2011 కథ, వ్యాసం, కవితల పోటీ బహుమతుల ప్రదానోత్సవం

భూమిక
భూమిక 2011లో నిర్వహించిన కథ, వ్యాస, కవితల పోటీలో విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమం శుక్రవారం నాంపల్లి గగన్‌విహార్‌లోని ఏ.పి హిందీ అకాడమీలో జరిగింది.

భూమిక స్త్రీవాద పత్రిక ఎడిటర్‌ కొండవీటి సత్యవతి సభను ప్రారంభించారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్‌ ఎపిసెన్సెస్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌ వై.వి. అనూరాధ, ఐ.ఎ.ఎస్‌ మాట్లాడుతూ, స్త్రీల సమస్యలను సమాజానికి తెలియజేస్తూ వాటి పరిష్కారానికి అక్షర రూపంలో ముందుకు వెళ్తున్న పత్రిక, భూమిక స్త్రీవాద పత్రిక అని కొనియాడారు. స్త్రీల అభ్యుదయానికి ఆత్మవిశ్వాసానికి పాటు పడే పత్రికగా ముద్రపడిన ఈ పత్రిక ఇలా ప్రతి ఏటా కొత్త కొత్త రచయితలను ప్రోత్సహించి వెలుగులోకి తీసుకురావడం బాగుందన్నారు. స్త్రీల చట్టాల గురించి ప్రభుత్వ పథకాల గురించి, వాటిలోని అవకతవకలను పాఠకులకు వివరంగా తెలపాలని కోరారు. ఎన్ని బాలికా దినోత్సవాలు జరిగినా, ఎన్ని మహిళా దినోత్సవాలు నిర్వహించినా, ప్రతి చోటా స్త్రీ జనాభా పురుష జనాభా కంటే తక్కువగా ఉండటం బాధాకరమన్నారు. ఈ పోటీలో ‘మాయమౌతున్న ఆడపిల్లలు- మన కర్తవ్యమేమిటి…? అనే వ్యాసంలో ఎందుకు మిస్సింగ్‌..? ఎక్కడికి మాయమై పోతున్నారు ఈ స్త్రీలు..? అనే అంశం ఎంతో బాగుందన్నారు. స్త్రీలకు బతకడం కాదు జీవించడం నేర్పాలన్నారు. ఎ.పి మహిళా కమీషన్‌ సెక్రెటరీ సి. సరళా రాజ్యలక్ష్మి మాట్లాడుతూ మహిళలకు అన్ని విషయాలపై చైతన్యం తీసుకు వచ్చే సాహిత్యం మరింత రావాల్సిన అవసరం ఉందన్నారు.
ఎ.పి.మహిళా సమతా ప్రాజెక్టు డెరెక్టర్‌ ప్రశాంతి మాట్లాడుతూ, భూమికకు తన వంతు సాయం చేస్తానన్నారు. కస్తుర్బా బాలికలకు కౌన్సిలింగ్‌ చేసే సంఘం మహిళలకు శిక్షణనిచ్చిన కొండవీటి సత్యవతిగారిని ఎంతగానో కొనియాడారు.
విజేతలకు నగదు, మెమొంటోలను ముఖ్య అతిధులు అందజేశారు. కథా విభాగంలో మొదటి బహుమతిని హైదరాబాద్‌కు చెందిన వి.మధుమతి, రెండవ బహుమతిని భువనేశ్వర్‌కు చెందిన బి. బాలాదేవి అందుకున్నారు.
వ్యాసం విభాగంలో మొదటి బహుమతిని సికింద్రాబాదుకు చెందిన డా. నళిని, రెండవ బహుమతిని కామారెడ్డికి చెందిన డా. జి. లచ్చయ్యగారు గెలుచుకున్నారు. కవితల విభాగంలో మొదటి బహుమతిని కర్నూల్‌కు చెందిన డి. గాయత్రి, రెండవ బహుమతిని హైదరాబాదుకు చెందిన సి.హెచ్‌.సుజాత సాధించుకున్నారు.
బహుమతులను స్పాన్సర్‌ చేసినవారు చాలామందే వున్నారు. ముఖ్యంగా వీరికి ధన్యవాదాలు తెలపాలి. డా. భార్గవీరావుగారు మన మధ్యలో లేరు గాని వారి భర్త ప్రభంజనరావుగారు ప్రతి సంవత్సరం కథ విభాగంలో మొదటి బహుమతిని భార్గవీరావుగారి పేరు మీద ఇస్తున్నారు. అలాగే ఆరి సీతారామయ్యగారు, యు.ఎస్‌.ఏ ప్రతి సంవత్సరం కొత్తవారిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో డబ్బు పంపిస్తున్నారు. అలాగే ఎం. హేమలతగారు, వై.వి. రమణారావుగారు, గుంటూరు, శాంతసుందరిగారు, సమతారోష్ని, శిలాలోలిత, అనూరాధగార్లు బహుమతులను స్పాన్సర్‌ చేసారు. జ్యూరీగా వ్యవహరించిన సుజాతరెడ్డిగారు, సుజాతామూర్తిగారు, ప్రతిమ, పి. సత్యవతి, సుజాతపట్వారి, శిలాలోలిత, అబ్బూరి ఛాయాదేవిగార్లకు కృతజ్ఞతలు తెలిపారు సత్యవతి. అలాగే జ్యూరీ ప్రత్యేక బహుమతిని వారణాసి నాగలక్ష్మి స్పాన్సర్‌ చేశారు. బహుమతుల ఎంపిక విషయా లను గురించి డా. శిలాలోలిత వివరించగా డా. సమతారోష్ని వందన సమర్పణను చేయడంతో ఆనాటి సభ ముగిసింది.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో