ఫెమినిస్ట్‌ పెస్ర్‌ డైరెక్టర్‌ – ఫ్లారెన్స్‌ హావ్‌

– కె. సత్యవతి, డా.సమత

(ఫ్లారెన్స్‌ హావ్‌ న్యూయార్క్‌లోని గ్రాడ్యుయేట్‌ సెంటర్‌ ఆఫ్‌ ద సిటి యూనివర్సిటీలో ఇంగ్లీషు ప్రొఫెసరుగా పని చేసారు. ది ఫెమినిస్ట్‌ ప్రెస్‌ పబ్లిషర్‌/ డైరెక్టరుగా వున్నారు. ఆమె డజను కన్నా ఎక్కువ పుస్తకాలను వంద కంటే ఎక్కువ వ్యాసాలు ప్రచురించారు. ఆమె ఎన్నో గౌరవ హోదాలను ఆరు గౌరవ డాక్టరేట్లను పొందారు. ఇటీవల ఆమె మాడిసన్‌ లోని విస్కాన్‌ సిన్‌ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్‌ను పొందారు. ప్రస్తుతం ఫ్ల్లారెన్స్‌ ‘వుమెన్‌ రైటింగు ఇన్‌ ఆఫ్రికా’ పుస్తకానికి కో డైరెక్టరుగా వుండడంతో పాటు ఈ ప్రాజెక్టు కింద రాబోతున్న నాలుగు పుస్తకాలకు టెక్ట్స్‌ ఎడిటర్‌గా వున్నారు. త్వరలో ఫ్లారెన్స్‌ తన జ్ఞాపకాలను పుస్తక రూపంలో తేనున్నాను.

ఫ్లారెన్స్‌ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫెమినిస్ట్‌ ప్రెస్‌ 1970లో స్థాపించబడింది. లాభాపేక్ష లేకుండా నడిచే ఈ పబ్లిషింగు హౌస్‌ ప్రపంచంలోని ఎంతో మంది స్త్రీల రచనలను ప్రచురించింది.కనిపించకుండా పోయిన అనేక పుస్తకాలను తవ్వి తీసి ప్రచురించింది. దానిలో చాలా ముఖ్యమైన పుస్తకం ఓల్‌సేన్‌ (Olsen) రాసిన “లైఫ్‌ ఇన్‌ ద ఐరన్‌ మిల్‌” రిప్రింట్‌ ఫెమినిస్ట్‌ ప్రెస్‌కి దిశా నిర్దేశం చేసిందని ఫ్లారెన్స్‌ అంటుంది. 1861 లో ప్రచురించబడి, కనబడకుండా పోయిన ఈ అద్భుతమైన పుస్తకాన్ని ఫెమినిస్ట్‌ ప్రెస్‌ పునర్ముద్రించింది. అలాగే ఏగ్నెస్‌ స్మెడ్లీ రాసిన “డాటర్స్‌ ఆఫ్‌ ఎర్త్‌”ని కూడా ఫెమినిస్ట్‌ ప్రెస్‌ ప్రచురించింది. ఇప్పటికీ ఈ రెండు పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్‌ సెల్లర్స్‌గా వున్నాయి.
1971 నుండి ఫెమినిస్ట్‌ ప్రెస్‌, కనిపించకుండా పోయిన ఎన్నో అమెరికన్‌ రచయిత్రుల రచనలే కాక, ప్రతి ఖండంలోని రచయిత్రుల పుస్తకాలను ప్రచురించింది.

అన్వేషి ఆహ్వానం మీద హైదరాబాద్‌ వచ్చిన ఫ్లారెన్స్‌ ఇక్కడ ఎన్నో సమావేశాల్లో ఉపన్యసించారు. (మాకు ఫ్లారెన్స్‌ ఇంటర్వ్యూ లభ్యమవ్వడంలో సహకరించిన డా. సూసితారు, డా. కె. లలితకి భూమిక ధన్యవాదాలు తెలుపుతోంది.)

ఫ్లారెన్స్‌ హైదరాబాదు వచ్చారు. ఆవిడది చాలా బిజీ ప్రోగ్రాం. భూమిక కోసం ఇంటర్వ్యూ చేయాలంటే ఛాన్సు దొరికేలా లేదనిపించింది. సూజీతారుకి మా సమస్య వివరిస్తే ఫ్లారెన్సు ఇంటర్యూ ఇప్పించే బాధ్యత తీసుకుని సి.ఇ.ఎఫ్‌.ఎల్‌ లోని ఒక ఆడిటోరియంలో ఆవిడ ఉపన్యాసం పూర్తయ్యాక మాకు కొంచెం సమయం కేటాయించారు.

అసలు ఆవిడ ఈ పని ఎలా మొదలు పెట్టారు? ఎలాంటి కష్టాలు, అడ్డంకులు ఎదుర్కొన్నారు? ఎన్ని పుస్తకాలు, ఎటువంటి పుస్తకాలు పబ్లిష్‌ చేసారు. ఆమె భవిష్యత్తు కార్యక్రమాలు ఏమిటి అని అడగిన ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలు భూమిక పాఠకుల కోసం.

నేను ఇంగ్లీషు టీచర్ని. నా విద్యార్థులు వ్యాసాలు సరిగా రాసేవారు కాదు. బాగా చదువుకున్న ఈ పిల్లలు ఎందుకు బాగా రాయలేకపోతున్నారు అనేది నాకసలు అర్థమయ్యేది కాదు. వాళ్లకు దేని గురించి రాయాలో తెలిసేదికాదు. మిసిసిపిలో కొంత మంది నల్లజాతికి చెందిన విద్యార్థులతో పనిచేసినప్పుడు నాకు ఒక విషయం తెలిసింది. ఈ విద్యార్థులు పెద్దగా చదువుకోనప్పటికీ నల్లజాతి, స్వేచ్ఛ అనే అంశాల గురించి చక్కగా రాసేవారు. అప్పుడు నాకనిపించింది రచనా వ్యాసంగానికి కొత్తపాఠాలు కావాలని. నిజానికి కొన్ని కొత్త విషయాలు తెలిసాయి. స్త్రీలు-పురుషులు, బాలికలు – బాలురు. వీరి జీవితాల్లో చాలా వ్యత్యాసం ఉంది.

మా కుటుంబంలోనే మా తమ్ముడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు. అతను నాకంటే చిన్నవాడయినా సరే… నేనే ఎక్కువ తెలివి తేటలు, చురుకుదనం కలిగిన దాన్నయినా సరే మా అమ్మ అంటూ ఉండేది “కొడుకుకి అందం వచ్చింది. కూతురికి తెలివితేటలు వచ్చాయి. ఎంత విచారకరం”. నేను చాలా సింపుల్‌గా వుండేదాన్ని. కాని మా అమ్మ నన్ను అనాకారిగా భావించేది. మా తమ్ముడికి బంగారు వర్ణపు (బ్లాండ్‌) జుట్టున్నందున చాలా అందగాడని అనేది. యూదుల కుటుంబంలో అటువంటి జుట్టుంటే చాలు, అదే సర్వం. తమ్ముడు తిండి బాగా తినేవాడు. నేను బక్కగా ఉండేదాన్ని. తిండి అసలు తినలేకపోయే దాన్ని. మగపిల్లవాడయి నందుకు తమ్ముడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విషయం నాకు తెలిసింది. ఇందులోనే ఏదో మతలబు ఉందని తెలుసుకుని నా స్టూడెంట్స్‌తో ఈ విషయాలు మాట్లాడ్డం మొదలు పెట్టాను. కాని వాళ్ళు మాట్లాడ్డానికి ఏమాత్రం ఇష్టపడేవాళ్ళుకాదు. అందుకని అవే విషయాలు రాయడం మొదలు పెట్టాను.

ఇలా రాయడం మొదలు పెట్టాక విద్యార్థులు చాలా బాగా రాసేవారు. లిటరేచరు స్టూడెంట్లు. ఇక్కడెవరూ స్త్రీ రచయితలు లేకపోవడానికి కారణం ఏమయి వుండవచ్చు అనుకున్నారు. నేను బాల్యం నుంచీ ఏ రచయిత్రుల గురించి చదవలేదు. మేం కేవలం బ్రిటీష్‌ మగ రచయితలను మాత్రమే చదివాం.

ఒక ప్రొఫెసరు గారయితే నాతో ఒక సారి ఇలా అన్నాడు- “స్త్రీ రచయితలు రాసింది చదవడం ఒక వేస్ట్‌, ఎందుకంటే అవి బాగా వుండవు.” నా విద్యార్థులు స్త్రీ రచయితులు కావాలని ఆశించారు. 18వ శతాబ్దంలో స్త్రీలు ఎలా ఉండేవారో తెలుసుకోవాలని కుతూహల పడ్డారు. నాకూ తెలీదు. అలాంటి ప్రశ్నే రాలేదు నాకు.

ఈ పరిస్థితి స్త్రీల గురించి కొన్ని పుస్తకాలు తీసుకురావాలే ఆలోచన నాలో రేకెత్తించింది. నేను కొంత మంది పబ్లిషర్లతో కలిసి మాట్లాడాను. వాళ్లందరూ ‘నో’ అన్నారు. అందులో డబ్బులు రావన్నారు. చాలా మంచి ఐడియానే… కానీ.. పైసలు సంపాదించాలి కదా మరి.

“నువ్వే ఎందుకు చెయ్యకూడదీపని?” నా (మాజీ) భర్త ప్రశ్నించాడు.

‘నో! నో! నేను చెయ్యలేను. ఎదైనా మెగజైను, లేక న్యూస్‌ లెటరో చెయ్యొచ్చు. పుస్తకాలు తీసుకురావడం. నో! నో!” అన్నాను.

నాతో కలిసి పనిచేయడానికి మనుషులు కావాలి. “బార్టిమోర్‌ వుమెన్‌ లిబరేషన్‌ కమిటీ”ని కలిసాను. ఆ రోజు ఇరవై అయిదు మంది గుండ్రంగా కూర్చుని మాట్లాడారు. వారిలో ప్రతి ఒక్కరూ ఎంత బిజీనో, నాతో కలిసి పనిచేయడానికి ఎలా వీలు కాదో వివరంగా చెప్పారు. అలా ఆ గదిలో ఉన్న ఏ ఒక్కరూ నాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా లేరు.

అప్పటికే నాకు చాలా నిరాశ కలిగింది. ఈ ఆలోచనే మర్చిపోదాం అనుకున్నాను. పాఠాలు చెప్పకోవడం ఉత్తమం అని నిర్ణయించుకున్నాను.

నేను సెప్టెంబరులో ఇంటికి తిరిగొచ్చాను. (ఆగష్టులో ఇంటి నుంచి వెళ్లాను) ఇంటికొచ్చే సరికి నా-మెయిల్‌ బాక్సు ఉత్తరాలతో నిండిపోయి ఉంది. వాటిపైన “ఫెమినిష్ట్‌ ప్రెస్‌’అని రాసుంది. (నవ్వులు). నాకు చాలా కోపం వచ్చింది. లోపల పిల్లల పుస్తకాలు, జీవిత గాధల కోసం డబ్బు, డాలర్‌ బిల్లులు ఉన్నాయి. చివరికి నవంబరులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసాను. నా కోపం తగ్గడానికి రెండు నెలలు పట్టింది. వాళ్లకి (బార్టిమోర్‌) ఫోన్‌ చేసి ఎందుకిలాంటి పనిచేసారు? మీకెంత ధైర్యం అని అన్నాను. ఇదొక మంచి ఐడియా అని, నాకేదో సాయం చేస్తున్నట్లుగా వాళ్ళు భావించారు.

“పిల్లల పుస్తకాలు ఎక్కడ్నుంచి వస్తాయి” అని అడిగాను. “మా ఉత్తరం కాపీ ఎక్కడో ఉంది-ఫ్లారెన్స్‌). ఏభై మంది వచ్చారు. వాళ్లందరూ వాళ్ల వాళ్ల ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఏవిషయం వచ్చినా ఉదా: పుస్తకం కవర్‌ గురించి… వగైరా చాలా వాదోపవాదాలు చర్చలు జరిగేవి. మీరు కూడ (మావైపు చూస్తూ) ఇలానే పని చేస్తారను కుంటాను. ఇలా కవర్‌ తయారు చేయడం, ఎడిటింగు కోసం మేం చాలా కాలాన్నే పెట్టే వాళ్లం. నాకక్కడ ఉద్యోగకాలం ఒక సంవత్సరం మాత్రమే ఉంది. నా భర్తను అకడెమిక్‌ జాబ్‌నుంచి తీసేసారు. అది వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం తీవ్రదశలో ఉన్న కాలం. నా భర్త మరో ఉద్యోగం వెతుక్కోకుండా యుద్ధ వ్యతిరేక ఉద్యమంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. నాకు వేరే ఉద్యోగం దొరకడం సులభం కాబట్టి అతనికి సపోర్టుగా ఉండాలని నిర్ణయించుకున్నాను. నాకు అనుకున్నట్టుగానే మరో ఉద్యోగం దొరికింది.

ఆ తర్వాత మేం న్యూయార్క్‌ వెళ్ళి పోయాం. ప్రెస్‌ పని బాల్లిమోర్‌లోనే వదిలేద్దామనుకున్నాను. కాని ఎవరూ దానికి అంగీకరించలేదు. నాతో పాటు ప్రెస్‌ కూడా న్యూయార్క్‌ చేరింది. ఇంకా నిర్మాణం కొన సాగుతున్న కాలేజీలో నా ఉద్యోగం. అనుభం ఉన్న పూర్తి ప్రొఫెసర్ని నేనొక్కదాన్నే. మీద స్త్రీని. మొత్తం బాధ్యతంతా నాపై పడింది. అమెరికన్‌ స్టడీస్‌లో భాగంగా వుమెన్స్‌ స్టడీస్‌ ప్రోగ్రాంని ఆవిష్కరించడానికి కొంత గ్రాంట్‌ కూడా లభించింది.

ఇంతలో నేను అనారోగ్యం పాలయ్యాను. న్యుమోనియా వచ్చింది. ఆ సమయం నా దగ్గర చదువుకున్న విద్యార్థిని (కార్మిక వర్గం నుంచి వచ్చిన గ్రాడ్యుయేట్‌) నన్ను చూడ్డానికి వచ్చింది. నా ఆరోగ్యం సీరియస్‌గా ఉండటం గమనించింది. నాకొక అసిస్టెంట్‌ అవసరమని అమె అర్ధం చేసుకుంది. జీతం ఎక్కడ్నుంచి తెచ్చిస్తాం అన్నాను. “నీ జీతాన్నే భాగాలు చేద్దాం” అంది. నేను నా భర్తని కూడ సపోర్ట్‌ చేయాలి కదా” అన్నాను.” నీకింతకు ముందున్న జీతం కంటే ఎక్కువే వస్తుంది కదా! నీ అసిస్టెంట్‌కి నీ జీతంలో సగం ఇద్దాం. నువ్వు బతికి బట్టకట్టడం చాలా ముఖ్యం” అంది నా స్టూడెంట్‌, అలా చేసి చూపించింది నా వండర్‌ ఫుల్‌ స్టూడెంట్‌ కార్ల్‌ ఎలెన్‌. ఓ వర్కింగు క్లాస్‌ యువతిని నాకు అసిస్టెంటుగా నియ మించింది. ఆమెకి ఇద్దరు చిన్న పిల్లలున్నారు. అందువల్ల ఉదయం 9గం|| నుంచి మధ్యాహ్నం 3గం||ల వరకు మాత్రమే ఆమె పనిచేసేది. అయితే ఈ అరేంజ్‌మెంట్‌ నన్ను కాపాడింది. నేనొక్క దాన్ని అయితే అన్ని పనులూ చేయకలిగేదాన్ని కాదు. అలా మొదలయ్యింది. మా కథ……

ఆ తర్వాత వుమెన్‌ స్టడీస్‌ పుంజుకున్నాయి. నేను మొదట సెకండ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, ఫస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా చివరకి ప్రెసిడెంట్‌గా ఎన్నియ్యాను. దాని కాలపరిమితి మూడు సం||రాలు. ఇలా ప్రెసిడెంట్‌గా ఎన్ని కయిన మొట్ట మొదటి స్త్రీని నేనే. అమెరికా మొత్తం నుంచి నాకు ఆహ్వానాలొచ్చేవి. ప్రతి యూనివర్సిటీ వాళ్ళు పిలిచి మాట్లాడమనే వారు. తమ సంస్థలో వుమన్స్‌ స్టడీస్‌ ప్రోగ్రాం ప్రారంభించడానికి సాయపడమనేవారు. నేను ఇంత ప్రతిష్టాత్మకమైన స్థానంలో ఉన్నాను కదా. దీన్ని కొంత మంది పురుషాహంకారులు సహించలేకపోయేవారు. నేనున్న గదిలో కూర్చోడానికి కూడ ఇష్టపడేవారు కారు. అంతేకాదు యూనివర్సిటీలో కింది పొజిషన్‌లో ఉన్న స్త్రీలు నేను వాళ్ళ కాలేజీ ప్రెసిడెంట్లను, డిపార్ట్‌మెంటు హెడ్లను కలిసి స్త్రీలు, వుమెన్స్‌ స్టడీస్‌ గురించి చెప్పమనేవారు.

ఎందుకంటే ఇటువంటి విషయాలు మాట్లాడే అవకాశం ఆ స్త్రీలకు లేదు కాబట్టి. నేను వారానికి రెండు మూడు సార్లు ప్రయాణాలు చేసేదాన్ని. నేనెప్పుడూ గాలిలోనే తేలుతుండేదాన్ని. ఆ ప్రయాణాల రికార్డు నాదగ్గర లేదు. కాని ఎక్కడికెళ్ళినా, అక్కడి స్త్రీలు మీరు ఫలానా సం|| ఇక్కడికొచ్చారు…. మళ్ళీ ఫలానా సం|| వచ్చారు. అని గుర్తుచేస్తూ ఉంటారు. అదంతా ఇప్పుడు నాబుర్రలో లేదు. గుర్తులేదు… కానీ అవి నిజంగా చాలా బిజీ, బిజీ, క్రేజీ రోజులు. ఆ చరిత్రంతా ఎలా పునర్నిర్మించాలో నాకు తెలియడం లేదు.
ఆ తర్వాత నూయార్క్‌కు చెందిన కొంత మంది స్త్రీ ప్రచురణ కర్తలు, పుస్తకాల ప్రచురణ గురించి బాగా తెలిసిన వారు మాకు సాయం చేస్తామని వచ్చారు. అలా మొదటిసారిగా పుస్తకాల డిజైనింగు, టైపు సెట్టింగు, ఎడిటింగులో ప్రావీణ్యత కలిగిన ప్రొఫెసర్ని అయ్యాను. వారి పుణ్యమా అని మా ప్రచురణలు అందమైన పుస్తకాల రూపం దాల్చాయి.

ఈ విధంగా వారి నుంచి నేను కొంత నేర్చుకున్నాను. మాకు నెల, నెలా మీటింగులు జరిగేవి. బార్టిమోర్‌ జనం ప్రతి నెలా సమావేశానికి వచ్చేవాళ్ళు. పుస్తకం, ప్రచురణ, ప్రొపెస్‌ (ప్రొడక్ట్‌ + ప్రొసెస్‌ – ఫ్లొరెన్స్‌) గురించి బార్టిమోర్‌ గ్రూప్‌కి న్యూయార్క్‌ గ్రూప్‌కి మధ్య పెద్ద యుద్ధం జరిగేది. ప్రొసెస్‌లో ప్రతి ఒక్కరూ ప్రతి పని చెయ్యాలని బార్టిమోర్‌ వార్లు అనేవారు. ఒక మనిషికి ఒక పని మాత్రమే అప్పచెప్పడం అనేది వారికి నచ్చేదికాదు. డిజైనింగు ఒకరు, డబ్బు సమకూర్చడం ఒకరు ఇలా విభజించడం వారికి వచ్చేదికాదు. అందరం అన్ని పనులూ చేయాలి అనేవారు. న్యూయార్క్‌ వారికి అది అసాధ్యమనిపించేది. ఓ పుస్తకం తీసుకు రావడానికి మాకు నాలుగు సం||రాలు పట్టింది. కొంచెం ఆర్గనైజ్‌డ్‌గా పనిచేస్తే మంచిదనిపించింది.

కొంచెం ప్రాక్టిల్‌గా ఆలోచించాం. నేను పొలిటికల్‌గా కొంచెం ఎదిగాను కూడ. ఒక వ్యక్తికి ఒకే పని అని నిర్ణయించాం. అలా పది సంవత్సరాలు గడిచిపోయాయి.అయినా కొంచెం గందరగోళంగా ఉండేది. కాని పది సంవత్సరాలు మేం పనిచేయగలిగాం. మాకు ఎక్స్‌టర్‌నల్‌ బోర్డు లేదు. కొద్ది మొత్తాల్లోనే ధనం సమకూర్చేవాళ్ళం. పుస్తకాలు వివిధ ప్రాంతాలకు పంపించేందుకు నిర్దిష్టమైన పద్ధతి (Distribution) లేదు. ఈ పని కొద్ది సం||రాల కంటే సాగదు అనుకున్నాను. పదవ వార్షికోత్సవం వచ్చింది. దానికి కొద్ది రోజులు ముందుగా External Board (నేను లేకుండా) ఏర్పాటు చేశారు. నేనైతే ఇంక ఈ పనికి ఫుల్‌స్టాప్‌ పెడదామనుకున్నాను. నేను చేస్తున్న వేరే పనుల బాధ్యత కూడా నామీద ఉంది. ఫుల్‌ టైమ్‌ ఉపాధ్యాయ వృత్తి వుంది. అలా Ext board సమావేశం జరిగింది. అందులో అందరూ నాకు తెలిసినవాళ్లే ఉన్నారు.

ఆ బోర్డులో సభ్యురాలైన ఎలిజబెత్‌ జేన్‌ (ప్రఖ్యాత రయిత్రి) నా వైపు చూస్తూ షాంపైన్‌ గ్లాస్‌ ఎత్తి -‘ఇది రాబోయే పదేళ్ళ కోసం’- అని టోస్ట్‌ చెప్పింది. నేనేమో “నో! నో! (నవ్వులు) హా! నో!” అన్నాను. అలా 37 సం|| గడిచిపోయాయి. నేను బతికుంటే 2010 నాటికి 40 ఏళ్లు పూర్తవుతాయి. ఆలోచిస్తే భలే ఆశ్చర్యం వేస్తుంది.

అప్పట్లో షుమారు. 80 ప్రచురణ సంస్థలుండేవి. 80-దశకం చివర్లో 90-దశకం మొదట్లో వచ్చిన కొత్త ఎక్‌సైక్లోపీడియా కోసం Feminist Publishing World Wide అనే అంశం మీద నన్ను రాయమన్నారు. అప్పట్లో అమెరికాలో 40 స్త్రీ వాద ప్రచురణ సంస్థలు ఉండేవి. మరో 40 సంస్థలు ఇతర ప్రపంచ దేశాలో ఉండేవి.

ప్రస్తుతం అమెరికాలో నాలుగు సంస్థలున్నాయి. ప్రపంచం మొత్తం మీద ఎన్ని ఉన్నాయో తెలీదు. ఇండియా లో డజను పైగా ఉన్నాయి. ఫ్రాంక్‌ ఫర్ట్‌లో జరిగిన ఒక ఉత్సవంలో పాల్గొన్నపుడు, అక్కడ డజను లేక రెండు డజన్లు ఇండియన్‌ సంస్థల వారిని చూసాను. ప్రస్తుతం భారత దేశంలోనే ఎక్కువ స్త్రీ వాద ప్రచురణ సంస్థలున్నాయని చెప్పొచ్చు. ఇది అమెరికాలో కంటే ఎక్కువే. మాదగ్గర కూడా లిస్టులేదు. ఆరు నుంచి ఎనిమిది సంస్థలు కలిసి ఒక గ్రూపుగా ఏర్పడి వారి పుస్తకాలు పంపిణీ విధానాన్ని మెరుగు చేయాలనుకుంటున్నారు. చిన్న దేశమైన నెదర్‌లాండ్స్‌లో మూడు సంస్థలున్నాయి. ఇటలీలో మూడు, కొన్ని చోట్ల పెద్ద ప్రచురణ సంస్థల్లో భాగంగా స్త్రీవాద ప్రచురణలు వస్తున్నాయి. ‘రాగ’ అనే సంస్థ కూడ అలానే పని చేస్తోంది – ఒక బ్రిటీష్‌ ప్రచురణ సంస్థలో భాగంగా.

ఇరాకీ ప్రచురణలు ఎవరూ పట్టించు కోలేదు. ఎందుకంటే అవి రాసింది స్త్రీలు. వాటిని మేం ప్రచురించాం. ప్రముఖ ప్రైజు వచ్చిన పుస్తకం – దాన్ని కూడా అమెరికాలో ఎవరూ ప్రచురించడానికి ముందుకు రాలేదు. మేమే ప్రచురించాం. “ముఫాజు” దీంట్లో రచయిత్రి వైవిధ్యం కలిగిన రచనా పాటవాల్ని కనబరిచారు. అద్భుతమైన పుస్తకం, మీదగ్గర కూడా (అన్వేషి దగ్గర) ఈ నవల ఉంది.

ప్రైజు వచ్చిన ఆమె పుస్తకం కధావస్తువు పారిస్‌లోని ఇరాకీ కాందిశీకులకు చెందినది. కొడుకు, అతనూ కాందిశికుడే, కెనడాలో ఉండేవాడు. అమెకి హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. చూడ్డానికి అతను వస్తాడు. అలా మొదలవుతుంది. రచనాసరళి అద్బుతంగా ఉంటుంది. ఒక్క పేరా చదివితే అమె బుర్రలో ఉన్న ప్రపంచమంతా తెలుస్తుంది. దానికి ప్రైజ్‌ వచ్చింది. ఆమె పేరు అలియామాముడు.

ఇరాక్‌ రచయిత్రుల పుస్తకాలు కూడా అమెరికాలో మేము ప్రచురించాం. ప్రచురించడానికి ఎవరూ ముందుకు రాలేదు. కాబట్టి మంచి రచయిత్రుల పుస్తకాలు ప్రచురించడమే మా పని. ఆఫ్రికన్‌ రచనలు, ఇండియన్‌ రచనల మీద పరిశోధన మేం చేసినా మా కోసమని వేరే వాళ్లెవరూ ఇదిచేయరు కదా! ఇది క్రేజీ పని కదా! లేక క్రేజీ వాళ్లు చేసే పని కదా!

చైనా రచయిత్రుల రచనలు కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాం.వాటి గురించి మాకు పెద్దగా ఏమీ తెలీదు. చైనాలోని మైనారిటీ స్త్రీల రచనలు తీసుకోవాలను కుంటున్నాం. మేం యునాన్‌ (చైనాలో ఒక ప్రాంతం) పోవాలి. అక్కడ ఇరవై వేరువేరు మైనారిటీ గ్రూపులున్నాయి. ఇక్కడ ముస్లిం లు చైనా వారిలా ఉండరు. చైనీస్‌ మాట్లాడరు. నాకు తెలీదు… ఈ పని ఇప్పుడే సాధ్యం అవుతుందో… కాదో…. ఇక భవిష్యత్తు గురించి – ఫెమినిస్ట్‌ ప్రెస్‌కి కొత్త డైరెక్టరు వస్తోంది. నేను ఈ సం|| ఆఖరు వరకూ ఈ ఆఫీసులో పనిచేస్తాను. నేను 2008 సం||లో మరోసారి ఉద్యోగ విరమణ చేస్తాను. ఆఫ్రికా ప్రాజెక్ట్‌ పూర్తి చేయాలి. తర్వాత నాకు నచ్చిన వేరే పనులున్నాయి. కొత్త డైరెక్టరు యునైటెడ్‌ నేషన్స్‌లో పనిచేసిన మహిళ. 9సం|| ఒక మాగజైన్‌కి ఎడిటర్‌గా ఉన్నారు. ఇధియోపియాలో 4సం|| ఉపాధ్యాయ వృత్తి చేసారు. అంతర్జాతీయ భావాలు కలిగినామె. పుస్తకాల ప్రచురణ గురించి ఆమెకింకా తెలీదు. నేర్చుకుంటున్నారు. కాని డబ్బును సమకూర్చడం తెలుసు. చాలా మంచి ఆర్గనైజర్‌. స్టాఫ్‌ అంతా ఆమంటే ఇష్టపడతారు. (స్టాఫ్‌ మొత్తం నాతో కలుపుకొని ఎనిమిది మంది -ఫ్లోరెన్స్‌) 2007 సం|| అంతంలో నా బదులు ఇంకొకర్ని తీసుకుంటారు. నేను ప్రతి రోజూ ఆఫీసుకెళ్లాల్సిన అవసరం లేదు. వారానికో, రెండు వారాలకో ఒకసారి వెళ్తాను. సైన్సు సిరీస్‌ని ఎడిట్‌ చేయాలి.

నాకు స్టాఫ్‌ గురించి బాధ్యతలు కూడా ఉండవు. గ్లోరీ జాకబ్‌ – కొత్తగా వచ్చే ఫెమినిస్ట్‌ ప్రెస్‌ అధినేత భవిష్యత్తులో చేయవలసిన పని గురించి ఆమెకు అవగాహన ఉంది. మరో తరం, యువతరంలో కలిపి పనిచేయాలని మిడిల్‌ ఈస్ట్‌ ప్రాజెక్ట్‌ని ముందుకు తీసుకు రావాలని ఇంకా ముందు ముందు ఏముందో ఎవరికి తెలుసు. సైన్సు ప్రాజెక్ట్‌ కయితే ఆమె నుంచి మంచి ప్రోత్సాహం ఉంది…. చెప్పడానికి బోల్డన్ని విషయాలున్నా, ఆసక్తిగా వినడానికి మేము సిద్ధంగా ఉన్నా సమయం లేనందున మాకు బై చెప్పి ముగించారు ఫ్లారెన్స్‌ హావ్‌.

Share
This entry was posted in ఇంటర్‌వ్యూలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో