ఇంట…బయట…పిల్లలు!

చంద్రలత
అసలే పండుగ రోజులు, ఆపై, ఆదివారం ఉదయం.
మీరందరూ ఇక్కడికి ఇలా రావడం, ఎంతో అభిమానంతో… ఇంటా బయటా పిల్లల బాగోగుల గురించి మాట్లాడాలనుకోవడం – మీరు సహృదయులని చెప్పకనే చెపుతోంది.
”ఈనాటి పిల్లలు ఎంత పాడైపోయారో…” అంటూ కాసేపు వాపోదామని మీరు వచ్చారని నేను అనుకోను. ఈ ‘బాలోత్సవ వేదిక’ పైన నిలబడ్డ మేమూ అనుకోము.
అయితే,
నానాటికీ పెరుగుతోన్న హింస, అభద్రత, అశాంతిలకు మూలాలను అన్వేషించి – ఆ పరిస్థితులు ఏర్పడే క్రమంలో పెద్దల పాత్ర ఏమిటో – పిల్లల పరిణితిపై వాటి ప్రభావం ఏమిటో – ఆ పరిస్థితులను మార్చవలసిన దిశలో పెద్దలు ఎంత నేర్వవలసి ఉన్నదో – ఎంత మారవలసి ఉన్నదో – అందుకు, ఇప్పుడు కలిగిన అత్యవసర పరిస్థితి ఏమిటో – మనం కొంత అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
ముందుగా, మీలో ఎంతమంది ఈ చిట్టిపాటను విన్నారో చెప్పండి.
చిట్టి చిలకమ్మా… అమ్మ కొట్టిందా?
తోటకెళ్ళావా? పండు తెచ్చావా?
గూట్లో పెట్టావా? గుటుక్కు మింగావా?
(దాదాపుగా అందరూ చేతులెత్తారు.)
ఇక ఇప్పుడు చెప్పండి.
మీలో ఎంతమంది చిలకమ్మను చూశారు? తోటకెళ్ళారు? పండును, గూడును చూశారు? (దాదాపు 40 నుంచి 50% మంది చేతులెత్తారు.)
ఈ చిట్టిపాటను నేర్చినపుడుగానీ, నేర్పేటప్పుడుగానీ, నేర్పాకగానీ – చిలకను, తోటను, పండును, గూడును –
మీ పిల్లలకు మీలో ఎందరు చూపారు? (ఎవరూ చేతులెత్తలేదు!)
సరే, మరొక విషయం చెప్పండి.
మీలో ఎందరిని అమ్మ కొట్టింది? లేదా, నాన్న కొట్టారు? (అందరూ హుషారుగా చేతులు పైకెత్తారు.)
అలాగే, మీలో ఎందరు అమ్మానాన్నలు మీ పిల్లలను కొట్టారు? (అంతా నిశ్శబ్ధం! ఎవరూ చేతులెత్తలేదు!)
ఇప్పుడు, తన బిడ్డను కొట్టని ఓ అమ్మ కథను చెప్పుకొందాం.
తమ పక్కింటినుంచి తోటకూరను దొంగిలించి తల్లికి ఇచ్చి, ఆమె మెప్పుకోలు పొందిన కొడుకు, ఇంతింతై, గొంతులు కోసే బంధిపోటు అవుతాడు. రాజు గారికి పట్టుబడి, ఉరిశిక్షకు లోనవుతాడు.
”తోటకూర నాడే చెప్పకపోతివే అమ్మా-” అంటూ, తనను ఉరితీయడాన్ని తన తల్లి చూడడమే తన కడసారి కోరికగా అమలుపరుచుకొంటాడు – మనందరికీ తెలిసిన ఆ దారితప్పిన పిల్లవాడు.
ఈ తోటకూర దొంగ కథను పిల్లల పెంపకంలో అమ్మానాన్నల పాత్ర ఏమిటో చెప్పడానికి, ఒక సజీవ ఉదాహరణగా మనం తరతరాలుగా చెప్పుకొంటూ వస్తున్నాం.
ఒకవేళ తల్లి దొంగతనంగా తోటకూర తెమ్మందే అనుకుందాం. ”తేను పొమ్మా-!” అని ఆ పిల్లవాడు కనుక అని ఉంటే…?
చివరాఖరుకు, తన దుస్థితికి తల్లిని బాధ్యుణ్ణి చేసిన కొడుకుతో – ఆ తల్లి, ”ఒరే నాయినా, నాకు తోచిందేదో నేను చెప్పాను. మరి, నీ బుద్ధేమయిందిరా? లోకమంతా తిరిగావు. మంచీచెడు చూశావు. నీ తెలివేమయిందిరా? నేను నిన్నేమైనా గొంతులు కోసే బంధిపోటువి కమ్మన్నానా? అడ్డాలనాడు బిడ్డలేగానీ, గడ్డాలనాడు కాదు. యధాకర్మ తథా ఫలితం. అనుభవించు నాయనా!” – అని అంటే?
నేను చెప్పదలుచుకొన్నదేమిటో మీరు గ్రహించే ఉంటారు.
స్వంత ఆలోచనలు గల పిల్లలు, పెద్దలు స్వయంగా పెడదోవ పట్టమన్నా పట్టరు కదా? పైనుంచి, ఆ పెద్దలను కూడా మంచితోవలోకి నడిపించగలరు కూడా!
”పిల్లలు కదా వాళ్ళకు ఏం తెలుసు?” అని అనుకుంటారేమో మీరు.
పిల్లలు కాబట్టే, వారిలో మానవసహజసిద్ధమైన ఆలోచన, వివేచన ఉన్నాయి కాబట్టే – వారు స్వతంత్రంగా ఆలోచించగలరు. స్వేచ్ఛగా ప్రకటించగలరు.
ఎటొచ్చి, ఎంతో అమాయకంగా మనకన్నీ తెలుసునని, పెద్దలం అన్న బెత్తం ఒకటి తీసుకొని, వారిపై పెత్తనం చలాయించి, వారిని చట్రాల్లోకి బిగించేది, వారి నోరును మూయించేది – తెలిసో తెలియకో – మనమే!
ఇక, పెరిగిన ప్రతి బిడ్డ చేసే ప్రతి దుష్కర్మకూ – అమ్మానాన్నలనో ఉపాధ్యాయులనో బాధ్యులను చేసి – చేతులు దులుపుకోవడం అన్నది – అంగీకరించవలసిన విషయమేనా? అయితే, అది ఏ మేరకు? వారి పరిధిని మించిన విస్తృతమైన సమాజం పాత్ర ఏమిటి?
సమాజం అంటూ ప్రత్యేకించి ఏదీ లేదు. అది అమ్మానాన్నలతో, ఉపాధ్యాయులతో, పిల్లలతో కలిసి ఏర్పడినది!
పెద్దల మాటలు పిల్లలు అమలుపరచాలన్నది మన శాసనం.
పెద్దలను గౌరవించాలన్నది మన నమ్మకం.
అయితే, పిల్లల మాటలు విని, విశ్లేషించుకొని, వివరం తెలుసుకొని, విస్తృతపరచుకొనేవాళ్ళం – మనలో ఎంతమందిమి? అంతటి సంస్కారం మనలో ఉందంటారా? ఓపిక, సహృదయత మనలో ఎంత?
అందుకే, ఇంట బయట పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడాలంటే, మొదట మనం వాళ్ళను గౌరవించాలి. వారిలోని స్వతంత్ర ఆలోచనలను ప్రకటించుకోగలిగే స్వేచ్ఛను, పదిలపరచగల వాతావరణాన్ని కల్పించవలసింది మనమే.
పిల్లల సూక్ష్మదృష్టిని స్వీకరించడంలోనే మన విజ్ఞత ఉన్నది. నిస్సందేహంగా!
జ                  జ                  జ
సకల చరాచర జీవరాశులలో… మనమే… బహుశా, కాదుకాదు, కేవలం మనమే – పిల్లలనంతా ఒక చోట చేర్చి, మంచీ చెడు నేర్పా లన్న ప్రయత్నంలో ఒక క్రమబద్ధ శిక్షణనూ, విస్తృతమైన ప్రణాళికలనూ, బోధనా పద్ధతులను, విద్యావిధానాలను, సువిశాల విశ్వవిద్యాలయాలను నిర్మించుకొన్నాం.
ప్రపంచంలోని అత్యంత విద్యాధికులు, కెంట్‌… గోథె… ఐన్‌స్టెయిన్‌ వారసులు…జర్మనులు. కానీ, వీరిలోని వారే, తమ సాటి మనుషులలో లక్షలాది మందిని వేరుచేసి గదులలో కుక్కి, పొగబెట్టి, నిర్ధాక్షిణ్యంగా కాల్చి, బూడిద చేసేంత క్రూరులుగా – ఎలా తయారయ్యారన్నది – ప్రశ్న.
ఈ దారుణ మారణ విధ్వంసాన్ని ఆపడంలో, వారికి చెప్పిన చదువులన్నీ ఏం చేశాయి? ఏమైపోయాయి? – అన్నది విశ్లేషిస్తూ – ఎలీ వీసెల్‌ ఈ నిర్ధారణ చేశారు.
”విలువలకన్నా సిద్ధాంతాలకు, మానవులకన్నా సూత్రాలకు (బీళిదీబీలిచీశిరీ), తెలివిడి క్రోఢీకరణకు, ప్రశ్నలకన్నా జవాబులకు, వివేచన కన్నా ఉత్పాదకశక్తికీ, నైపుణ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చేత” అని.
మరి, ఈ మధ్య మన తెలుగునాట సగర్వంగా సందుకొకటిగా వెలసిన ”కాన్సెప్ట్‌ స్కూల్స్‌” కంటబడితే, ఎలీ వీసెల్‌ గారు ఏమంటారో మరి!
ఎలీ వీసెల్‌ గారి మాటలు ఇంకోసారి. ఈమారు ఇంగ్లీషులో.
వ|శి లిళీచీనీబిరీరిచిలిఖి శినీలిళిజీరిలిరీ రిదీరీశిలిబిఖి ళితీ ఖీబిజితిలిరీ, బీళిదీబీలిచీశిరీ జీబిశినీలిజీ శినీబిదీ నీతిళీబిదీలీలిరిదీవీరీ, బిలీరీశిజీబిబీశిరిళిదీ జీబిశినీలిజీ శినీబిదీ బీళిదీరీబీరిళితిరీదీలిరీరీ, బిదీరీగీలిజీరీ రిదీరీశిలిబిఖి ళితీ వితిలిరీశిరిళిదీరీ, రిఖిరిళిజిళివీగి బిదీఖి లితీతీరిబీరిలిదీబీగి జీబిశినీలిజీ శినీబిదీ బీళిదీరీబీరిలిదీబీలి.వ
ఈనాటి మన తెలుగింటి ్పుజూఊ-విద్యావేత్తలు కొంగ్రొత్త ప్రయోగాలు – అద్భుతంగా ఆచరిస్తున్నారు. వారి విధానంలో ఉపాధ్యాయుడితో పనిలేదు. ప్రశ్నలు, జవాబులు అన్నీ అచ్చేసి పిల్లలకు పంచేయడం, పిల్లలు వాటిని బట్టీపట్టి, అక్షరం పొల్లుపోకుండా – ఒక్క ఫుల్‌స్టాప్‌ కామా కూడా తప్పకుండా – మళ్ళీ పరీక్షాపత్రాల్లో అచ్చు గుద్దేయడం – చాలు. నూటికి నూటపన్నెండు శాతం ఫలితాలు వచ్చేస్తాయి. ఊరంతా ఫ్లెక్సీబోర్డుల మీదకు మన పిల్లలను ఎక్కించేసి, మనం సంబరాలు చేసుకొంటాం.
బోధన అన్నది మానవజాతి మనుగడలో ఒక కీలకాంశం అయినపుడు, ఆ రూపేణా మనం మన భావితరాలకు మన వారసత్వ జ్ఞానాన్ని అందించదలిచినపుడు – వారికి మంచీచెడూ నేర్పదలిచినపుడు – చర్చకు తావులేని ఇలాంటి జిరాక్స్‌ కాపీ చదువుల ద్వారా మాత్రం – అది సాధ్యం కాదు!
గురుశిష్య సంబంధం మన మానవ సంస్కృతిలోనే ఒక చమత్కారం. గురువును మించిన శిష్యులే, మనిషిని ముందుకు నడుపుతూ వస్తున్నారు. ఈ మానవ సంబంధాన్నే మనం వద్దనుకొందామా? ఇది ఆలోచించవలసిన విషయం.
పిల్లల్ని జిరాక్స్‌ మిషిన్లలాగా తీర్చిదిద్దితే చాలా? వారు స్వతంత్రంగా ఆలోచించేవారు కానక్కరలేదా? స్వంత బుద్ధీ వివరం వికసించక్కరలేదా?
‘మా బడిలో ఎన్ని ఎసిలు ఉన్నాయి – ఎల్సీడి టివిలు ఉన్నాయి – కంప్యూటర్లు ఉన్నాయి-‘ అని ప్రకటనలు గుప్పించే టెక్‌- విద్యా సంస్థలు, ‘మా బడిలోని గురువులు వీరు’ అని సగౌరవంగా పరిచయం చేయగలిగిన రోజును మనం ఆశించకూడదా?
జ                  జ                  జ
మాట్లాడితే మనం చీటికిమాటికి టీచర్లపై చూపుడువేలు ఉంచుతాం. ఇక, ఉపాధ్యాయుల విషయమే తీసుకోండి.
ముందుగా, నిజాయితీగా పాఠాలు చెప్పడానికి ప్రయత్నించే వారి సంగతే తీసుకోండి. ఏకోపాధ్యాయ పాఠశాలలో ఉపాధ్యాయుల తిప్పలు సరేసరి. ఇక, ఏ బడిలోని ఏ తరగతిలో చూసినా యాభైనుంచి డెబ్భైమంది పిల్లలు. ఒక్కొక్కరు మాట్లాడడానికి ఒక్క నిమిషం సమయం కేటాయించినా, మన 45 నిమిషాల తరగతి సమయం – ఎలా సరిపోతుంది?
ఆ సమయంలోనే, పాఠం ఎలా చెప్పాలి? వివరణలు ఎలా ఇవ్వాలి? పునశ్చరణ ఎలా చేయాలి? పాఠశాల యాజమాన్యం వారిచ్చే ‘టార్గెట్‌’ ఫలితాలు ఎలా సాధించాలి? ప్రభుత్వానికి నివేదికలు ఏమని పంపాలి? పక్క బడిలో పోటీలో ఎలా నిలవాలి? మళ్ళీ ఏడాది పిల్లలు వాళ్ళ బడిలోనే చేరేలా ఎలా చేయాలి?
ప్రయివేటు బళ్ళలో, అటు యాజమాన్యం ఇటు అమ్మానాన్నలు – ఫలితప్రధానవిద్య (ష్ట్రలిరీతిజిశి ంజీరిలిదీశిలిఖి జూఖితిబీబిశిరిళిదీ) కొరకై ఉపాధ్యాయులపై తీవ్రమైన ఒత్తిడి తేవడం – మనకు తెలుసు. అటు ప్రభుత్వ బళ్ళలో, అక్షరాస్యతాశాతం, మధ్యాహ్నభోజనాలు, రాని జీతాలు, బోనస్సులు – వీటికై పోరాడాలా? బోధనావనరులను సేకరించుకోవాలా? ఇలాంటి నేపథ్యంలో – ప్రత్యేక శ్రద్ధ వహించవలసిన పిల్లలు, వెనకబడిన పిల్లలు, నెమ్మదిగా నేర్చుకొనే పిల్లలు (స్లో బ్లూమర్స్‌) – ఇలాంటి వారందరికీ ఉపాధ్యాయుడు తమ సమయం వెచ్చించడం ఎలా?
ఈ ప్రశ్నల్లోనే ఒక పలాయనసూత్రం కనబడుతోంది. కదండీ?
ఎందుకంటే, తరగతిసమయం, బోధనావనరులు, ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి, ప్రత్యేక విద్యాబోధనల అవసరాలు – ఇలాంటి వాటన్నిటినీ – గొంతెత్తి సాధించగల సత్తా – ఉన్నవారు ఉపాధ్యాయులే!
బోధనాపరమైన సమస్యలను గుర్తించడంలో – పరిష్కారాలు అన్వేషించడంలో – అమలుపరచడంలో – వారు చొరవ తీసుకోవాలని మనం ఆశించేది ఎందుకంటే –
వారు పిల్లల బోధనావిధానాల్లో, వారి మానసిక ప్రవర్తనలో – సంబంధిత అనేకానేక అంశాలలో శిక్షణ పొందినవారు. వారి మొదటి బాధ్యత-బోధన. అందుకు అవసరమైన స్వేచ్ఛ. అది సాధించవలసిన దీక్ష. అవి ఏర్పరుచుకోగల వాతావరణం.
ఆ దిశగా వారు ప్రయత్నాలు చేస్తారని, అమ్మానాన్నలు, యాజమాన్యాలు వారికి సహకరిస్తారని ఆశిద్దాం. ఇక, మన పిల్లలు తమ విలువైన, చురుకైన సమయాన్నంతా గడిపేది బడిలోనే! అది మనం మరవరాదు. ఎప్పటికీ!
జ                  జ                  జ
ఇక, అమ్మానాన్నల సంగతి చూద్దాం.
ఎక్కడ ఏ వ్యక్తి ఎలాంటి విధ్వంసం జరిపినా, ఎలాంటి కిరాతకం చేసినా –
అటు అమ్మానాన్నలు ఉపాధ్యాయులను –
ఇటు ఉపాధ్యాయులు అమ్మానాన్నలను –
ఆపై, అందరం కలిసి సమాజాన్ని ఆడిపోసుకొంటాం.
ఇప్పుడు మీకు ఒక నాలుగో తరగతి పిల్లవాడిని పరిచయం చేస్తాను. ఆ అబ్బాయి రోజూ బడినుంచి ఏదో ఒక సమస్యతో ఏడుస్తూ ఇంటికి వస్తాడు. అతనికి ”వేగంగా-సులువుగా” (వితిరిబీది ఞ లిబిరీగి రీళిజితిశిరిళిదీ) అమలు చేయగల పరిష్కారం కావాలి.
అతనికి ఒక రోబో-పిల్ల సాయం చేస్తుంది. నిజానికి, సాయం చేసేట్టు ఆ పిల్లవాడు ఏడ్చి, అరిచి, అలిగి – వత్తిడి చేస్తాడు. అప్పుడు ఆ పిల్లి, అతనికి ఒక అత్యాధునిక గాడ్జెట్‌ను తయారుచేసి ఇస్తుంది. ఆ గాడ్జెట్‌తో అతను తన ”పగ తీర్చుకొంటాడు. కక్ష సాధిస్తాడు. సమస్య పరిష్కరించుకొంటాడు. స్నేహితుల ముందు విర్రవీగుతాడు.”
ఆ రోబో-పిల్లి డోరెమాన్‌. ఆ పిల్లవాడు నొబిటా.
నోబిటా శత్రువులు ఎవరండి? ఉపాధ్యాయులు, సహాధ్యాయులు.
ఈ కథ నేర్పే నీతి ఏమంటే –
బడిలో మానవసంబంధాల అవసరం లేదు. ఎవరి మీదైనా పగ పెంచుకొని, కక్ష సాధించి, సంబరం చేసుకోవాలి. అందుకు, ఎంత మేరకైనా వెళ్ళచ్చు. ఏమైనా చేయచ్చు.
అందుకు, అత్యాధునిక సాంకేతిక జ్ఞానాన్ని పనిముట్టుగా చేసుకోవచ్చు. ప్రయోగించవచ్చు.
సమస్యలను పరిష్కరించుకోవలసినది మంచితనంతో, వివేచనతో, నేర్పుతో ఓర్పుతో కాదు!
పగ, కక్ష, సాధింపు – వంటివి పిల్లల పదసంపదగా మారిపోతుందంటే – మీ ఇంట్లోనే కూర్చొని – తీరిగ్గా మీ పిల్లలు చూస్తోన్న టివి కథలు చూడండి.
మానవ సంబంధాలు మార్దవం కోల్పోతున్నాయంటే – దాని మూలాలు – మీ ఇంటిలోని ఒక అత్యాధునిక ‘గాడ్జెట్‌’ తెర మీదనే ఉన్నాయేమో గమనించండి.
మీ పిల్లల మాటలలో కరుకు, ప్రవర్తనలో గరుకు – గుర్తించారంటే – ఆ తెరమీది బొమ్మల సంభాషణలను గమనించండి!
ఇంతకీ, మీరు మీ పిల్లలు ఇంట్లో కలిసి గడిపే సమయం ఎంత? ఏమిటి? ఆ సమయాన్ని ఎలా గడుపుతున్నారు? ఆ సమయంలో అమ్మానాన్నలు లేదా ఇతర పెద్దలు పిల్లలకు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారు? ఆ సమయాన్ని ఎంతటి సుహృద్భావనతో – సృజనభరితంగా, స్నేహపూర్వకంగా గడుపుతున్నారు?
ఈ రోజున అమ్మానాన్నలంటే – హోంవర్క్‌ చేయించేవారు, ప్రోగ్రెస్‌రిపోర్టు కొలిచేవారు, ఫీజులు కట్టేవారు, అనుకున్నంత ‘ఫలితం’ అందించకపోతే – ఎంతటి క్రమశిక్షణ చర్యకైనా వెనుకాడనివారు – ఇలా సాగిపోయే జాబితాలో – మానవ సంబంధాలు ఏ దోవన సాగుతున్నాయో – మీరే చూడండి!
బడిలోకి వెళ్ళగానే ”సైలెన్స్‌ప్లీజ్‌” అనగానే, ఎక్కడి పిల్లలు అక్కడ గప్‌చుప్‌!
ఇక, ఇంటికి వచ్చాక పిల్లలతో మనం మాట్లాడుతున్నదీ, చర్చిస్తున్నదీ, వివరిస్తున్నదీ వారి స్వంత మాటలను వింటున్నదీ, భావాలను తెలుసుకొంటుందీ – ఎంత?
అదీ ఆలోచించండి.
అంతదాకా ఎందుకు?
మీ ఇంట్లోనే ఉండే పిల్లలందరినీ ఒకసారి తలుచుకోండి! ఆడపిల్లలపై వివక్ష ఎంత సహజ ప్రక్రియగా సాగిపోతున్నదో – మీరు గ్రహించారా? సొంతబిడ్డల నడుమనే సమభావనతో, సమ్యక్‌దృష్టితో మన పెంపకం సాగడం లేదు. ఆడపిల్లలపై   దౌర్జన్యాలకు, దౌష్ట్యాలకు – బీజాలు మీ ఇంటనే పడుతున్నాయి. ఈ విషబీజాలను నిర్వీర్యం చేయవలసినది అమ్మానాన్నల ప్రథమ బాధ్యత కాదా?
ఇక, మీ పిల్లల ఈడువారే, ఒక్కోమారు వారికన్నా చిన్నవారు, మీ పిల్లల పనీపాటలు చేస్తూ ఉంటారు. వారిపై పెత్తనం, దౌర్జన్యం – సహజంగానే, యాజమాన్యధర్మంగా చలామణి అవుతుంది. మీ పిల్లలపై చూపే గారాబం, మురిపెం అంతా ఎటు పోతుంది? అందుకే అనిపిస్తుంది.
అమ్మానాన్నలు అంటూ అంతలేసి నిర్వచనాలు ఇచ్చేస్తూ ఉంటారు కదా – మనలో ఎంతమందిమి అమ్మానాన్నలుగా పరిణితి చెందగలుగుతున్నాం? మనలో ఎంతమేరకు ఆ ”పేరెంటల్‌ సెన్సిటివిటీ” ఉన్నది? అది ఏ మేరకు మన కన్నబిడ్డలు కాని పిల్లలపై ఆత్మీయభావం ప్రసరించగలుగుతున్నాం?
చివరిగా, ఒకసారి చిట్టి చిలకమ్మను పలకరిద్దాం.
జ                  జ                  జ
మనం ప్రకృతిని తెరపై చూసి ఆనందించే దశకు చేరుకుంటున్నాం, క్రమక్రమంగా.
అమ్మానాన్నలు, ఉపాధ్యాయులు, సహాధ్యాయులు – వంటి వ్యక్తిగత, సామాజిక మానవ సంబంధాలు బలపడడానికి మూలాలు మనకు మన ప్రకృతితో ఉన్న సంబంధంతో ముడిపడి ఉన్నాయి. చెట్టుతో, గుట్టతో, పెట్టతో, పుట్టతో – సజీవ సంబంధం – మన జ్ఞానానికి, మానవతకు బలమైన పునాది అవుతుంది. సహోదరభావన బలపడుతుంది.
మనిషికి తొలి గురువు ఆ ప్రకృతి ఒడి. ఆ ఆదిగురువుకు దూరంగా, ఇరుకు గదుల, ఎల్సీడీ తెరల చదువులు, గాడ్జెట్‌ ప్రధాన విద్యలు/గారడీ విద్యలు/ – వీటిని చదువులు అని ఎలా స్వీకరించగలం? చెప్పండి!
మన పిల్లలకు మనమే మంచి ఉదాహరణ. అయితే, ఇంటా బయటా తరుచూ మనం వారికి చెడ్డ ఉదాహరణలుగా మారుతుంటాం.
కనుక, సంస్కరణ అన్నది జరగవలసి వస్తే మొదట ఎవరు సంస్కరించబడాలి? ఎవరు సంస్కరించుకోవాలి?
అందుకే,
అమ్మానాన్నలలో ఉపాధ్యాయ దృక్పథం…
ఉపాధ్యాయులలో పేరెంటల్‌ సెన్సిటివిటీ…/అమ్మానాన్నల ఆత్మీయభావన…/ ప్రకృతితో మమేకమైన పాఠాలు…
పిల్లల స్వతంత్ర భావాలను వ్యక్తపరుచుకోగల వాతావరణం…
పిల్లల ఆలోచనలను గౌరవించగల సంస్కారం…
పిల్లల అనుభూతులకు స్పందించగల ఆత్మీయతా…
ఇంటా బయటా పిల్లలకు…
ఆపై, మనకు…
కొండంత అండ!
(బాలోత్సవ కమిటీ, కొత్తగూడెం క్లబ్‌ వారు నిర్వహించిన విద్యా సదస్సులో చేసిన ప్రసంగ పాఠం. 10-10-10)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.