విప్లవం మధ్యలోంచి రాయటం

మంజుశ్రీ థాపా (నేపాల్‌)
అనువాదం: ఓల్గా

2005 ఫిబ్రవరిలో రాజు జ్ఞానేంద్ర హఠాత్తుగా చట్టవిరుద్ధంగా ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని రద్దుచేశాడు. ఆ చర్య ద్వారా ఆయన అనుకోకుండా డెమోక్రాట్లు సంఘటితమవటానికి సహాయపడ్డాడు. అంతకు ముందు వాళ్ళు పరమ అరాచకంగా ఉన్నారు. రచయితలు భావ ప్రకటనా స్వాతంత్రం గురించి ఎంత నిబద్ధతతో ఉన్నారనే దానికి యిదొక పరీక్ష పెట్టింది.

నేపాల్‌ ప్రజాస్వామిక విప్లవానికి 75 సంవత్సరాల వయసు. మొదట ఈ విప్లవం 40వ దశాబ్దంలో శక్తి సంపాదించుకుంది. అప్పుడే అనేక దక్షిణాసియా దేశాలు స్వాతంత్రోద్యమాల వూపులో ఉన్నాయి. 1950లో నేపాల్‌ ప్రజాస్వామిక విప్లవం విజయవంతమయింది. కానీ పది సంవత్సరాల తర్వాత 1960లో మొదటి దశలోనే రాచరికపు కుట్రకు అది అంత మయింది. 1980 వ దశాబ్దంలో ప్రజాస్వామిక విప్లవం మళ్ళీ ప్రజ్వలించింది. 1990లో విజయవంతమై మళ్ళీ 15 సంవత్సరాల తర్వాత 2005లో మళ్ళీ రాచరికపు కుట్రను ఎదుర్కొంది.

కానీ ఈ సారి మాకు పూర్వానుభవం ఉండటం వల్ల ఏం చెయ్యాలో మాకందరికీ తెలిసింది. కుట్ర జరిగిన రోజు వందలాది రాజకీయవేత్తలను అరెస్టు చేశారు. కానీ వేలాది మంది అజ్ఞాతవాసానికి వెళ్ళి భద్రంగా సంఘటితపడ్డారు. విదేశాలతో సంబంధా లున్న అసమ్మతివాదులు వెంటనే దేశాన్ని వదిలి వెళ్ళారు. అజ్ఞాతంలోని నేపాల్‌కి ఢిల్లీ కేంద్రంగా మారుతుందని స్పష్టమయింది. ఆ తొలి రోజుల్లో నేనూ ఢిల్లీ వచ్చాను. అప్పుడు రాచరికం పత్రికా కార్యాలయాల్లో టెలిఫోను వైర్లు పీకిపడేసి మిలటరీని దింపింది. దాంతో నాకు భారతీయ పత్రికల్లో, అంతర్జాతీయ పత్రికల్లో రాసే అవకాశం వచ్చింది. కానీ నేపాల్‌ లోనే ఉండిపోయిన రచయితలు కూడా సెన్సార్‌షిప్‌ని తప్పించుకుని రాసే మార్గాలు, ఉపాయాలు కనిపెట్టి వృద్ధి చేశారు. కుట్ర జరిగిన తర్వాత రెండువారాలపాటు అన్ని పత్రికలు నియమాలను పాటించాయి. ఆ తర్వాత దేశాంతర సంపాదకులు సెన్సార్‌కు గురైన రచనలు ప్రచురించాల్సిన చోట్ల ఖాళీ స్థలాలుంచి ప్రచురించటం మొదలు పెట్టారు. మిలిటరీ విరుచుకుపడ్డాక మిగిలిన పత్రికల సంపాదకులు అర్థంపర్థం లేని అబ్సర్డ్‌ సంపాదకీయాలు రాయటం మొదలు పెట్టారు. “ఖాట్మండ్‌ పోస్ట్‌” అనే పత్రిక ఎగతాళి చేస్తున్నట్లుగా “మేజోళ్ళు-సమాజం” అనే సంపాదకీయం రాసింది. చాలా మంది యిలాగే ఆలోచనతోకూడిన, బరువైన శీర్షికలతో పూర్తిగా అసందర్భమైన మేజోళ్ళ వంటి విషయాలమీద రాశారు. “ది నేపాల్‌ టైమ్స్‌” చెట్లు పడిపోవటాన్ని వ్యతిరేకిస్తూ సుదీర్ఘ సంపాదకీయం రాసింది. చెట్లు నేపాలీ కాంగ్రేస్‌ పార్టీ ఎన్నికల గుర్తు. “సమయ్‌” ఇంకా తిరస్కారాన్ని చూపింది. కుట్రకు వ్యతిరేకంగా కోఫీ అన్నన్‌ యిచ్చిన స్టేట్‌మెంట్‌ను ప్రకటించింది. రాచరికం ప్రశ్నించి సంజాయిషీ అడిగినపుడు సంపాదకుడు “ఐక్య రాజ్య సమితిని సెన్సార్‌ చేయటం సాధ్యం కాదని” సమాధానం యిచ్చాడు.

అన్ని వైపులనుంచీ యిలాంటి ప్రయత్నాలు రాచరిక పాలనను చుట్టు ముట్టాయి. చివరకు ప్రజా ప్రతినిధుల సభ మీద నిషేధాన్ని ధిక్కరిస్తూ పౌర సమాజ ఉద్యమం (స్వతంత్ర కార్యకర్త గ్రూపు, నేపాల్‌ను ప్రజాతంత్ర దేశంగా మార్చే ఎజెండాతో యేర్పడింది) వీధిలో కవి సమ్మేళనాలను నిర్వహించటం మొదలు పెట్టింది. అర్జున్‌ పరాజుని వంటి రచయితలను, రచయిత్రులను కవిత్వం చదివేందుకు వీధుల్లోకి రమ్మని ఆహ్వానించింది. కవిత్వాన్ని ప్రేమించే ప్రజలందరూ గుంపుగా కవులను వినటానికి చేరగానే, రాచరికం బీటలు వారక తప్పలేదు. ప్రజా సంబంధాలు భారీగా దెబ్బతిన్నాయి. ఎందుకంటే ఒక రాజు కవులకూ, కవిత్వాన్ని వినేవాళ్ళకు భయపడ్డాడంటే యిక అతన్ని చూసి నవ్వక ఏం చేస్తారు. త్వరలోనే బైరాగి కైన్‌లా యింకా యితర రచయితలూ సాహిత్యపరమైన ప్రతిఘటనలు మొదలు పెట్టి తాము కోల్పోయిన చోటుని అడగసాగారు.

రచయితలు కేవలం బహిరంగ చర్యలతోనే ఆగిపోలేదు. గత కొన్ని సంవత్సరాలుగా కొత్త నేపాల్‌ రూపకల్పనకు యుద్ధం జరుగుతూనే ఉంది. దానిలో రచయితలు ప్రజాతంత్ర నేపాల్‌ సాధ్యమనీ, దానిని కోరుకోవాలని చెప్పటంలో ఎంతో సహయం చేశారు. 2004లో పూర్ణ బిరామ్‌ రాచరికానికి వ్యతిరేకంగా కవిత్వం చదివితే ఆయనను మూడు నెలల పాటు మిలటరీ నిర్బంధంలో ఉంచారు. అక్కడ పరిస్థితులు హింసతో కూడివుంటాయని చెప్పక్కర్లేదు. 2005 సగానికొచ్చే సరికి రాచరికానికి వ్యతిరేకంగా రాయటం, బహిరంగా దానిని చదవటం సర్వ సాధారణమయింది. “ఫర్‌గెట్‌ ఖాట్మండు” అనే పుస్తకాన్ని నేనీ యుద్ధంలో భాగంగానే చూస్తాను. అది మన గురించి మనం ఆలోచించుకునే విధానాన్నే మార్చేసింది. ఐతే అన్ని చరిత్ర పుస్తకాల్లాగానే అదీ పాక్షికంగా ఉండొచ్చు, దాన్ని ఎవరైనా సవాలు చెయ్యొచ్చు కానీ అది ప్రజలు చరిత్రను అర్థం చేసుకుని అనుభూతి చెందేదానికి ఒక పద్ధతిని యేర్పాటు చేసింది. మనకు పాఠాలలలో చెప్పే అధికారికమైన చరిత్రల కంటే యిది యిక్కడ భిన్నంగా ఉంటుంది.

రచయితలు మా ప్రజాతంత్ర పోరాటంలో ఈ విధంగా ముఖ్యపాత్ర పోషించారు. ఈ పోరాటంలో మీడియా అగ్రభాగాన నిలబడిందనే విషయాన్ని తప్పనిసరిగా నిత్యం గుర్తుంచుకోవాలి. కానీ సాహిత్య కారులు కూడా వారి సత్తా చూపించి, రాచరికాన్ని ఓడించటంలో సహయపడ్డారు. 2006లో జ్ఞానేంద్ర దిగిపోయాడు. బహుశ అతనే నేపాల్‌ చివరి రాజు.

దీని ఘనతంతా మనదేననుకోవటం చాలా బాగుంటుంది. ఇప్పడు మా నేపాలీయులకిదంతా సర్వసాధారణమయింది. అమెరికా, ఇంగ్లాండులలో నివసిస్తున్న వుదారవాద, వామపక్ష భావాలున్న నా స్నేహితులు జార్జి బుష్‌ని, టోనీ బ్లేయిర్‌ని తిడుతుంటే “మీకు తెలుసా? మాకు నచ్చని ప్రభుత్వం అధికారంలో ఉంటే దాన్ని మేం జస్ట్‌ పడగొట్టేస్తాం అంతే. అని సమాధానం చెప్పగలను.
ఐనప్పటికీ జ్ఞానేంద్ర కుట్రకు ముందు, ప్రజాస్వామిక రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నపుడు రచయితలు చాలా అరుదుగా నోరు విప్పేవాళ్ళు. అధికారికంగా సెన్సార్‌షిప్‌ విధిస్తే రచయితలు దానికి వ్యతిరేకంగా రాశారు. కానీ నేపాల్‌ అంతటా స్వేచ్ఛ ఉన్నపుడు రచయితలు తమను తాము సెన్సార్‌ చేసుకుంటారు.

1996లో మావోయిస్టులు సాయుధ పోరాటం ప్రారంభించారు. వాళ్ళు చేసిన ఘాతుకాలు, ప్రతీకారంగా ప్రభుత్వం చేసిన యుద్ధ నేరాలు, రాజకీయాలలో పెరిగిపోతున్న అప్రజాస్వామిక ధోరణులు యివన్నీ ఆ కాలంలోని సాహిత్య ప్రాంతం బయటే ఉండిపోయాయి. ఖాగేంద్ర సంగ్రేల వంటి కొద్దిమంది రచయితలు పత్రికలలో తమ అభిప్రాయ ప్రకటనలు చేశారంతే. బిమల్‌ నిభా మీడియాలో వ్యంగ్య రచనలు చేశాడు. నేను కూడా పత్రికల్లోనే మానవ హక్కుల ఉల్లంఘన గురించి రిపోర్టులు రాశాను. 2004లో గోవింద బర్తమాన్‌ అనే రచయిత యుద్ధ యాత్రావిశేషాలు “సొహ్రా సంర్‌­” అనే పేరుతో రాశాడు. పూర్ణబిరామ్‌ వంటి రచయితలు రాచరికానికి వ్యతిరేకంగా రాశారు. కానీ ప్రజాతంత్ర ప్రభుత్వాన్నని చెప్పుకునే ప్రభుత్వం తయారు చేసే ప్రజా వ్యతిరేక పాలసీలకు వ్యతిరేకంగా నోరు విప్పిన రచయితలను, కవులను వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. 1990వ దశాబ్దపు సాహిత్యాన్ని చదివితే దేశం యుద్ధంలో ఉందని మనకు తెలియను కూడా తెలియదు. నారాయణ్‌ వాగ్లే రాసిన నవల “పల్‌పాసా కేఫ్‌” (2005) మొదటి యుద్ధ నవల అని చెప్పవచ్చు.

ఈ స్వయం సెన్సార్‌షిప్‌కు సగం కారణం భయం. మావోయిస్టులు గానీ మిలటరీ గానీ దాడి చేస్తుందనే భయం. రెండూ కిరాతకంగానే ఉన్నాయి. అజ్ఞానం కూడా కొంత కారణం. మావోయిస్టు దాడులు, ప్రభుత్వ ప్రతి దాడులు చాలా క్రూరంగా ఉండేవి. అరణ్య ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో అక్కడికి వెళ్ళటానికి రచయితలెవరూ సాహసించరు. (వాళ్ళు నగరాలలోనే ఉండటానికిష్టపడతారు) వీటన్నిటికంటే ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని విమర్శిస్తే అది అప్రజాస్వామిక శక్తులను – మావోయిస్టులు లేదా మిలటరీ – బలపరుస్తుందనే ఆలోచన ఎక్కువ పని చేసింది. జర్నలిస్టులు, సంపాదకులు ఈ భయం నుంచి బైటపడిన చాలా కాలం తర్వాత అతి కొద్ది మంది రచయితలు ప్రజాస్వామ్య ప్రభుత్వం పేరుతో మిలటరీ చేసే చట్టవిరుద్ద మైన నిర్బంధాల గురించి, అరెస్టుల గురించి, హింస గురించి, లైంగిక అత్యాచారాల గురించి, హత్యల గురించి, మనుషుల్ని మాయం చెయ్యటం గురించీ రాశారు.

ఈ రకమైన నిశ్శబ్దమే రాజు కుట్రకు పాల్పడేలా చేసింది. ఈ నిశ్శబ్దమే మిలటరీ ఘాతుకాల వల్ల బాధితులైన వారు మావోయిస్టుల పక్షం చేరి, వారిని బలపర్చ టానికి దారితీసింది. ఈ నిశ్శబ్దమే మిలటరీ తాము చేసిన కిరాతకాలకు ఎలాంటి శిక్షా అనుభవించకుండా తప్పించుకునేలా చేసింది. మిలటరీని చట్టానికి అతీతంగా చేసిందీ ఈ నిశ్శబ్దమే. చివరకు మిలటరీ సహాయంతో జ్ఞానేంద్ర ఈ కుట్ర చేయగలిగాడు.

ఇప్పుడు ప్రజాస్వామ్మం పునరుద్ధరింప బడి సంవత్సరం గడిచిన తర్వాత, అతి సున్నితమైన శాంతి ప్రక్రియల మధ్య మళ్ళీ మాకు ఆ ప్రశ్నే ఎదురవుతోంది. అధికారంలో రాజవంశం కాకుండా ప్రజాస్వామిక ప్రభుత్వం ఉండి అది తప్పులు చేస్తుంటే మనం గొంతు విప్పాలా లేదా?
విమర్శించటానికి ఎన్నో విషయా లున్నాయి. సంతకం చేసిన శాంతి ఒప్పందంలో ఎన్నో పొరపాట్లున్నాయి. మధ్యంతరంగా ఏర్పడిన రాజ్యాంగం నియంతృత్వ పద్ధతిలోనే ఉంది. అందులో అన్ని పాలన పరమైన, న్యాయ పరమైన అధికారాలూ ప్రధానమంత్రికే చెందేలా ఉంది. మిలటరీ గానీ మావోయిస్టులు గానీ యుద్ధకాలంలో చేసిన ఒక్క ఘాతుకానికి కూడా సమాధానం చెప్పుకోనవసరం లేకుండా పోయింది. అదృశ్యమైపోయిన 800 మంది జాడ తెలియలేదు. అన్ని వివరాలు, సాక్ష్యాధారాలు వున్న కేసులు, ఉదాహరణకు మైనా సున్వార్‌ అనే 15 సంవత్సరాల వయసున్న అమ్మాయి సైనిక నిర్బంధంలో హత్యకు గురైన కేసు వంటి వాటిని కోర్టుకు తీసుకెళ్ళలేదు. మానవహక్కుల హైకమిషన్‌తోపాటు అనేక హక్కుల సంస్థలు ఎన్నో సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదు. మదేష్‌, జనజాతి ఉద్యమాలలో మనందరం చూశాం. రాజకీయాలలో అన్ని వర్గాల, కులాల ప్రజలను భాగస్వాములుగా చేయాలని అందరిలో వ్యాపించిన, అందరూ కావాలను కుంటున్న డిమాండ్‌ను రాజకీయ పార్టీలు వ్యతిరేకించి వెనక్కు నెడుతున్నాయి. రాజకీయాలు ప్రస్తుతం అగ్రకులాల వారి గుత్తాధిపత్యంలోనే ఉన్నాయి. ప్రభుత్వ ఎజెండాలో స్త్రీల హక్కులు ఎక్కడో అట్టడుగున ఉన్నాయి.

నేపాల్‌ని మారుస్తామని చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటంలో ప్రజాస్వామిక ప్రభుత్వం రోజు రోజుకీ విఫలమవుతోంది. మళ్ళీ జర్నలిస్టులకూ, సంపాదకులకు గొంతు విప్పటం ప్రమాదమని అనిపిస్తోంది. ఎందుకంటే మితవాదులు ఏ చిన్న అపజయాన్నయినా కారణంగా చూపి లాభం పొందాలని చూస్తున్నారు. ముఖ్యంగా మిలటరీలో ఉన్నతాధికారులు రాచరికాన్ని గట్టిగా బలపర్చేవారే. ఇది కొత్తేం కాదు. అందరూ ఊహించినదే. విప్లవ కాలంలో ఎక్కడైనా, విప్లవ వ్యతిరేక శక్తులు సమయం కోసం ఎదురు చూస్తుంటాయి. మావో యిస్టులు కూడా ప్రజాస్వామిక రాజకీయాలకు పాక్షికంగానే కట్టుబడ్డారు. ఎప్పుడైనా యుద్ధం మొదలు పెట్టవచ్చు. ఇప్పుడదే భయం. ప్రజాస్వామిక వాదుల పొరపాట్లు, అపజయాల గురించి మాట్లాడితే మనం ప్రజాస్వామ్యానికి “శత్రువులం” అయిపోతాం.

కాబట్టి యివాళ పత్రికలలో, సాహిత్య వర్గాలలో ప్రజాస్వామ్యాన్ని గట్టిగా బలపరిచి ఆకాశానికెత్తటమే కనిపిస్తుంది. ఐతే ఈ ప్రవాహానికి ఎదురీదే వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ పత్రికలు మాత్రం విమర్శించటంలో అతి సున్నితంగా వ్యవహరిస్తున్నాయి. ఏ సమస్యలూ రాకుండా చూడటానికే సుముఖంగా ఉన్నాయి. పత్రికలలో వచ్చే రిపోర్టులు పక్షపాత ధోరణిలో రాజకీయంగా ఒక వర్గానికి కొమ్ముకాసేలా ఉన్నాయి. స్వీయ సెన్సార్‌షిప్‌ అమలవుతూ “చెడ్డ” వార్తలను పైకి రాకుండా అణిచి చేస్తున్నారు. కానీ ఒక భయపూరితమైన, “విచ్‌ హంటింగు” వాతావరణం ఉంది. డెమోక్రాట్లను మరీ ఎక్కవ విమర్శిస్తే మావోయిస్టులని గానీ, రాచరికవాదులని గానీ, విప్లవకారుడనో, రెచ్చగొట్టే వారి ఏజంటనో, మరీ ఘోరంగా, ఇండియన్‌ ఏజంటనో, సిఐఎ మొక్క అనో అంతర్జాతీయ సమూహం చేతిలో పావు అనో ముద్రపడే ప్రమాదం ఉంది.

మనందరం యింకా ప్రజాస్వామిక విప్లవం మధ్యలో ఉన్నామని గుర్తుంచుకోవటం చాలా ముఖ్యమని నేననుకుంటున్నాను. మనందరం యింకా మూడవ ప్రజాస్వామిక పోరాటాన్ని విజయవంతం చేయటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. విప్లవం జరిగేటపుడు రాయటంలోని ప్రమాదాన్ని మనందరం గుర్తించుకోవాలి. మనం రాసే ప్రతి మాటా రాజకీయం చేయబడుతుంది. ప్రతి నిబద్ధత ప్రశ్నించబడుతుంది. మాట్లాడటానికున్న ఆటంకాలను అధిగమించటమే యిప్పుడు రచయితల ముందున్న సవాలు. ఎందుకంటే హాని చేసేది మాటలు కాదు, నిశ్శబ్దమే! గతంలో కూడా ఈ నిశ్శబ్దమే నాశనాన్ని తెచ్చింది. ఆ నిశ్శబ్దమే మళ్ళీ వినాశనకారి కావచ్చు.

Share
This entry was posted in అనువాదాలు, వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.