ఆహ్వానం
Posted By భూమిక on June 5, 2007
- వత్సల
రా! నేస్తం రా!
నీకిదే నా తుది
ఆహ్వానం-
నా
జీవితానికోవైపు
జీవచ్ఛవానికోవైపుగా
జరుగుతున్న దహనకాండలకి
నా తల్లికి
కన్న వాడొకడు
కట్టుకున్నవాడొకడు
ఏదో ఐన మరొకడు కలసి
గోతిని తవ్వారు
నన్ను
ప్రేమించిన వాడు
పెళ్ళాడిన వాడు
వాడి తండి
అనబడే అన్యుడొకడు కలసి
చితిని పేర్చారు
ఇక్కడున్న దంతా నా వాళ్ళే
లేనిది నీఒక్కడివే
అందుకు నీకు నాప్రత్యేక ఆహ్వానం
గోతి మీద మన స్నేహపు పరిమళాలను
వెదజల్లుతూ రా….
చితిలోకి ఓ మంచి గంధపు ముక్కను
బహుమతిగా తీసుకురా…
Comments
Leave a Reply