గౌరవనీయ రవాణా శాఖామాత్యులకు ఉత్తరం

18.4.07

గౌరవనీయ రవాణా శాఖామాత్యులు
శ్రీ కన్నా లక్ష్మీనారాయణగార్కి,

నేను డా. సమతా రోష్ని 3.4.07 తేదీన నిర్మల్‌ నుంచి హైదరాబాదుకు ఆర్‌.టి.సి బస్‌. నెం. ఎపి11 2 2406 లో ప్రయాణం చేసాను. ఆ రోజు ఆ బస్సులో స్త్రీలకు రిజర్వ్‌ చేసిన మూడు సీట్లలోను పురుషులే కూర్చున్నారు. ఈ బస్‌ ఆదిలాబాద్‌ నుండి వస్తోంది. నెంబర్‌ 1 సీటు ఒక పురుషుడికి రిజర్వ్‌ చేయబడింది. నేను నిర్మల్‌లో ఈ బస్సు ఎక్కాను. మమ్మల్ని తోసుకుంటూ ముందుగా బస్సు ఎక్కిన 17-20 సంవత్సరాల కుర్రాళ్ళు మిగతా సీట్లు (2-9) ఆక్రమించారు. ఇవి స్త్రీలకు రిజర్వ్‌ చేయబడిన సీట్లు మీరు లేవండి అని నేను కోరినపుడు, ఈ సీట్లు అదిలాబాద్‌ నుంచి స్త్రీలు కూర్చుని వస్తేనే అవి స్త్రీలకు చెందుతాయి. మధ్యలో ఎవరైనా కూర్చోవచ్చు. కాబట్టి మేం లేవము అని అన్నారు. కండక్టర్‌ని అడిగితే ఆయన అదే సమాధానం చెప్పాడు. ఆ తర్వాత స్టేజీల్లో ముగ్గురు మహిళలు పిల్లలతో సహా, మరో వృద్ధురాలు బస్‌ ఎక్కారు. అయినా స్త్రీల సీట్లల్లో కూర్చున్న వారెవరు లేవనే లేదు. నేను ఎంత వాదించిన ఎవరూ విన్పించుకోలేదు.

స్త్రీలకు రిజర్వ్‌ చేసిన సీట్లు డిపోల నుంచి బయలు దేరిన స్త్రీలకు మాత్రమే చెందుతాయని, ఆ తర్వాత ఎక్కిన స్త్రీలకు ఆ సీట్లు చెందవని, మీరు నిలబడే ప్రయాణం చెయ్యాలని మగ ప్రయాణీకుల సిబ్బంది చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇలాంటి నియమాలేమైనా వున్నాయా? స్త్రీలకు రిజర్వ్‌ చేసిన సీట్లలో స్త్రీలే కూర్చునే విధంగా మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీ సిబ్బందికి జెండర్‌ సెన్సటైజేషన్‌ ప్రోగ్రామ్‌ నిర్వహిస్తే బావుంటుందని మా అభిప్రాయం. నేను పేర్కొన్న సదరు బస్సు పికెట్‌ డిపోకు చెందినది. ఈ విషయమై మీరు తగిన చర్యలు తీసుకుంటారని మేము బలంగా నమ్ముతున్నాము. అలాగే మీరు బస్సుల్లో రాయించిన కాప్షన్‌లు కూడా సరిగా లేవు. “ స్త్రీలను గౌరవిద్దాం. వారి సీట్లలో వారినే కూర్చోనిద్దాం” అంటే వారు కూర్చోనిస్తేనే మేము కూర్చోవాలా? మాకు అంటే స్త్రీలకు రిజర్వ్‌ చేసిన సీట్లు మాకే చెందుతాయి కదా! అది స్త్రీల హక్కు కదా!” ఈ ఫలానా సీట్లు స్త్రీలకు రిజర్వ్‌ చేయబడినవి” అని రాస్తే చాలు కదా!

అయ్యా! మా ఈ ఫిర్యాదును పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మిమ్ములను కోరడమైంది.

భవదీయులు
డా. సమతా రోష్ని
కొండవీటి సత్యవతి
ఎడిటర్‌, స్త్రీవాద పత్రిక భూమిక, హైద్రాబాద్‌.

(19.4.2007 తేదీన మేము ఈ ఉత్తరం పోస్ట్‌ చేసినప్పటికీ ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదు. దీనిపై పాఠకులు స్పందించాల్సిందిగా కోరుతున్నాం.)

Share
This entry was posted in ఉత్తరం. Bookmark the permalink.

3 Responses to గౌరవనీయ రవాణా శాఖామాత్యులకు ఉత్తరం

 1. Jai says:

  నా ద్రుస్టిలో పాత కాలంలోన స్రీలకు తగిన గౌరవము దక్కేదేమొ,మనిషి చదువు పెరిగిన కొలది స0స్కారము మరచిపోతున్నారు.

 2. Vennela says:

  జనాలు తెలువులు పెరిగి అడ్డంగా వాదించటం నేర్చుకుంటున్నారు. అంతే కానీ అటువంటి నియమాలేం లేవు.
  నాకూ ఇటువంటి అనుభవాలు జరిగాయి. స్త్రీలు 33% రిజర్వేషన్ కోరింతర్వాత నుంచి ఎక్కడైనా లైన్ లో
  కానీ వేరెక్కడైనా హక్కు గురించి మాట్లాడితే ఎదటి వారు ఈ విధమైన సమాధానాలు ఇవ్వటం చాలాసార్లు
  విన్నాను. కనీస సంవేదనశీలత లేకపోంగా అమానుషంగా మాట్లాడి చాలా తెలివిగా ప్రవర్తించామని సంబర
  పడే వారిని చూస్తే వీరూ ఓ ఆడ మనిషి కన్న సంతానమేనా అని బాధ పడటం తప్ప మరేం చేయగలం?

 3. Murali says:

  సత్యవతి గారు, ఈ లేఖకు ఏదయినా స్పందన లభించిందా? తెలుసుకోవాలని వుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో