‘కిటికీ’

పసుపులేటి గీత
‘చరిత్రలో ఒక రోజు తప్పక వస్తుంది, ఆ రోజు సర్వమానవాళి ఒకానొక నూతన వివేచనతో అత్యున్నత నైతికస్థాయికి ఎదుగుతుంది. అప్పుడు మనం మన భయాలన్నింటినీ తోసిరాజని, ఒకరికొకరం స్నేహసహకారాల్ని అందించుకుంటాం.’
‘నేనొక మొక్కను నాటాను అంటే, అది క్రమంగా ఎదగడాన్ని చూస్తాను, దానికి పండ్లు కాస్తే, వాటిని పిల్లలు ఇష్టంగా తినడాన్ని చూస్తాను. అది ఒక గొప్ప అనుభూతి. ఒక మొక్క ఎదిగితే అది పక్షులకు మంచి ఆవాసంగా మారుతుంది. నేను చేతల మనిషినే కానీ మాటల మనిషిని కాను. నేను ఒక మార్పుకు అంకితమయ్యాను. మొక్కని నాటడమంటే నా దృష్టిలో ఒక ఆశను నాటడమే. గ్రీన్‌బెల్ట్‌ కార్యకర్తలు దెబ్బలు తిన్నారు, జైళ్ళ పాలయ్యారు. వేధింపులకు గురయ్యారు. వెరసి సామాన్య మహిళలందరూ ఇప్పుడు ‘ఫారెస్టర్స్‌ వితవుట్‌ డిప్లొమాస్‌’ (డిప్లొమాలు లేని అటవీ నిపుణులు) అయ్యారు. ఎవరైనా ఒక చిన్న గోతిని తవ్వవచ్చు. చాలా దేశాల్లో ముఖ్యంగా వర్ధమాన దేశాల్లో మహిళలకు సంఘటిత వ్యవసాయం, అడవుల నిర్వహణ అన్నవి అందని మ్రానిపండ్లలాగే ఉన్నాయి. పథకరచనలు చేసేవాళ్ళు దిగువస్థాయి సాధారణ పేద మహిళల విజ్ఞానాన్ని అర్థం చేసుకున్న తరువాతే ప్రణాళికల్ని రచిస్తే బావుంటుంది. నేను మధ్య కెన్యాలోని నైరీలో పెరుగుతున్నపుడు మా కికుయూ భాషలో ‘కరవు’ అన్న పదానికి తావే ఉండేది కాదు. కానీ ఇప్పుడు అన్ని వర్ధమాన దేశాల్లోలాగే మా నైరీలో కూడా జలవనరులు అంతరించిపోతున్నాయి. భూమికోసం ఘర్షణలు పెచ్చరిల్లిపోతున్నాయి. నేను 1970ల్లో కెన్యా మహిళా జాతీయ సమాఖ్యలో పనిచేస్తున్నపుడు గ్రామీణ మహిళల వెతల్ని విన్నాను. మహిళలు కోరే కోరికలేమీ అంత ఖరీదైనవి కావు, వాళ్ళు కేవలం పరిశుభ్రమైన తాగునీరు, ఇంధనం, తమ సంతతికి పోషకాహారాన్ని మాత్రమే కోరుతున్నారు.’
– బంగారీ మథై
మొక్కలు నాటడం ద్వారా ఆఫ్రికన్‌ సమాజపు రూపురేఖల్ని మార్చేసిన మనకాలపు అద్భుత మహిళ వంగారీ మథై. ఒక కార్యకర్తగా, పర్యావరణ ఉద్యమకారిణిగా, మహిళగా అన్ని హద్దుల్ని తోసిరాజని, కెన్యాలో వలసవాద ప్రభుత్వాల మీద తిరుగుబాటు బావుటా ఎగరేసి, ఆ దేశాన్ని విముక్తం చేయడంలో ముఖ్య భూమిక పోషించింది వంగారీ. కెన్యాలోని కికియూ తెగకు చెందిన వంగారీ ముతా మథై 1, ఏప్రిల్‌, 1940న నైరీలోని ఒక పేద కుటుంబంలో జన్మించింది. నైరోబీ విశ్వవిద్యాలయం నుంచి 1971లో ఆమె డాక్టరేటును పొందింది. మధ్యప్రాచ్య ఆఫ్రికాలోనే ఇలాంటి ఘనతను సాధించిన మొదటి మహిళ వంగారీ. కెన్యా మహిళల జాతీయ సమాఖ్యకు ఆమె 1981లో అధ్యక్షురాలైంది. కెన్యా మహిళల జాతీయ సమాఖ్య సహాయంతో ఆమె గ్రామీణ మహిళల చేత మొక్కలు నాటించే ప్రక్రియను ‘గీన్‌బెల్ట్‌ మూవ్‌మెంట్‌’గా ప్రారంభించింది. వంగారీని 2004లో నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న తొలి ఆఫ్రికన్‌ మహిళ కూడా వంగారీనే!
ఆమె అవిశ్రాంత పోరాటానికి, కృషికి లభించిన అవార్డులు అన్నీ ఇన్నీ కావు. ఆమెకు 1983లో ‘ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డుతో ఈ సత్కారాల పరంపర మొదలైంది. ‘రైట్‌ లైవ్లీహుడ్‌ అవార్డు’, ‘ఉమెన్‌ ఆఫ్‌ ది వరల్డ్‌ అవార్డు’, ‘హంగర్‌ ప్రాజెక్ట్‌ ఆఫ్రికా ప్రైజ్‌ ఫర్‌ లీడర్‌షిప్‌’, ‘వాంగో ఎన్వైరన్‌మెంట్‌ అవార్డు’, ‘వరల్డ్‌ సిటిజెన్‌షిప్‌ అవార్డు’, ‘డిస్నీ వైల్డ్‌లైఫ్‌ కన్జర్వేషన్‌ అవార్డు’, ‘కెన్యా మానవహక్కుల జాతీయ సమాఖ్య అవార్డు’ ఆమెకు లభించిన అవార్డుల్లో కొన్ని మాత్రమే.

Share
This entry was posted in కిటికీ and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో