సమాచార విప్లవం ఎవరి కోసం?

“స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం. వారికి కేటాయించి సీట్లలో వారినే కూచ్చోనిద్దాం” అనడానికి, జేబులు కొట్టకపోవడం మన సంప్రదాయం. ఎవరి జేబులో పైసలు వారినే ఖర్చు పెట్టుకోనిద్దాం – అనడానికి ఆ దృష్టిలో ఏమి తేడా లేదు.

అంటే హక్కుల్నీ, సమస్యల్ని ఆదర్శం తోనో, భావజాలానికి సంబంధించిన మాయాజాలంలోనో దక్కించుకోగలమని మనం ఇంకా నమ్ముతున్నామా? ఈ ప్రకటనలో అధిష్టాన వర్గపు దృక్పధం కనిపిస్తుంది. ఉదాహరణకి వరకట్నం గురించి చెప్పుకుందాం. ఇది నేరమని తెలిసి మనం చక్కగా ఇస్తున్నాం, పుచ్చు కుంటున్నాం. కాబట్టి పుచ్చుకోకపోవడం విలువ/ఆదర్శంగా కనిపిస్తుంది. ఈ మధ్య నేను కలిసిన పొదుపు గ్రూపుల్లో నూటికి తొంభై శాతం ఆడవాళ్ళు తమ కూతుళ్ళ పెళ్ళికి చేసిన/చేయాల్సిన అప్పుల గురించే బాధపడ్డారు. ఆ అప్పులు వాళ్ళ ఎంపిక కాదు. అప్పు చేయడం ఒక సాహసంగా, తీర్చడం ఒక సమర్థతగా అధిక వడ్డీలయినా సరే కట్టేందుకు ఫైనాన్సు కంపెనీల చుట్టూ, తక్కువ వడ్డీలకోసం ప్రభుత్వ కంపెనీల చుట్టూ తిప్పి తిప్పి దివాలా తీయించారు.

ఎక్కడెక్కడ నగలు, వస్తువులు, క్యాటరింగులు దొరుకుతాయో చెప్పడానికి ప్రచార, ప్రసార మాధ్యమాలు కలిపించారు. వివాహాన్ని ఎంత వైభవంగా చేసుకోవచ్చో, అలా చెయ్యకపోవడం వల్ల ఎంత నవ్వుల పాలు కావాల్సి వస్తుందో సినిమాల్లోనూ టివీల్లోనూ చూస్తారు. పక్కింటి వాళ్ళను చూసి నేర్చుకుంటారు. ఏ వస్తువులు కొనడం వల్ల భర్తని, పిల్లల్ని, కుటుంబం మొత్తాన్ని నిరవధికంగా ప్రేమించగలరో అర్ధం చేయించడానికి అంగడికి, అంగడే మీ కాళ్ళ ముందుకు వస్తుంది.

కంటి ముందు కొలువు తీరుతున్న హంగుల్లో ఏది తక్కువైనా ఎంతెంత నేరాలూ, ఘోరాలూ జరిగిపోయోవో కూడా తెలీకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. సమాచార వ్యవస్థ మిమ్మల్ని బతకనివ్వదు. ఈ పరిస్థితుల్లో అ జ్ఞానం మనకు ఎంతో సౌకర్యంగా వుంటుంది. మన కోరికలు తీర్చుకోవడానికి, తద్వారా తగినవారం అనిపించుకోవడానికి ఎంత హీన కారణమైనా చాలనిపిస్తుంది. మగపిల్ల వాణ్ణి కన్న భాగ్యానికి, ఫంక్షను హాలు రేటు నుంచి, భోజనంలోకి వడ్డించే పదార్థాల నుంచి, వధువు చీరలూ, నగలూ, తల వెంట్రుకల సింగారం నుంచీ, వంటి మెరుపు ఏ బ్యూటీ పార్లలులో పెట్టించుకోవాలో కళాత్మకంగా నిర్ణయాలు జరుగుతాయి. వరుడి తాలూకు వాళ్ళ అనవసర జోక్యంతో, అమ్మాయి తరపు వాళ్ళు ఎంత చిరాకు పడతారో అందరికీ తెలిసినా, కానీ ఆ భావావేశాలకు ఒక వ్యక్తీకరణ గానీ వేదిక గానీ లేదు. వ్యతిరేకించే విలువ కానీ, విధానం గానీ చట్టబద్ధంగా లేదు. చట్టబద్ధం కానిదేదీ భూమ్మీద బతకదు. బతికించదలుచుకోని దేన్నయినా గాని ఆదర్శం పేరుతో కబుర్లాడుతుందన్న మాట.

అదే సర్కారీ తన రాష్ట్ర జనాభా నియంత్రణ చెయ్యాలనుకున్నప్పుడు స్టీిలు బిందెలు చూపించి అయినా బ్రతిమలాడు కుంటుంది. మనం కూడా ఇష్టాయిష్టాలతో పని లేకుండా ఆపరేషను బల్లెక్కికూచుంటాం. దేవాలయాల్లో జరిగే సామూహిక వివాహాల్లో సైతం కట్న ప్రసక్తి, ప్రేమ వివాహాల్లో లాంచనాల, కానుకల ప్రసక్తి అందుకే కనిపిస్తోంది. ప్రేమ పెళ్ళిళ్ళలో, రిజిస్టరు పెళ్ళిళ్ళలో, పోలీసులు జరిపించే పెళ్ళిళ్ళలో అందుకే జనానికి నమ్మకం లేదు. కుటుంబ, సామాజిక ఒప్పుదల లేవు కదా అని భయం. అభద్రత కాబట్టి సాధారణ జనం ఆచరించదగిన ఒక వివాహ తంతు చేపట్టి దానికి ప్రచారం కల్పించాలి. ఇది పొదుపు గ్రూపులకే కాదు. మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతికి కూడా వర్తించాలి. ఎందుకంటే మనం మనకంటే పై మెట్టు విలువలు విధానాలు ఆచరించడానికి ఉత్సాహపడతాం.

పరిమిత ఖర్చులో పెళ్ళి గురించి భారత దేశంలో పని చేస్తున్న వాళ్ళు ఎవరెవరు వున్నారా అని ఈ మధ్య గూగుల్‌ సెర్చి ఇంజను వెతికాను. ఏఏ ఫైనాన్సు కంపెనీలో అప్పు దొరుకుతుందో, ఏ ఈవెంట్సు మేనేజర్సు ఎక్కడ దొరుకుతాయో కనిపించాయి గాని నాకు కావాల్సిన సమాచారం ఒక పట్టాన దొరకలేదు. చివరకు ఒక ఫైల్లో కొద్దిపాటి సమాచారం దొరికింది. దాని ప్రకారం జులై, 2003 ఇస్లామాబాదులో మరియు జస్టిస్‌ కమిషను, వరకట్నంతో బాటు కానుకలు రూపంలో కూడా వధువు నుంచి వరుని తల్లి తండ్రి ఆశించడం నేరమని, వివాహ ఖర్చుకి కూడా పరిమితి వుందని రాసి వుంది.

ఒక జాతీయ సదస్సులో ఈ నిబంధనల వివరాలు సమర్పించడం కూడా జరిగాయట.

  1. వివాహ భోజనం సాధారణంగా వుండాలి. శీతల, మత్తు పానీయాలు వివాహ సత్రంలోనికి అనుమతించరాదు.
  2. వివాహం జరుగుతున్న భవనం తప్ప రోడ్లు, వాహనాలు అలంకరించరాదు.
  3. మైకులు పెట్టి జన సామాన్యాన్ని విసిగించరాదు. మందుగుండు సామాను పేల్చరాదు.
  4. పిలవదల్చుకున్న బంధుమిత్రుల పరిమితి సంఖ్య, ఖర్చు వివరాలు వివాహ తేదీకి 15 రోజుల ముందుగా నిజాము యూనియను కౌన్సిలుకి సమర్పించాల్సి వుంటుంది. (ఖర్చు విషయంలో సమాచారం సవ్యంగా లేదు. ఒక ఫైల్లో రూ.50.000/- మరొక ఫైల్లో 3 లక్షలు అని వుంది. ఇది ఎవరైనా గాని అంగీకరించే మొత్తం కాదు)

అయితే కర్నాటక, కేరళ రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు సమర్థవంతంగా వివాహ ఖర్చు పరిమితి అనే అంశం మీద పని చేస్తున్నాయని తెలిసింది.

జన జీవితానికి ఇంతగా అవసరమైన అంశం చట్ట రూపంలో వుందో లేదో తెలీక పోవడం చాలా బాధగా వుంది. ఒక ఆడపిల్లకు చేసే పెళ్ళి ఖర్చు దుబారాతో పది మంది ఆడపిల్లల జీవితాల్ని తీర్చి దిద్దవచ్చని అంచనాలు చెబుతున్నాయి. సబ్బుల మాదిరి, చాక్లెట్ల మాదిరి ఈ సమాచారం ఎలా తెలుస్తుందో తెలీదు.

ఇప్పుడు ప్రపంచంలో నాకు ఎక్కడ చూసినా సమాచార విప్లవమే కనిపిస్తోంది. ఒక మౌళిక సంప్రదాయం ముందు మోగలేని విప్లవం, భూత, ప్రేతాత్మ మాదిరి కొందరికే, కొన్నిటికే కనిపించే విప్లవం. మనిషి దిగజారకుండా, దిగాలు పడకుండా వుండటం సాధ్యమేనా?

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.