‘నాకు నచ్చిన టీచర్‌’

డా. శిలాలోలిత
ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరంగల్‌ జిల్లాలోని మహబూబాబాద్‌ విద్యార్ధుల కృతజ్ఞతా ప్రకటనగా ‘నాకు నచ్చిన టీచర్‌’ అనే పుస్తకాన్ని తీసుకొని వచ్చారు. పుస్తక రూపం రావడానికి వారికి వెన్నుదన్నుగా నిలిచినవారు సీతారాం, ఓదెల శ్రీనివాసులు, బి. సంధ్యారాణి గార్లు.
విద్యార్ధులలో సృజనాత్మక రచనలపట్ల ఆసక్తిని, విద్యపట్ల గౌరవాన్ని, గురువుల పట్ల విలువను తెలియజేసేట్లుగా వుందీపుస్తకం.
ఈ వ్యాసాలలో తమను ప్రభావిత పరిచిన టీచర్ల గురించి విద్యార్ధులు రాసినదాన్ని ప్రచురించటం ఆశిస్తున్న ప్రయోజనాలు.
1. విద్యార్ధుల ఆలోచనకు, భావప్రకటనకు భాష ఏవిధంగా ఉపకరిస్తుందో గ్రహించగలుగుతారు. భాషా సామర్థ్యాలు పెంపొందించుకునేందుకు తగిన భావ వాతావరణం ఏర్పడ్తుంది. 2. సమాజంలో ఉపాధ్యాయులు వ్యక్తిత్వము, గౌరవాలు క్షీణిస్తున్న దశలో అటు ఉపాధ్యాయులకు, ఇటు విద్యార్ధులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. 3. కళాశాల ఇటువంటి వినూత్నమైన కార్యక్రమం చేయడంవల్ల విద్యార్ధులకు, సమాజానికి విశ్వసనీయత కలుగుతుంది.
విద్యార్ధి జ్ఞాపకశక్తి మాత్రమే జ్ఞానంగా పరిగణన పొందుతూ ఉన్న విద్యావ్యవస్థలో మరి ఏ ఇతర సామర్థ్యానికి, నైపుణ్యానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. ఒకవైపు జ్ఞాపకమే జ్ఞానమని అంతా నిర్హేతుకంగా నమ్ముతున్న తరుణంలోనే సమాచారమే జ్ఞానమని అనాలోచితంగా అందరూ అంగీకరించే స్థితి ఉత్పన్నమైంది. (డా|| ఆర్‌. సీతారామారావు)
ఈ అద్భుతమైన పుస్తకంలో 32 మంది విద్యార్ధులు తమ తమ మనోపుస్తకాలను తెరిచి వారి భావాలను వెల్లడించారు. ఇటీవల కాలంలో మన కాంక్రీటు యుగంలో గడ్డకట్టిన గురుశిష్య బంధాలన్నింటినీ బద్దలు కొడ్తూ, మిణుకుమిణుకుమంటున్న మానవసంబంధాలను వెలిబుచ్చిందీ పుస్తకం. తెరిచీ తెరియగానే ఆద్యంతమూ చదివించే అపురూప జ్ఞాపకమిది. మౌనంగా, భయంభయంగా, దిగులుగా, చదువులతల్లి దరిచేరడానికే భీతిల్లుతున్న నేటి పేద విద్యార్ధుల మన: చిత్రపటమిది. విద్యార్ధులు పెట్టిన శీర్షికలే వారి మనోభావాలకు అద్దం పట్టాయి. ‘మాధవి టీచర్‌ = ఓర్పు’, ‘యాకయ్య సార్‌, మా సార్‌ శ్రీనివాసరావు, సక్కుబాయి టీచర్‌, ఆహుతి టీచర్‌, పద్మావతి మేడమ్‌ మాకు స్ఫూర్తి. ఐలయ్య సార్‌ చల్లగా ఉండాలి, రాములు గారు జిందాబాద్‌, చదివే దారిని చూపారు, గోవర్ధన్‌ సార్‌ చరిత్ర, జీవశాస్త్రం-గిరిజకుమారి, నాకంటి చూపు సార్లే, ఈశ్వర్‌ సార్‌, జీనత్‌ ఫాతిమా, శ్రీనివాస్‌ సార్‌ అనుభవాలు-దారిదీపాలు. వెంకన్న సార్‌, వీరాస్వామి సార్‌, లెక్కతప్పని సూరయ్య సార్‌, వారు మనకు అర్థం కావాలంటే ఈ పుస్తకాన్ని తప్పక చదవాల్సిందే. గురు శిష్యుల బంధాన్ని విద్యార్ధులకు జ్ఞానదీపికగా, బతుకు చిత్రపటంగా చదువులతల్లి ఉపయోగపడే విధానాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చు. పేదరికంలో మగ్గుతూ, ఆకలి దప్పుల మధ్య అలమటిస్తున్న విద్యార్ధులు ‘దారిదీపాలైన’ గురువుల సహకారంతో, ప్రేమ వాత్సల్యాలతో, వెన్నెల మడుగులై, రేపటి తరానికి ప్రతినిధులుగా నిలిచే విద్యార్ధులను మనం ఈ పుస్తకంలో చూస్తాం. ఇదేదో కల్పనో, కథో, ఊహో కాదు. ఒక వాస్తవ జీవన దృశ్యపటాన్ని సమాజానికి చూపించిన వారందరూ అభినందనీయులు. ఎందరి జీవితాలనో చదివిన తర్వాత తడిసిన కనురెప్పల మధ్య, విద్యార్ధులకు చేయూత నివ్వాలనే సంకల్పమూ కలుగుతుంది.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో