ఊబి

– తురగా జానకీరాణి

చిత్ర పరుగెత్తుతోంది. భుజాన పుస్తకాల సంచీ బరువుగా ఉంది. వగరుస్తూ పరుగెడు తోంది. ‘అమ్మో, టీచరు చంపేస్తుంది? అనుకుంటోంది. అల్లా పరుగెత్తి రైల్వే స్టేషన్‌ దగ్గర ఆగింది. అది వూరికి చివర. రైలు ఆగివుంది. మెట్లు ఎత్తుగా వున్నాయి రైలు పెట్టెకి. ఐనా, సంచీ గట్టిగా పట్టుకొని ఎక్కేసింది. ఎంతో కష్టమైంది. అయాసం వచ్చింది. ఆ తలుపుమూల నక్కి కూచుంది. రైలు కదిలింది. ఆకలి, నిద్ర, ఏడుపు. కాసేపటికి ఒక ముష్టి మనిషి చూసింది చిత్రని. “ఏయ్‌ పిల్ల” అని పిలిచి ‘నాతోరా’ అని తీసుకెళ్ళింది. కంపార్టుమెంటులో సీట్ల మధ్య నడిపిస్తూ, తనలాగే చేయి చాపి అడుక్కోమంది. బజ్జీలు, టీ కూడా పెట్టింది.

బడి వదలి, వూరు వదలి, అమ్మను వదిలి దూరంగా వెళ్ళిపోతున్నది చిత్ర. అమ్మ, చిత్తుగా తాగేస్తుండేది. రోజూ యింత అన్నం మాత్రం పిల్లకి పడేసేది. ఎప్పుడైనా నాలుగు డబ్బులూ యిచ్చేది. ఇంటి పక్క పిల్లలతో కలిసి బడికి వెళ్లేది చిత్ర. అమ్మా యిచ్చే చిల్లర డబ్బుల లెక్క తెలియదు. అవి యిస్తే ఒక బిస్కెటు ప్యాకెట్టు యిచ్చేవాడు దుకాణదారుడు. దయతలచి స్కూలు పుస్తకాలు పాతవి యిచ్చేవాడు. ఇంటి నుంచి బడికని ఎప్పడో బయలుదేరేది. దోవ తప్పేది. లేటుగా వచ్చినందుకు టీచరు తిట్టేది. ఒక రోజు అమ్మ యీవేేళ నీ పుట్టిన రోజే చిత్ర! ఇవి పిల్లలందరికీ యివ్వు, అని పిప్పర్‌మెంటు బిళ్ళలుకొని యిచ్చింది. అవి పుచ్చుకొని క్లాసుకి చేరేసరికి, యింకా లేటయింది. కొత్త టీచరు ‘ఏమిటి యిప్పుడారావడం! అని ఒక్క దెబ్బ వేసింది. చిత్ర దూరంగా పోయి వెనకాల కూచుంది. బిళ్లలు పిల్లలకి యిచ్చింది. ‘నా పుట్టినరోజు’ అని చెప్పింది. టీచరు చూసింది దగ్గరకు వచ్చి ‘ఒసేయ్‌, ఏమిటి వాగుతున్నావు?” అని మరో దెబ్బ వేసింది. ఇందాకా కొట్టినందుకు చెంప మండిపోతుంది. ఇప్పుడు ంూ దెబ్బ మరీ చుర్రుమన్నది. ఒళ్ళు భగ్గుమంది. కోపంతో పలక పుచ్చుకొని టీచరు చేతిమీద గట్టిగా కొట్టింది. ‘అబ్బా’ అని టీచరు చెయ్యి వెనక్కి తీసుకుంది. చిత్ర వణికిపోయింది. టీచరు తనని పట్టుకునే లోగా వెనక తలుపులోంచి ఒక్క పరుగు తీసింది. బయటికి వచ్చి పడినా యింకా వణుకు తీరక, పరుగెత్తుతూనే వుంది.

ఇదంతా, ఆ ముష్టి మనిషికి ఆ తర్వాత చెప్పుకుంది. తనవూరు, తన యిల్లు, మామిడి తోటల్లో ఆటలు అన్నీ చెప్పింది. అమ్మను మరచి పోతోంది. ముష్టి వాళ్ళతో కలుస్తూ, గుడిసెల్లో బతుకుతూ కడుపు నిండా తింటూ, ఎక్కడో ఒక చోట నిద్రపోయేది. ఎవరో బట్టలూ యిచ్చేవారు, స్నానం చేస్తే హాయిగా అనిపించేది. నాలుగు బట్టలు పోగుచేసుకొని, అవే వుతుక్కొని కట్టుకునేది.

చిత్ర పొడుగైంది. వయస్సు వచ్చింది, ఎప్పుడో, ఎక్కడో వళ్లు అమ్ముకోవడం ఆరంభమైంది. వ్యభిచారంలోకి దిగింది. చేతుల్లో డబ్బులు ఆడుతున్నాయి. ఇప్పుడొక పవిత్ర పుణ్యక్షేత్రంలో బస్సు స్టాండులో వుంటోంది చిత్ర. వయస్సు యిరవై మూడేళ్లు. ఒక పాప. తండ్రి ఎవరో తెలియదు. తన పసితనమే మర్చిపోయింది. ఇంక తన కూతురి బాల్యం చూసి మురిసే మనస్సు ఎక్కడుంది?
బస్సు స్టాండు వెనకాల ఒక గది వుంది. అక్కడే ఆమె వృత్తి, ఆ యిరుకు గదిలోంచి బయటకు వచ్చి బస్సు స్టాండులో వున్న అరుగు మీద పడుకొంటుంది. ఉన్న డబ్బులోనే అలంకరణ, ఏదో ఒకటి చేసుకొంటుంది. ఆ బిడ్డను సాటి వాళ్లెవరో ఎత్తుకొంటారు.

“చిత్ర !” ఎవరేనా పిలుస్తారు. వళ్లంతా వూకుంటూ లేని వయ్యారాలు వలకబోస్తూ నడుస్తుంది. తళుక్కుమనే బొట్టు పెట్టుకుంటుంది. పొడుగాటి లోలాకులు. కారణం లేకుండా నవ్వుతుంది. మూతి చివర్లో జారిపోయి ఒక విషాదం నవ్వు వంవులో. ఆ చుట్టు ప్రక్కలే చెత్త మనిషిలా పెరిగిన చిత్రవంక మగవాళ్ళు చూస్తారు. ‘అది’ ఎవరో వాళ్లందరికీ తెలుసు నల్లని కనుగుడ్లు, విశాలమైన కళ్లల్లో పలుగుకాదు. ఎర్రని జారవుంటుంది. పోషణ వారి వలచని మాట్లాడగానే తెలుస్తుంది. ఆమె ఎదగని పసిబిడ్డ అని, బాలిక లాంటి లేత కంఠం అల్లాగే వుండిపోయింది. ముద్దు మాటలు పట్టినట్లు అంటోంటే ఆమె మనిషిగా ఎదగడం ఎక్కడో ఎప్పుడో మానేసిందని అనిపిస్తుంది.

ఆమెని సంఘసేవికలు పట్టుకున్నారు. ‘వృత్తి చేసుకో కానీ నీవళ్లు చూసుకో. నీ వల్ల నలుగురు మగవాళ్లు లేదా నలుగురు మగవాళ్ల వల్ల నీవు జబ్బు పడవద్దు. రోగాలు వ్యాపింప చేయకండి’ అని చెప్పారు. రక్షిస్తాం అన్నారు ఆమెకి వైద్య పరీక్షలు చేసి మందులిచ్చి, కండోమ్స్‌ ఇప్పించారు.
తనని రక్షిస్తారు సరే, కానీ చిత్ర తన జీవితంలో యిప్పుడేం చేస్తుంది? ఏ పనీ చేతకాదు ఆమె ఎటూ పోలేదు. తల్లి వుందో, పోయిందో తెలియదు. తనకి కన్న బిడ్డ ఒక్కతి వున్నది. అది మాత్రం సత్యం. కులం, వంశం, తేడా లేని ఆ బిడ్డను చూసినప్పుడు చిత్ర కళ్లల్లో వెలుగు, దానికి ఏదో మంచి చేయాలి. బతుకు కల్పించాలి తన లాగా కాకూడదు.

చిత్ర ఒక దీనవనిత, కానీ హుందాతో తల ఎత్తుకొని, నిటారుగా వెన్ను సవరించు కొని, నిలబడి, బతకాలని ప్రయత్ని స్తున్న ఒక సెక్సు వర్కరు.

ఊబిలో పడింది, సుడిగుండంలో చిక్కుకుంది. చిత్ర లాంటి ఆడదాని శరీరానికి గిరాకీ వుంది. అంటే అవసరమైన ‘సేవలు’ అందిస్తోంది. జీవనం గడుపుకుంటోంది. ఆమె కళ్లు దిగులు నిండిన కారు మబ్బులు. ఆమె పసితనాన్ని, అమాయకత్వాన్ని, సంతోషాన్ని యా లోకం మటుమాయం చేసింది. ఆమె బతుకు కల్మశాన్ని, జరిగే దోపిడీని యా పవిత్ర భూమి సహిస్తున్నది.చిత్ర లాంటి వారెందరో? ఆ సంఖ్య పెరుగుతోందంటే గుండె పగలదా? చిత్ర లాంటి మనిషిని చచ్చిపోనిద్దాం, కానీ మానవాళిని రోగాలబారినుండి కాపాడుదాం, అదే యినాటి నిత్య న్యాయ సమ్మత విధానం, ఔనా?

( ఇది వాస్తవగాధ, చిత్ర చెప్పుకున్న కథ)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో