స్త్రీల పట్ల అన్ని విధాల వివక్ష నిర్మూలనకు ఒప్పందం సదస్సు

నేపథ్యం
స్త్రీ శిశు సంక్షేమ అభివృద్ధి విభాగం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, యూనిసెఫ్‌ కూడా ‘సిడా’ నిబంధనలను అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. ‘సిడా’ అంతర్జాతీయ ఒప్పందం నిబంధనలకి ప్రచారం కల్పించడమేకాక, ఈ నిబంధనలకి మన చట్టాలకి, అట్లాగే రాష్ట్రప్రభుత్వ కార్యక్రమాలకి మధ్యనున్న తేడాలు, అంతరాలను తెలుసుకోవడమే ఈ అధ్యయన ముఖ్యోద్దేశం.
ఆంధ్రప్రదేశ్‌లో ఆడపిల్లలు, ఎదిగే ఆడపిల్లలు, స్త్రీలకు సంబంధించి అమలులో ఉన్న చట్టాలను సమీక్షించడం. ఈ చట్టాలతో సాధికారత, స్వశక్తి, అభివృద్ధి, సంక్షేమం ఎంతవరకు సాధ్యం అని పరిశీలించడం.
రాష్ట్రంలో ఆడపిల్లలు, ఎదిగే యువతుల, స్త్రీల అభివృద్ధికి సంబంధించి అమలవుతున్న కార్యక్రమాలతో పాటు, చట్టాల అమలుపై విశ్లేషణ.
పై రెండు అంశాలను ‘సిడా’ సంబంధిత నిబంధనలతో కలిపి పరిశీలించి చర్చించడం.
‘సిడా’కి మన చట్టాలు/కార్యక్రమాలకి మధ్య అంతరాలు ఉన్నపుడు, వాటిని దూరం చేయడానికి, చట్టాలలో, వాటి అమలులో ఉన్న లొసుగులను తొలగించడానికి సూచనలు చేయడం.
అత్యంత దయనీయమైన నిస్సహాయ వర్గాలైన స్త్రీల, పిల్లల పరిస్థితి మెరుగుపరచడానికి ‘సిడా’, ‘సిఆర్‌సి’ ఎట్లా ఉపయోగించవచ్చో సిఫార్సు చేయడం.
సాంఘిక పరిస్థితులను/నిర్మాణాలను, న్యాయవ్యవస్థను విడివిడిగా చూడరాదనే ఆలోచనతో ఈ అధ్యయనం ప్రారంభమైంది. స్త్రీల సమస్యలకు పరిష్కారాలు కేవలం న్యాయవ్యవస్థ నుంచి రాగలవని మేము భావించట్లేదు. ఎన్నో సాంఘిక సంబంధాల చట్రాలలో ఉన్న స్త్రీల జీవితాలకి, కేవలం వారికి అనుకూలంగా చట్టాలు చేసినంత మాత్రాన న్యాయం జరుగుతుందని అనుకోవడం మన అపోహ. అట్లాగే, ఉన్న జెండర్‌ న్యాయచట్టాలను అమలుపరిస్తే సమస్య పరిష్కారం అవుతుందనుకోవడంలో అర్థంలేదు. కాబట్టి చట్టాలని, న్యాయవ్యవస్థని ఉపయోగించే స్త్రీల విభిన్న సమస్యలను పరిష్కరించడం మన ముందున్న పనిలో ఒక భాగం మాత్రమే. స్త్రీల స్వావలంబనకు న్యాయశాసనాలు ఒక శక్తివంతమైన మార్గమే అయినప్పటికీ, చట్టాల పరిమితిని గుర్తించడం అవసరం. సమాజాన్ని సంపూర్ణంగా మార్చడానికి, అట్టడుగున ఉన్న స్త్రీల పరిస్థితిని మెరుగుపరచడానికి చట్టాలు మాత్రమే సరిపోవు.
స్త్రీల పట్ల అన్ని విధాల వివక్ష నిర్మూలనకు ఒప్పందం సదస్సు (్పుజూఈజుఇ)
్పుజూఈజుఇ ఒక శక్తివంతమైన అంతర్జాతీయ ఒప్పందంగా 1981 సెప్టెంబర్‌ 3న అమలులోకి వచ్చింది. అయితే ఇందులో పౌష్టికాహారం, స్వతంత్రంగా జీవించే స్త్రీలు (స్త్రీలు నిర్వహించే కుటుంబాలు), నిస్సహాయ స్త్రీలు, సమాజం అంచుల్లోకి నెట్టివేయబడ్డ కమ్యూనిటీలు, వర్గాలలోని స్త్రీల మీద, స్త్రీలపై హింస మొదలైన అంశాలపై నిబంధనలు లేకపోయినా, తర్వాత సంవత్సరాల్లో చేసిన తీర్మానాలు ఈ అంశాలను కూడా ్పుజూఈజుఇ లో చేర్చాయి.
లింగం ఆధారంగా కనబరిచే వ్యత్యాసాన్ని, వేసే వెలిని, విధించే ఆంక్షలను ”స్త్రీలపట్ల వివక్ష”గా ఈ ఒప్పందం అర్థం చేసుకుంటుంది. స్త్రీ, పురుష సమానత్వం ఆధారంగా రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పౌర తదితర రంగాల్లో, (వివాహహోదాతో నిమిత్తం లేకుండా) ప్రాథమిక మానవహక్కులు అనుభవించకుండా, గుర్తింపు పొందకుండా చేసే పరిస్థితులకు ఈ లింగ వివక్ష కారణమవుతున్నది.
స్త్రీలపట్ల అన్నివిధాల వివక్షను ఖండించడం, వివక్ష నిర్మూలనకు వెనువెంటనే సరియైన విధానాన్ని అవలంబించడం, విధానం సత్వర అమలుకు అన్ని సముచిత చర్యలు తీసుకోవడం రాజ్యాల/ప్రభుత్వాల బాధ్యత. ఈ లక్ష్యసాధనకు రాజ్యాలు/ప్రభుత్వాలు కింద వివరించిన పనులు చేయాలి.
రాజకీయ, సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక రంగాలతో పాటు ఇతర అన్ని రంగాలలో స్త్రీల అభివృద్ధికి, పురోగతికి శాసనాలు చేయడానికి రాజ్యాలు/ప్రభుత్వాలు ముందుకు రావాలి. పురుషులతో సమానంగా స్త్రీలు మానవహక్కులను అనుభవించాలంటే ఇది తప్పనిసరి.
‘స్త్రీల అభివృద్ధి’ అనే విభాగాలు చేర్చి, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు కూడా ఎన్నో ప్రాజెక్టులు చేస్తున్నారు. ఐతే వీరెవరూ కూడా ఇంట్లో, బయట సమాజంలో స్త్రీలకున్న అవకాశాలు ఏమిటి, వాటిని మార్చే ఉపాయాలేమిటి అని మాత్రం చర్చించరు. అసమానమైన కుటుంబ నిర్మాణాన్ని గురించి చర్చించకుండా, స్త్రీలు తమ హక్కులను ఉపయోగించుకునేందుకు ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయూత నందించలేవు. ప్రజల అవసరాలను గుర్తించి, వాటి చుట్టూ అల్లుకునే పోరాటాలను వాటికవసరమయే చోటును ఈ ప్రాజెక్టులు కల్పించగలవు. అయితే స్త్రీలకు అందుబాటులో ఉండే సేవలు, సదుపాయాల విస్తృతిని పెంచడమే కాక, వాటిని సమూలంగా మార్చాలి. అయితే ఈ మార్పు కేంద్రీకృతమై ఉండక, ”స్వావలంబన” స్వాతంత్య్రాలను ప్రోత్సహించాలి.
స్త్రీ పురుషుల మధ్య సమానత్వాన్ని త్వరితగతిన సాధించేందుకు రాజ్యాలు, ప్రభుత్వాలు తాత్కాలిక ప్రాతిపదికపై ప్రత్యేక చర్యలు తీసుకున్నప్పుడు ఆ చర్యలను వివక్ష పూరితమైనవిగా భావించరాదు. స్త్రీ పురుషులకు వేర్వేరు ప్రమాణాలను అసమాన స్థాయిలో నెలకొల్పడానికి ఇది దారితీయరాదు. సమానత్వాన్ని సాధించిన తరువాత ఈ చర్యలను ఉపసంహరించాలి.
స్త్రీ పురుషులలో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావనపై, స్త్రీ పురుషుల మూసపాత్రలపై ఆధారపడిన ఆచారవ్యవహారాలను, పక్షపాత ధోరణులను తొలగించాలంటే స్త్రీపురుషుల నడవడిని శాసిస్తున్న సాంఘిక, సాంస్కృతిక చట్రాలను మార్చాలి.
స్త్రీ శరీరాలతో చేసే అన్ని వర్తక వ్యాపారాలను, వ్యభిచారాన్ని నిలిపివేసేందుకు రాజ్యాలు/ప్రభుత్వాలు శాసనాలు చేయడంతోపాటు అన్ని చర్యలు తీసుకోవాలి.
వివిధ కేంద్ర రాష్ట్ర చట్టాలు భారతీయ శిక్షాస్మృతి వ్యభిచారాన్ని నిషేధించవు. స్త్రీలు, పిల్లల వ్యాపారాన్ని మాత్రమే నిషేధించాయి. అనైతిక వ్యాపార (నిరోధక) చట్టం, స్త్రీలను తప్ప, ఇతర నేరస్థులను శిక్షించట్లేదు.
రాజకీయ ప్రజాజీవనంలో స్త్రీలపట్ల వివక్ష లేకుండా చూసేందుకు రాజ్యాలు-ప్రభుత్వాలు అన్ని అవసరమైన చర్యలు తీసుకోవాలి.
ఎ)    ఎన్నికలలో రిఫరెండం (ప్రజాభిప్రాయ సేకరణ)లలో ఓటు వేసే హక్కు, ప్రజలు ఎన్నుకునే అన్ని ప్రజాస్వామిక సంస్థలకు పోటీ చేసే హక్కు కల్పించాలి.
బి)    ప్రభుత్వ విధానాల రూపకల్పనలో, అమలులో పాలుపంచుకునే హక్కు, ప్రభుత్వ పదవులు నిర్వహించే హక్కు, ప్రభుత్వంలోని అన్ని స్థాయిల్లో సమావేశాలను, సభలను ప్రజాసదస్సులను నిర్వహించే హక్కులను కల్పించాలి.
సి)    ప్రజాజీవనానికి, దేశరాజకీయాలకు సంబంధించిన ప్రభుత్వేతర సంస్థలలో, సంఘాలలో పని చేసే హక్కు కల్పించాలి.
అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రభుత్వాలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం, అంతర్జాతీయ సంస్థల పనుల్లో పాలుపంచుకునే అవకాశం స్త్రీలకు పురుషులతో సమంగా కల్పించేందుకు రాజ్యాలు/ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకోవాలి.
జాతీయతను పొందేందుకు, ఉంచుకునేందుకు మార్చుకునేందుకు హక్కులను స్త్రీలకు పురుషులతో సమానంగా రాజ్యాలు/ప్రభుత్వాలు ఇవ్వాలి. పరాయి దేశస్తుడితో పెళ్లిద్వారాగాని, భర్త జాతీయత మార్చుకున్నప్పుడుగాని, భార్య జాతీయత దానంతటదే మారకుండా, ఆమె భర్త జాతిని ఆమెపై బలవంతంగా రుద్దకుండా, ఆమె జాతీయత రద్దుకాకుండా ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకోవాలి.
విద్యారంగంలో పురుషులతో సమానంగా స్త్రీలకు హక్కులు కల్పించేందుకు వీలుగా, స్త్రీల పట్ల వివక్ష నిర్మూలనకు రాజ్యాలు/ప్రభుత్వాలు అన్ని చర్యలు తీసుకోవాలి.
ఉపాధి రంగంలో వివక్షను అంతం చేసేందుకు, సమాన హక్కులు కల్పించేందుకు రాజ్యాలు/ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలి.
వివాహం, మాతృత్వం సాకుతో స్త్రీల పట్ల వివక్షను నివారించేందుకు, పనిచేసే హక్కుకు పూచీ ఇచ్చేందుకు రాజ్యాలు/ప్రభుత్వాలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి.
ఈ నిబంధనలో ప్రస్తావించిన అంశాలకు సంబంధించిన శాసనాలను ఎప్పటికప్పుడు శాస్త్ర, సాంకేతిక విజ్ఞానాల వెలుగులో సమీక్షించి, అవసరమైతే వాటిని సవరించడమో, రద్దుచేయడమో, పొడిగించడమో చేయాలి.
ఆరోగ్య రంగంలో, కుటుంబ నియంత్రణతో సహా పురుషులతో సమంగా ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు, రాజ్యాలు/ప్రభుత్వాలు తగురీతిన చర్యలు తీసుకోవాలి.
గర్భధారణ సమయంలో, ప్రసూతి తదుపరి కాలంలో ఆమెకు ఉచిత సేవలు అందించాలి. గర్భధారణ సమయంలో, స్తన్యం ఇచ్చే సమయంలో బలమైన పోషకాహారం అందించాలి.
ఆర్థిక, సాంఘిక జీవనంలోని ఇతర రంగాల్లో స్త్రీలపట్ల వివక్ష లేకుండా రాజ్యాలు/ప్రభుత్వాలు సముచిత చర్యలు తీసుకోవాలి.
ఎ)    కుటుంబ ప్రయోజనాల హక్కు.
బి)    బ్యాంకు రుణాలు, తనఖాలు, ఇతర ఆర్థిక సహాయాలు పొందే హక్కు.
సి)    మానసికంగా ఉల్లాసం కలిగించే కార్యకలాపాల్లో, క్రీడలలో ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు.
గ్రామీణ స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలను రాజ్యాలు/ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలని, కుటుంబ పోషణలో వారు నిర్వహిస్తున్న పాత్రను దృష్టిలో వుంచుకుని ఈ ఒప్పందంలోని నిబంధనలను వారికి అన్వయించాలని ఈ నిబంధన చెబుతుంది.
గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలలో గ్రామీణ స్త్రీలు పాలుపంచుకునేలా, వారు ఆ కార్యక్రమాల నుంచి లబ్ధి పొందేలా చూడాల్సిన బాధ్యతను రాజ్యాలు/ప్రభుత్వాలు స్వీకరించాలి.
చట్టం ముందు స్త్రీలకు పురుషులతో సమానత్వాన్ని రాజ్యాలు/ప్రభుత్వాలు కల్పించాలి.
సివిల్‌ కేసుల్లో చట్టపరంగా పురుషులకు వున్న అవకాశాలు స్త్రీలకు కూడా వుండేలా చూడాలి. వ్యక్తిగత స్థాయిలో ఆస్తి వంటి విషయాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే హక్కు కల్పించాలి. న్యాయస్థానాలు, ట్రిబ్యునళ్లు ఆమె హక్కులను గుర్తించి గౌరవించాలి.
స్త్రీల చట్టపరమైన సామర్థ్యాన్ని నియంత్రించే అన్ని ఒప్పందాలు, పత్రాలు చెల్లనేరవని రాజ్యాలు/ప్రభుత్వాలు ప్రకటించాలి.
నివాస స్థలం ఎంచుకునే హక్కు, ఒక చోట నుంచి మరో చోటికి నివాసం మార్చుకునే హక్కును స్త్రీ పురుషులకు సమానంగా ఇవ్వాలి.
వివాహం, కుటుంబ సంబంధాల విషయంలో స్త్రీల పట్ల వివక్షకు తావులేకుండా పురుషులతో సమానంగా రాజ్యాలు/ప్రభుత్వాలు స్త్రీలకు హక్కులు కల్పించాలి.
పిల్లలు చేసుకునే పెళ్ళి ప్రభావం చట్టపరంగా తల్లిదండ్రులపై వుండకూడదు. కనీస వివాహ వయస్సు నిర్ణయిస్తూ, వివాహాలను అధికారికంగా నమోదు చేయడాన్ని తప్పనిసరి చేస్తూ శాసనాన్ని చేయాల్సిన బాధ్యత రాజ్యాలు/ప్రభుత్వాలపై వుంది.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.