అణుదాడులకు వ్యతిరేకంగా గళం విప్పిన శ్యామలి కస్థగిరి

70 సంవత్సరాల శ్యామలి కస్థగిర్‌ ఆ వయస్సు వారికి భిన్నంగా తాను సామాజిక మార్పును తీసుకువచ్చే బాధ్యతాయుతమైన పౌరులను తయారుచేసే దిశగా, అణుబాంబుల తయారీ, ప్రయోగాలకు విరుద్ధంగా పోరాటం సాగిస్తున్న మహిళ.
ఆమె డెహ్రాడూన్‌లో ఒక స్కూల్‌లో పెయింటింగ్‌ టీచరుగా పనిచేసేవారు. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, రచనలు; ఆయన స్థాపించిన ‘శాంతినికేతన్‌’. అందులో బోధించే విద్యావిధానం పట్ల, ఆకర్షితులై ఆమెను కూడా అక్కడ ఉంచి చదివించారు. అక్కడ ఉన్న విద్యావిధాన ప్రభావం వలన ఆమె ప్రకృతిని ఆరాధించడం; ప్రకృతిలో ఉన్న ందాలను ఆస్వాదించడం నేర్చుకున్నారు. ఆమె తండ్రి నుండి వారసత్వంగా గొప్పగా పెయింటింగ్స్‌ వేయడం; అన్ని రకాల చేతివృత్తులు; తోలుబొమ్మలు చేయడం అలవర్చుకున్నారు.
1968లో ఆమెకు వివాహం జరిగి, తన భర్తతో కలసి కెనడా వెళ్ళిపోయారు. ఒక బాబుకు జన్మ ఇచ్చిన తరువాత చాలా సంవత్సరాలు శ్యామల గృహిణిగానే వుండిపోయారు. 1973వ సంవత్సరంలో ఆమె తండ్రిగారి అనారోగ్య కారణంగా వారిని చూడటానికి ఇండియా వచ్చినప్పుడు; ఆ తరువాత సంవత్సరం రాజస్థాన్‌ దగ్గర ఉన్న ”పోక్రాన్‌” అనే గ్రామంలో అణుబాంబు ప్రయోగం జరిగింది. ఆ ప్రయోగం నుండి సంభవించిన నష్టాన్ని చూసి శ్యామల చలించిపోయారు. చుట్టుపక్కల గ్రామాలలోని ప్రజలకు, ఆ ప్రయోగం ద్వారా ఏర్పడిన నష్టాన్ని రేడియేషన్‌ కిరణాల వలన వారికి ఏర్పడిన చర్మసంబంధ వ్యాధులు, క్యాన్సర్లు గురించి తెలుసుకొని చలించిపోయారు. అదే సంవత్సరం వారి తండ్రిగారు మరణించడంతో ఆమె తిరిగి కెనడా వెళ్ళిపోయారు.
తన మేనమామ ద్వారా ఆయన రసాయనక శాస్త్రంలో అధ్యాపకుడుగా పనిచేసేవారు. నుండి ఈ అణుబాంబుల తయారీ; ప్రయోగాల వలన ఈ ప్రకృతికి సంభవించే నష్టాన్ని గురించి తెలుసుకున్నారు. ఒక సామాజిక అంశంపై పోరాడాలనుకుంటున్నపుడు ఆ అంశం పైన సంపూర్ణ అవగాహన ఉండాలని తెలుసుకొని; ప్రపంచంలోని అన్ని దేశాలకన్నా ముందుగా ఇండియాలోనే ఈ అణుబాంబు మీద ప్రయోగం జరిగిందని తెలుసుకొని; దీనికి విరుద్ధంగా, అప్పుడు తాను నివాసం ఉంటున్న కెనడాలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. అక్కడ కూడా అణు ప్రయోగాలకు అడ్డుపడినందుకు ఆమెను అక్కడ పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.
జైలు నుండి బయటకు వచ్చిన తరువాత ఆమె భర్తకు; ఆమెకు మధ్య కొన్ని విషయాలలో విభేదాలు వచ్చి విడిపోయి తన కుమారునితో కలసి వేరుగా జీవితం కొనసాగిస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయోగాలు జరిగే గ్రామాలలోని ప్రజలకు వారి మాతృభాషలో వీటి వలన ప్రకృతికి; పంటభూములకు కలిగే నష్టాలను వివరిస్తూ, పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
ఇప్పుడు ఆమె ఏ కార్యక్రమాలు చేస్తున్నారో తెలుసుకున్నపుడు ఆమెకు తన తండ్రి నుండి వారసత్వంగా వచ్చిన పెయింటింగ్స్‌; తాను తయారుచేసే తోలుబొమ్మల ద్వారా సామాజిక మార్పును తీసుకొచ్చే, బాధ్యతాయుతమైన పేరులను తయారుచేసే పనిలో ఉన్నారు. ఒక పెయింటింగ్‌ టీచరు ఒక సామాజిక ఉద్యమకర్తగా మారిన విధానం తెలుసుకున్నాక ఆధునీకరణకు అనుగుణంగా తాను నేర్చుకున్న విద్యతో మనుషులలో ప్రకృతిపట్ల, పర్యావరణం కాపాడటం పట్ల తనకు ఉన్న నైతిక బాధ్యతలను గుర్తుచేస్తూ దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలలోని ప్రజలకు, ముఖ్యంగా దేశ అభివృద్ధికి వెన్నుముక అయిన గ్రామాలను నిర్లక్ష్యం చేస్తూ అభివృద్ధిని నగరాలకే పరిమితం చేయడాన్ని నిరసిస్తూ తాను తయారుచేసిన తోలుబొమ్మలతో పర్యావరణాన్ని కాపాడటం భారతీయుల అందరి బాధ్యత.
తాను చెప్పదలచిన సామాజిక అంశాన్ని తాను తయారుచేసిన తోలుబొమ్మలతో బడిపిల్లలకు వివరిస్తూ వారిలో సమస్యపై అవగాహన తీసుకురావడానికి కృషి చేస్తున్నారు.
(శ్యామలి కస్థగిరిను కలవడంలో ముఖ్యపాత్ర పోషించిన బర్డ్‌ఆఫ్‌సేమ్‌ ఫెదర్స్‌కి ధన్యవాదాలు. ఈ ఇంటర్వ్యూను నిర్వహించింది సత్యవతి, గీత. రాసింది వెన్నెల.)

Share
This entry was posted in సాహిత్య వార్తలు. Bookmark the permalink.

One Response to అణుదాడులకు వ్యతిరేకంగా గళం విప్పిన శ్యామలి కస్థగిరి

  1. sivalakshmi says:

    ఒక మంచి ఇంటర్వ్యూ చేసిన సత్య,గీత లకు ధన్లవాదాలు 1 శ్యామల గారికి మనందరి సహకారం అందిద్దాం !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో