విలక్షణ స్నేహశీలి వాసిరెడ్డి సీతాదేవి

– అబ్బూరి ఛాయాదేవి

డాక్టర్ వాసిరెడ్డి సీతాదేవిగారితో నాకు పరిచయం నలభై ఏళ్ళ క్రితం జరిగింది. ఢిల్లీలో మా ఇంట్లో. ఆమె అబ్బూరి రామకృష్ణరావుగారి శిష్యురాలుగానూ, నేను కోడలుగానూ పరస్పరం పరిచయం అయ్యాం- రచయిత్రులుగా కాదు. సీతాదేవిగారు మద్రాసు నుంచి హైద్రాబాదుకి తరలి రావడం, మేము హైదరాబాదు నుంచి న్యూఢిల్లీకి తరలి వెళ్ళడం దాదాపు ఒకేసారి జరిగింది. సీతాదేవి గారు 60ల నాటికే పేరు పొందిన రచయిత్రి. కథలూ, నవలలూ రాయడంతో పాటు ఆమెకి నాటక రంగంలో కూడా అభిరుచి ఉండేది. హైదరాబాద్లో 1959లో నాట్య విద్యాలయ స్థాపన జరిగిన కొంతకాలం తరువాత సీతాదేవిగారు నాట్య విద్యాలయంలో శిక్షణ పొందటానికి చేరారు. ఆ విధంగా నాట్య విద్యాలయం డైరెక్టర్గా ఉన్న అబ్బూరి రామకృష్ణరావుగారికి శిష్యురాలయారు. మా మరిది అబ్బూరి గోపాలకృష్ణతో పరిచయం అయింది. ‘కన్యాశుల్కం’, ‘మృచ్ఛకటిక’ నాటకాలను ప్రదర్శించడానికి నాట్య విద్యాలయ బృందం ఢిల్లీకి వచ్చినప్పుడు, వారితో పాటు సీతాదేవిగారు కూడా వచ్చారు. అప్పుడు నాకు ఆమెతో ముఖ పరిచయం మాత్రమే. ఆమె రచనలు చదివే అవకాశం కూడా నాకు అప్పట్లో కలగలేదు.

1982 లో మేము ఢిల్లీ నుంచి హైదరాబాదుకి తిరిగి వచ్చి స్ధిరపడ్డాక, మా ఇంటి పక్కనున్న ‘లెండింగ్ లైబ్రరీ’ నుంచి ఇతరుల నవలలతో పాటు సీతాదేవిగారి నవలలు దొరికినవన్నీ తెచ్చుకుని చదివాను. అప్పటికీ నాకు ఆమెతో రచయిత్రిగా ప్రత్యక్ష పరిచయం కాలేదు.

1990-91 ప్రాంతంలో అనుకుంటాను. సీతాదేవిగారు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో చాలా నిస్పృహకి లోనవుతున్నారనీ, ఈ కబుర్లు ఆ కబుర్లూ చెప్పి ఆమెకి ఉత్సాహాన్ని కలిగించమనీ రాష్ట్ర సమాచార శాఖలో పని చేసిన గోపాలశాస్త్రిగారు వరద రాజేశ్వరరావు గారికి సూచించారు. వాళ్ళిద్దరూ హాస్య సంభాషణాచతురులు. వరద రాజేశ్వరరావుగారు తరచుగా సీతాదేవిగారికి ఫోన్ చేసి ఏవేవో వ్యాక్యాలు చెప్తు ఆమెని నవ్విస్తూండేవారు. ఆమె బాగా కోలుకున్నాక స్వయంగా మా వారికి ఫోన్ చేస్తూండేవారు. అప్పుడు కూడా సీతాదేవి గారూ నేనూ ఫోన్లో మాట్లాడుకోలేదు. ఆమె ఫోన్ చెయ్యగానే మా వారిని పిలిచి అందించేదాన్ని.

1993 మే లో మా వారు మరణించినప్పుడు నన్ను పరామర్శించడానికి వాసిరెడ్డి సీతాదేవిగారు, గోవిందరాజు సీతాదేవి గారితో కలిసి వచ్చారు. 1991 చివరలో ప్రచురితమైన ‘ఆఖరికి అయిదు నక్షత్రాలు’ కథని గోవిందరాజు సీతాదేవి గారు ఆమెకి చదివి వినిపించారుట – వాసిరెడ్డి సీతాదేవిగారు కంటి ఆపరేషన్ జరిగి చదవ లేకుండా ఉన్న కాలంలో. అప్పుడే నన్ను సీతాదేవిగారు కథా రచయిత్రిగా గుర్తించారనుకుంటాను. 1991 మొదట్లోనే నా తొలి కథా సంపుటం వెలువడింది. ( అందులో ‘ఆఖరికి అయిదు నక్షత్రాల కథ లేదు) నా కథా సంపుటాన్ని సీతాదేవి గార్లిద్దరికీ ఇచ్చాను.

ఆ తరువాత రెండు నెలలు తిరక్కుండానే వాసిరెడ్డి సీతాదేవి గారు తమ తల్లి వాసిరెడ్డి రంగనాయకమ్మ గారి పేరున తెలుగు విశ్వవిద్యాలయంలో ఏర్పరచిన ధర్మనిధి పురస్కారాన్ని ఆ సంవత్సరం నాకు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. ఆయన పోయి మూడు నెలలు తిరక్కుండా నేను వేదిక విూదికి ఎక్కి అవార్డు తీసుకోవడం ఏమిటని. అయినా సీతాదేవిగారు పట్టుపట్టి, నాకు ధైర్యం చెప్పి, ఆమె కారులో మా ఇంటికి వచ్చి నన్ను తెలుగు విశ్వవిద్యాలయానికి వెంట బెట్టుకుని వెళ్ళారు. అదే నాకు వచ్చిన మొట్ట మొదటి అవార్డు. అప్పటి నుంచీ మా స్నేహం కొనసాగింది. ‘సఖ్యసాహితి’ తెలుగు రచయిత్రుల సంస్థ సీతాదేవి గారి సారధ్యంలో రూపొందిన తరువాత మా స్నేహం మరింత సన్నిహితమైంది. నన్ను అప్పుడప్పుడు ఫోన్లో దబాయించినా, ఆమె అధికార ధోరణి మా స్నేహానికి అడ్డు రాలేదు. నాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినప్పుడు సహృదయతతో నన్ను అభినందించి, ‘సఖ్యసాహితి’ సమావేశంలో నన్ను స్వయంగా సత్కరించారు. ఏ విషయంలోనైనా, ఎవరితోనైనా నిష్కర్షగా మాట్లాడటం, అప్పుడప్పుడు నొప్పించడం ఆమె స్వభావం. కానీ అంతలోనే స్నేహాన్ని గుప్పించేవారు. అటువంటి ఆత్మీయ మిత్రురాల్ని కోల్పోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. ఆమె నుంచి తరచుగా వచ్చే ఫోన్కాల్స్ రాకపోతే ఎంతో వెలితిగా ఉన్నట్లుంది.

Share
This entry was posted in నివాళి. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.