చిత్త ప్రసాద్‌ కథలు

సి.సుజాతమూర్తి
రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజలు ఎదుర్కొన్న కరువు కాటకాలను చూసిన జనం పడ్డ పాట్లు ఇన్నీ  అన్నీ కావు. ఆ బాధలను, దారిద్రాన్ని చూసిన రచయితలు, నాటక రచయితలు,చిత్రకారులు, దాని ప్రభావానికి స్పందించి తమ తమ రంగాల్లో నైపుణ్యంతో, కరువు ప్రధాన అంశంగా పదును పెట్టి, కవితలను, కథలను, చిత్రాలను చిత్రీకరించారు.
ఆ తరుణంలో సమకాలీకులైన చిత్రకారులు రవీంధ్రనాథ్‌ ఠాగూర్‌, జెమినీరాయ్‌, చిత్త ప్రసాద్‌లు తమ తమ రీతుల్లో చిత్రాలద్వారా, కథలద్వారా నాటకాలద్వారా ప్రజలలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందారు. అప్పుడే ‘చిత్త ప్రసాద్‌’ తన జానపద రీతుల్లో వేసిన ‘నలుపు-తెలుపు’ బొమ్మలతో,రంగుల బొమ్మలతో తన కథలను కూడా జనాకర్షణ పొందేలా చేశారు.
ఎవరూ భద్రపరచని ఈ విధమైన కథలను సమతారోష్నిగారు, ఎక్కడో నాలుగు సంపాదించి పద్ధెనిమిది సంవత్సరాల క్రితం అనువదించారు. ఇల్లు సద్దుకునే సమయంలో హఠాత్తుగా బయటపడ్డ తన కథలను చూసుకుని సంబరంగా ముద్రించారు.
తెలుగులో ఆవిడ చాలా ఉత్కంఠభరితంగా తనదైన శైలిలో, చాలా పఠనీయమైన శైలిలో, ధారావాహికంగా సాగిపోతున్న రీతిలో రాశారు. చిన్నప్పుడు అమ్మలో అమ్మమ్మలో చెప్పే, రాజుగారు ఏడుగురు కొడుకుల కథల్లా ఇందులో ఉన్న నాలుగు కథలూ వాడికవే సాటిగా ఉన్నాయి. మన తెలుగులో ఉన్న నుడికారాన్ని చక్కగా వాడుకుంటూ ఎంతో మనసుకు హత్తుకుపోయేలా అనువదించారు.
మన తెలుగులో ఉన్న నుడికారాన్ని చక్కగా వాడుకుంటూ  ఎంతో మనసుకు హత్తుకుపోయేలా అనువదించారు.
మొదటి కథ ”రసగుల్లా రాజ్యం”లో ఆఖరున చూపించిన నీతి ఇప్పటికీ మన ప్రజాస్వామ్యదేశంలో అనుసరణీయమే అనిపిస్తుంది. అవినీతి ప్రబలిన రాజ్యాల్లో ఇంతటి సత్యసంధుడైన రాజు ఉన్నాడా అని చదువరులను ఆలోచింప చేస్తుందీ కథ.
రెండోది ”బ్రహ్మాదిత్యుడి విముక్తి’ కథలో దెయ్యాలు ఒక సామాన్య మానవుడికి ఎలా సహాయ పడతాడో చెపుతుంది.
మూడోకథ ‘నల్లపిట్ట’ రాజు కథ. ఇది చాలా రసవత్తరంగా నడిపించారు రోష్నిగారు. తననే తినేయ్యాలని పన్నాగం పన్నిన రాజుగారికి ఎంతో చాకచక్యంగా నల్లపిట్ట రాజుగారికే బుద్ధి చెబుతుంది. చాలా చక్కగా అనువదించారు రోష్నిగారు.
నాలుగో కథ ”శంఖు చున్నీ”. పిల్లలు కనకుండా చనిపోయిన స్త్రీ దయ్యమైన కథ. అలా దయ్యం రూపంలో ఉండి, అసలు ఇంటికోడలిని దాచి, అత్తగారింట్లో వారి కోడలిగానే చలామణీ అయిపోతున్నా సందర్భంలో బయటపడ్డ దయ్యం కథ. ఎంతో నేర్పుతో అత్తగారి ఇంట్లో వారి సొంత కోడలిగా నడిచిన తీరు  చదువరులను ఆకట్టుకుంటుంది.
ఈ నాలుగు కథలూ ఎంతో ఉత్కంఠ భరితంగా, ఎంతో అలవోకగా సాగిన రచన (అనువాదం) అసలు ”చిత్తప్రసాద్‌” ఎవరు అనే వారికి సమాధానంగా, రోష్నిగారు అనువదించారు. ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన ”చిత్త ప్రసాద్‌” గారి, కనుమరుగైన కథలను ప్రచురించి, ఆయన చిత్రాలను చూపించిన సమతా రోష్నిగారికి శుభాభినందనలు.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో