ప్రతిస్పందన

ఏప్రిల్ 07 లో రాసిన సంపాదకీయం ‘ఫ్రెష్ మార్కెట్ల వెనుక క్రష్ అవుతున్న మహిళల జీవనోపాధి” అనేది నేడు ఎంతో కీలకమైన సమస్య. గత కొద్ది మాసాలుగా, ముఖ్యంగా ఈ విశాఖ పట్నంవంటి మహా పట్టణాల్లో వెలుస్తున్న ‘సూపర్’ ‘డాపర్’ తాజా మార్కెట్లు చూస్తున్నప్పుడల్లా, మనసులో ఏదో ఒక బాధ, భయం తొలిచేస్తున్నాయి. అసలు సామాన్యుడు ఈ దేశంలో కనీస జీవనోపాధినైనా పొందగలిగే అవకాశం, ఆ ఆదాయ మార్గం ఇంకా ఏమైనా మిగిలి ఉంటుందా?? ఇన్ని వేల మంది చిన్న చిన్న వ్యాపారులు, చిల్లర దుకాణాలు, అంగళ్ళు, సంతలోని మధ్యతరగతికి చెందిన చిల్లర వర్తకుల బ్రతుకులు ఏమి కావాలి? అన్న ప్రశ్నలు బాధిస్తున్నాయి. ఒకప్పుడు ఏవో కొద్దిపాటి ప్రత్యేకరంగాలకే పరిమితమైన బహుళజాతి కంపెనీలు, నేడు ప్లాస్టిక్ సామాన్ల నుండి పోపు గింజలుదాకా, కర్భూజా నుండి కరివేపాకు దాకా వదలకుండా వ్యాపారాలన్ని ఇలా కబ్జా చేస్తుంటే, ఇక సామాన్యుడు బ్రతికే దారి ఏది?

ఒకప్పుడు మధు పానీయాల (సాప్ట్ డ్రింక్స్) రంగంలో కాలు పెట్టిన ఈ కంపెనీలు, ఎందరో షర్బత్లు, నిమ్మకాయల నీళ్ళు, బత్తాయి రసాలు, ఇతర పళ్ళు రసాలు అమ్ముకొని బ్రతికే బీదబిక్కీిని సమూలంగా/ నామ రూపాలు లేకుండా తుడిచి పెట్టాయి. అయితే ఫలితం వారు ఒక్కరే అనుభవించడం లేదు. అర్ధ రూపాయి పెట్టి నాడు సంతల్లోనూ, తీర్ధాల్లోనూ త్రాగే రంగు నీళ్ళు నేడు 9,10 రూపాయిలు ఇచ్చి ( అవీ పురుగు మందుల అవశేషాలతో) కొనుక్కుని తాగే దౌర్భాగ్యం ప్రజలకు దాపురించింది.

రేపు ఈ ‘ఫ్రెష్ ‘ మార్కెట్ల్లు సృష్టించబోయే మాయాజాలం కూడా ఇదేనని ముందుగా ప్రజలు గుర్తించవలసిన అవసరం ఎంతైనా వుంది. ఈ ఫ్రెష్ మార్కెట్లలోని వస్తువులను తినడం మాత్రమే ఆరోగ్యదాయకమనో, నాగరికత అనో తప్పుడు ప్రచారాలను చేపట్టేడప్పుడు (అవసరమైతే ఇందుకు సినిమా స్టార్లు, క్రికెట్ వీరులు వీరికి అందుబాటులో ఉండనే ఉన్నారు) అధిక మొత్తం లో బేర సారాలు జరపడంవల్ల తక్కువ ధరలకు సరకును అందించగలిగే (కొద్ది రోజులు మాత్రమే సుమా) రంగు రంగుల అద్దాలు, ఆకర్షణలతోనో, అంతకీ కాదంటే రిబేట్లు, డిస్కౌంట్స్, బంపర్ డ్రాలు నిర్వహించో, మధ్యతరగతి ప్రజలను, చివరకు క్రింది తరగతి వారిని కూడా ఆకర్షించి, అనతికాలంలోనే చిన్న చిన్న చిల్లర వ్యాపారులు, తోపుడు బళ్ళు, నెత్తి మీద గంపలవాళ్ళకు నిలువ నీడ లేకుండా చేస్తాయి. ఒకసారి వీరిని తుడిచి పెట్టడం అంటూ జరిగితే, ఇక్కడి నుండి వీరి వీర విహారానికి, ఏకస్వామ్యానికి ఎదురు ఉండదు. వీరి ఏకస్వామ్యం సంగతి ఏలా ఉన్నా, ఇంతమంది బ్రతుకులకు ప్రత్యామ్నాయం ఏమిటి? ఇక్కడి కీలక ప్రశ్న అలాగే ఇది తాత్కాలికంగా ఈ కొద్ది మంది వ్యాపారస్థులకు సంబంధించిన సమస్యగానే కనిపించినా, అనతి కాలంలోనే ఇది అందరి సమస్య ( అధిక మూల్యం చెల్లించవలసి రావడం) అవుతుంది. ఒకప్పుడు ఉచిత వస్తువుగా భావింపబడిన’నీరు’ నేడు లీటరుకు 12 నుండి 14 రూ చెల్లించి కొనుక్కోవలసి వస్తుందంటే ఇంతకన్న నిదర్శనం ఏమి కావాలి? ఇదే సంచికలోని ‘హైరిస్క్ సెగ్మెంట్లో తెలుగు యువత” అనే అధ్యయన నివేదిక కూడా విజ్ఞానవంతంగా, వివరణాత్మకంగా వుంది. పత్రిక యొక్క కృషి అభినందనీయం.
– ఎల్. మల్లిక్, మన్నెంలో… ఎడిటోరియల్ టీం. విశాఖపట్నం

* * *

ఈ నెల సంపాదకీయంలో ‘ఫ్రెష్’ సూపర్మార్కెట్లు వీధుల్లో తోపుడు బండ్లు, తలమీద బుట్టలతో పండ్లు, కూరగాయలు అమ్ముకునే పేద వ్యాపారుల పొట్టలు ఎలా కొడుతున్నాయో చదివితే హృదయం ద్రవించింది. గ్లోబలైజేషన్ ఎన్ని ఇళ్ళల్లో దీపాలార్పి వేస్తున్నదో చక్కగా వివరించారు. మంచి మనసున్న వారే పేదల ఇక్కట్లు అర్ధం చేసుకోగలరు. ‘పునరుజ్జీవం’ కథ విదేశీ మోజు పెంచుకునే వారికి చక్కటి కనువిప్పుగా ఉన్నది. మన పత్రికలో కథలకు, కవితలకు ఇంకా ఎక్కు చోటు ఇవ్వమని కోరుతున్నాను.’చిక్కటి అడవిలో రెక్క విప్పుతున్న చైతన్యం’ మీ రిపోర్టు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నది. మీరు ఏ విషయం గురించి వ్రాసినా, అది ఒక సుందర కావ్యం ఉంటుంది. పాపి కొండల యాత్ర కూడా అంతే. ఒక బాలిక అడిగిన ప్రశ్నకు, మీ గురించి పత్రికలో రాసి మీ సమస్యలు అందరికీ తెలిసేలా చేస్తామని పేలవమైన సమాధానం చెప్పానన్న మీ మాటలో వారి గురించి ఏమీ చెయ్యలేక పోతున్నామన్న మీ దయార్ద్ర హృదయం వ్యక్తమయింది. మంచి విషయం అందించిన మీకు కృతజ్ఞతలతో.
– కోపూరి పుష్పాదేవి, విజయవాడ

* * *

మా ప్రిన్సిపాల్గారి టేబుల్ మీద భూమిక చూడడం జరిగింది. వెంటనే తీసి చదివాను. ప్రతి పేజీ ఎంతో సమాచారంతో, ఆత్మగౌరవంతో నిండి వుంది. ఈ లెటర్తో పాటు సంవత్సర చందా పంపుతున్నాను. పత్రికను నాకు పంపగలరు.
– జరీనాబేగం, హన్మకొండ

* * *

మీ భూమిక ఎంతో బావుంటోంది. నాకు తెలియని ఎన్నో విషయాలు స్త్రీల సమస్యల గురించి, సంస్థల గురించి ప్రపంచ మహిళా ఉద్యమాల గురించి చాలా విస్తారంగా తెలుసుకోగలుగుతున్నాను. మీరందరూ కలిసి, ఎంతో శ్రమతో, ఉత్సాహంతో స్త్రీలకు ఒక వెలుగుబాటగా మీ పత్రికను నడిపిస్తున్నందుకు ధన్యవాదాలు. అదే కాక, కథలూ, వాస్తవ జీవిత సత్యాలూ, కవితలూ, విమర్శనా పూర్వకమైన వ్యాస పరంపరలు అత్యధిక ఆసిక్తకరంగా, ఎంతో జ్ఞానదాయకంగానో ఉంటున్నాయి. ప్రతి సంచిక ఎంతో అద్బుతంగా వస్తోంది.
– బి. బాలాదేవి, భువనేశ్వర్

* * *

స్త్రీలకెంతో అమూల్యమైన స్త్రీవాద పత్రిక సంపాదకురాలిగార్కి, నేనొక కవి, పండితుని (కీ. శే. కళా ప్రపూర్ణ కొత్త సత్యనారాయణ చౌదరి) కుమార్తెను. గత 32 సం. రాలుగా స్థానిక కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిని. నాకెంతో ఆత్మీయులైన ఒక విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ నా పేరుతో ‘భూమిక’కు డబ్బుకట్టి పత్రిక ప్రతినెల వచ్చేలా చేశాననే వరకు ఇంత విలువైన మాసపత్రిక ఉన్నదనే సంగతి నాకు తెలియదు. అప్పటి నుండి చాలా పదిలంగా ఏ ఒక్క వాక్యం విడువకుండా నా మాటలో చెప్పాలంటే అ నుండి అ: వరకు చదువుతున్నాను. చదివిస్తున్నాను. ఇతరులకు పరిచయం చేస్తున్నాను. ఈ పత్రికను నడిపించటంలో మీ సంపాదకవర్గం కృషి అభినందనీయం. ఏది యేమైన ‘భూమిక’ మా చేతిలో ఒక ‘గీత’ కావాలని మనసారా కోరుకుంటూ.
– కె.పద్మావతి, గుంటూరు

* * *

భూమిక పత్రికలో ‘ప్రియమైన అమ్మా… నాన్న…’ పుస్తకావిష్కరణ సందర్భంగా అరుణమ్మగారి ప్రసంగవ్యాసం ప్రచురించినందుకు ధన్యవాదాలు. హైదరాబాద్ వచ్చినపుడు మిమ్ములను స్వయంగా కలుసుకుంటాను. పిల్లల మనోభావాలు అమ్మలకు, నాన్నలకు తెలియటం అవసరం.
– ప్రభాకరశాస్త్రి, గిద్దలూరు

* * *

‘భూమిక’ పత్రికలో మీరు ప్రకటించిన ‘దళితా కవితా యుగం’ ప్రకటనకు చాలా మంచి స్పందన వచ్చింది. అందుకు కృతజ్ఞతలు. నాకు చాలా మంది ఫోన్ద్వారా సావిత్రిభాయిఫూలే గురించిన రాసిన వ్యాసం చాలా బాగుందని తెలిపారు. భూమిక చాలా బాగా వస్తోంది.
– కత్తి పద్మారావు, పొన్నూరు

* * *

భూమిక హెల్ప్లైన్ టోల్ ఫ్రీ నెంబర్ను మీరు కోరిన విధంగా కొన్ని నెలల పాటు తప్పక ప్రచురించగలము. గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మీ పత్రిక బాగున్నది. హెల్ప్లైన్ ప్రారంభించి మీరందరూ చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయం. పత్రిక ద్వారా యీ మాత్రం సహకారం అందించగలగడం మాకూ ఆనందదాయకమే.
– సామ రమేష్ బాబు, నడుస్తున్న చరిత్ర

* * *

భూమిక ఫిబ్రవరి, మార్చి సంచికలు ఆసక్తి దాయకంగా వున్నాయి. గ్లోరియా స్టీనమ్తో ఇంటర్వ్యూ పత్రికకు హైలెట్. ఇది మీరింత త్వరగా సాధించినందుకు కంగ్రాట్స్.
– జె. భాగ్యలక్ష్మి, న్యూఢిల్ల్లీ

* * *

భూమిక స్త్రీవాద పత్రిక అంటూ స్త్రీలను చైతన్య పరిచే దిశగా రచనలు వుండాలంటూ… మీ పత్రికలలో స్త్రీల సమస్యలు ప్రతిబింబించే కథలు – కవితలు వేస్తామంటూ సంపాదకీయాలలో రాస్తూ వుంటారు. కాని స్త్రీలు నిరంతరం ఎదుర్కొంటున్న సమస్యలు గాని – వాళ్ళు మానసికంగా అనుభవిస్తున్న క్షోభగాని మీకు పట్టదు. పత్రికను కమర్షియల్గా నడపాలనుకున్నపుడు స్త్రీవాద పత్రిక అనే క్యాప్షన్ అనవసరం అని నా అభిప్రాయం. పోనీ అన్ని పత్రికలలాగే రచనలు ప్రచురించాలనుకున్నప్పుడు మీ పిరికితనపు చేష్టలు కూడా అనవసరం. ముందుగా రచనలు అభ్యుదయపధంలో, స్త్రీలను ఆలోచింపచేసేవిగా ఉండాలని ఆత్మశుద్ధిగా అనుకుంటే కొద్దిలో కొద్దిగానైనా స్త్రీలను జాగృతపరచి తద్వారా సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను సానుభూతితో అర్ధం చేసుకుని పరిష్కారం చూపగల రచనలు ప్రచురించాలి కాని.. చౌకబారు రచనలు చేయాలకుంటే మీరు స్త్రీలను మోసగించకూడదు. ఎసి గదులలో విందులు, వినోదాలలో మునిగి తేలే మీలాంటి వారి వల్లే స్త్రీ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళిలా వుంటున్నాయి. చిత్తశుద్ది లేనప్పుడు పత్రిక మూసేసుకుంటే బాగుంటుంది. మీలాంటి వారివల్ల అమాయక స్త్రీలు ఆశలతో జీవిస్తూ బలవుతున్నారు. మీకు నిజాన్ని చెప్పే రచనలను కూడా వినే సాహసం లేదని నేను పంపిన అ(స)బల కవిత ప్రచురించక పోవడంవల్ల తెలుసుకున్నాను. గతంలో నేను ఒక కథ స్త్రీ సమస్య పై రాస్తే ప్రచురించలేదు. రాసినవి ప్రచురించే సాహసం లేదని మీ లాంటివారు ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులున్నాయి అనే సామెతలా బ్రతకడం సిగ్గుచేటు. ఆలోచించండి. నిజంగా స్త్రీలను జాగృత పరచాలనుకుంటే రోటీిన్వి రాకుండా ఆలోచింపచేసే రచనలకు చోటివ్వండి. ఎందుకంటే నేను స్త్రీ సమస్యలకు స్పందించే వాడిని.
– సి.హెచ్.వి.ఎస్.బ్రహ్మానందరావు, విశాఖపట్నం

* * *

రెగ్యులర్గా భూమికను చదువుతాను. ఆసక్తికరమైన వ్యాసాలు వున్నాయి. అయితే కథల విషయంలో ఒకటి చెప్పాలి. స్త్రీవాద పత్రిక కాబట్టి చివరకి స్త్రీలు గెలుపొందినట్లు రాస్తూ ఉంటారు. అసహజమైన వాతావరణం కథ కోసం సృస్టిస్తూ ఉంటారు. ఉదా. ఏప్రిల్ సంచికలో పునరజ్జీవనం కథలో మార్త గల్ఫ్ దేశాలకి వెళ్ళి నానా అవస్థల పడి చావుతప్పి కన్ను లొట్టబోయి వస్తుంది. గల్ఫ్ వెళ్ళేముందు అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించక పోవడం మూర్ఖత్వం కాదా? ఆకర్షింపబడ్డాను, మోసగించబడ్డాను అంటే సరిపోతుందా? డబ్బు పోతే పోయింది కాని లా తెలిసింది అన్నట్టు చివరలో ఇప్పుుడు నాలో విశ్వాసం కలిగింది. స్వతంత్రంగా బ్రతకగలను అంటుంది. డైట్ కోకు తాగటం అడసు తొక్కనేల కాలు కడుగనేల అన్నట్టు ఉంది
– కె. రామారావు, హైద్రాబాద్

* * *

మీ పత్రిక రెగ్యూలర్గా అందుతోంది. ఎయిడ్స్పై మీ సంచిక వల్ల ఎంతో వేదన ఈ సమాజంలోని ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు ఉందని అవగాహన పాఠకులకు వస్తుంది. మీ కృషి ప్రశంసనీయం.
– వై. వి. రమణారావు, ఖమ్మం

Share
This entry was posted in ఎడిటర్‌కి లేఖలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.