నాకూ స్పేస్‌ కావాలి

హేమా వెంకట్రావ్‌
ఎస్‌.ఎమ్‌.ఎస్‌… అనేక కమర్షియల్‌ మెసేజ్‌ల నుంచీ (ఎస్‌ఎంఎస్‌ సముద్రమంత స్నేహాన్ని) మోసుకొచ్చింది… అది విశాలమైన ప్రపంచంలో మనల్ని మనం తడిమి చూసుకోడానికి, కాసింత అలసిన హృదయాన్ని శరీరాన్ని సేద తీర్చటానికి మనలో వున్న భావపరంపరలు కవితాత్మరూపం తీసుకోడానికి ‘ఆకాశాన్నే హద్దు’గా పిలిచిన ఆహ్వానం అది. ఆ తర్వాత చాలామంది మిత్రులతో మాట్లాడాను. ఆ అపురూపమైన ఆహ్వానం గురించి కొంతమంది చూసామని ఆలోచిస్తామని మరికొంత మంది అసలు గమనించలేదని… ఎందుకో ఆకాశాన్నే ముద్దాడాలనే కాంక్ష చప్పబడిపోయింది. ఒకసారి స్త్రీ జీవితాన్ని తరచి చూస్తే కూడా అంతేనేమో. 24 గంటల సమయంలో 16-18 గంటలు యితరుల కోసం పనిచేసే మనకు మన గురించి ఆలోచించడానికి వాటిని ఆచరణలో పెట్టే విషయమై ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు. ఏ వర్గాన్ని చూసినా మనకు స్పష్టమే. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యంలో ఎప్పుడైనా తమ కోసం ఒక స్పేస్‌ ఏర్పాటుకై తపన చెందే స్త్రీలు ఎందరో ఉన్నారు. వారందరికీ వందనాలు. కాని వ్యవస్థలో ఎవరో చేసిన తప్పులకు బ్రతుకు పోరులో నిలబడటానికి బలౌతున్న స్త్రీమూర్తులెందరో …వారి గుండె గూటిలోకి వెళ్లి ఒక క్షణం ఉపశమనం పొంది మీ ముందు కొచ్చేదే ‘ఆమె  పరిచయం’..
ఆమె ముఖం నిండా ముసుగేసి ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. ఆ ముసుగు వెనకాల కథలోని జీవిత వాస్తవాలలోకి వెళితే ‘ఆమె’ తెలంగాణలోని ఓ వెనక పడ్డ జిల్లా నుంచి వచ్చింది. భర్త మేనమామ అయినప్పటికీ ఆమె పెళ్లి బంధం ఆమె అందాన్ని చూసి భయపడింది. అణిచి ఉంచాలన్న అతని కోరిక నెరవేరలేదు. ఆమె ఎదురు తిరిగిన ప్రతిసారి ఆమెపై పడిన వాతలు మరకలై మిగిలిపోయేవి. భర్త నుంచి విడిపోయినా, ఊళ్ళో మిషను కుట్టుకుంటూ కాలం గడిపినా, అతను ఆమెను వదలలేదు. చాలీ చాలని డబ్బు, పిల్లల పోషణ, అతని హింస, హైదరాబాదులోని ఫిలిం ఇండస్ట్రీలోకి నెట్టి వేసాయి. అక్కడ ఏదో చిన్నా చితకా పని చేసిన ఆమె చుట్టూ ఒక విషవలయం.. ఆమె అందం, ఆడతనం, ప్రతి ఒక్కరికీ పందేరం వేయవలసిందే. అక్కడ ఒక అతనితో పరిచయం, గుప్పెడు మెతుకుల కోసం రోజూ కష్టపడే కంటే కొన్ని సంవత్సరాలు ఎవరికీ తెలియకుండా వ్యభిచార గృహం నడిపించి ఆ డబ్బుతో పిల్లల్ని చదివించుకోవచ్చని, భవిష్యత్‌ ఏర్పాటు చేసుకోవచ్చని అన్నింట్లో అండగా ఉంటానని ప్రోత్సాహిస్తే ఒప్పుకుంటుంది. పిల్లల పెంపకం కోసం బంధువులను సైతం పోషిస్తుంది. కానీ కొన్నాళ్ళకే పోలీస్‌ రైడింగ్స్‌, ప్రోత్సహించిన గృహ నిర్వాహకుడు ఆమెను ముఠా నాయకురాలిగా, వ్యభిచార గృహ నిర్వాహకురాలిగా, ఒప్పించి పోలీసులకు అప్పగిస్తాడు.
అందుకు చెప్పిన కారణం సంఘంలో అతని పేరు పరువు ప్రతిష్టలు దెబ్బతింటాయని డబ్బుకు కొదవ చేయనని ఆమెను ఆదుకొంటానని జైలు పాలు చేసాడు. నిర్వాహకుడి దమన నీతి తెలిసినా ఇద్దరి పిల్లల చదువు మధ్యలో ఆపలేక వారి భవిష్యత్తు పాడు చేయలేక ఒప్పుకొంటుంది. ఆమెను కలిసినప్పుడు చాలా సార్లు ఒకే మాట అంది. ఈ వృత్తిలో మేము ఎవ్వరం కావాలని రాలేదని, కేవలం సమాజంలో తమ పిల్లలకు ఓ స్థానం కల్పించాలనే కోరికే యిలా తయారు చేసిందని, అనుక్షణం భయం భయంగా గడిపే తమకు జీవితం పట్ల ప్రేమ, దయ ఉందని, కాని తమ చుట్టూ వున్న సమాజం, వృత్తిలో కరిగిపోతూ పెంచుతున్న పిల్లలు ఎవ్వరూ ఆదరించరని నిర్ధ్వందంగా చెప్పుకుంటూ పోయింది. తానే కాదు చదువుకుంటున్న పిల్లలు, ఇతర స్త్రీలు ఎలా ఊబిలోకి దిగబడిపోతున్నారో కధలు కధలుగా చెప్పింది. క్లయింట్‌లు హింసించరా అన్నదానికి నా భర్త పెట్టిన హింస కంటే తక్కువేనని గట్టిగానే చెప్పింది. యిష్టం లేకపోయినా వృత్తి కోసం శరీరాన్ని ఒక షేప్‌లో ఉంచుకోవడానికి తీసుకునే జాగ్రత్తలు గురించి ఆమె మాట్లాడుతున్నప్పుడు మోచేతి క్రింద వున్న పచ్చబొట్టు ఆమె ఊరు, సంప్రదాయాలు వేదనని గాజుల సవ్వడితో కలిసి ఘోష పెడుతున్నట్టనిపించింది.
ఆమె వేెదనా ఘోష యిప్పటిది కాదు. వేద కాలం నుంచే ఉన్నది. కౌటిల్యుని కాలం నుండి  ఈనాటి ప్రపంచీకరణ వరకూ స్త్రీ శరీరం ఒక వస్తువేే. రూపాలు వేరు అయిన  ఆనాటి రాజ్యాలు పడగొట్టడానికి విష పూరిత మూలికా ఔషదాలను వాడి కొంత మంది స్త్రీలను విష కన్యలుగా మార్చినట్టు ఈ రోజు మార్కెట్‌ ప్రతిపాదిత సామ్రాజ్యం పునాది కోసం స్త్రీ శరీరం కావలసి వచ్చింది. మన చట్టాలు ద్వంద వైఖరినే ఆవలంబిస్తున్నాయి. వీటి ప్రకారం వ్యభిచారం చట్ట విరుద్ధం కాదు! అలాగని చట్ట పరమైనది కాదు. వ్యభిచారాన్ని బహిరంగ స్థలాలకు 200 గజల దూరంలో చేసుకొనవచ్చును. వీరిని శ్రామికులుగా గుర్తించరు కాబట్టి కనీస వేతనాలు, వసతులు, నష్టపరిహారంలాంటివి లభించవు. ఐ.పి.సి సెక్షన్‌ 366ఎ, 366బి. వ్యభిచారం కోసం స్త్రీలను, పిల్లలను సరఫరా నేరం క్రింద పరిగణించినా లెక్కలకు అందని రీతిలో ఇంకా ఆ వృత్తి కొనసాగుతూనే వుంది.  రోజుకు 200 మంది చొప్పున 20 శాతం మంది 18 సంవత్సరాల లోపు వారు ఈ వృత్తిలో ఉన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 2.3. మిలియన్ల మంది ఈ వృత్తిలోనికి నెట్టి వేయబడ్డారు.ఇందులో 60శాతం మంది పేదరికంలో మగ్గుతూ, ఎలాంటి అవకాశాలు చదువులేని దళిత బహుజన వర్గాలకు చెందినవారే.
ఈనాడు ‘ఆమె’ గొంతు వింటే మనకు జాలి కలుగవచ్చు. కానీ ఆమె సానుభూతి, దయను కోరుకోలేదు. ఆమెను ఒక ‘మనిషి’గా గుర్తించమని తానూ వెలివేయబడ్డ సమాజం నుంచి మరెవ్వరూ ఈ వృత్తిలోనికీ ప్రవేశించకూడదని కోరుతుంది. వ్యవస్థీకృతమైన విధానాలలో మార్పు కొరకు జరిగే మన పోరులో తమ బాధలకు, కన్నీళ్ళకు, ఆశలకు కొంచెం స్పేస్‌ ఇవ్వమని, ఆమెను మన మనుసులో మన విధానాల రూపకల్పనలో భాగం చేయమని కోరుతున్నది. స్త్రీలపై హింసకు వ్యతిరేక దినాన్ని జరుపుకుంటున్న మనం ఒక్కసారి ‘ఆమె’ శరీరం మనసుపై జరిగే దాడి, సంఘ వెలివేత గురించి ఆలోచించి మన ‘స్పేస్‌’ని ఆమె పోరు కోసం మరింత విశాలం చేద్దామా!!

Share
This entry was posted in ఆమె @ సమానత్వం. Bookmark the permalink.

4 Responses to నాకూ స్పేస్‌ కావాలి

 1. venkatrao says:

  మోచేతి క్రింద వున్న పచ్చబొట్టు,విష కన్య లతో విషయము బాగ వచ్హింది .

 2. kavitha says:

  సముద్రమంత నీ స్నెహాన్కి ఏమివ్వగలను?

 3. రమ says:

  పేరులో భర్త పేరో, తండ్రి పేరో తగిలించుకుని, పురుష పెత్తనాన్ని బహిరంగంగా భరిస్తూ, ఇలాంటి వ్యాసాలు రాస్తే (ఆ వ్యాసాల్లో నిజం ఎంత ఉన్నప్పటికీ), వాటికి ఏం విలువ ఇవ్వగలుగుతామూ?

  – రమ

 4. RAMBABU says:

  హేమ గారు,
  సమాజంలో స్త్రీల పరిస్తితి చాల అద్వాన్నంగా ఉందనటానికి ఇదొక ఉదాహరణ. వ్యభిచారం ఎంత నీచామో కదా.. ఇది కూడా ఒకరకంగా స్త్రీల ఆర్ధిక సమస్య నుంచి వచ్చిందే. వాళ్ళు ఆర్ధికంగా నిలబడ్డప్పుడు ఇటువంటి సమస్యలు చాలావరకు తగ్గుతాయి.
  స్త్రీల గురుంచి చక్కగా ఆలోచించే మీరు , మీ పేరులో భర్త పేరో ,తండ్రి పేరో పెట్టుకొని ….పురుషుడి ద్వార గుర్తింపు పొందటం ఎంతవరకు సమంజసం. రంగనాయకమ్మగారు రాసిన “ప్రేమ కన్నా మధురమయినది ” కథ చదవండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో