క్లాస్‌ఫోర్‌ మహిళలు మాతో సమానులా!

జూపాక సుభద్ర
మా సెక్రెటేరియట్‌లో దాదాపు 20 సం|| నుంచి రెండు సామాజిక వర్గాల మహిళా ఉద్యోగుల మధ్య నలుగుతున్న సంగతి.

ఏంటంటే సచివాలయ మహిళా సంక్షేమ సంగంలో మేము కూడా భాగమే అని క్లాస్‌ఫోర్‌ వుమెన్‌ ఎంప్లాయీస్‌ వాదిస్తూ మమ్మల్ని కూడా సచివాలయ మహిళా ఉద్యోగులుగానే గుర్తించాలని మా సమస్యలు కూడా పరిష్కరించాలని కోరుతున్నరు కాని సచివాలయ మహిళా సంక్షేమ సంగంలో టైపిస్టు నుంచి డి.ఎస్‌, అడిషనల్‌ సెక్రెటరీ దాక వున్న మహిళా ఉద్యోగులు మాత్రమే సభ్యులుగా వున్నారు. అటెండర్లు, సీపర్లు, రికార్డు అసిస్టెంట్స్‌గా వున్న మహిళలు సభ్యులు కాదు అని బైలాలో పెట్టుకున్నారు. నిజానికి ఆ సచివాలయ మహిళా సంక్షేమ సంగం ఏర్పడింది క్లరికల్‌ ఎస్సీ మహిళా ఉద్యోగితోనే. బైలా తయారు చేసేప్పుడే పెద్ద గొడవ జరిగింది. ఎందుకు చేర్చొద్దు అంటే స్వీపర్లు, అటెండర్లంతా ఎస్సీ, ఎస్టీ, బీసి (చాలా తక్కువ) మహిళలే వుంటారు. వాళ్లు చాలా చిల్లర గొడవలన్నీ తీసుకొస్తరు డీసెంటుగ వుండరు చాలా తలనొప్పులుంటాయి ఆ చిల్లర గొడవలన్నీ తీర్చలేము, అసోసియేషన్‌ డిగ్నిటీ పోతుందనీ, రిజిస్టర్డ్‌ సంక్షేమ మహిళా సంగంలోని ఆధిపత్య కులం మహిళా ఉద్యోగులు వాదిస్తుంటరు. రేపు మేము కూడా పోటీ చేస్తమంటరు మనతో సమానంగా. యిది తట్టుకోగలమా!
యీ నాల్గవ తరగతి మహిళా ఉద్యోగులేమంటారంటే ‘మీరు సచివాలయ మహిళా సంక్షేమ సంగం’ అని పెట్టుకున్నారు. మేము కూడా సచివాలయ మహిళా ఉద్యోగులమే. మీరు ఏ మహిళా అనేది వివరణ పెట్టుకోలేదు. అందికే మేమడుగుతున్నం. సంగం మాది కూడా మాకు సభ్యత్వమివ్వాలె, మా సమస్యల్ని కూడా తీసుకోవాలి ప్రతి మీటింగుకి మమ్మల్ని కూడా పిలవాలె అని అడిగిండ్రు
నిజానికి సెక్రెటేరియట్‌లో అన్ని క్యాటగిరీల మహిళా ఉద్యోగులు దాదాపు 900 అయితే వీరు 200 మంది దాకా వుంటారేమో. యీ గొడవ అంటే మేము కూడా సెక్రెటేరియట్‌ మహిళలమే మమ్మల్ని గూడ సభ్యులుగా చేర్చాలి లేదా సచివాలయ మహిళా ఉద్యోగులనే పేరు మార్చుకోండ్రి. యీ వాదనని సెక్రెటేరియట్‌ ఎస్సీ ఎస్టీ మహిళలు (అన్ని క్యాటగిరీలు) మగవాల్లు సపోర్టు చేస్తున్నరు కాని అగ్రకులాల, బీసీ మహిళలు (కొందరు) ససేమిరా అంటున్నరు. మనకన్నా చిన్న క్యాడర్‌ వూడిచే వాల్లు ఫైల్లు మోసుకొని తిరిగేవాల్లు, మన ఛాయ్‌ కప్పులు కడిగేవాల్లు, చదువులేని వాల్లు, మోటుగాల్లు చిల్లర మనుషులు అట్లాంటి ఆడవాల్లకు మనతో సమానంగా సభ్యులుగా చేర్చుకుంటే మన అసోసియేషన్‌కి చాలా ప్రాబ్లమ్స్‌ వస్తయి. రేపు మేం సభ్యులం గనక అసోసియేషన్స్‌లో పోటీ చేస్తరు, మనతో సమానంగా స్టేజీల మీద కూర్చోబెట్టాలా! ఆఫీసరు అటెండరును ఒకే గాట కడ్తామా! సరే సభ్యులుగా చేర్చుకుంటే ఎన్నికల్లో పోటీ చేయం, మీతో సమానంగా కూర్చోము ‘అని రాసివ్వమనండి’ అని ఒక క్లర్కమ్మ అంటది. ‘వాళ్లు ఎన్నికల్లో నిల్చుంటే నిలుచోనిద్దాం, పోటీ చేస్తే చేయనిద్దాం, మనం వాల్లకు ఓటెయ్యకుంటే సరి’ యింకో ఆఫీసరమ్మంటది.
వాల్లు స్వీపర్లు, తోటమాలీలు, అటెండర్లనే క్యాడరుగానే కాదు వాల్ల కులంవల్ల కూడా వాల్లను మనతో సమానంగా చేర్చుకోవడంలేదు ఒక ఎస్సీ మహిళాఫీసరు. ‘అదేంటి?’ మీ కులాల వాల్లు మా క్యాడర్‌లో వున్నారు మిమ్మల్ని తీసేయలేమా’ ఒక అగ్రకుల సీమాంధ్ర మహిళా క్లర్కు.
పై క్యాడర్‌లో మేముండడమంటే రాజ్యాంగబద్దంగా ఆధునిక ప్రజాస్వామ్యం వల్లనే మీరు మమ్మల్ని తీసేయలేక పోతున్నరు. మేము సాంఘికంగా సమానమైంది యెక్కడ? ఉద్యోగపరంగా మీతో సమానంగా వుంది రాజ్యాంగపరంగనే. లేకుంటే క్లాసుఫోర్‌ మహిళా ఉద్యోగుల్లాగనే మమ్మల్ని తరిమే వాళ్లే’ ఒక ఎస్సీ ఆఫీసరమ్మ. యీ చర్చంత మొన్నామధ్య జరిగిన మహిళా ఉద్యోగుల సంగం జనరల్‌ బాడీ మీటింగులో జరిగింది. క్లాస్‌ఫోర్‌ మహిళా ఉద్యోగుల్లేకుండానే వారి ప్రాతినిధ్యాలు, వారి గొంతులు, వాదనలు లేకుండానే ముగిసింది. వాల్లను కూడా పిలవాల్సింది, వాల్లు లేకుండా వాల్లమీద చర్చేంటి? అంటే ‘వామ్మో వాల్లొస్తే యింకేముంది? అయినా వాల్లు మన మెంబర్స్‌ కాదు ఎందుకు పిలుస్తామ్‌, పిలిస్తే చిల్లర సంతయితది’ అని క్యాడర్‌ పేరుతో పై కులాల అహంకారాన్ని ప్రదర్శించారు.
సచివాలయ మహిళా ఉద్యోగుల సంక్షేమ సంగం స్థాపించి ప్రసిడెంటుగా వున్నకాలంలో (యీ వ్యాసకర్త) క్లాస్‌ఫోర్‌ మహిళా ఉద్యోగులు యధేచ్ఛగా మీటింగుల్లో పాల్గొనేవాల్లు. వారి సమస్యల మీద కూడా పంజేయడం జరిగింది. కాని తర్వాత వచ్చిన ప్రసిడెంటు అగ్రకులాల మహిళాఫీసరు కాలంలో క్లాస్‌ఫోర్‌ మహిళల్ని సభలకు రానివ్వని ఆంక్షలు మొదలైనయి. మహిళల విముక్తి దిశగా పయనించే రోజు అని అనుకునే మార్చి ఎనిమిదిన జరిగిన మీటింగులో యిచ్చిన లంచ్‌లో క్లాసుఫోర్‌ మహిళా ఉద్యోగులు తింటున్న కంచాలు గుంజుకొన్న గాయాలు, గేటుదగ్గర నిలుచొని వారిని వెళ్లగొట్టిన అవమానాలున్నయి. యీ విషయమ్మీద యీ మహిళలంతా ఆ ప్రసిడెంటుమీద పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది.
సచివాలయంలో ప్రధానమైన ఉద్యోగుల సంగంలో యిప్పటిదాకా (యీ వ్యాసకర్త తప్ప) ఒక్క మహిళా ఉద్యోగి కూడా ఎన్నికల్లో నిలుచొని గెలవలేక పోయింది. ఉద్యోగ సంఘాల్లో అంతా మగ ఉద్యోగులే నాయకులు. అట్లనే క్లాస్‌ఫోర్‌ అసోసియేషన్‌లో కూడా ఒక్క ఆడనలుసు లేదు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్డర్స్‌ జారీ చేసే సెక్రెటేరియట్‌ లోనే యింత జెండర్‌ వివక్షలు, జెండర్‌లో జెండర్‌ అణిచివేతలుండడం అప్రజాస్వామ్యం.
అంతా ఆడొల్లమే కదా అనుకున్నా క్యాడర్‌ పేరుతో అగ్రకుల ఆడవాల్లు తమ సంగం లోనికి రానియట్లేదు, ఒకే క్యాడర్‌ అనుకున్న క్లాస్‌ఫోర్‌ మగవాల్లు నిరాకరిస్తున్నరు. యీ పరిస్థితుల్లో క్లాస్‌ఫోరు మహిళా క్యాడర్‌ ‘వాల్ల సంగంల, వీల్ల సంగంల ఎందుకు మనమే సంగం బెట్టుకొందామ్‌’ అని డిసైడ్‌ అయిండ్రు.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో