పి.సి.పి.ఎన్‌.డి.చట్టం మీద ఒక రోజు రాష్ట్ట్రస్థాయి సమావేశం

కె. సత్యవతి

2011 సెన్సెస్‌ రిపోర్టు ప్రకారం భారతదేశంలో బాల బాలికల మధ్య సెక్స్‌ రేషియో చాలా ప్రమాదకరంగా, వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో ఈ అంశమై ఒక సీరియస్‌ చర్చను రేకెత్తించాలన్ని నివారణ చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని కదిలించాలనే ఉద్ధేశ్యంతోను భూమిక నవంబరు 5న ఒక రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రచయిత్రులు, విద్యావేత్తలు, న్యాయవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, హోమ్‌ మేకర్లు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, రేడియో జర్నలిస్ట్‌లు, ప్రభుత్వ అధికారులు, బ్యాంకు మేనేజర్లు హాజరయ్యారు. దాదాపు 100 మంది పాల్గొన్న ఈ సమావేశంలో లింగ నిర్ధారణ పరీక్షలు జరిపి ఆడపిండాలను చంపే అమానుష చర్యల పట్ల తమ నిరసనని తెలియచేసారు. మొదట భూమిక నిర్వాహకురాలు సత్యవతి సమావేశానికి హాజరైన వారినందరినీ ఆహ్వానిస్తూ… ఈ సమావేశానికి మంత్రులను, అధికారులను ఆహ్వానించామని, వారంతా ‘రచ్చబండ’లో మునిగి వున్నారని, ఆడపిల్లల అంశాలు వారి దృష్టిలో అంత ప్రాముఖ్యత కల్గినవి కాదని, వారెవ్వరూ హాజరుకాక పోవడమే వారి నిర్లక్ష్య వైఖరికి అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసారు. రాష్ట్రవ్యాప్తంగా పి.సి.పి.ఎన్‌.డి.టి చట్టం అమలును పర్యవేక్షించాల్సిన ఫ్యామిలీ వెల్ఫేర్‌ శాఖ అధికారి తాము పలుసార్లు అభ్యర్థించినా ఇంటర్వ్యూ ఇవ్వలేదని, తమ శాఖనించి ఎవ్వరినీ సమావేశానికి పంపలేదని ఆవేదనతో చెప్పారు. ఆంధ్రరాష్ట్రంలో స్త్రీల అంశాలకు సంబంధించి ఎన్నో సీరియస్‌ విషయాల మీద భూమిక ఇప్పటికే చాలా సమావేశాలు నిర్వహించిందని, వాటిలో ముఖ్యమైనవి యాసిడ్‌ దాడులు, గృహహింస, పనిచేసేచోట లైంగిక వేధింపులు, 498ఏ మొదలైన అంశాలమీద రాష్ట్రస్థాయి సమావేశాలు నిర్వహించి ఆయా తీర్మానాలను ప్రభుత్వానికి అందించడం జరిగిందని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాలలో విపరీతంగా పడిపోయిన సెక్స్‌ రేషియోలవల్ల భార్యను పంచుకోవడమనే దురాచారం మొదలైందని, దీనికి మన రాష్ట్రం కూడా అతీతంగా ఉండబోవడంలేదని, మన ప్రభుత్వం మేల్కొని పి.సి.పి.ఎన్‌.డి.టి చట్టం అమలును పకడ్బందీగా అమలు చేయాలని, దీనికోసం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసారు. ఆ తర్వాత హైకోర్టు న్యాయవాది ముజీబ్‌ కుమార్‌ పిసిపిఎన్‌డిటి చట్టంలోని ముఖ్య అంశాలను వివరించారు. ఈ చట్టం లింగనిర్ధారణ పరీక్షల్ని, పిండం సెక్స్‌ గురించి చెప్పడాన్ని నిషేధిస్తుంది.గర్భస్థ శిశువుకు ఏదైనా మేజర్‌ డిజార్డర్‌ వుందనే అనుమాన మొచ్చినపుడు మాత్రమే స్కానింగ్‌ చెయ్యాలి. కాని ఈ రోజు గర్భం దాల్చిన ప్రతి స్త్రీకి స్కానింగ్‌ టెస్ట్‌ చేసి, పిండం సెక్స్‌ గురించి చెబుతున్నారని ఇలా చెప్పడం నేరమని చెప్పారు. ప్రి నేటల్‌ డయాగ్నోస్టిక్‌ టెక్నిక్స్‌ని అందరి మీద ఉపయోగించకూడదని చెబుతూ ు 35 సంవత్సరాలు దాటిన గర్భిణీ స్త్రీలు ు అంతకు ముందు రెండు, మూడు సార్లు హాఠాత్తుగా అబార్షన్‌లు జరిగిన స్త్రీలు ు మానసిక జబ్బుతో బాధపడుతున్న స్త్రీలు వీరికి ప్రత్యేకమైన పరిస్థితులలో మాత్రమే స్కానింగ్‌ చేసి వారి గర్భంలోపలి సమస్యను చూడాల్సివుంటుంది. వైద్యులెవ్వరూ పిండం ఆడ,మగ అని చెప్పకూడదు. చెబితే అది శిక్షార్హమైన నేరమౌతుంది. ఈ నేరం కింది రూ. 10,000 జరిమానా, మూడేళ్ళ జైలు శిక్ష పడుతుంది. అంతేకాదు మెడికల్‌ కౌన్సిల్‌కి వారి లైసెన్సు రద్దు చేసే అధికారముంది. అన్నింటికన్నా ముఖ్యమైన అంశం ఏమిటంటే పి.సి.పి.ఎన్‌.డి.టి చట్టాన్ని ఉల్లంఘించిన నేరంం నాన్‌ బెయిలబుల్‌, నాన్‌ కాంపౌండబుల్‌ మరియు కాగ్నిజబుల్‌. చట్టం ఇంత కఠినంగా ఉన్నప్పటికీ, పఠిష్టమైన అమలు, పర్యవేక్షణ లేకపోవడంవల్ల నేరం చాలా యధేచ్ఛంగా కొనసాగిపోతోంది అంటూ ముగించారు ముజీబ్‌కుమార్‌. తర్వాత గ్రామ్య రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌ బాధ్యురాలు డా. రుక్మిణిరావు ఆడపిండాల హత్యల నివారణ కోసం ఎలాంటి ప్రచారం చేపట్టాలనే అంశమై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. రుక్మిణి మాట్లాడుతూ ఇది చట్టపరమైన సమస్యగానే చూడకూడదు. దీని చుట్టూ తీవ్రమైన అనేక సామాజిక అంశాలు ఇమిడి వున్నాయి. వాటి కనుగుణంగా, ప్రణాళికాబద్దంగా స్ట్రాటజీలు రూపొందాలి. ప్రధానంగా ఆమె చెప్పిన విషయాలు ఆంధ్రప్రదేశ్‌లో 0-6 వయస్సు ఆడ, మగ పిల్లల మధ్య సెక్స్‌ రేషియో ఎలా దిగజారుతూ వచ్చిందో చెబుతూ 1961లో 976, 2001లో 961, 2011 943కి పడిపోయింది. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మహిళలమీద హింస పెచ్చరిల్లిపోయింది. ఆర్ధికంగా బాగున్న ప్రాంతాల్లో మహిళా సాధికారత వుంటుందనడం ఒక భ్రమ అని ఆర్ధికంగా బాగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో లింగస్థ ఆడపిండాల హత్యలు విపరీతంగా వున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో వరంగల్‌ అతి తక్కువ సెక్స్‌ రేషియో (912)తోను, తరువాత స్థానం నల్గొండ (921), అనంతపూర్‌ 927 గాను వున్నాయి. మహారాష్ట్రలో తొలిసారిగా పి.ఎన్‌.డి.టి.చట్టం చేసింది. దేశవ్యాప్తంగా పి.సి.పి.ఎన్‌.డి.టి చట్టం 1994లో అమలులోకి వచ్చింది. డాక్టర్లు సౌంజ్ఞలద్వారా బిడ్డ సెక్స్‌ చెప్పి నేరస్థులవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో విపరీతంగా పెరుగుతున్న, వివిధ పేర్లతో వున్న స్కానింగ్‌ సెంటర్‌ల మీద పర్యవేక్షణ పెరగాలని ఆడపిల్లల హక్కుల పోరాటంలోకి పురుషులు, రాజకీయ నాయకులు కూడా కలిసి రావాలని, పంచాయతీలు, స్థానిక సంస్థలు కూడా ఈ అంశం మీద అవగాహనతో పనిచేయాలని కోరారు. రుక్మిణిరావుగారి ఉపన్యాసం మీద మంచి చర్చ జరిగింది. ఆ తరువాత హైదరాబాదు జిల్లా అడిషనల్‌ జిల్లా వైద్యాధికారి పద్మజ మాట్లాడారు. హైదరాబాద్‌ జిల్లాలో పి.సి.పి.ఎన్‌.ఎన్‌.డి.టి చట్టం పకడ్బందీగా అమలవుతోందని, స్కానింగ్‌ సెంటర్‌లలో సెక్స్‌సెలక్షన్‌ నేరమని బోర్డులు పెట్టామని, ఆడపిల్లల హక్కుల మీద అవగాహన కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు. జిల్లా స్థాయి అడ్వయిజరీ కమిటీలు ఏర్పాటు చేసామని, మూడు నెలలకొకసారి సమావేశం నిర్వహిస్తామని, ఇప్పటివరకు 16 కేసులు బుక్‌ చేసామని చెప్పారు. తాము నకిలీ గర్భవతుల్ని స్కానింగ్‌ సెంటర్‌లకు పంపి ఎవరైనా బిడ్డ సెక్స్‌ గురించి చెబితే వారి మీద కేసు బుక్‌ చేస్తామని వివరించారు. పద్మజ ప్రసంగం మీద కూడా వేడి వాడి చర్చ జరిగింది. ఆ తరువాత ప్రతి నిధుల్లోంచి చాలామంది మాట్లాడారు. రెడ్స్‌ నుంచి భానుజ, ”స్వార్డ్‌” నుండి శివకుమారి, ఆంధ్రప్రదేశ్‌ మహిళా సమత సొసైటీ నుంచి పద్మ, పశ్యపద్మ, సమతారోషిణి మొదలైన వారంతా చాలా విలువైన సూచనలిస్తూ చర్చలో పాల్గొన్నారు. విద్యారెడ్డి పి.స.ిపి.ఎన్‌.డి చట్టం అమలులోని న్యాయసంబంధ అంశాలను గురించి మాట్లాడారు. ఎఫ్‌ఎం రెయిన్‌బో నుంచి వచ్చిన వసుమతిగారు మాట్లాడుతూ ఈ సమావేశానికి రావడం తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఈ అంశం మీద తన వంతు ప్రచారం ఎఫ్‌ఎంద్వారా చేస్తానని, ఎవరైనా జింగిల్స్‌ లాంటివి రాస్తే, ప్రోగ్రామ్‌ల మధ్య వినిపిస్తానని ప్రామిస్‌ చేసారు. ఈ కార్యక్రమ నిర్వహణలో ఆర్థికంగా సహకరించిన బాగ్‌లింగంపల్లి బ్యాంకు మేనేజరు ఠాకూర్‌ మాట్లాడుతూ లింగనిర్ధారణ పరీక్షలు జరిపి ఆడపిండాలను హత్య చేయడంలాంటి దారుణ నేరానికి సంబంధించిన ఒక సీరియస్‌ అంశం మీద మీరు సమావేశం ఏర్పాటు చేయడం, దానికి మా వంతు సహకారాన్ని అందించగలగడం చాలా సంతోషంగా వుందని, ముందు ముందు మీరు మేము కలిసి మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని చెప్పారు. ఉదయం నుండి జరిగిన చర్చల సారాన్నంతా క్రోడికరించి ఈ క్రింది తీర్మానాలను ఆమోదించారు. ు ఎన్‌జివోలు చెబుతున్న డేటాని, ప్రభుత్వం వెల్లడిస్తున్న డేటాని పోల్చి చూడాలి. ు జిల్లా అడ్వయిజరీ కమిటీలను బలోపేతం చెయ్యాలి ు ఆడపిల్లల హక్కులకోసం జరుగుతున్న ఉద్యమంలో పురుషులు, రాజకీయ నాయకులు భాగస్వాములు కావాలి. ు ముఖ్యంగా స్త్రీలు చైతన్యం పొందాలి. ‘నో’ అని చెప్పగలగాలి. ు ‘ఆడపిల్లల్ని హత్య చేయొద్దు’ అనేది నానుడిగా ప్రచారం కావాలి. ు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్న స్కానింగ్‌ సెంటర్‌మీద నిఘా, పర్యవేక్షణ ఎక్కువ చెయ్యాలి. ు పల్స్‌పోలియో స్థాయిలో ఈ అంశం మీద పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలి. ు ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియాలోను, ప్రభుత్వ మీడియాతోను లింగనిర్ధారణ పరీక్షలు నేరమని, పరీక్షలు చేసి బిడ్డ సెక్స్‌ చెప్పేవారు శిక్షార్హులని ప్రచారం చేయాలి. ు ఈ నేరాలకు పాల్పడిన వైద్యులు లైసెన్సులు రద్దు చేసి వారిని శిక్షించాలి. ు నేరాలకు పాల్పడిన స్కానింగ్‌ సెంటర్‌లను రద్దుచేసి, శిక్షలు విధించాలి. ఇంకా చాలా అంశాలమీద చర్చలు, తీర్మానాలు జరిగాయి. ఈ తీర్మానాలను ప్రభుత్వానికి సమర్పించడం జరుగుతుందని, ఈ సమావేశంలో పాల్గొని అర్ధవంతమైన చర్చని నిర్వహించిన ప్రతినిధులందరికీ ధన్యవాదాలు చెప్పారు సత్యవతి. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని పాక్షికంగా స్పాన్సర్‌ చేసిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, బాగ్‌లింగంపల్లి మేనేజరుకి కృతజ్ఞతలు తెలియచేసారు. ఉపన్యాసాలిచ్చిన వారందరికీ పేరు పేరుగా కృతజ్ఞతలు తెలియచేయడంతో ఆనాటి సభ ముగిసింది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.