అమ్మఇల్లు

హిమజ

మా అమ్మకి మా ఊరన్నా
మా ఇల్లన్నా ఎంతో ఇష్టం
మాకన్నా మరీ మరీ ఇష్టం
అందుకే ఎప్పుడూ మా ఊళ్ళోనే వుంటుంది
జ         జ         జ         జ         జ
నిజమేనర్రా పిల్లలూ!
మా కలలు కష్టమూ కన్నీళ్ళు
కలగలిపి కట్టుకున్న గూడురా ఇది
అంతకు మించి మిమ్మల్ని
ఈ అరచేతులు దించకుండా పెంచుకున్నాను
కంటిరెప్పలా కాచుకున్నాను
ఇప్పుడిక ఈ చేతుల్లో సత్తువ లేదు
ఇప్పుడీ కాళ్ళు మీకై పరుగులెత్తి పనిచెయ్యవు
గుప్పెడు గుండె మాత్రం, మీ ప్రేమకై తపించిపోతుంది
మీ అందమైన బొమ్మరిళ్ళల్లో సోఫా కుషన్ల మధ్య
నేనో దిష్టిబొమ్మలా కనబడే వుంటాను
పెరిగిన మీ జీవన నాణ్యతా ప్రమాణాల ముందర
నేను మరుగుజ్జులా కుంచించుకుపోయే వుంటాను
మీ వేగాన్ని అందుకోలేక వెయ్యి అడుగులు వెనకబడే వుంటాను
అందుకే ఇప్పుడు నేను మనూళ్ళో… మనింట్లోనే…
నాలాగే కదిలి వదులైన
నా కలలగూడు – నాలుగు గోడలై
నన్ను జాలిగా చూస్తుందే తప్ప
వేళకి కంచంలో ఓ ముద్ద పెట్టదు కదా
అలనాటి ఇంటి ముందరి పందిరిలా
ఈ మునిమాపువేళ ఎప్పుడు కూలిపోతానో
నా ఇల్లన్న సెంటిమెంటుతో నన్ను
మీనుంచి దూరంగా తోసెయ్యకండి
నాకే కాదు – ఏ అమ్మకయినా
ఈ సందె అలుపువేళ తన ఇంటికన్నా
తనవారి మధ్య బతుకుతూ
రాలిపోవటమే ఇష్టం.
బి. అంజన
మార్పు

చిన్నప్పుడు
నాన్న రానీ చెబుతా
అని అమ్మ అంటే
దండించే హక్కు మగాడిదేనేమో
అనుకున్నా అమాయకంగా
పెళ్ళయ్యాక
నోరు మూసుకుని చెప్పింది చెయ్యి
అని కట్టుకున్నవాడంటే
శాసించే హక్కు మగాడిదేగా
అనుకుని సహించా విధిలేక
ఇప్పుడు
నీకేం తెలీదు నువ్వూరుకో
అని కన్నకొడుకంటే
చెంప ఛెళ్ళుమనిపించా
మరో తరాన్ని భరించలేక.
అరణ్య
నిష్క్రమణం

వాడు వెళ్ళిపోతున్నాడు..
రంగుల కలల్లోంచి కన్నీటి కాల్వల్లోకి
వాడు వెళ్ళిపోతున్నాడు..
కాలం పీకలు నొక్కినవాడు
సజీవ సమాధులు పేర్చినవాడు
దిగ్దిగంతాల నిర్మాత ననుకుని
గర్వాగ్రేసరుడై
నా మెళ్లో ముళ్లేసినవాడు
నా సుందర స్వప్నాలను మింగేసినవాడు
కన్నీటి సంద్రాన కర్కశ బాహువులు సాచినవాడు
వాడు వెళ్ళిపోతున్నాడు…
నాకోసం.. నన్ను శూన్యం చేసే పనిలో
పురాణాలు చంకనెత్తుకుని పుట్టుకలనెంచుతూ
పులిరాజు వేషాన జన్మరహస్యాలు చెప్తూ
తరతరాలుగా నన్ను దహించివేస్తున్న
జన్మారిష్ట బాలారిష్టాల మూర్ఖశిఖామణి
వాడు వెళ్ళిపోతున్నాడు…
బూజు పట్టిన వేదాంతాలలో నన్ను
బందీ చేసినవాడు
యాసిడ్‌లు నెత్తికెత్తుకుని
‘మగతనా’న్ని కోరల్లో నింపుకుని
నా కోట్లాది కలలకు కాలకూటం పంచినవాడు
గుదిబండలా నా గుండెకు బరువై
అణువణువునా
వాడి గమనం దుర్గంధమై
నా అంగాంగాలకు అధిపతిననుకున్నవాడు
వాడి గడ్డాలు రాలిపోతుంటే
వాడి మీసాలు తగలబడుతుంటే
నన్ను చూడలేక
చూసి తాళలేక
పుణ్యపురుషుడు
వాడు వెళ్ళిపోతున్నాడు…
కడలి కెరటాలు ఆకాశాన్ని తాకుతుంటే
ఆ ఆకాశంలో సగాన్ని దాటి
సంపూర్ణతకై నేను
స్వేచ్ఛావిహంగంలా అవిశ్రాంతంగా
విహరిస్తుంటే విస్తరిస్తుంటే
విధాతవిశ్వాన్ని తుత్తునియలు చేస్తూ
చండప్రచండంగా సాగిపోతుంటే
వాడే శవమై
వాడి శవయాత్రకు వాడే
శవం మోసుకుంటూ
వాడు వెళ్ళిపోతున్నాడు…
ఆడవాళ్ళు
హిందీమూలం :  రమాశంకర్‌ యాదవ్‌ విద్రోహి
అనువాదం : ఆర.్‌ శాంతసుందరి
కొందరు స్వేచ్ఛగా ఎందులోనైనా దూకి ఆత్మహత్య చేసుకున్నారు
అలా అని పోలీసు రికార్డుల్లో నమోదయి ఉంది
ఇంక కొంతమంది ఆడవాళ్ళు స్వయంగా చితిమంటల్లో పడి ఆత్మాహుతి చేసుకున్నారు.
అలా అని మతగ్రంథాల్లో రాసి ఉంది
నేను కవిని, కర్తని
తొందరేముంది
ఏదో ఒక రోజు పోలీసులనీ పురోహితులనీ కట్టకట్టుకుని రమ్మని
స్త్రీల న్యాయస్థానానికి పిలిపిస్తాను
మిగతా న్యాయస్థానాలన్నిటినీ రద్దు చేసేస్తాను
స్త్రీలకీ పిల్లలకీ వ్యతిరేకంగా మగమహారాజులు వేసిన
కేసులన్నిటినీ కూడా రద్దు చేస్తాను
సైనికులూ విద్యార్థులూ తెచ్చిన డిక్రీలను కూడా
పనికిరావని చెపుతాను
దుర్బలులు కండబలం ఉన్నవాళ్ళ పేర రాసిన విల్లులని కూడా నేను బహిష్కరిస్తాను.
స్వేచ్ఛగా బావుల్లో దూకిన స్త్రీలనీ చితిమీద కాలి చనిపోయిన స్త్రీలనీ
నేను మళ్ళీ బతికిస్తాను
ఎక్కడైనా ఏమైనా పొరపాటు జరిగి ఉంటే
చెప్పని విషయాలేమైనా ఉంటే
వాళ్ళు న్యాయస్థానాల్లో ఏనాడో చెప్పిన మాటలని
మళ్ళీ కొత్తగా రాస్తాను.
ఎందుకంటే నాకు ఒక స్త్రీ తెలుసు
ఏడు జానల తన శరీరాన్ని జానెడు ఇంట్లో
జీవితాంతం కుదించుకుని బతికింది బైటికి తొంగి కూడా చూడలేదు
శవంగా మారిన తరవాతే ఇంట్లోంచి ఆమె బైటికొచ్చింది.
బైటికి వస్తూనే భూమి తల్లిలా పరుచుకుంది
స్త్రీ శవం భూమాతలాగ ఉంటుంది
బైటికి రాగానే విస్తరిస్తుంది పోలీసు స్టేషన్లనుంచి న్యాయస్థానాల దాకా
అపరాధం జరిగిన రుజువులన్నిటినీ తుడిచెయ్యడం చూస్తున్నాను
చందన తిలకం దిద్దుకుని తలలెగరేసుకు తిరుగుతున్న పురోహితులూ
పతకాలతో ఛాతీలను అలంకరించుకుని విర్రవీగుతున్న సిపాయిలూ
మహారాజుకి జై అని నినాదాలు పలుకుతున్నారు.
వాళ్ళందరూ చనిపోయిన మహారాజులు
చితులు పేర్చుకుని సతీసహగమనం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు వాళ్ళ మహారాణులు
ఇక మహారాణులే లేకపోతే పరిచారికలేం చేస్తారు?
అందుకే వాళ్ళు కూడా సిద్ధమౌతున్నారు చనిపోయేందుకు
నాకు మహారాణులకన్నా వాళ్ళని చూస్తేనే జాలి
వాళ్ళ భర్తలు బతికే ఉన్నారు…ఏడుస్తున్నారు
ఒక స్త్రీ బతికున్న తన భర్త ఏడుస్తుంటే చనిపోవడం ఎంత ఘోరం?
కానీ భర్తలకి ఏడ్చే స్త్రీని కొట్టడం తప్పుగా తోచదు ఎందుకో
ఆడవాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, మొగాళ్ళు కొడుతూనే ఉంటారు
ఆడది గట్టిగా ఏడిస్తే మగాడు మరింత గట్టిగా కొడతాడు
దాంతో ఆమె ఒక్కోసారి చనిపోతుంది.
చరిత్రలో మొట్టమొదటిసారి మంటల్లో పడేసే చంపబడిన మొదటి స్త్రీ ఎవరై ఉంటుంది?
నాకు తెలీదు
కానీ ఆమె ఎవరైనా సరే మా అమ్మే అయి ఉంటుంది,
ఇప్పుడు నా విచారం
భవిష్యత్తులో అలాటి నేరానికి గురై మరణించే స్త్రీ ఎవరవుతారనేదే
ఆ ఆఖరి స్త్రీ ఎవరవుతుంది?
నాకు తెలీదు
కానీ ఆమె ఎవరైనప్పటికీ నా కూతురే అవుతుంది… అయినా
నేనలా జరగనివ్వను కదా!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో