ఉత్సాహంగా జరిగిన హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగు

భూమిక హెల్ప్‌‌లైన్‌ ప్రారంభించి సంవత్సరం గడిచిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒక రివ్యూ మీటింగు పెట్టాలనుకున్నాం. సంవత్సర కాలంలోనే ఎంతో ప్రాచుర్యం పొంది ఎందరో బాధిత మహిళలకు బాసటగా నిలిచిన హెల్ప్‌లైన్‌ విజయం వెనుక ఎందరో మిత్రుల సహాయ, సహకారాలున్నాయి. వారందరిని ఆహ్వానించి మా కృతజ్ఞతలను ఈ రివ్యూ మీటింగు ద్వారా వ్యక్తం చెయ్యాలనుకున్నాం. చిన్న స్థాయిలోనే చెయ్యాలని మేమనుకున్నాంగాని ఆక్స్‌ఫామ్‌ గిరిజ ఇచ్చిన ప్రోత్సాహంతో ఏదైనా మంచి రిసార్ట్స్‌లో పెట్టాలని అనుకున్నాం. ఎన్నో రిసార్ట్స్‌ని సంప్రదించాం. కాని అవేవీ మనకు అందు బాటులో లేవు. చివరికి సెలబ్రిటీ రిసార్ట్‌ అన్ని విధాలా అనుకూలంగా వుండడంతో అక్కడే మీటింగు ఏర్పాటు చేసాం. రచయిత్రుల్ని, న్యాయవాదుల్ని, కుటుంబ సలహానిస్తున్న వారిని, మీడియా వారిని ఆహ్వానించాం.

22 వ తేది ఏప్రిల్‌ 2007 ఉదయం తొమ్మిది గంటలకి భూమిక ఆపీసులో కలవాలని నిర్ణయించాం. దాదాపు 35 మంది సమావేశానికి రావడానికి సంసిద్ధత వ్యక్తం చేయడంతో ఒక పెద్ద బస్సు మాట్లాడాం.

తొమ్మిదిన్నరకి మా వాహనం బయలు దేరింది. మధ్యలో కె. వరలక్ష్మి, స్వార్డ్‌ శివకుమారి ఎక్కారు. డా. సమతా రోష్ని మల్లెపూలు, మల్లెపూలంటూ గోల చేయడంతో మల్లెచెండులు కూడా బస్సెక్కి, బస్సులో ఉన్న వాళ్ళ తలల మీద తిష్ట వేసాయి. మల్లెపూల గుబాళింపును మోసుకెళితూ మా బస్సు పదకొండున్నరకి సెలబ్రిటీ చేరింది. ఎండ చుర్రుమంటోంది. పచ్చని చెట్ల మధ్య సెలబ్రిటీ ఠీవిగా నిలబడి వుంది.

మేమంతా బస్సు దిగి, ఈత కొలనులో జలకాలాడుతున్న వాళ్ళని ఈర్ష్యగా చూస్తూ ఆహా! ఈ వేడికి ఆ కొలనులో దూకెేస్త ఎంత బావుంటుంది అనుకున్నాంగానీ, ఎవరిదగ్గరా స్విమ్మింగు సూట్లు లేవు. మెల్లగా మాకు కేటాయించిన హాలులో కెళ్ళాం. ఎసి హాలు, చల్లగా, హాయిగా వుంది. పుట్టినూర్లో ప్రేమగా ఇచ్చినట్లుగా చల్లని మజ్జిగ సర్వ్‌ చేసారు. సాండ్‌విచ్‌లు తిని మీటింగు మొదలు పెడదామనుకున్నాం. అయితే గిరిజ అప్పటికి రాలేదు. తన కోసం ఎదురు చూస్తుండగా తెలిసింది. తను రాలేక పోతోందని ( అప్పటికే వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగా లేదు) గిరిజ రాకపోవడం చాలా నిరాశ కల్గించింది.రివ్యూ మీటింగు మొదలైంది. సత్యవతి సమావేశాన్ని ప్రారంభిస్తూ, అసలు హెల్ప్‌లైన్‌ పెట్టాలనే ఆలోచన ఎలా కలిగింది, ఎలా మొదలైంది, ఏ విధంగా నడుస్తోంది మొదలైన విషయాలు మాట్లాడింది. సంవత్సర కాలంలోనే ఆంధ్ర రాష్ట్రమంతటా హెల్ప్‌లైన్‌ నంబరు తెలిసిందని, ఇంత ప్రచారం లభించడం వెనుక ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎందరో మితృల కృషి వుందని చెబుతూ, ముఖ్యంగా ఆంధ్ర జ్యోతి లో వసంతలక్ష్మి చొరవతో నాగసుందరి, జ్యోతి రాసిన కథనాలు హెల్ప్‌లైన్‌ నంబరుని ‘నవ్యపేజీ’ చదివే వారందరికి పరిచయం చేసింది. అలాగే టి.వి.9 రవిప్రకాష్‌కి, ముఖ్యంగా ‘నవీన’ బాధ్యురాలు, షీతల్‌కి హెల్ప్‌లైన్‌ ఎంతో రుణపడి వుంది. ఎలాంటి చార్జీలు లేకుండా, ఉచితంగా, ప్రతి రోజూ ‘నవీన’లో హెల్ప్‌లైన్‌ స్క్రోల్‌ రావడం సాధారణ విషయం కాదు. ఎంతో నిబద్ధతతో, మూస కార్యక్రమాలకు భిన్నంగా షీతల్‌ రూపొందిస్తున్న ‘నవీన’ స్త్రీల కార్యక్రమంలో హెల్ప్‌లైన్‌ ( స్క్రోల్‌ రావడంవల్ల ఈ నెంబరు స్త్రీలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇంక సి.సుజాత ఇక్కడే వుంది. తను హెల్ప్‌లైన్‌ మీద రెండు కథనాలు చేసింది. సఖి ప్రొగ్రామ్‌లో వీటిని ప్రసారం చేయడం వల్ల ఎంతరో బాధిత స్త్రీలను ఈ నెంబరు చేరగలిగింది. ఇంకా హిందూలో విజయమేరి, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌లో నీరజ… వీరంతా హెల్ప్‌లైన్‌కి ప్రాచుర్యం కల్పించినవారే. ఇక భూమికలో మేము రెగ్యులర్‌గా ప్రకటన వేయడం కూడా ఎంతో ఉపయోగపడింది. వీరందరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. సమస్యల్లో వున్న బాధిత స్త్రీలకి తమ వంతు సహాయం అందించిన వీరికి అభినందనలు.

అలాగే హెల్ప్‌లైన్‌ పఠిష్టంగా పనిచేయడానికి, బాధిత స్త్రీలకి సహాయం చేయడానికి ఎందరో న్యాయవాదులు, మానసిక నిపుణులు, కుటుంబ సలహాదారులు సహకరి స్తున్నారు. ఎంతో మంది మాతో స్వచ్ఛందంగా పని చేయడానికి ముందు కొస్తున్నారు. హెల్ప్‌్‌లైన్‌ పని తీరును మెరుగు పరుచు కోవడానికి మీ సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను.” అంటూ ముగించింది.

ఈటివి2, సఖి ప్రోగ్రాం డైరెక్టర్‌, సుజాత మాట్లాడుతూ హెల్ప్‌లైన్‌ ఉపయోగం గురించి చర్చిస్తూ స్త్రీ సమస్యలపై పనిచేయడానికి చాలా ఓపిక, సహనం వుండాలి. సమస్యలను గురించి లోతుగా ఆలోచిస్తే వాటికి పరిష్కారం దొరుకుతుందని తెలిపారు. ఈటీవిలో వంటల సందడి, చూడండి చేయండిలాంటి ప్రోగ్రామ్‌లను చేయడానికి ఆసక్తి చూపుతుంటాం. కాని హెల్ప్‌లైన్‌ వంటి సంస్థలగురించి పరిచయం చెయ్యాలని ఆలోచించం. ఇలాంటి సంస్థలను పరిచయం చేయాలంటే బ్యాలస్సింగు వుండాలి. హెల్ప్‌లైన్‌ పరిచయం చేయడానికి వేదికను సిద్ధం చేసి ముందుగా భూమిక హెల్ప్‌లైన్‌ను పరిచయం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాకు చాలా ఫోన్‌లు వచ్చాయి. తనవంతు సహాయంగా భూమిక కోసం ఇంకా ఇలాంటి కార్యక్రమాలు వీలయినంత చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు సి. సుజాత.

తరువాత స్వార్డ్‌ డైరెక్టర్‌ శివకుమారి మాట్లాడుతూ మాకు వచ్చే కేసులలో కొంతమందికి వాళ్ళు దేనిగురించి బాధపడుతున్నారో వారికే తెలియదు. అలా అని మేము ఏ కేసును అంత తేలికగా తీసుకోం. మొదట్లో వాళ్లు పగ తీర్చుకోవాలని వస్తారు. వాళ్ళకు కౌన్సిలింగు చేసిన తరువాత వారు అసలు విషయాన్ని బయట పెడతారు. ఆ విధంగా మేము కౌన్సిలింగు చేసి పంపుతాం అన్నారు.

సమత మాట్లాడుతూ స్త్రీలకి ఇంకా సమానత్వం రాలేదని చెపుతూ ఉదా. ఉస్మానియా హాస్పిటల్‌లో కొంతమంది స్త్రీలు బురఖాలు వేసుకుని వచ్చి బి కాంప్లెక్స్‌ టాబ్లెట్లు తీసుకుంటారు. అట్లా ఎందుకు వస్తారంటే వాళ్ళు 24గంటలు ఇంట్లోనే వుంటారు. వారికి కనీసం ఈ విధంగానైనా బయట ప్రపంచంలోకి అడుగు పెట్టవచ్చునని అనుకుంటారని తెలిపారు.

సోషల్‌ ఆక్టివిస్ట్ రత్నమాల మాట్లాడుతూ స్త్రీలను మీడియా ఎలా తయారు చేస్తుందో దాని గురించి మాట్లాడారు. కొంతమంది స్త్రీలకు కొన్ని ధ్యేయాలుంటాయి. అవి నేరవేర్చుకోవడానికి ఉద్యమం చేయాలి. అలాగే అప్పటి మీడియాకి ఇప్పటి మీడియాకి చాలా తేడా వుంది. ఇప్పటి ఉద్యమ కారులు మీడియాలో వచ్చి చెప్పాల్సినది చెప్పాం అనుకుంటున్నారు. ఉద్యమాలు తగ్గిపోయాయి. ఇప్పటి తరం పిల్లలమీద మీడియా ప్రభావం చాలా వుంది. వాస్తవాలను వేరుగా అంచనా వేస్తున్నారని చెప్పారు.

అత్తలూరి విజయలక్ష్మి మాట్లాడుతూ బాలకార్మికుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ సమస్య కోసం బాలకార్మికుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పథకాల గురించి, వాళ్ళ చట్టాలు, హక్కుల గురించిన అవగాహనను కల్పించాలని చెప్పారు. దీనికి సంబందించిన సమచారం కూడా మీ హెల్ప్‌లైన్‌లో వుండాలని అభిప్రాయ పడ్డారు. దానికి సమాధానంగా సత్యవతి బాలల హక్కులపై పనిచేసే వివిధ సంస్థల గురించి వివరించారు.

సమత మాట్లాడుతూ అన్ని భూమికే చేయాలంటే కష్టం. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క దాని మీద పని చేస్తున్నారని చెప్పారు.

శివకుమారి మాట్లాడుతూ నిస్సహాయ స్థితిలో వుండి బాధను పంచుకోవడానికి ఎవ్వరు లేనప్పుడు ఇలాంటి హెల్ప్‌లైన్‌ల అవసరం చాలా వుంది. వారికి సరైన సమాచారం అందుతుంది.
తరువాత సత్యవతి మాట్లాడుతూ మాకు ఫాలోఅప్‌ కేసులు చాలా వస్తుంటాయి. వాటిని ప్రాసెస్‌ చేస్తున్నాం. అందులో కొన్ని కేసులు సక్సెస్‌ కూడా అయ్యాయి.

రేణుక అయోలా మాట్లాడుతూ సమస్యలో వున్న ప్రతి ఒక్కరు హెల్ప్‌లైన్‌కి ఎందుకు ఫోన్‌ చేస్తారంటే కొంత మంది కొన్ని విషయాలు ఎంత మంచి స్నేహితులు వున్నా చెప్పుకోరు. అలాంటి సందర్భంలో విషయాలను గోప్యంగా వుంచే ఇలాంటి హెల్ప్‌లైన్‌ల అవసరం చాలా వుంది. ఇంకా ఇప్పటికాలంలో స్నేహాలు లేకపోవడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వలన కూడా హెల్ప్‌లైన్‌ల అవసరం పెరిగిందని అభిప్రాయపడ్డారు.

తరువాత భూమిక హెల్ప్‌లైన్‌ కౌన్సిలర్‌ నాగమణి మాట్లాడుతూ ఫోన్‌ వచ్చినపుడు ఎలా మాట్లాడతారో, సమస్యను సహానుభూతితో తెలుసుకొని, వారిదగ్గర నుండి సమాచారం రాబట్టడం, వారికి సరైన సలహా ఇవ్వడం, వారితో మాట్లాడి ఎలా వారికి ఊరట కల్పించవచ్చో వివరంగా తెలియపర్చారు. ఉదాహరణగా కొన్ని విజయవంతమైన కేసుల గురించి వివరించారు.
అనురాధ, రేవతి మాట్లాడుతూ భూమికకు వచ్చి కౌన్సిలింగు చేయడం ద్వారా స్త్రీలకు తన వంతు సహాయం చేయడంపట్ల ఆనందం వ్యక్తం చేసారు.

ఈ రివ్యూ మీటింగుకి వచ్చిన వారంతా తమకు తోచిన సహాయం హెల్ప్‌లైన్‌కు అందిస్తామని తెలిపారు.

లంచ్‌ తర్వాత కొంత సేపు ఆటలు, పాటలు అయ్యాక రిసార్ట్స్‌లో కాసేపు నడకలు, పోటో సెషన్లు అయ్యాక తిరుగు ప్రయాణమయ్యాం. ఆ… అన్నట్టు తిరుగు ప్రయాణానికి ముందు సమత, సత్యవతి అందరికీ ప్రాణాయామం నేర్పించారు.

రోజంతా మితృలతో కలిసి గడిపిన హుషారుతో పచ్చని చెట్ల మధ్య నుంచి కాలుష్యం నిండిన కాంక్రీటు జంగల్‌లోకి తిరుగు ప్రయాణమైనాం.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>