మ…నం?!

– వత్సల

‘బచ్చీని’ చూడాలి…

ఎలాగయినా చూడాలి….. ఎలాగయినా సరే… తనని చూడాలి…. .

తనను చూడకుండా మాత్రం వెళ్ళకూడదు – ఎందుకంటే?… నేను మళ్ళీ ఈ ఊరు వస్తానో? రానో?…

ఒకవేళ రాలేకపోతే?… పోతే ఏమిటి? మళ్ళీ వద్దామనే?… ఛీఛీ… మళ్ళీ ఈ ఊరికి రావటమే?….

ఇలా…. అనుకుంటున్నా ఏమూలో తనని ఆ ఊరికి తిరిగి తీసుకొస్తారేమో?! అనే ఊహ కంపరం కలిగిస్తోంది. అనుమానం భయపెడుతోంది.మరి ఎలాగయినా- అందుకే ఇప్పుడు ఒకసారి తప్పకుండా – బచ్చీని చూసి వెళ్ళాలి. ఒకవేళ నేను కొంత కాలానికి బాగా ఉండగలిగితే…. మళ్ళీ ఇలాగే దొంగగా అయినే సరే తనను నాతో తీసుకు పోవాలి.

అబ్బ… ఈ ఆలోచన ఎంత బాగుంది – ఎంత అందంగా ఉంది – ఎంత హాయిగా ఉంది. ఇలాంటి ఆలోచనలు మనసులోకి రాగానే శ్యామలకు తను తీసుకున్న నిర్ణయం పట్ల మరింత బలం వచ్చింది.

అలా రావటమే ఆలస్యం – టీ బల్ల కింద గంట నుండి – నీళ్ళబాన వెనక్కి మునికాళ్ళ మీద గొంతుకూర్చుని ఉన్న శ్యామల – ఆ ఇంటి తలుపు తట్టింది –

కొట్టిన తలుపు తెరుచుకొనే లోపే –

తెరచుకున్న తన అనుభవం తలపులు…

కోటి ఆశలతో కాదుగానీ… కొన్ని ఆశలతో…

ఆరుమాసాల క్రితం… ఆ ఊర్లోకి కోడలిగా అడుగుపెట్టింది శ్యామల మొదటిసారిగా.

ఆ ఊరి బస్టాండుకు ఊరికి మధ్య ఓ ఫర్లాంగు దూరం.

బస్టాండులో మాత్రం అన్నీ హోటళ్ళులాంటివే ఉండేవి

లోపలికి రెండు గదులు, వాటి ముందు ఒక వసారా. బోదతోనో, ఈతాకు మండల తోనో కప్పబడి ఉండేవి. ప్రతీదీ రెండు బండ బేంచీలు, ఒకవైపుకు వంగిన టీ బల్లలు వాటికి రోడ్డు వైపుకు లోపలివి కనిపించకుండా చీకిపోయిన గోనెసంచులు కట్టి, లేకుంటే మేక మార్కు బీడి బొమ్మలున్న రేకులుకొట్టి – లోపల మాత్రం పెద్ద నీళ్ళబాన – ఉండేది.

పిండేసిన టీ పొడి, విస్తరాకులు, కడుగు నీళ్ళు పోయడానికి – మూతి కత్తిరించిన తీసేసిన నూనె డబ్బా – లేకపోతే ఇనుప బక్కెట్లు.

హోటలుకైతే ఖాళీ జెమిని టీ పొడి ప్యాకెట్లు తోరణాలుగా మెరిసేవి. షోడా షాపుల్లో రంగురంగుల నీళ్ళు కలిపిన సీసాలపై వరుసగా నిమ్మకాయలు పేర్చి, సిగరెట్‌ బంకులకయితే ఖాళీ సిగరెట్‌ ప్యాకెట్‌ కవర్లు, అక్కడక్కడా క్రిష్ణా టాకీస్‌లో ఆదివారం ఆడే సినిమా పోస్టర్లు అతికించబడి ఉండేవి.

ఇవన్నీ చూసి కొత్తవల్ల కాదుకానీ… ఎందుకో ఒకలా అనిపించింది. శ్యామలకు.

బహుశా ఇంకెప్పుడూ అక్కడే ఉండాలన్న ఆలోచన కాబోలు.

ఎవరు బస్కెక్కి బయట ఊర్లకి వెళ్ళా లన్నా కనీసం అరగంట ముందైనా వచ్చి ఏదో ఒక బండ బెంచీ మీద కూర్చోవాలి. అదే ఆడవాళ్ళయితే అందులోనే కొంత దూరంగా లోపలికి ఉండి, కాపురం కూడా అక్కడే ఉంటున్న మక్బూల్‌ హోటల్‌ దగ్గర కూర్చునే వాళ్ళు. అదే బస్సు దిగి ఊర్లోకి వెళ్ళేటపుడు ఏవైనా బరువులుండి రెండుసార్లు మోసు కెళ్ళాలన్నా అదే పరిస్థితి.

అలాంటి ఊరికి అందరు ఆడపిల్లలా్లగ వచ్చిన తనకు…

మొదట… కొత్తదనం

రెండవరోజు… భయం…

మూడవరోజు… అలవాటు-గా…

కష్టాలతో జీవితం మొదలైపోయింది.

‘ముచ్చుమొహం’ – అన్న అత్త బిరుదు…

‘వదిన నీలం చీర ఇవ్వనంటుందే’ – అన్న ఆడపడుచు ఫిర్యాదు

‘కాఫీలో ఇంత చక్కెర వద్ద…మ్మా’ మామగారి సన్నాయి నొక్కులు

అన్నింటిని మించి

‘అమ్మ చెప్పినట్లు విను’… అన్న మొగుడి సాదాసీదా…. సలహాలతో

సెప్టెంబరు చామంతులతో వచ్చిన తనకు – నీలం, లేత గులాబి రంగుల డిసెంబరాల పువ్వులు తను అక్కడికి వచ్చి మూడు నెలలయిందని గుర్తు చేశాయి.

కొత్త సంవత్సరం వచ్చింది కొత్త సమస్యతో… శ్యామలకి…

నెల తప్పడం రూపంలో… ‘కష్టాలకత్తుల’కు పదునొచ్చింది.

‘ముచ్చుదానా’ ఇట్రా అన్న సాత్వికమైన అత్తగారి పిలుపుతో దగ్గరకు వచ్చి నిల్చున్న శ్యామలతో…’తీయించేద్దామా’…. అంది.

ఓ క్షణం – మాత్రమే అయోమయం.

అందులో నుండి బయటకు వచ్చిన శ్యామల….

దృఢంగా, మెల్లగా ‘ఎందుకూ?’ అంది.

‘ఎందుకేమిటి? ఇప్పుడే పిల్లలెందుకు…?’

‘…’ మౌనం సమాధానం.

పలకవేంది? ఎద్దంత నువ్వు – ఎద్దుకాల్లో ముల్లంత వాడు – వాడప్పుడే పిల్లోల్ని ఎత్తుకొని రోడ్డుమీద ఎట్లా తిరుగుతాడు? ఎవరన్నా చూసినోళ్ళక్కూడా బాగుండదు.” అంటూ ఏవేవో చెప్పింది.

ఒక్కదానికి సమాధానం రాకపోవడంతో ‘ఈ – ముచ్చుది ఎక్కడదొరికిందో మా ప్రాణానికి’ అంటూ అప్పటికి విషయం వాయిదా వేసింది కానీ…

శ్యామల మనసులో నిజంగానే అంతా అయోమయంగా ఉంది, ఈ నిప్పు నన్ను ఎంత తగులబెడుతుందో?! ఎక్కడ దాకా విషయం వెళుతుందో…..?!-అనే భయంతో…

సాయంత్రం కొడుకు కాఫీ తాగడం అంటూ అయ్యాక మెల్లగా మళ్ళీ మొదలు పెట్టింది.

అంతా విన్న శ్రీనివాస్‌ మాత్రం ‘నేను కూడా చెప్తాలే’ అన్నాడు.

ఎవరికి వాళ్ళు – వాళ్ళ మౌనాలు… గాంభీర్యాలతో ఓ వారం గడచిపోయింది.

మళ్ళీ సమస్య… చర్చ మొదలు….

అప్పటికి వారం నుంచి శ్యామల మౌనాన్ని భరించిన విసుగుతో…

‘పోన్లేమ్మా… ఉండనీ… నేను చెప్పినా పలకటం లేదు’ అని అతి కష్టం మీద ఒక మాట మాత్రం అనగలిగాడు.

అలా అన్నాడో లేదో – ఒక్కసారిగా గయ్యిమంటూ మొదలెట్టింది సుబ్బమ్మ.

‘తెలీదురా బాబుగా దాని ఎత్తు – తొందరగా పిల్లలు పుడితేనే ఆస్తిలో హక్కు వస్తుందని అది వచ్చేటప్పుడు వాళ్ళ చిన్నమ్మ దానికి చెప్పి పంపించి ఉంటుంది. అసలంత తొందరేమొచ్చింది? ఓ అచ్చటా ముచ్చట ఏమి తీరిందని? నువ్వు ముఖ్యమా దానికి బిడ్డలంత ముఖ్యమా? మొగుడు బాగుంటే బిడ్డలు మల్లా పుట్టరా?’

ఇన్ని ప్రశ్నలు – సమాధానాలు ఎందుకని శ్రీనివాస్‌ లేచి బయటికెళ్ళి పోయాడు.

కాని ఇంటి వాతావరణంలో బరువు అలాగే కొనసాగుతూనే ఉంది. హాల్లో కూర్చొని ఉన్న మామగారు మాత్రం తనకేమీ వినపడనట్లే ఉన్నాడు.

రెండు మూడు వారాల తర్వాత దొడ్లో పూల చెట్ల మధ్య కూర్చొని విరగబూసిన చెండుమల్లె, చెండ్లకు కట్టిన దిష్టి గుడ్డను చూస్తూ ఇంత అందంగా, వత్తుగా, నవనవగా ఉండే చెండ్లు ఎంతబావుంటాయి. ఒక్క చెండయితే జడంతా నిండిపోతుంది. ఎవరూ చూడకుండా వీటికి బట్టకట్టడమెందుకు? అని ఏమేమో ఆలోచిస్తున్న శ్యామలకు చీకటిపడిన విషయం గుర్తొచ్చి లైట్లు వేద్దామని ఇంట్లోకొచ్చింది.

అక్కడ లోగొంతుకలో రెండు స్వరాలు…

ఒకటి అత్తగారిది, మరొకటి మామగారిది.

‘బాబుగాడేమంటున్నాడు?’

‘వాడనేదేముంది. పోన్లే అంటాడు.’

‘సరేపోన్లేయే. ఎందుకు రచ్చను ఎక్కువ చేస్తావు?’

‘అదికాదండి… నేనింతగా ఎందుకు చెప్తున్నానంటే – ఖచ్చితంగా ఆడపిల్లే పుడుతుంది. అందుకే తీయించేద్దాం.

‘అది ఎట్లా చెప్తావే.’

‘అదేంటండీ వాళ్ళమ్మకు అయిదుమంది అన్నీ ఆడవే… వాళ్ళమ్మమ్మకు తొమ్మిదిమంది ఆడపిల్లలే. వాళ్ళ చిన్నమ్మకు ముగ్గురు వాళ్ళే… మనకు ముగ్గురూ ఆడవాళ్ళే కదా. వీడంటే బాబుగాడు ఎట్లానో పుట్టినాడు కాని… అయినా ఆ వాంతులు చూడండి. తిన్నది తిన్నట్లుగానే రోజంతా అదేపనిగా…. ఆడపిల్లయితేనే అట్లా వాంతులవుతాయి,’ అంటూ తరతరాల్లో ఆడపిల్లల పుట్టుక లెక్కకడుతోంది సుబ్బమ్మ.

‘అదికాదే సుబ్బూ – ‘రమణయ్య ఆ పిల్లకు ఏమీ కానంత వరకూ నువ్వు ఏమిచేసినా ఊరుకొంటాడుగాని, ఏమైనా అయిందంటే మాత్రం పేగులు తీసి మెళ్ళో వేసుకొంటాడు.’ – అంటూ…. తన భయంతో కూడిన సందేహాన్ని తెలిపాడు.

‘అంతా అయిపోయిన తరువాత ఎవరేం చేస్తార్లే అయినా మల్లా పుట్టరా? ఏమన్నానా?’

‘శ్యామల తిరగబడి చేయించు కోకుంటే?…

‘మత్తిచ్చి చేయిద్దాంలే… మన ఆసుపత్రిలో నర్సు మున్నెమ్మక్కూడా చెప్పివచ్చినాలే…’ అంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయనట్లు.

‘కనీసం బాబుగాడికన్నా ఇంకోసారి చెప్పే, లేకపోతే ఎట్లా?’

‘ఏదో ఒకటి నేను చూసుకుంటాలే’ అంటూండగానే శ్యామల నడక శబ్దం విని మాటలాపేశారు.

కానీ ఆ రాత్రి శ్యామలకు భయంతో… రకరకాల ఆలోచనలతో నిద్ర పట్టలేదు…

వాళ్ళ సంభాషణలో… ఒక్కొక్కమాట పదేపదే గుర్తురాసాగాయి.

వచ్చివచ్చి ‘ఆడపిల్లే పుడుతుంది’ అన్నమాట దగ్గరే ఆగి గింగర్లు కొట్టసాగాయి. అంటే కేవలం ఆడపిల్ల పుడుతుందన్న అపోహ. ఆడపిల్లనైతే ఖచ్చితంగా కనకూడదన్న అత్తగారి వికృతమైన ఆలోచనలు తననో నిర్ణయం వైపుకు తీసుకుపోయాయి. మనసులో నిర్ణయం తీసుకుందో లేదో మరుక్షణం చూపులు క్యాలండర్‌వైపు సాగాయి. ఈరోజు బుధవారం అంటే మరో రెండు రోజుల తర్వాత ముహూర్తం పెట్టారన్నమాట…

ఈ లోపుగా ఎలాగైనా… నేను అనుకున్నది చేసేయాలి. చివరగా ఒకసారి… ఆయనకు చెప్తే ఉపయోగం ఉంటుందా?

ఊహూ పొరపాటున విషయం బయటపడిపోతే… నేననుకున్నది చేయలేననే భయం శ్యామలని, శీనుకు చెప్పనీయకుండా చేసింది.

అందుకే శుక్రవారం రాత్రి పదకొండు గంటలకు ఇల్లు వదలి దొడ్డిదారిలో…

చెండుమల్లెలకు వీడ్కోలు చెప్తూ – కంప దాటి వచ్చేస్తూంటే సర్కారు ముల్లు గీరుకుపోయి మంటపెడుతున్నా లెక్కచేయ కుండా వచ్చి మక్బూల్‌ హోటల్‌ టీ టేబుల్‌ కింద మంచినీళ్ళ బానవెనుక ఎవరికీ కనపడ కుండా, దోమలు పీకుతున్నా చలిచంపేస్తున్నా కాళ్ళు తిమ్మిర్లెక్కిపోతున్నా ఇవన్నీ పట్టించుకోలేని స్థితిలో ఇంకొద్ది సేపట్లో బస్సు వచ్చేస్తుందనగా…. మక్బూల్‌ ఇంటి తలుపు తట్టింది శ్యామల.

‘కోన్‌రే?’ అన్న మక్బూల్‌ విసుగయిన గొంతు, తలుపు రెండూ ఒకేసారి తెరచు కున్నాయి. కాసేపు ఎదురుగా ఆ వేళపుడు శ్యామలను చూసి ఏమయిందమ్మా? అన్నాడు ఆదుర్థాగా.

‘ఏం లేదు. రెండు సూటుకేసులు బరువుగా ఉన్నాయి. ఒకటి పెట్టడానికి ఆయన ఇంటికి పోయాడు. తను మళ్ళీ వచ్చేదాకా ఉందామని….’

‘ఇంత చలిలో… ఇప్పుడేం బస్సుంది? ఎక్కడ నుంచి? అటూనే తలుపు వదలి లోపలికెళ్ళిపోయాడు. ‘సబర్వాలా… కడపనుంచి’… అని సమాధానం చెప్తున్న శ్యామల – తలుపులు వారగా మూసి బెంచీమీద కూర్చున్నట్లు నటించింది. చూపులు మాత్రం వేగంగా వెతుకుతున్నాయి. బచ్చీ కోసం…

ఘోషాగా కట్టిన పాతచీరల కర్టెను కొద్దిగా జరిపి చూసింది.

అక్కడ… గోనెసంచీ మడత మీద, చిరిగిన లుంగీ గుడ్డ పరచి బచ్చీని పండబెట్టి ఉంది వాళ్ళమ్మ.

పక్కనే రెండడుగుల దూరంలో ఊయల తొట్టిలో, దోమల గొడుగు కింద రాజాలా నిద్రపోతున్నాడు, తనతోపాటే పుట్టిన మక్బూల్‌ కొడుకనబడే మగమహారాజు.

పాపం బచ్చీ మాత్రం తొమ్మిది నెలలకే శవంలా…

రేపోమాపో వెళ్ళిపోయే ఊపిరితో…

గొల్లభామ కీటకంలా… కనపడీ కనపడకుండా… పడిఉంది.

వాళ్ళిద్దరూ ఒకే కానుపులో పుట్టిన కవలపిల్లలు. ఈ కొద్దికాలంలోనే అప్పుడప్పుడూ బస్సుకోసం వచ్చి ఆగినపుడు చూసిన శ్యామలకు… మగపిల్లవాడికి మాత్రం కడుపునిండుగా పాలిచ్చి, బచ్చీకి మాత్రం పాలు తాపకుండా సహజమరణానికి దగ్గర చేసిన విషయం గుర్తొచ్చినప్పుడల్లా కడుపులో దేవినట్లయ్యేది. ఏ రోజూ దగ్గరికి తీసుకొని ఎత్తుకోకపోయినా ఆ చిన్నిపిల్లపట్ల జాలి, అభిమానంగా మారింది.

మక్బూల్‌ వాళ్ళు బచ్చీని పుట్టిన తరువాత ఆడపిల్ల అయినందుకు చంపే యాలనుకుంటున్నారు…

మరి మా ఇంట్లో… రూపం కూడా దిద్దుకోకుండానే…

ఇంక ఆపైన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు శ్యామల.

కళ్ళ నిండుగా మరోసారి బచ్చీని చూసుకొని…

గట్టిగా పీల్చివదిలిన ఊపిరితో… దృఢంగా బయటికి నడిచింది… చీకట్లోకి…

అర్ధరాత్రి…

తనకేమవుతుందోనన్న భయం – ఒకింతకూడా లేకుండా…

తనకు పుట్టే బిడ్డను ఎలా పెంచుకోవాలో ఊహించుకొంటూ…

తన నిర్ణయం కలిగించిన గర్వంతో మరింత ధైర్యంగా…

తనకు ‘ఆడపిల్లే’ పుట్టాలన్న కోరికతో…

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో