పట్టా వుంది…భూమి లేదు!

యం.సునీల్‌కుమార్‌
ప్రభుత్వం భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వభూమిని భూపంపిణీ పథకంలో భాగంగా భూపంపిణీ చేయడంలో ఉద్దేశ్యం ఆ భూమిని సాగు చేసుకొని తద్వారా వచ్చే ఆదాయాన్ని సక్రమంగా ఉపయోగించుకుంటూ పేదరికంనుండి బయట పడాలన్నదే.
ఇప్పటివరకు ఈ విధంగా పేదలకు పంచిన భూమి సుమారు 42లక్షల ఎకరాలుంటుంది. శ్రీ కోనేరు రంగారావు అధ్యక్షత నిర్వహించబడిన భూకమిటీ నివేదిక 2006 ప్రకారం తెలియపర్చబడినది. మరి ఈ పట్టా పొందిన నిరుపేదవ్యక్తి పరిస్థితిలో ఎలాంటి మార్పు వచ్చింది. పేదలకు పంచిన భూములు పేదలజీవితాలల్లో ఎంత వెలుగులు నింపగలిగాయి.పంచిన భూముల్లో సాగుయోగ్యమైనది ఎంత? అనుభవంలో వున్నది ఎంత? సాగు చేసుకోవడానికి కావలసిన నైపుణ్యం, వ్యవసాయ పనిముట్లు అందుబాట్లులో వున్నాయా? అందుకు కావలసిన పెట్టుబడి సమయం వెచ్చించగలిగే పరిస్థిత్లులో  ఈ భూమిని పొందిన పేదలున్నారా? ఇవన్నీ ఒక ఎత్తైతే, పొందిన భూమికి పట్టా రాక పోవడం, అసలు భూమిని చూపకపోవడం, రికార్డులలో చూపిన విస్తీర్ణానికి సరిపోయినంత భూమి లేకపోవడంవంటి సమస్యలు అనేకం.
ఇలాంటి సమస్యలున్నపుడు పేదలకు ఆ భూమిపై పూర్తిస్థాయి హక్కులు పొందడం ఎంతవరకు వీలవుతుంది? భూమిసాగులో వుండడం భూమికి పట్టా వివరాలు రెవెన్యూ రికార్డులలో నమోదు అయినపుడు మాత్రమే ఆ భూమిపై పూర్తిస్థాయి న్యాయపరమైన హక్కులు పొందినట్లుగా అయితే చేతిలో పట్టా వుండి, భూమి చూపని కేసులు  న్రస్తుతానికి కోకొల్లలు.
అనంతపురం జిల్లాలోని ఆత్మకూర్‌ మండలం గొరిదిండ్ల  గ్రామంలో  2008వ సంవత్సరంలో సుమారు 70 మందికి మూడు నుండి ఐదు ఎకరాల భూమిని భూబదలాయింపు పథకం కింద పంపిణీ చేయబడింది. ఈ పంపిణీ కింద భూమి పొందిన వారంతా  పేద వ్యవసాయ కూలీలే. వీరంతా మహిళలు. భూమి పొందిన మహిళల చేతిలో పట్టాతో తమ పిల్లలకు మంచి చదువు, పౌష్టికాహారాన్ని అందించాలనే  తమ కలను సాకారం చేసుకోవచ్చని ఆశ పడ్డారు. కాని వారి చేతిలో వున్న పట్టాకు  సంబంధించిన భూమి ఎక్కడుందో  వారికి తెలియదు. ఎన్ని సార్లు అధికారులను కలిసి సమస్య వివరించినప్పటికీ  ఫలితం లేకపోయింది. భూమి గురించి తెలుసుకొనుటకు చేసిన ప్రయత్నం ఇప్పటికీ ివరకు వారికి తెలిసింది ఊరి బయట కొండ దగ్గరలో రాళ్ళతో నిండిన  బీడు భూమి వారికి కేటాయించబడిందని, దానిని సర్వేయర్‌ సర్వే చేసి హద్దులు చూపాలని ఆ తరువాతే దానిని అనుభవంలోకి వస్తుందనే సమాచారం మాత్రమే. అయితే ఈ లోపులో కొంతమందికి భూమికి ఎక్కడుందో తెలియకపోయినా ఈ పట్టా మీద రుణం తీసుకోవచ్చని, బాంకులో పట్టా పాసు పుస్తకం తనఖాకు పెట్టుకొని రుణం పొందవచ్చని తెలియడంతో ప్రతి ఒక్కరు ఆ పట్టాను రుణం పొందేందుకు అవకాశంగా భావించి బాంకునుండి అప్పు తెచ్చుకున్నారు. దీనిలో కొంతవరకు వారి ఆర్ధిక అవసరాలు తీరుతుండడంతో వారు కూడా భూమి గురించి అంతగా పట్టించుకోలేదు. అయినా వారిలో ఒకరిద్దరు సర్వేయర్‌ కోసం మండలతహసీద్దార్‌కు దరఖాస్తు చేసుకొని అందుకు చెల్లించవలసిన కనీస రుసుం చెల్లించినప్పటికీ  మండలం అంతటికీ  సర్వేయర్‌ ఒక్కరేవుండడంతో వారికి పనివత్తిడి కారణంగా వెనుకబడిపొయింది.                                  ఆ తరువాత వీరికి కూడా ఆసక్తి సన్నగిల్లింది. దానితో  మూడు సంవత్సరాలు గడిచిపోతున్నా  ఇంకా వీరికి తమ భూమి ఎక్కడ వుందో తెలియదు.
పేదరికస్థితి నుండి బయటపడి మెరుగైన జీవితాన్ని గడపడానికి నిర్ధేశించబడిన పథకాలు, అవి మెరుగ్గా అమలు పరచబడినప్పుడు మాత్రమే వారికి ఉపయోగ పడగలరు.ఈ సమస్యకు పరిష్కారం ఎలా? పట్టా మంజూరై భూమి పొందలేని పరిస్థితుల్లో భూమి పొందేలాంటి అవకాశం ఏమైనా వుందా? దాని గురించి సమాచారం ఎలా తెలుస్తుంది.
ు    అసైన్‌మెంట్‌ పట్టా వుండి భూమి స్వాధీనంలో లేకపోతే ముందుగా    సంబంధిత రెవెెన్యూ డిపార్ట్‌మెంట్‌ దృష్టికి తీసుకొచ్చి తగిన సహాయం పొందవచ్చు.
ు    అయితే లబ్దిదారులకు భూమిని అసైన్‌ చేసి పట్టాలిచ్చినా కూడా భూమి  చూపించకపోవడానికి ఒక సర్వే జరగకపోవడం  ఒకటే కారణమా లేదా  ఇంకా ఏమైనా వున్నాయా అనే వివరాలను సేకరించాలి.
ు    ఈ వివరాలన్నింటితో తహసీల్దారు ఒక దరఖాస్తును సమర్పించాలి.  అందుకు రశీదును పొందాలి.
ు    తహసీద్దారు  ముందు సర్వేయర్‌ను భూమిని సర్వే చేసి అవసరమైతే సబ్‌ డివిజన్‌ చేసి రికార్డుతో సహా సమర్పించమని ఆదేశిస్తారు.
ు    ముందు సర్వేయర్‌  తాను ఈ గ్రామంలో సర్వే ఎపుడు చేస్తాడో తేదీ, సమయం నిర్ధేశిస్తూ లబ్దిదారులకు, పక్కా పట్టాదారులకు నోటీసు ఇస్తారు.
ు    సర్వేయర్‌ నిర్ధేశించిన సమయానికి గ్రామంలో సర్వే చేస్తారు.
ు    సబ్‌ డివిజన్‌లను ఏర్పాటు చేస్తారు. వాటి నెంబర్లను వాయవ్యం మూల నుండి మొదలుపెట్టి ఆగ్నేయం మూలకు చేస్తారు.
ు    కొత్త సబ్‌ డివిజన్‌లకు ఆ సర్వే నెంబర్‌లోని ఆఖరు సబ్‌ డివిజన్‌ నెంబర్‌ తరువాత నెంబర్‌ కేటాయిస్తారు.  ు    ఇదే సమయంలో సర్వేయర్‌తో పాటు రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ వుండి పంచనామా చేస్తారు.
ు    సర్వే ద్వారా తయారు చేసిన సబ్‌ డివిజన్‌ వివరాలను 8-ఏ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.  ఆ రికార్డులను సర్వే లాండ్‌ రికార్డ్స్‌ డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ పరిశీలనకు పంపుతారు.  ఆమోదం పొందిన తరువాత గ్రామ లెక్కల్లో నమోదు చేస్తారు.  గ్రామ లెక్కల ఆధారంగా సర్వే నెంబర్‌, భూమి విస్తీర్ణాల  వివరాలు సక్రమంగా నమోదయ్యేటట్లు చేయాలి.
భూమిని స్వాధీనం చేయమని కోరుతూ అసైనీలు తహసీల్దారు గారికి సమర్పించే దరఖాస్తు.
శ్రీయుత…గారికి
తహసీల్దారు/మండలం
అయ్యా/అమ్మా…
విషయం: అసైన్‌మెంట్‌ పట్టాలుండి భూమిని స్వాధీనం చేయకపోవడం గురించి
నిర్ధేశం: అసైన్‌మెంట్‌ పట్టా నెం.. తేదీ..
నేను అనగా …తండ్రి/భర్త…. గ్రామ నివాసిని. నా పేరు … గ్రామంలో  సర్వే నెం.. లో విస్తీర్ణం …వ సం.లో ఉత్తర్వు నెం..తేదీ.. ప్రకారం డి ఫారం పట్టా సర్టిఫికేట్‌ ఇచ్చారు.కాని భూమి స్వాధీనం చేయలేదు. కనుక  నాకు ఇవ్వబడిన భూమిని చూపించి నాకు  పొజెసన్‌ ఇప్పించగలరని/స్వాధీనపరచగలరని నా మనవి.
ఇట్లు
గ్రామం.
మండల్‌, జిల్లా
క్రింద పత్రాలు జతపర్చబడ్డాయి.
ప్రస్తుత పహాణి నకలు, డిఫార్మ్‌ పట్టా సర్టిఫికెట్‌ నకలు

Share
This entry was posted in నేలకోసం న్యాయపోరాటం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>