుంది. దరఖాస్తుదారులు పైనతెలిపిన అర్హతలలో ఏవి కలిగి ఉన్నదీ తెలియపరుస్తూ తగిన ఆధారాలను (వీలైనంతమేరకు) పంపిన యెడల నిబంధనల మేరకు తగు చర్య తీసుకొనబడును.
దరఖాస్తు చేయవలసిన చిరునామా
ఉచిత న్యాయ సహాయం కోరువారు తమతమ జిల్లాలకు చెందిన జిల్లా కోర్టులందు గల జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలకు గాని, రాష్ట్ర హైకోర్టునందు గల రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థకు గాని తమ యొక్క కేసుల వివరాలను తెలుపుతూ దరఖాస్తు చేసుకొనవచ్చును.
1.    సెక్రటరీ, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ, జిల్లా కోర్టు భవనములు లేదా
2.    మెంబరు సెక్రటరీ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, న్యాయ సేవా సదన్‌, సిటీి సివిల్‌ కోర్టు భవనములు, పురానాహవేలి, హైదరాబాద్‌ – 500 002.
న్యాయ సహాయ విధానాలు
1.    న్యాయవాదిచే ఉచితంగా న్యాయ సలహా ఇప్పించుట     2.    కేసులను పరిశీలించిన మీదట అవసరమైనచో దరఖాస్తుదారుని తరపున న్యాయవాదులను నియమించి ఆయా కోర్టులలో కేసులు చేపట్టుట. 3.    న్యాయ సహాయం పొందిన వారికి కోర్టు ఫీజు, కేసుకు సంబంధించిన కోర్టు ఖర్చుల భరించుట.  4.న్యాయ సహాయం పొందిన వారికి ఆయా కేసుల్లో జడ్జిమెంట్ల నకళ్ళు ఉచితంగా ఇచ్చుట, మొదలగు సహాయాలు అందించబడతాయి.
ఫ్యామిలీ కోర్టులుఫ్యామిలీ కోర్టులు
కుటుంబ న్యాయస్థానాల చట్టం 1984కుటుంబ సంబంధమైన తగాదాలను పరిష్కరించి వారి మధ్య రాజీ కుదుర్చుటకు, వివాహపరమైన తగాదాలను పరిష్కరించుటకు ఫ్యామిలీ కోర్టుల చట్టము ప్రవేశపెట్టబడినది. లా కమీషన్‌ యొక్క రిపోర్టు ఆధారంగా రూపొందించబడిన ఈ చట్టం త్వరితముగా తగాదాను పరిష్కరించుటకు దోహదపడుతుంది. లాయరును నియమించుకోనవసరం లేకుండా ఎవరి కేసును వారే వాదించుకొనుటకుగాను ఈ చట్టం వీలు కల్పిస్తోంది.
చట్టపు ముఖ్యోద్దేశాలు    : రాజీ మార్గంగా కుటుంబ తగాదాలు పరిష్కరించుట, త్వరితంగా న్యాయాన్ని అందించుట.
కుటుంబ న్యాయస్థాన పరిధిలోనికి వచ్చే తగాదాలు :
వివాహ సంబంధిత తగాదాలు అంటే వివాహనిబద్ధత, విడాకులు, దాంపత్య హక్కులు, మనోవర్తి, పిల్లల సంరక్షణ బాధ్యత, భార్యాభర్తల ఆస్తి వివాదాలు, సంతాన న్యాయ సమ్మతి (వారసత్వం) నిర్ధారణ చిన్న (ఆయుక్త) పిల్లల సంరక్షణ వగైరాలు. ఇవి కాక ప్రత్యేక చట్టం ద్వారా దాఖలు చేయబడిన తగాదాలు (అంశాలు).
కుటుంబ న్యాయస్థానం ఒక పరిధిలో స్థాపిస్తే పైన చెప్పిన తగాదాలు ఆ న్యాయస్థానంలోనే పరిష్కరించుకోవాలి, వేరే ఇతరమైన న్యాయస్థానాలు (సివిలు, క్రిమినలు న్యాయస్థానాలు) పైన చెప్పిన తగాదాలను పరిష్కరించకూడదు (జాలవు).
కుటుంబ న్యాయస్థాన వ్యవహారాలు, న్యాయస్థానం కాని, వాది ప్రతివాదులుగాని, కావాలనుకుంటే రహస్యంగా నడపవచ్చు.
పార్టీలకు (వాది, ప్రతివాదులు) న్యాయవాదిని నియమించుకొనే హక్కులేదు. కాని న్యాయస్థానం అలాంటి అవసరం ఉందని భావిస్తే నిస్వార్థంగా కోర్టుకు సలహానిచ్చే వ్యక్తిని  నియమించవచ్చు.
కుటుంబ న్యాయస్థానం, నివేదికను  వాంగ్మూలాన్ని  దస్తావేజు  సమాచారం  లను (అంటే అది తగాదాలు పరిష్కారానికి సహాయకారిణి అనుకుంటే) సాక్ష్యాలుగా తీసుకోవచ్చు. సాక్ష్యం చట్టబద్ధత యీ న్యాయస్థానానికి అక్షరాలా అన్వయించనక్కరలేదు.
కుటుంబ న్యాయస్థానపు తీర్పు () పైన హైకోర్టుకు (ఉన్నత న్యాయస్థానానికి) అప్పీలు (పునర్విచారణ, పునర్నిర్ణయం కొరకు) దాఖలు చేయవచ్చు.
కాని కుటుంబ న్యాయస్థానపు తీర్పుకు పునరీక్షణ.  లేదు (ఐలిబీ. 19(3)). భార్యాభర్తల మధ్య వివాహపరమైన మరియు ఆస్తి తగాదాలు, భరణమునకు సంబంధించిన విషయములు, పిల్లల సంరక్షణకు సంబంధించిన విషయములు మొదలగునవి ఈ ఫ్యామిలీ కోర్టులలో చేపట్టబడతాయి.
ఈ ఫ్యామిలీ కోర్టులలో పై విషయాల్లో దావాలు వేసుకోదలచిన మహిళలు, పిల్లలు, మరియు అర్హులైన పురుషులు జిల్లా న్యాయసేవా అధికార సంస్థల నుండి న్యాయ సహాయం పొందవచ్చు.
జీవిత కాలంలో వీలునామాను ఎప్పుడైనా, ఎన్నిసార్లయినా మార్చుకొనవచ్చును. ఆఖరి వీలునామా మాత్రమే చెల్లును.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

One Response to ఉచిత న్యాయ సహాయం

  1. madhavi says:

    కులారతర వివాహము చెసుకున్న వారికి భారత ప్రముత్వము యెతువంతి ప్రయొజనాలు కల్పిస్తుంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.