దాడుల నేపధ్యంలో రాయటమంటే

– ఎస్తర్ డేవిడ్ (అనువాదం- ఓల్గా)

నేనీ మధ్యనే కొత్త ఇంటికి మారాను, ఎందుకంటే 2002లో గుజరాత్లో జరిగిన మారణ కాండ తర్వాత హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతంలో ఉంటుంటే నేను ”మైనారిటీని” అనే భావం యింకా యింకా పెరుగుతోంది. మా పాత ఇల్లు, మిని పాకిస్తాన్ అని అనుకునే ముస్లిం ప్రాంతానికీ, హిందువుల ప్రాంతంగా ఉన్న గుప్తానగర్కి మధ్య సరిహద్దులో ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య నాదొక్కటే యూదుల ఇల్లు. 2002 నుంచి నేను పరస్పరం ద్వేషించుకునే రెండు కమ్యూనిటీల మధ్య చిక్కుకుపోయాయని అనిపించసాగింది.

మత సంఘర్షణలను నేను మర్చిపోలేను. అవి నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేశాయి. అంతకు ముందు ఏం జరిగినా నేను మైనారిటీననే భావం నాకు కలగలేదు. నేను గుజరాతీని అంతే ఈఘర్షణలతో పాటు ఒక సంఘటన నాకు సంబంధించి అంతా మార్చేసింది. ఒక ఆదివారం ఉదయం కర్ఫ్యూ కొన్ని గంటలపాటు సడలించారు. నేను తినడానికేవో కొనాలని ఇంటినుంచి బైటికి వచ్చాను. మెయిన్ రోడ్డువిూదికి వెళ్ళి ఆటో తీసుకునే లోపలే ఏదో గొడవ, పోలీసు నన్ను ఇంటికి వెళ్ళి పొమ్మని చెప్పాడు. నేను వెనక్కు తిరిగేసరికి ఒక శవం తెల్లటి దుప్పటి కప్పి కనిపించింది. ఆమె గీతాబెన్. ఆమె చేసిన తప్పు హిందూ అయి ఉండి ముస్లింని పెళ్ళాడటం. ఆమెను బట్టలూడదీసి కత్తులతో పొడిచి చంపారు. ఇదంతా నా గుమ్మం ముందే జరిగింది. ఆమెను చంపిన మగవాళ్ళు చాలామంది తర్వాత కూడా నాకు ఎదురు పడుతూ వచ్చారు. నా ఇంటి వెనక ఉంటారు

ఆ తర్వాత యూసఫ్ భాయ్ గురించి. ఆయన మా కుటుంబ మిత్రుడు. మేం కలిసి పెరిగాం. 2002 లో ఘర్షణలప్పుడు మా ఇంటి దగ్గరలో ఆయన కారుకి ఏదో యిబ్బందయింది. దాన్ని తోసుకుంటూ మా ఇంటిదాకా వచ్చి మా ఇంటి తలుపులు కొడుతూ నించున్నాడు. అతని చుట్టూ గుంపు తయారవుతోంది. నేను తలుపు తెరిచి తాగటానికి గ్లాసెడు నీళ్ళిచ్చి, అతను వెళ్తానంటే పోలీసుల్ని పిలిచి అతన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళమని అప్పగించాను. అతను వెళ్ళిపోయిన తర్వాత ఆ గుంపు అతను ముస్లిమా అని అడిగింది. నేను వాళ్ళతో అతను నా స్నేహితుడు అంతే-అని చెప్పాను. ఐతే 2002 తర్వాత ఇంటికి వచ్చిన ముస్లిం స్నేహితులు కాస్త ఎక్కువ సేపు ఉంటే నాకు యిబ్బందిగా ఉండేది. వాళ్ళు ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బాగుండనిపించేది. అది చాలా బాధే- వాళ్ళ భద్రత కారణంగా నైనా వాళ్ళు వెళ్ళిపోవాలనుకోటం చాలా బాధగా ఉండేది. ఆ ఇంట్లో ఉన్నంతకాలం ఎవరో నా అస్తిత్వాన్ని సందేహిస్తారనీ నీదే కులం అని అడుగుతారనీ భయంగా ఉండేది. 2002 కర్ఫ్యూ వాతావరణంలో ఒకసారి చాలా విసుగెత్తిపోయి మాఇంటి వెనక ఉన్న స్లమ్ దాకా నడిచిపోతున్నాను. నా తలమీద చున్నీ కప్పుకున్నాను. దాంతో కొందరు కుర్రాళ్ళు నావెంటపడి, తిడుతూ, బీబీ, బీబీ అని అరుస్తూ తరమసాగారు. నేను ఆగి వెనక్కు తిరిగాను. నాముఖం మీద బొట్టు చూసి వాళ్ళు నన్ను ఒదిలి వెళ్ళారు. మత ఘర్షణల సందర్భంలో దుస్తులకు కూడా మతం అంటుతుందని అర్థమైంది.

అహమ్మదాబాద్ యిపుడు విభజించబడిన నగరం. ముస్లింలు ఘెట్టోలలో బతుకుతున్నారు. హిందువులు ఎక్కడైనా నివసించవచ్చు. ఇంతకుముందు కూడా సమస్యలున్నాయి. దాడులు జరిగాయి. కానీ అవి చాలా వరకు కల్పించుకున్న గోడలు. అవిపుడు నిజమైన గోడలయ్యాయి. నా పాత ఇల్లు అమ్మకముందు, మత ఘర్షణలు జరిగాక నేనొక హవుసింగ్ సొసైటీలో ఉందామని ప్రయత్నించాను. అక్కడ కూడా నగర వాతావరణంలో నేను ఒంటరిగానే ఉన్నాననిపించింది. 2002లో జరిగిన మతోన్మాద ఘాతుకాలగురించి ప్రజలు చాలా పరుషంగా కఠినంగా ఉన్నారనిపించింది. నేను వాటి గురించి మాట్లాడబోతే ”దాడులా? ఏం దాడులు? అంటారు. ఇంగ్లీషులో రాయట్స్ని రైట్స్ లాగా ఉచ్ఛరించే ప్రయత్నం చేస్తారు. వాటిని మర్చిపోయి బతకమని సలహాయిస్తారు. వాటిని మర్చిపోతే మళ్ళీ అలాంటివి జరుగుతాయని మనందరికీ తెలుసు. ఆ వాతావరణంలో నేను మరింత అశాంతికి అలజడికి గురై మళ్ళీ నా పాత యింటికి తిరిగొచ్చి కాస్త మామూలయ్యాను. 2007 లో గాని అక్కడి నుంచి కదలలేకపోయాను.

2002లో గోధ్రా సంఘటన తర్వాత ఫిబ్రవరి 28 న మా యింటి ముందు వీధిలో మూకలు ఆయుధాలతో పరిగెత్తటం, చంపటం, దోచుకోవటం, అరుపులు, కేకలు అన్నిటినీ. నగరం నిండా మంటలు అలుముకుని పెరగటంతో పాటు చూశాను. నా యింటి తలుపులు తాళం పెట్టి కంప్యూటర్ ముందు కూచోని ఒక కవిత రాశాను. ఆ మర్నాడు ఒక కథ రాశాను. ”పెద్ద రెక్కలున్న ముసలాయన” అనే పేరు పెట్టాను. ఆ కథలు, ఘర్షణలు ఆపటానికి మహాత్మా గాంధీ దిగి వస్తున్న కల్పన ఉంది. ఆ కథను ఒక నవలగా చేయవచ్చనిపించి, ఆ నవల గురించి ప్రచురణ సంస్థకు ప్రపోజల్ పంపించాను. వాళ్ళకు అది నచ్చింది ప్రచురిస్తామని కాంట్రాక్టు పంపితే సంతకం కూడా చేశాను.

కానీ ఎంత ప్రయత్నించినా నేనా పుస్తకం రాయలేకపోతున్నాను. 2007 లో ఈ క్షణాన గుజరాత్లో అంతా బాగున్నట్టే వున్నప్పటికీ, త్వరలో మళ్ళీ మరో మత కల్లోలం దాపురిస్తుందని నాకు భయంగానే ఉంది. 2002 నుంచీ వాతావరణమంతా భయంతో నిండివుండటం నాకు తెలుస్తోంది. నేను ఫీలవుతున్నాను. మెజారిటీ కమ్యూనిటీకి వ్యతిరేకంగా రాస్తే నాకు బెదిరింపులు వస్తాయనే భయంతో నేనా నవల రాయలేకపోతున్నానా? నేను స్త్రీని, మైనారిటీనీ, గీతా బెన్ లాగా హత్య చేయబడవచ్చని భయపడుతున్నానేమో. కానీ, ఏదో ఒకరోజు. నేను దీని గురించి రాస్తాను.

Share
This entry was posted in వ్యాసాలు, అనువాదాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో