నాన్నా! అమ్మ గొంతు నులమకు….

సహచరి
నాన్నా! నేను నీ ప్రతిరూపాన్ని
మాట్లాడుతున్న…
నా కారణంగా అమ్మ గొంతు
నులిమి చంపిన తల్లి కడుపులోని
పసిగుడ్డును మాట్లాడుతున్న…
మళ్ళీ! ఆడపిల్లనే కనబోతుందని
నా తల్లి గొంతు నులిమిన
నీ క్రౌర్యానికి, పుట్టకుండానే
అమ్మ కడుపులోనే
హత్య కావించబడుతున్న
పసిబిడ్డను మాట్లాడుతున్న!
నీకో మనసుంటుందని
మనసు పెట్టి వింటావని కాదు
నీలాంటి కొడుకుల్నీ కన్న తల్లుల

గర్భశోకం నీకు తెలియదు…
ఏ పాపం చేయని అమ్మను
నీ సకల భోగాలకు నలిగిపోయిన
పిచ్చితల్లి నీవల్లే గర్భం దాల్చిందని
నీ సె(ఎ)క్స్‌కు ప్రతిరూపమే నేనని
గుర్తించలేని నీ మూర్ఖత్వానికి
బలైపోతున్న పసిగొంతును!
అయినా… నిన్నని ఏం లాభం
నిన్ను కన్నదీ ఓ తల్లేనని
ఆ తల్లినీ హతమార్చగల
కిరాతకంగా నిన్ను మార్చిందీ
ఈ సమాజమేనని నువ్వూ
గుర్తించలేవు..
నీలాంటి కొడుకులంతా
ప్లెస్సూ మైనసుల్లా పిండాల్ని
స్కానింగులు చేస్తూ…
తల్లుల గర్భాల్ని ఛిద్రం చేస్తున్నారు!
దిక్కూ మొక్కూలేని పిండాల్లా
చెత్తకుండీలల్ల మురికి కాలువల్లో
కొట్టుకుపోతున్నాం!
తల్లి పేగు తెంచుకున్న
పసిపాపల ఆర్తనాదాలు
దేవుని గుళ్లో జోల పాటలై
తండాల్లో వేలం పాటల్లో
మాయమౌతున్నాయి!
నాన్నా! అమ్మ గొంతు నులమకు…
నీకు కొడుకు పుట్టాలన్నా
తల కొరివి పెట్టాలన్నా
అమ్మ బతికుండాలిగా!
(భూమిక నిర్వహించిన 2011 కథ, వ్యాసం, కవితల పోటీలో  ప్రత్యేక జ్యూరీ బహుమతి పొందిన కవిత)

సరగసీ
మొయిద శ్రీనివాసరావు
ఆ ఊర్లో అడుగుపెడితే చాలు
ప్రతీ ఇంటి గుండె గుమ్మానికి కొట్టిన
దారిద్య్రపు మేకుకు
”అమ్మకడుపు ఇక్కడ అద్దెకు ఇవ్వబడును”
అన్నబోర్డు వేలాడుతూ ఉంటుంది.
ఆకలి నోటికి నాలుగు నూకలకై
తల్లి కోడి విదేశీ బాతు గుడ్లను పొదగడానికై
కొన్ని నెలల కాలపరిమితితో
పేగు బంధపు ఒప్పందం చేసుకుంటుంది.
9వ నెల వరకే
ఆ ఇళ్లు సర్వాంగ సుందరం
ఖాళీ చేసినాక చూడాలి
పేగు తెగిన మౌనవేదనతో కన్నీటి పాటపాడుకుంటూ…
పెచ్చులూడిన గర్భాశయ గోడలతో
పెలుసుబారిన ఎముకల గూడై
కూలడానికి సిద్ధంగా ఉంటుంది.
ఆ ఇంటి అరుగులపై వాడెవడో తల్లి పేగును
నిట్టనిలువునా కోసి
తక్కెడలో వేస్తున్నాడు
అమ్మతనం కంటే అమ్మకానికే మొగ్గు చూపిన
బొడ్డు పేగును సైతం
బొల్లిగెద్దలా తన్నుకుపోతున్నాడు
పేదరికపు గుహల్లోంచి
అడుగులు వెయ్యాల్సిందే…!
ముడిచిన రెక్కలు విప్పి..విదిల్చి..పైకెగిరి
వాడి తలపై ఒక్క తన్ను తన్నడానికి
కాళ్ళకు కత్తులు కట్టాల్సిందే…!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో