భూమిక ఇవాల్టి అవసరం

తెలుగు వారికి అందుబాటులో ఉన్న సీ్తవాద పత్రిక ‘భూమిక’, 20 సంవత్సరాలు నింపుకుంటున్న సందర్భంగా అభినందనలు. ఎన్నో రకాల ఒడిదుడుకులు, ఆటుపోట్లను ఎదుర్కొంటూ తెలుగు పాఠకలోకంలో, సమాజంలో తనదైన స్థానాన్ని  నిలబెట్టుకున్న ”భూమిక”ను అభినందించడం మనందరికీ గర్వకారణం.


స్వతంతం రాకముందు దాదాపు  1900 నుంచి 1940 ల వరకు మనదేశంలో, ముఖ్యంగా తెలుగు పాంతంలో ఎన్నో  సీ్తల పతిక్రలు ఉండేవి అన్న సంగతి అందరికి తెలిసందే. కాని, స్వతంత్రానంతరం, సీ్తవాద దృక్పథంతో వచ్చిన పతిక్రల్ని వేళ్ళతో లెక్కించవచ్చు. అందులో ‘భూమిక’ ఒకటి. ఒక సీ్తల పతిక్రను ఆపకుండా నడిపిస్తూ నిర్వహించడం అనేది ఒక సామాన్య విషయం కాదు.
నా అభిపాయ్రంలో ‘భూమిక’ సాధించాల్సి విషయాలు ఇంకా ఉన్నాయి. గత కొన్ని సంవత్పసరాలుగా ఎన్నో రకాల అంశాల మీద కధలు, వ్యాసాలు, రచనలు ‘భూమిక’లో కనిపిస్తాయి. కానీ,  సీ్తల మీద జరుగుతున్న హింస గురించీ లేదా సీ్తల సాహిత్యం, కవితల గురించే ‘భూమిక’ ఎక్కువ శద్ధ్ర చూపించినట్టు అనిపిస్తుంది. అక్కడక్కడ కార్మికులు, రైతాంగం, గిరిజన-ఆదివాసీ జీవితాల గురించీ, సంబంధిత ఆర్థిక అంశాల గురించీ, దేశ, అంతర్జాతీయ ఆర్థిక విధాల గురించీ నివేదికలు, పుస్తక సమీక్షలు తదితర విషయాల మీద చర్చలు కనిపించినా, హింస, సీ్తల సాహిత్యాల మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది. చాలావరకు సంపాదకీయాలు కూడా అవే. మనదేశంలో ‘స్తీ పశ్న్ర’ను కులం, వర్గం, మతం, జాతి రీత్యా మరింత విస్తృతం చేయడమే కాకుండా దృక్పథాన్ని లోతులకి తీసుకుని పోయే  పయ్రత్నం చేయాలి. దానితోపాటు ‘భూమిక’ జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలు, సీ్తల ఉద్యమాలు, రాజకీయ పోరాటాలు, ఆర్థిక, సామాజిక రంగాలలో సీ్తలు సాధిస్తున్న అభివృద్ధిల గురించి కూడా విస్తృతంగా రాయాలి.
పతిక్ర మాతమ్రే కాకుండా హెల్ప్‌లైన్‌ని, ఎన్నో రకాల వర్క్‌షాప్‌లను నిర్వహించడంలో సఫలీకృతమైన ‘భూమిక’ ఈ పై విషయాల మీద కూడా దృష్టి సారిస్తుందనే ఆశ, నమ్మకంతో…                                                   డా. కె. లలిత

‘భూమిక’ని నేను మొదటిసారి చూసినప్పుడు దాని వయసు రెండేళ్ళు. అప్పుడు మేం ఢిల్లీలో ఉండేవాళ్ళం. సత్యవతిని కలవటం కూడా మొదటిసారే. ఆ సభలో సత్యవతి మాట్లాడిన తీరుకీ, భూమిక గురించి తెలిపిన వివరాలకీ మేమందరం చాలా ఆకర్షితులయాం. అక్కడ ఉన్న తెలుగు రచయితలూ కొందరు వీలైనంత త్వరగా రచనలు కూడా పంపినట్లు గుర్తు. అలా మొదలైన అనుబంధం ఈ నాటి వరకూ కొనసాగుతూనే ఉంది.
భూమిక మంచి ఆలోచనలనీ, ధైర్యాన్నీ, వ్యక్తిత్వాన్నీ సంపాదించుకుని ఇంతదయింది. బాహ్య సౌందర్యం కన్నా బౌద్ధికమైన విషయాలకి, మానసికమైన పరిపక్వతకీ పామ్రుఖ్యం ఇచ్చింది. చిన్న వయసులోనే ధైర్యం, ఆత్మగౌరవం, అన్యాయాన్ని ఎదిరించటం, వంటి గుణాలని సమస్యల్లో ఉన్న సీ్తలందరికీ నేర్పింది. ఎందరి  పేమ్రనో చూరగొంది.
భూమిక కొండవీటి సత్యవతి (మానస) పుత్రిక, కానీ ఎంతోమంది ఈ భూమికని పెంచి పెద్ద చేశారు. అప్పుడే భూమికకి ఇరవై ఏళ్ళు నిండాయి! ఇంకా ఎంతో జీవితం ముందుంది. ఇంకా ఎంతో స్ఫూర్తినీ,  శక్తినీ అందిస్తూ, ఇలాగే దిన దిన పవ్రర్థమానమవ్వాలని ఆశిస్తూ, పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ఆర్‌. శాంతసుందరి
ఙభూమిక ఒక ఫెమినిస్ట్‌ దృక్పథంలోటి పార్రంభమయ్యి ఇప్పటిదాకా కొనసాగుతూ ఎన్నో విషయాలను పజ్రాదృష్టికి తీసుకురావడం, చాలా అభినందించదగ్గ విషయం. ఇటువంటి పతిక్రలు లేనట్టువంటి  తరుణంలో పార్రంభమయ్యి, మహిళ దృక్పథంపై అవగాహన ఉన్నటువంటి  సీ్తలు -మేధావులు, ఆక్టివిస్ట్‌లు, పట్టుదలతో దీనిని కొనసాగించడం చాలా సంతోషదాయకం. ఇంక ఎన్నో విషయాలను చర్చించి చరితన్రు తిరిగి రాయాల్సిన అవసరం వుంది కాబట్టి ఈ పతిక్రకు అందరి సపోర్ట్‌ వుంటుందని ఆశిస్తూ, …
డా. రమామెల్కోటె
ఒక్క మాటలో చెప్పాలంటే – ”ఆధునిక మహిళ చరితన్రు తిరగరాస్తుంది” అన్న గురజాడ మాటను, ‘భూమిక’ అక్షరాలా రుజువు చేసింది. శ్రీశ్రీ అన్నట్టు ”మాకు తెలియని మరో పప్రంచపు మహారణ్యపు చిక్కుదారుల్ని” పొందికగా ఆవిష్కరించింది. సీ్తలలో చైతన్యాన్ని రగల్చటానికి, పురుషుల సంస్కారస్థాయిని పెంచటానికి, ‘భూమిక’ చేస్తున్న  కృషి మరొక పతిక్రతో పోల్చటానికి వీలులేనట్టిది. పతిక్ర ద్వారా నేను చాలా వేగంగా ఎడ్యుకేట్‌ అయినాను. పత్య్రేక సంచిక కోసం ఈ రోజే వేయిరూపాయలు ఎం.ఓ. ద్వారా పంపిస్తున్నాను.
సింగమనేని నారాయణ
భూమిక సంపాదకురాలు శ్రీమతి సత్యవతి గారికి,
‘భూమిక’ చదవటం పార్రంభించినప్పటినుంచి ఆ పతిక్రంటే నాకొక పత్య్రేకాభిమానం. ఎన్నో కారణాలు.
ఒకటి. ఏదైనా ఉద్యమం నడిపే పతిక్రలు, వ్యక్తులూ, వ్యవస్థలూ ఒకోమారు కీచుగొంతుతో అరవటమే కాక, పత్య్రర్థులను అనవసరంగా తిట్టడం, తర్కానికి వీడ్కోలివ్వడం చేస్తాయి. వీటికేమాతం ‘భూమిక’ తావివ్వకపోవడం.
రెండు. పచ్రురించే కథలలో, వ్యాసాలలో, పర్యాటక విషయాలలో, అనువాదాల్లో, కవితలలో, అభిపాయ్రాలలో  వుండే చదివించే గుణం, కనిపించే నిబద్ధత. వాటన్నిటితో ఏకీభవించకపోతే మాతం మునిగేదేమీ లేదు.
మూడు. ఎటువంటి పటాటోపం లేకుండా ఆర్తిలో వున్న  సీ్త జనాన్ని తగినట్లుగా ఆదుకోవడం, వారికి సరియైన రక్షణ కల్పించడం. నేను సీ్తవాదిని కాదు. ‘బహ్మ్రమొక్కటే’ వాదిని. ‘భూమిక’కు అన్ని విధాలైన విజయమూ కలగాలని కోరుకొంటూ…
వి.ఎ.కె. రంగారావు
రెండు దశాబ్దాల ప్రస్థానం
భూమిక సత్యవతి గారికి,
భూమిక పతిక్రను రెండు దశాబ్దాలుగా ఎటువంటి అంతరాయం లేకుండా నడుపుతున్నందుకు అభినందనలు. ఒక పతిక్రను ఇంతకాలం విజయవంతంగా నిర్వహించటమంటే మాటలు కాదు. ఎంతో ఉత్సాహం, ధైర్యం వుండాలి. అర్థబలం, అంగబలం కూర్చుకునే శక్తి వుండాలి. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ మీరు భూమికను నడపటం సంతోషించదగ్గ విషయం. భూమికకు సీ్తవాద పతిక్రగా ఒక పత్య్రేకత వుంది. సీ్తలకు సంబంధించిన ఎన్నో సమస్యలను మీరు పతిక్రలో చర్చిస్తున్నారు. సీ్తల రచనలను విశ్లేషిస్తున్నారు. సీ్తల సమస్యలను సీ్తల విజయాలను పాఠకులకు తెలియజేస్తున్నారు. దానివల్ల సీ్త పాఠకులకు పేర్రణ కలుగుతున్నది. భూమిక పతిక్ర ”కథ-కవిత్వం-వ్యాసం” పక్రియల్లో పోటీలు పెట్టి రచయితుల్రను తయారుచేస్తున్నది. రాయాలనే ఉత్సాహాన్ని సీ్తపాఠకుల్లో కలుగజేస్తున్నది. భూమిక స్తీవ్రాద పతిక్రకు ఒక ఆంధప్రద్రేశ్‌ రాష్ట్రంలోనే గాక ఇతర రాష్టాల్లో, అమెరికాలోనూ పాఠకులున్నారనటం గర్వించదగిన విషయం. మీరు అందమైన పాంతాలకు పయ్రాణాలను, యాతల్రను నిర్వహించటమే కాక వాటి విశేషాలను భూమికలో పచ్రురిస్తూ  సీ్తలు తమకుతాము  దూరపద్రేశాలకు పయ్రాణం విజయవంతంగా నిర్వహించగలరు, ఆనందించగలరు తాము దర్శించిన పద్రేశాలను గురించి రాయగలరు అన్న ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నారు.
ఆ విధంగా ఎన్నో మౌలికమైన అంశాలను భూమిక – ”సీ్తవాద” పతిక్రలో  పవ్రేశపెడ్తూ నిర్విఘ్నంగా నడుపుతున్నందుకు సత్యవతిగారిని, ఆమె సహాయకబృందాన్ని అభినందిస్తున్నాను. ఈ సీ్తవాద పతిక్ర తనదైన రూపంలో ఎల్లప్పుడూ ఇట్లానే పాఠకులకందుతూ వుండాలని ఆకాంక్షిస్తున్నాను.
 ముదిగంటి సుజాతారెడ్డి
సత్యవతి మీకు తెలుసు. మీతోను, భూమికతోను వున్న అనుబంధం ఎప్పటిదో.. ఒక తల్లి తన కూతుర్ని ఎంత జాగత్త్రగా పెంచుతుందో అలా మీరు భూమికను పెంచారు. ఆ బిడ్డకు మమతానురాగాలతో పాటు విజ్ఞానాన్ని, సోషల్‌ అవేర్‌నెస్‌ కలిగించారు. ఇపుడు ఆ భూమిక మా అందరికీ  ఆ  విజ్ఞానాన్ని అందిస్తోంది. భూమిక చదివే  పత్రి ఒక్కరూ  విద్యావంతులు అయ్యేలా పతిక్ర నడుపుతున్నారు. పి. సత్యవతి, కొండేపూడి, ఛాయాదేవి, సుభద, డా. రోష్ని, శిలాలోలిత, శాంతసుందరిగార్ల రచనలతో పాటు  మీ సంపాదకీయాలు ఎంతో విజ్ఞానదాయకంగా వుంటున్నాయి. ఒకపుడు ఢిల్లీ నుండి వచ్చే ‘మానుషి’ పతిక్ర సీ్తల కోసం వెలువడే పతిక్రల్లో చాలా వున్నంతమయిన ఆశయాలతో వెలువడుతున్నదని అనుకునేదాన్ని. ఇపుడు భూమిక ఆ స్థాయికి చేరిందని గర్వపడుతున్నాను. మన తెలుగులో ఇంతమంచి మాసపతిక్ర వుండడం మా అదృష్టం. దీనివెనుక మీ  శమ్ర, తపన, పట్టుదల ఎంత వుందో నాకు తెలుసు.  మూడు నెలలొకసారి వచ్చే పతిక్రను రెండు నెలలకు, ఆ తరువాత మాసపతిక్రగా వచ్చేలా చేశారు. ఇది మీరు ఎలా సాధించారో మా ఊహకు అందదు. మంచి ఉద్యోగానికి రిజైన్‌చేసి భూమిక అభిరుచి కోసం పాటుపడడం నేను ఎన్నిటికి మరువలేను. సీ్తలను చైతన్యవంతులుగా చేయగల ఒక మంచి పతిక్ర ఉండాలనే మీ సంకల్పం చాలా ఉదాత్తమైనది.
అరటిచెట్టులో పత్రి భాగం – కాండం, ఆకులు, పువ్వులు, పండ్లు – మనిషికి పనికొచ్చేదట. అలాగే భూమికలో మీరు పచ్రురించే పత్రిశీర్షిక, పత్రి పేజీ అర్థవంతమై మాకు ఉపయోగపడేదే. అందుకే భూమికను చేతిలో తీసుకుంటే సంపాదకీయం నుండి చివరి పేజీవరకు ఏకబిగినా చదివేదిగా చేస్తుంది.
చాలాసంతోషం సత్యా. భూమిక ఎప్పటికీ ఇలాగే తన పత్య్రేకతను నిలబెట్టుకోవాలని కోరుతున్నాను.
శారదా శ్రీనివాసన్‌
‘భూమిక’ పతిక్ర సంపాదకురాలు శ్రీమతి సత్యవతి గారికి,
‘భూమిక’ ఆవిర్భవించి రెండు దశాబ్దాలు పూర్తిచేసుకున్నందుకు సంతోషం. ‘భూమిక’ను మీరు సీ్తవాద పతిక్ర అని అన్నారు.  సీ్తవాదమంటే పురుషునికంటే  సీ్త ఆధిక్యం కలదని ప్రకటించే వాదం కాదు. సీ్త పురుషునితో సమస్కంధంగా ఉండేదని ఉద్ఘోషించే వాదం.
‘భూమిక’లో పాయికంగా రచయితుల్ర రచనలే ఉంటాయి. ఆ రచనలు స్తీల్ర సమానత్వాన్ని వివిధ కోణాలనుంచి సమీక్షించేవి. మార్చ్‌ 8వ తేదీన అంతర్జాతీయ మహిళాదినోత్సవ సందర్భంగా ‘భూమిక’ పత్య్రేక సంచికను వెలువరిస్తున్న మీ సంకల్పానికి నా హార్దికాభినందనలు.
 డా|| సి. నారాయణరెడ్డి
భూమిక ఆవిర్భవించి ఇరవైవసంతాలలోకి అడుగుపెడుతున్న  శుభసందర్భానికి  నా శుభాకాంక్షలు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఆద్యంతం ఆసక్తికరంగా, ఆహ్లాదకరంగా, ఎంతో సమర్ధవంతంగా భూమిక పతిక్రను మలిచిన తీరు పశ్రంసనీయమైనది.
రచయితిగ్రా కథలు, కవితలు, వ్యాసాలు మరియు వర్క్‌షాపుల్లో భాగంగా విహారయాతల్ర నిర్వహణ… ఇలా ఎన్నో సృజనాత్మకమైన కార్యకమ్రాలు. రచనలు చేయడమే కాకుండా, రకరకాల విషయాల మీద ఆర్టికల్స్‌ రాసేవారిని పోత్స్రహిస్తున్న తీరు ఎంతో మంచి పయ్రత్నం.
సమాజంలో జరిగే  పత్రి సంఘటనకీ తక్షణం స్పందించి అటువంటి ఆలోచననీ, అభిపాయ్రాలనూ అక్షరరూపంలో ఆర్టికల్స్‌ ద్వారా వెలువరిస్తున్న తీరు అభినందనీయం.
హింసను రూపుమాపడానికి మీవంతు కృషిగా భూమిక హెల్ప్‌లైన్‌ను స్థాపించి బాధిత సీ్తలకు ఎంతో ఊరటను కలిగించే విధంగా అందించే తోడ్పాటు చాలా పశ్రంసనీయమైనది.
భూమిక సర్వతోముఖంగా ఇంకా ఇంకా ముందుకు సాగాలని, అత్యున్నత  పమ్రాణాల స్థాయికి ఎదగాలని మనఃస్ఫూర్తిగా కోరుకుంటూ… అంతర్జాతీయ మహిళాదినోత్సవ సందర్భంగా… హార్దిక అభినందనలతో…
వసంత్‌ కన్నబిరాన్‌
గౌరవనీయులైన సీ్తవాద పతిక్ర ‘భూమిక’ నిర్వాహకులకు నమస్కారం. ముందుగా పత్రికను రెండు దశాబ్దాలపాటు దిగ్విజయంగా నడిపిస్తూ వస్తున్నందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను.
పతిక్ర విషయానికి వస్తే, నేను గత ఏడు, ఎనిమిది సంవత్సరాలుగా కమ్రం తప్పక చూస్తూ వున్నాను. పతిక్రను ఏదో ఒక వ్యాపకంగా కాకుండా ఒక పత్య్రేక దీక్షా, లక్ష్యాలతో నడిపిస్తున్నారు. కాబట్టే అది అంతకంతకూ వాసిలోనూ, రాశిలోనూ ద్విగుణీకృతం అవుతోంది. ఊరికే సీ్త సమస్యలను ఏకరువుపెట్టడం కాకుండా సీ్తల దృష్టితో ఒక పత్య్రేక కోణంలో వాటిని మీరు ఆవిష్కరింపచేయడానికి చేస్తున్న పయ్రత్నం అభినందనీయం. ‘భూమిక-హెల్ప్‌లైన్‌’ వంటి పత్య్రక్ష చర్యల ద్వారా సమస్యలను కేవలం పప్రంచానికి తెలియజెప్పడం ఒక్కటే కాదు, వాటి పరిష్కారంలో సహితం మీవంతు కృషిచేయడానికి నిర్విరామకృషి చేస్తున్నారు.
ఆర్థికంగా ఎన్నో ఒడిదుడుకులను నిరంతరంగా ఎదుర్కొంటూ ఒక లక్ష్యం కోసం పతిక్రను బత్రికిస్తూ,  ముందుకు తీసుకొని రాగలగడం వెనుక ఎంత పట్టుదల, ఎందరి కృషి, ఎంత మనోసంకల్పబలం ఉండాలో అర్థం చేసుకోగలం. వీటన్నిటికీ మీ బృందానికి పూర్తి మద్దతు తెలియజేస్తూ, ఇక ముందు కూడా పతిక్ర నిర్విరామంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలతో…
ఎల్‌. మల్లిక్‌, ఎడిటోరియల్‌ టీం మన్యంలో…
కె. సత్యవతిగారికి,
నమస్కారం. మీ ఉత్తరం నిన్ననే అందింది.  భూమిక పుట్టి అప్పుడే 20 ఏళ్ళయిందంటే ఆశ్చర్యంగా ఉంది. రెండు దశాబ్దాలపాటూ ఒక పతిక్ర నిరంతరాయంగా రావటం నిజంగా అభినందించవలసిన విషయమే. అందుకు భూమిక వర్గానికి అభినందనలు.
రచయితి పత్య్రేక సంచికలుగా తెచ్చిన మూడు పతిక్రలూ చాలా బాగా వచ్చాయి. ఇదేవిధంగా ఇకముందు కూడా తెస్తారనుకుంటున్నాను.  మీ ఆలోచనలతో ఏకీభవించినా, లేకపోయినా అరవయ్యో దశకంలో పతిక్రా పప్రంచాన్ని, పాఠకలోకాన్ని ఒక పభ్రంజనంలా చుట్టేసిన రచయితుల్రు చాలామందే ఉన్నారు. పజ్రలని మరీ ముఖ్యంగా సీ్తలని చదువరులుగా చేసిన విషయంగానీ, అనేకమంది చదువరులను కూడా రచయితుల్రుగా మారటానికి దోహదం చేసిన విషయంగానీ తోసిపుచ్చటానికి వీలులేదు.  నిజానికి మనమందరం కూడా ఆనాడు ఆ రచనల్ని విపరీతంగా చదవటమేకాక మనం కూడా మన భావాలకి అక్షరరూపం ఇవ్వటానికి ఆనాటి నుండీ పయ్రత్నం చేసిన వాళ్ళమే. కనుక ముఖ్యం 70-80 ఏళ్ళ వయస్సులోని ఆనాటి రచయితుల్రకు భూమిక ద్వారా గౌరవం పక్రటించితే బాగుంటుందని నా అభిపాయ్రం. అంతేకాక ఈ విధంగా ఇంతవరకూ ఏ పతిక్రాకూడా చేయలేదు. ఎట్లాగూ మీరు ఒక అడుగు ముందుకువేసి రచయితుల్ర ముఖచితాల్రతో పతిక్రలు తెచ్చారు కాబట్టి ఇది కొనసాగిస్తారనీ, నా సూచనతో ఏకీభవిస్తారనీ అనుకుంటున్నాను.
ఇకపోతే కవితలు, కథలకు సంబంధించి కూడా అప్పుడప్పుడు ఇతర రచయిత్రులకు ఉత్తరాలు రాసైనా రచనలు తెప్పించుకుంటే మరికొన్ని రచనలకి స్థానం కల్పించినవారౌతారు. ఇతర శీర్షికలు ఎక్కువగానే ఉంటున్నాయి కానీ కథలు, కవితలు, సమీక్షలు తక్కువగా ఉంటున్నాయి. ఇవి ఎక్కువగా ఉంటే పతిక్ర సర్క్యులేషను కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది.
పతిక్ర నడపటంలో సాధకబాధకాలు సాహిత్యరంగంలో ఉన్నవారందరికీ అర్థం అవుతుంది. ఇంత శమ్రకోర్చి పతిక్ర తీసుకువస్తున్న మీకూ, సంపాదకవర్గానికి నా శుభాభినందనలు.
ఇరవై ఏళ్ళు నిండిన భూమిక ఇకపై మరిన్ని వన్నెలు సంతరించుకుంటుందని ఆశిస్తున్నాను.
శీలా సుభద్రాదేవి
భూమిక సంపాదక వర్గానికి,
భూమిక పతిక్ర ఆవిర్భావమే తెలుగు పతిక్రారంగంలో ఒక అరుదైన సంఘటన, ఇంతకు పూర్వం కూడా మహిళల ఆధ్వర్యంలో తెలుగు పతిక్రలు నడిచాయి. కానీ విషయం, దృక్కోణం, పాప్రంచిక అవగాహన వంటి విషయాల్లో వాటికి, ఇతర పత్రికలకు పెద్దగా తేడా ఉండేది కాదు. ఈ మూడింటిలోనూ నూతన ఒరవడిని తెచ్చి, యావత్ప్రపంచ పరిణామాలను సీ్తల కోణం నుంచి చూడడంలో, చూసిన దాన్ని విశ్లేషించడంలో భూమిక చాలావరకు సఫలమైంది. వ్యాపార పక్రటనలకోసం, విరాళాకోసం నిబద్ధతను తాకట్టు పెట్టక తప్పని ఈనాటి పరిస్థితులలోనూ, గతి తప్పని, అడుగు తడబడని నిజాయితీతో నడుస్తున్నందుకు భూమికకు తెలుగు పాఠకులు ఎంతైనా రుణపడివుంటారు. సీ్తల కోణం నుంచి పప్రంచాన్ని చూడడం, సీ్తలకే కాదు; పురుషులకు ఇంకా అవసరమని చెప్పడంలోనూ భూమిక విజయం సాధించిందని గత కొన్నేళ్లుగా ఈ పత్రికకు వస్తున్న లేఖలవల్ల తెలుస్తుంది. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. సీ్తలు కేవలం కుటుంబ సమస్యల గురించి, వ్యక్తిగత కష్టనిష్ఠురాల గురించే రాయగలరన్న అభిపాయ్రాన్ని పూర్వపక్షం చేస్తూ, అన్ని రంగాలకు సంబంధించిన పరిణామాల గురించీ ఆలోచంచగల మేధావి సీ్తల వర్గాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తున్న ఘనత భూమికదే.
భూమికలో దేనికైనా కొరత ఉందీ అంటే అది హాస్య స్ఫూర్తిలో. విషయం ఎంత లోతైనదైనా మరీ అంత గంభీరంగా ఉండనవసరం లేదేమో. మనల్ని చూసుకుని, మన చుట్టూ ఉన్న సమాజాన్ని చూసి అప్పుడప్పుడూ నవ్వుకోవడం మన ఆరోగ్యానికీ, సమాజం ఆరోగ్యానికీ కూడ అవసరమే. ఆ కోణాన్ని కూడా భూమిక పరిగణలోకి తీసుకుంటే బాగుంటుంది. అలాగే భూమికలో వచ్చే ఉత్తరాల్లో వ్యక్తిగత స్తోత్ర పాఠాల వంటి ఉత్తరాలను పరిహరిస్తే భూమిక విలువ, విశ్వసనీయత ఇంకా పెరుగుతాయని నా అభిప్రాయం. పతిక్రా రంగంలో  సీ్త సామర్థ్యానికి కొలమానంగా భూమిక పతిక్ర మరింతకాలం విజయపథంలో నడవాలని ఆకాంక్షిస్తూ…
మృణాళిని
‘భూమిక’  పార్రంభించి రెండు దశాబ్దాలయిన సందర్భంలో భూమిక నిర్వాహకులకు, రచయిత్రులకు నా అభినందనలు.
ఇరవై సంవత్సరాలపాటు రచయితుల్రకు ఒక వేదికగా నిలబడింది. అది సామాన్యమైన విషయం కాదు.
రాబోయే సంవత్సరాలలో మరింత విస్తృతంగా భూమిక తన సాహిత్య సామాజిక కృషి కొనసాగించగలదని ఆశిస్తున్నాను. కొత్త రచయితుల్రలో ఉత్సాహాన్ని నింపగలదనుకుంటున్నాను. భూమిక సంపాదకీయాలు పత్య్రేకంగా చెప్పుకోవాల్సినవి. వాటిని అలాగే కొనసాగిస్తారని ఆశిస్తాను. ఇతర భాషా రచయితల పరిచయం, పుస్తకాల పరిచయం యివన్నీ ఆసక్తికరంగా ఉంటున్నాయి. తనదైన ముద వేస్తున్న భూమిక వంద సంవత్సరాల వేడుక జరుపుకోవాలని కోరుతూ – తరం నుంచి తరానికి భూమిక మరింత బలంగా వేళ్ళూనుకుని నిలబడాలని కోరుతూ – ఎప్పటికప్పుడు కొత్త ఉత్సాహాలనందించే కొత్త రక్తాన్ని నింపుకోవాలని కోరుతూ – వివక్షకు గురైన పజ్రల తరపున నిలబడాలని కోరుతూ –
 ఓల్గా
ఇరవై సంవత్సరాల భూమికకు  మరో ఇరవై సంవత్సరాల అభినందనలు. సీ్తవాద సాహిత్యానికి, భావజాలానికి భూమిక నిర్వహించిన పాత చరితాత్మ్రకమైనది. తెలుగు పతిక్ర సాహిత్యంలోను, తెలుగు సాహిత్య చరితల్రోను ఈ అంశం నమోదు కావాలి.
  ఎండ్లూరి సుధాకర్‌
ఆత్మీయ ‘భూమిక’, ఆదర్శ ‘భూమిక’
పార్రంభ సంచిక నుంచీ ‘భూమిక’ పతిక్రతో నాకు సన్నిహిత సాహిత్యానుబంధం, నిర్వాహకులతో స్నేహసంబంధం ఉంది. ‘నిర్ణయం’ అనే కథ ఆ సంచికలోనే వచ్చింది. ఆ తరవాత ‘కాలమ్‌’ రాయడం మొదలుపెట్టి చాలాకాలంపాటు కొనసాగించాను. తరవాత వ్యాసాలూ, సమీక్షలూ మొదలైనవి రాస్తూ వస్తున్నాను. పొ.చేకూరి రామారావు, శ్రీ వల్లంపాటి వెంకటసుబ్బయ్య వంటి మేధావులూ, సీ్తల పురోగతిని కాంక్షించేవాళ్ళూ భూమికని చదివి మెచ్చుకుంటూండేవారు అప్పటినుంచీ.
‘సీ్తవాదపతిక్ర భూమిక’ సీ్తలని చైతన్యపరచడంలోనూ, యువరచయితుల్రను పోత్స్రహించడంలోనూ విజయం సాధిస్తూండటమేకాక, వివిధ వర్గాలకూ, దృక్పథాలకూ చెందిన పురుషులలో కూడా ఆసక్తిని పెంచుతూ వస్తుందనడానికి నిదర్శనం- సీ్తలూ, పురుషులూ సంపాదకురాలికి రాసే ఉత్తరాలూ, పతిక్రకి రాసే రచనలూ.  సమాజంలో కొనసాగుతున్న వివిధ రకాల సీ్తపురుష వివక్షని బయటపెడుతూ, అందరిలో చైతన్యం కలిగించేలాగ కమ్రం తప్పకుండా భూమిక పట్ల బాధ్యతతో రచనలు చేస్తున్న, కొండేపూడి నిర్మల, శిలాలోలిత, పి.సత్యవతి, జూపాక సుభద మొదలైనవారు భూమిక విలువని పెంచుతున్నారు. రచయితుల్రేకాక, చితక్రారిణులూ, వైద్యనిపుణులూ, న్యాయశాస్త్రజ్ఞులూ మొదలైనవారు కూడా భూమికని పయ్రోజనకరంగా చేస్తున్నారు. సంపాదకీయాలు మేలుకొలుపు పాడుతూ, మార్గదర్శనం చేస్తున్నాయి.
‘భూమిక’ ఇలాగే కలకాలం, సమాజంలో స్తీప్రురుష వివక్ష అంతరించి, సీ్తలు సంపూర్ణ వికాసం పొందేవరకూ భిన్నతరాల సీ్తలకి స్ఫూర్తి కలిగిస్తూ కొనసాగాలని మనసారా కోరుకుంటున్నాను. ‘సీ్తవాదపతిక్ర భూమిక’కి నా హృదయపూర్వక అభినందనలు!                                                                                     

అబ్బూరి ఛాయాదేవి

ఒక ఐక్య సంఘటన
చాలా వింతగా వుంది. సీ్త వాద సాహిత్యం ఉద్యమ రూపం తీసుకురావడానికి వేదికయిన భూమిక అప్పుడే  ఇరవై వసంతాల నవజవ్వనా? సంభ్రమాశ్యర్చాలతో గొంతు మూగబోతోంది. నిన్న మొన్న కొత్త పద్యమొకటి, చిరు కథానికను రాసుకుని భూమిక కథల వర్‌కకషాప్‌ ముందు తచ్చాడుతున్నట్టే వుంది.. ఆ అతిథిగృహం ముందు మిరిమిట్లు గొల్పుతున్న లైట్ల కాంతి పరావర్తనం చెంది తరళాయిస్తున్న నీళ్ళ కొలనులో నిలబడి చలిని కప్పుకుని చెలులతో ఛాయాచిత్రాలు దిగుతున్నట్లే వుంది… మూడు రోజుల కథల వర్క్‌షాప్‌లో మేమేం నేర్చుకున్నామో రెండో తరగతి విద్యార్థుల్లా వాసిరెడ్డి సీతాదేవి ముందు బుద్దిగా వివరిస్తుంటే చాలా లైవ్లీగా చెప్పావు పత్రిమా’ అంటూ యిప్పుడిప్పుడే ఆమె మెచ్చుకుంటున్నట్టుగా వుంది.. నేను ఉబ్బిపోయినట్లు కూడా గుర్తుంది. అక్కడే తొలిసారిగా కాళీపట్నం, వల్లంపాటి, అల్లంరాజయ్య, ఓల్గా , కాత్యాయనీ విద్మహే, కేతు అందరినీ అభిమాన పేక్ష్రకుడు సినిమా నటుల్ని చూసినంత ఆనందపు పరాకాష్ట నిత్య నూతనంగానే వుంది…
సంపాదకురాలు సత్యవతితో మాట్లాడ్డానికి సంకోచించి సజయతో సాహిత్య స్నేహం పెంచుకున్న జ్ఞాపకాలు సజీవంగానే వున్నాయి..  ”ఈ అమ్మాయి పత్రిమ..బడ్డింగ్‌ రైటర్‌”  అంటూ అబ్బూరి ఛాయాదేవి, వసంతా కన్నబిరాన్‌కి, సుజీతారూకి యిప్పుడిప్పుడే పరిచయం చేసినట్లుగా వుంది… ఆ తర్వాత ఛాయాదేవిగారే ‘పత్రిమ మన కళ్ళముందు నుండే భలే ఎదిగింది కదూ..” అంటూ ముచ్చటపడ్డం కూడా హృదయాన్ని హత్తుకునే వుంది..
ఇదంతా ఎప్పుడు జరిగిపోయింది? కథల వర్క్‌షాప్‌ దగ్గర్నుండి..వివిధ సామాజిక సందర్భాల మీదుగా లీగల్‌, సోషల్‌ కౌన్సిలర్‌లతో కూడ కాలానికి నిలిచే వర్క్‌షాప్‌లు నిర్వహించిన భూమిక… రాష్టవ్యాప్తంగా దిగులు మేఘాలై వర్షిసోస్తున్న అనేకమంది  సీ్తలకు అత్యవసర సాయమందించి గుండెల్ని దిటవు పరిచిన భూమిక..
ఎప్పటికప్పుడు సమాజ  సంబంధిత పీడిత అంశాలమీద పత్య్రేక సంచికలందించి మనందరికీ ఎరుక కల్గించిన భూమిక..
అనేక జిల్లాల నుండి బ్యాచ్‌లు బ్యాచ్‌లుగా సీ్తలను రావించి, చైతన్యవంతుల్ని చేసి…చేయి, చేయి కలిపి మానవ హారాలయిన వాళ్ళని ముఖ చితాల్రుగా మార్చుకున్న భూమిక.. భిన్న అస్థిత్వాల వాళ్ళకి స్పేస్‌నిచ్చిన భూమిక వివిధ భాషల రచయితుల్ర సదస్సుల్లో.. మన తెలుగు సీ్త రచయిత యొక్క విజయపతాకని ”స్పారో” మీదుగా ఎగురవేసిన  భూమిక…
ఆంధ రాష్ట వ్యాప్తంగా వివిధ రంగాలలో పమ్రుఖ సీ్తలను ఆయా రంగాలలో నింగిని తాకిన సీ్తలను పరిచయం చేస్తూ అస్మిత ప్రచురించిన ‘మహిళా వరణం’ లో చోటు సంపాదించిన భూమిక. ఇటు హెచ్‌ఐవి బాధితులని తాకి పలకరించి, అటు పదకొండేళ్ళుగా మిలటరీవాళ్ళకి పత్య్రేక అధికారులున్నటువంటి చట్టాన్ని నిరసిస్తూ నిరాహారదీక్ష చేస్తున్న షర్మిలని మణిపాల్‌ వెళ్ళి చూసి..యింకా మరెన్నో సందర్భాల్లో కన్నీళ్ళు కన్నీళ్ళుగా పాఠకులను తాకిన భూమిక..
ఒకటా?రెండా. ..తాను చేసిన సాహసాలకుగాను అనేకానేక పురస్కారాలనందుకుని, సన్మానించబడ్డ భూమిక…యివ్వాళ ఇరవై వసంతాల నవజవ్వని.. చూస్తుండగానే చాలా చాలా జరిగిపోయింది… మన ఆలోచనలకు, అభిపాయ్రాలకు, పోరాటాలకు ఒదగకుండా కాలం మన మీది నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయింది..ఎంతెంత చేశామో ఏమి చేయకుండా వుండిపోయామో లెక్కలు తేల్చడం కష్టమే.. అనేక సవాళ్ళను ఎదుర్కునే  కమ్రంలో సాహసాన్ని పద్రర్శించాం. చాలాసార్లు మనల్ని వేళ్ళతో పెకలించి వేయాలని పయ్రత్నం చేసిన శక్తులతో తీవ్రంగా పోరాడి మన వేళ్ళు మరింత బలంగా పాదుకునేలా చేసుకున్నాం.. భావసారూప్యత  లేని హృదయాలను కూడా అక్కున చేర్చుకుని భావ చైతన్యం కలిగించి ఒక చూపునిచ్చాం..
అస్థిత్వ పోరాటాలన్నీ ఒక అవగాహన కోసమే తప్ప అందులో అందులోనే కూరుకుపోవడానికి కాదని గుర్తెరిగి మనతో కలిసి నడుస్తాయన్న పురుషులని సహృదయంతో కలుపుకు నడిచాం… వైరుధ్యాలన్నీ కూడ మిత స్పర్థలేనని మనలోమనం ఒకరినొకరం అర్థమవుతూ.. వివిధ అస్థిత్వాలను కలుపుకుంటూ ముందుకు సాగాం…  కొన్ని సార్తు గుంపునుండి విడివడి కొత్తదారు లేర్పరుచుకున్న వాళ్ళతో వెనుక నడిచో.. మరో దారిలో నుండి ఎదురొచ్చి చేయికలిపో మలేసుకుని మనలోకి చేర్చుకున్నాం..
మనమంతా ఎప్పుడూ విడిగాలేం.. విడగొట్టబడినట్లుగా భమ్రింపబడ్డాం…అంతే. నిజానికి మనమంతా ఒక ‘ఐక్యసంఘటన’.
వి.  ప్రతిమ
భూమికతో…
2005 జూలైలో అనుకుంటా.. ఓ రోజు ఉదయాన్నే మితుడ్రు యాకూబ్‌ ఫోన్‌ చేసి ‘భూమిక కథల పోటీలో మీ కథకి మొదటి బహుమతి వచ్చిందట. అభినందనలు’ అని చెప్పారు. భూమికతో పరస్పర అనుబంధానికి ఆ సంఘటనే నాంది…
బహుమతి పద్రాాన సభ హైదరాబాద్‌ పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన భవనంలో జరిగింది. సీరియస్‌ సాహిత్యం ఒకటి ఉందని, అక్కడ తప్ప ఇంకే రంగంలోనూ ఇమడలేనని గుర్తించాక నేను వెళ్ళిన మొదటి సాహిత్య సభ అది.
‘మనందరి మధ్యా గారూ గీరూ అనే మర్యాదలెందుకు? సత్య అని పిలిస్తే చాలు’ అంటూ చనువుగా కావిలించుకున్న కొండవీటి సత్యవతి, ఏవో కరపతాల్రు పంచుతూ సభంతా కలయదిరిగేస్తున్న రత్నమాల, న్యాయనిర్ణేతలతో కలిసి బహుమతులు గెల్చుకున్నవారు ఫోటోలు దిగుతున్నప్పుడు ‘మనం మనం కథలవాళ్ళం నా పక్కన నిల్చో’మని పిల్చి భుజం చుట్టూ చెయ్యి చుట్టి  పేమ్రని పంచిన పి.సత్యవతి, పమ్రుఖ రచయితుల్రందరికీ తన కవిత్వ పుస్తకం ఇచ్చి పక్కనే ఉన్న నన్ను వదిలేసి నాచే బుంగమూతి పెట్టించిన కె.గీత, తన ఉపన్యాసానికి వ్యంగ్యపు మందు గుండు దట్టించి మాటల్ని తూటాలు చేసి పేల్చిన కొండేపూడి      చూసిన మంచి రచయిత్రులతో ఎడతెగని సంభాషణకి బీజం ఆ సభలోనే పడింది.
రచయితుల్రుగానే కాక సీ్తలుగా కూడా అనుభవాలను పంచుకొనే సంస్కృతిని భూమిక యాతల్ర సందర్భంలో నేను గమనించాను.
మగవారు ఏ రంగంలోనైనా పని చేయడానికి మరింత నేర్చుకోడానికి ఉత్తేజితులవడానికి అవసరమైన వ్యవస్థాగత వేదికలు ఉంటాయి. తమని ఏకీకృతం చేసే మరిన్ని వేదికలను సృష్టించుకోవడం వారికి పెద్ద సమస్య కాదు. రచయితలు, కవులకయితే తరుచూ జరిగే సాహిత్య సభలు, సభానంతర కార్యకమ్రాల ద్వారా అనేక అంశాలపై విస్తృతంగా మాట్లాడుకునే వెసులుబాటు ఉంటుంది.
కానీ చాలామంది రచయితుల్రకి అలా కాదు. వారు ఇంటిని కుటుంబాల్ని వదిలి బయట అడుగు పెట్టడమే గగనం. ఒకవేళ అదృష్టం పట్టి ఏ సభకో వక్తగా పిలిస్తే అతిరధ మహారధులైన అయిదారుగురు పురుష రచయితల మధ్య, మరీ బావుండదు కదాని పిల్చి కూచోపెట్టిన పీఠం మీద బిక్కుబిక్కుమని కూచుని చెప్పదలిచినదాన్ని చెప్పేసి వేదిక దిగాక బాగా మాట్లాడారనో, ఇంకా బాగా మాట్లాడొచ్చనో నాలుగు హడావిడి అభిపాయ్రాలని భుజానేసుకుని ఇంటి కొచ్చి మళ్ళీ జీవితంలో పడిపోతాం. దీనికి భిన్నంగా ఒక స్నేహపూర్వక వాతావరణంలో మూడు నాలుగు రోజుల పాటు కలిసి చేసే యాతల్ల్రో పంచుకునే అభిపాయ్రాలూ చర్చలూ సుఖదు:ఖాలూ వ్యక్తిగతమూ సామాజికమూ సాహిత్యమూ ఎన్నెన్ని                                                         విలువైన అనుభవాలు !!
భూమిక నలభై మంది రచయితుల్రతో కలిసి చేసిన ఉత్తరాంధ యాతక్రి నేను స్థానిక సహాయకులలో ఒకరిగా ఉన్నాను.  మహిళా ఖైదీల జైలు, గంగవరం ఎస్‌.కోట, వాకపల్లి మొదలైన పాంతాలకి వెళ్లి బాధిత  సీ్తలతో మాట్లాడే  కమ్రంలో రచయితుల్రమంతా ఒకటి అయ్యాం. పీడిత మహిళల పట్ల రత్నమాల నిబద్ధత, నిజాయితీ, వారి సమస్యల పట్ల ఆమె మమేకతని చూసి  పేర్రణ పొందింది ఆ యాతల్రోనే. ముళ్ళతో రాళ్ళతో నిండి ఎగుడుదిగుడుగా ఎత్తు ఎక్కుతున్నట్లు ఉన్న మూడు మైళ్ళ కాలిబాటని డెబ్భై ఏళ్ళ వయసులో జయించిన అబ్బూరి ఛాయాదేవి గారిని చూసి జీవశక్తిని పునర్నిర్వచించుకున్నది ఈ యాతల్రోనే…. గోడు వెళ్ళి బోసుకోడానికి ఎవరి దగ్గర సుఖంగా ఉంటుందో కనిపెట్టి ఘంటసాల నిర్మల పక్కన చేరి ‘సీ్తవాదం ఉద్యమస్థాయిలో ఉన్నపుడు మీరంతా ఆ తీవత్రని అందిపుచ్చుకుని రాసారు. యిపుడు రాస్తున్న వాళ్ళం రిపీట్‌ అవుతున్నాం కొత్తదశలోకి వెళ్ళడంలో మాకు చాలా అయోమయం ఉంది. మనందరం మళ్ళీ మాట్లాడుకోవాలి కదా కలిసి చర్చలు చేయాలి కదా విడివిడి గొంతుల కన్నా ఒక్కటైన పచ్రండ ఘోష కావాలి కదా’ అని సమయం దొరికినప్పుడల్లా ఊదరగొడితే శాంతంగా తలూపుతూ విని ‘అవునూ…. ఉత్సాహంగా ఉన్నావు నువ్వే ఆ పయ్రత్నం చేయకూడదా?’ అన్న సూచన చేసారు. ఇక్కడ పుట్టిన ఆలోచనా బీజాన్ని రచయితుల్రందరం కలిసి నాటి ‘మనలో మనం’ గా పోషించి, పజ్రాస్వామిక రచయితుల్ర వేదిక అనే ఫలాన్ని పొందాం.
సీ్తలకి మాతమ్రే సొంతమైన  పజ్రాస్వామిక వేదికలుండడం వారికి ఎంతటి ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందో భూమిక వేదిక ద్వారా గహ్రించాను, పభ్రావితమయ్యాను. పజ్రాస్వామిక ఉద్యమాల పట్ల పాలసీ పరంగా కూడా ఏకీభావం ఉండడంతో ఆయా ఉద్యమాల్లోని  సీ్తల అనుభవాలను కూడా భూమిక రికార్డ్‌ చెయ్యగలుగుతోంది. భూమిక అంటే మన పతిక్ర అనే సొంతదనాన్ని రచయిత్రులకి కలిగించడంలోనూ, పతిక్రను కమ్రం తప్పకుండా నడపడంలోనూ, పమ్రాణాలను ఎప్పటికపుడు మెరుగుపర్చుకోవడంలోనూ ఎల్లపుడూ చురుకుగా వ్యవహరించే సంపాదకురాలు కొండవీటి సత్యవతికీ, భూమిక బృందానికీ ఇరవై వసంతాల భూమికకీ, రచయితుల్రకీ, అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

మల్లీశ్వరి
‘రెండు దశాబ్దాల భూమిక’ – ఆత్మగౌరవపు పతాక
మన ‘భూమిక’ ఇరవై సంవత్సరాల పస్థ్రానం విజయోన్ముఖంగా సాగిన సందర్భంగా కార్యనిర్వాహకులకు అభినందనలు! సీ్తవాద ఉద్యమ గమనంలో తన పత్య్రేకతను నిలబెట్టుకుంటూ మహిళల జీవన కోణాల్ని ఆవిష్కరించిన నెచ్చెలి భూమిక.
జాతీయ, పాంతీయ, అంతర్జాతీయ మహిళోద్యమాలు, జీవితానుభవాలు, సంఘాలు, వేదికల కార్యాచరణలు… కార్యక్రమ నిర్వహణలు… బాలికల స్వీయ సృజన గాధలు, బాలసాహిత్యం, సీ్త దృక్కోణం నుండి కవితలు, కథలు, సమీక్షలు, పరిచయాలు… యాతా విశేషాలు, సభల రిపోర్టులు… కరపతాల్రు అన్ని విభాగాల్లో రచనలు చైతన్యపథాన్ని నిర్దేశిస్తూ సీ్త శక్తిని పత్రిబింబిస్తూ మహిళాలోకానికి విశ్వాసాన్నీ ఆత్మస్థైర్యాన్నీ, సమూహ చైతన్య అవగాహననూ పంచించీ పెంచిందీ భూమిక.
తెలుగు సాహిత్య-ఉద్యమ రంగంలో ఈ రెండు దశాబ్ధాలూ (1990-2010) ఎంతో కీలకమైనది. ఉద్యమాల ఆవిర్భావం, వాటి దిశా నిర్దేశం జరిగి, సాహిత్య ఉద్యమరంగాల విస్తృతినీ పజ్రాస్వామికతనూ పెంచిన దశాబ్దాలు ఇవి. సీ్త స్వాతంత్యకాంక్ష, స్వేచ్ఛా దృక్పథం, సీ్త సమానత్వం కేందంగా ఆవిర్భవించిన సీ్తవాద ఉద్యమాన్ని ఉధృతం, పరిపుష్టం చేసిన కాలంలో భూమిక పాత చరిత్రాత్మకమైనది.
నూరేళ్ళ శామ్రిక మహిళా ఉద్యమ చరితల్రో…. తనపై అసమానత్వాన్నీ, అమానవీయ చర్యల్ని ఎదుర్కొంటూ పత్రిఘటించే లోకానికి 8 మార్చి ఒక మైలురాయిగా నిలుస్తూ వచ్చింది. పప్రంచ వ్యాప్తంగా మహిళలకు ఒక ఆత్మగౌరవపు పతాకగా 8 మార్చి నిలిచింది. సామాజిక పురోగమ చరితక్రాలంలో ‘మాతృస్వామ్యం’ నుండి మట్టికరిచే దశకు దిగజారిన సీ్త జీవన కమ్రాన్ని  సీ్త జనవైతాళికులూ, సంస్కరణ వాదులూ చేసిన తిరుగుబాట్ల కారణంగా సీ్త మానవ హక్కుల భావనలకు బలం చేకూరి సామాజిక, రాజకీయ, జండర్‌ విముక్తి ఉద్యమాల పభ్రంజనాలు లేచాయి- అపవాదులూ-అవమానాలూ, కుటల్రూ-మోసాలు ఎన్ని జరిగినా కడకు ‘శతాబ్ది మహిళకు శతవందనాలు’ అర్పించింది పప్రంచం. విజయాలు కొన్ని నమోదు అయ్యాయి, గుణపాఠాలు మార్గదర్శకాలయ్యాయి… ఇంకా  నాగరికత, సభ్యతా చిరుగుల బొంతగా ఉన్న వాస్తవం కాదనలేం. విప్లవోద్యమాలు అసంపూర్ణంగావడం చూస్తున్నాం.
నూరేళ్ళ పోరాట చరితన్రు దిక్సూచిగా మరో నూరేళ్ళు మానవజాతి విమోచనా పోరాటం చేయాల్సి ఉంది. సమసమాజం పితృస్వామ్యంలో సాధ్యం కాదని స్పష్టమయిపోయింది. మాతృస్వామ్యాన్ని మళ్ళీ నిలబెట్టడమో సరైనదని నాకనిపిస్తున్నది. ‘స్వామ్యాన్ని’ వ్యతిరేకించే సామ్యవాదులమైన మనం మళ్ళీ మాతృస్వామ్యం ఏమిటని పశ్న్రిస్తారేమో… కొందరు హాహాకారాలూ చేస్తారేమో…
సృష్టికి పత్రిసృష్టి చేసి సమాజాన్నీ కుటుంబాన్నీ లాలన చేస్తూ ఆలనా-పాలనా చేసే మాతృమూర్తి, సీ్త, మహిళ ఆధిపత్య అహంకృత భావజాలానికి లోబడదు అని నా ధృడ విశ్వాసం. అందుకే నేను మాతృస్వామ్యవాదిని. సీ్తలు సహజంగా అహింసావాదులు, పేమ్ర మూర్తులు.. అయితే అదే అదనుగా తీసుకొని పితృస్వామ్యం వారిని పిరికివారుగా, అబలలుగా దౌర్జన్యంగా నమ్మించింది- అత్యాచారాలు, అణిచివేతలతో దుర్మార్గంగా గాయపర్చింది. వారిని త్యాగాలకూ, భోగానికే పరిమితం చేసుకొని మరోవైపు వారి శమ్రదోపిడీని కొనసాగించింది.
ఈ నీచత్వాలు, దారుణాలూ మహిళలు స్వాభావికంగా చేయలేరు. స్త్రీలు సమాజ, మానవ జాతి నిర్మాతలు- మగవాళ్ళు విధ్వంసకులు. అందుకే నమ్మకంగా నిశ్చలంగా మాతృస్వామ్యమే శరణ్యమంటున్నది.
‘సీ్తల వ్యక్తిగతమంతా లైంగిక రాజకీయార్థికమే’ అయిన వ్యవస్థలో ‘కులం’, కులవ్యవస్థ, పితృస్వామ్యకులవ్యవస్థ అంశాలు పధ్రాన చర్చగా ముందుకొచ్చాయి దళిత వాదం. దళిత సీ్తవాదం రూపంగా ‘సీ్తల వ్యక్తిగతమంతా లైంగిక కుల రాజకీయమే’ అన్న ఆలోచనావగాహన ఏర్పడింది. దళితవాద ఉద్యమ ఫలితంగా.  శాస్తాల్రూ, భావనలూ, ఉద్యమాలూ తలెత్తడానికి సామాజిక, మేధో నేపథ్యాలు కారణమవుతాయి. ఇది ఉద్యమాల యుగం. మార్పులు కోరుకుంటున్న కాలం. అన్యాయాల ముసుగులు చీల్చి అసమానత్వాల కోటగోడలు పడగొడుతున్న ఆధునిక కాలం.
‘భూమిక’ మరిన్ని దశాబ్దాలు పరిణామకమ్రంలో పయనిస్తూ తన చారిత్రక భూమిక నిర్వహణలో ముందుండాలని కోరుకుంటూ ఈ రెండు దశాబ్దాలపాటు ‘భూమిక’ కోసం శమ్రిస్తున్న మితుల్రందరికీ నీరాజనాలు అర్పిస్తున్నాను.
పియ్ర మితుర్రాలు భూమిక సారథి సత్యవతికి ఆత్మీయ అభినందనలు ! రెండు దశాబ్దాలు గడిచిపోయాయా అనిపిస్తుంటే ఒక ఉద్విగ్నత హృదయాన్ని నీటిచెలిమలా రెండు కళ్ళను నీటిఊటల్లా చేసి అనిర్వచన మనస్థితిని కలిగిస్తున్నది. ఎంత శమ్ర, ఎన్నిపాట్లు, ఎంతటి నిబద్ధత! ‘భూమిక’కు సీ్తవాద ఉద్యమ జైజైలు! హమ్‌ హోంగే కామ్‌యాబ్‌ ఇప్పుడూ ఇకముందూ… సమీకృత మహిళా చైతన్యం సాధించి తీరును విజయం…
విజేతల పప్రంచంలో వీరోచితంగా అడుగుపెట్టి ఆశయగమ్యానికి అడుగుదూరంలో ఉన్న మహిళా ఉద్యమం – అందిపుచ్చుకుంది భూమిక సహచర్యం.. గెలుస్తాం మనం.. ఈ గెలుపు పీఠాలనెక్కి, భుజకీర్తులు అలంకరించుకుని అహంకరించే గెలుపు కాదు.. ఈ గెలుపు సమతాసౌందర్యవనంలో వెన్నెల ఉద్యానవనాల్ని నాటుకొని అందమైన నవసృష్టిని అరమరికలు లేక ఆస్వాదించి అద్భుత జీవనదృష్టినిచ్చేది.
భావుకత్వం-భవిష్యత్‌ స్వప్నాన్ని అతిశయోక్తిగా ఆశిస్తున్నదేమో… అయినా సరే.. శుభాకాంక్షలు! అభినందనలు!

అనిశెట్టి రజిత
సంపాదకులు కె. సత్యవతి గారికి,
పి.సత్యవతి గారి సాహిత్య కృషిని సమీక్షిస్తు వచ్చిన ఫిబవ్రరి సంచిక ‘భూమిక’ ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. మనసు మెచ్చిన రచయితి గురించి మరోసారి చదవడం సంతోషం. అసలు తామెవరు, తామేంటి, తామెందుకు ఇలా పలు కోణల్లో తమని తాము సీ్తలు తెలుసుకొనేందుకు సకల సామగిన్రీ అందించింది ఆమె సాహిత్యం. సీ్తల మస్తిష్కాల్లో ఆలోచనా తరంగాలని సృష్టించడంలో ఆమె రచనలు నిర్వహించిన పాత అపారం. విషయం, కథన శిల్పం ఒకదానికొకటి పడుతున్నట్లు సాగే ఆమె రచనా కౌశలాన్ని వ్యాసాలన్ని గుర్తు చేశాయి.
పతిక్ర నిర్వాహకులకు కృతజ్ఞతలు.
 కె. శోభాదేవి
భూమిక బహుజన మహిళల వేదికగా మారాలి
20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న భూమికకి శుభాకాంక్షలు. భూమిక మితుల్రందరికి అభినందనలు.
నా అనుభవాలు నన్ను రాయించే దిశగా నడిపించే కమ్రంలో ‘భూమిక పతిక్ర’ పరిచయం జరిగింది. భూమిక ఎడిటర్‌ కొండవీటి సత్యవతి వెంటబడి ‘మాక్క ముక్కుపుల్ల గీన్నే పోయింది’ ‘కాలమ్‌’ని పెట్టించింది. కొంతమంది సీ్తవాదులు  సీ్తలకొక పత్రిక వుండాలనే దృక్పథంతో సీ్తవాద పతిక్ర భూమికను తీసుకొచ్చారు. ఇతర భాషా రచనల్తో ఎక్కువగా పరిచయంలేని సీ్తలకోసం పతిక్ర వుండాలనే ఆశయంతో, సీ్తల చర్చల వ్యాసంగాలు, మరుగునపడిన సీ్తల కళలు, సాహిత్యం, చరితల్న్రి వెలుగులోకి తీసుకొనివచ్చే రచనలను యీ పతిక్ర ద్వారా అందించాలనీ, సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల్ని సీ్తవాద సిద్ధాంతంతో అవగాహన కలిగించే రచనలు తీసుకురావాలని అప్పటి భూమిక సంపాదకవర్గం పేర్కొనడం జరిగింది.
ఏ కులాల సీ్తల కోసం, ఏ  సీ్తల అవసరాల కోసం, ఏ సీ్తల చర్చలు, ఏ సీ్తల కళలు, సాహిత్యం, చరితన్రు వెలుగులోకి తీసుకొని వచ్చే రచనలకు వేదికవుతుందనే స్పష్టత అప్పటి యిప్పటి భూమిక కార్యనిర్వాహకవర్గంలో, అడ్వయిజరీ కమిటీలో అపస్త్రుతాలుగా వున్నాయి. మొత్తంగా భూమిక పతిక్రలో అడ్వయిజరీ కమిటీలో, ఎడిటోరియల్‌ బోర్డులో అగవ్రర్ణకులాల మహిళలున్నా, వారి రచనలు, సమస్యల కోసమే పధ్రానంగా పనిచేసినా… అణగారిన మూలవాసి మహిళల సమస్యలకు, రచనలకు కూడా కొంతచోటు కల్పించింది భూమిక సీ్తవాద పతిక్ర. భూమిక వచ్చినట్లు వివిధ కులాల్లో, మతాల్లో, పాంతాల్లో వున్న మహిళలందరికి అనేక మహిళాపతిక్రలు రావాల్సిన అవసరముంది. 20 సం||లు సీ్తవాద సిద్ధాంతానికి, ఫెమినిస్టు రాజకీయ చర్చలకు వేదికగా ఎన్నో అవాంతరాల్ని అధిగమిస్తూ పతిక్రను నడిపిస్తున్న భూమిక సంపాదకులను అభినందించాలి.
అంటబడని మహిళల సమస్యల్ని ఫెమినిస్టులు అర్థం చేసుకున్న పరిధుల్లోనే భూమిక ఆవిష్కరించింది. ఎస్సీ, ఆదివాసీ, బీసీ, మైనారిటీ మహిళల జీవితాలు, వైవిధ్యాలు, వైరుధ్యాలు వాటి చుట్టూ అగాధంలా విస్తరించిన వాస్తవాలు యింకా చీకట్లోనే వున్నాయి. ‘మా అయ్య అల్లింది వాల్లయ్య రాసిండు. రాత రాజైంది అల్లిక అంటరానిదైంది’లో అల్లింది మగబానిస, రాసింది మగయజమాని. అల్లినరాత కనీసం రికార్డుగానైనా మిగిలింది. కాని మా అవ్వ అల్లిందాన్ని ఏ అవ్వ రాయలే. మా అవ్వ అల్లికలు రాత నమోదు కాలే. ఆ అల్లికలన్నీ చరిత మరుగున బడ్డాయి అని వెలికిరావాల్సిన అవసరముంది.
రాష్ట్రంలోని గామ్రాల్లోకి బోతే, స్థానికంగా దళిత గిరిజన మహిళలు వారి బతుకుదెరువుల్ని, వనరుల్ని దెబ్బతీస్తున్న రిలయన్స్‌ కేజీ బేసిన్‌, జిందాల్‌, ఎల్‌ అండ్‌ టి, వాన్‌పిక్‌, పోలేపల్లి, అపాచి, కాకినాడ సెజ్‌ల వంటి కంపెనీల మీద పోరాడుతున్నారు. మీడియా సెలెబిట్రీల పెళ్లిపేరంటాలకు వారాల తరబడి యిచ్చిన విలువ యీ మహిళల ఉద్యమాల్ని పట్టించుకోవట్లేదు. యీ మహిళలు అభివృద్ధి అంచు ఆవల్నే వున్నారు. వారి జీవితాలు యింకా పిడికెడు మెతుకుల చుట్టే క్షోభిస్తున్నయి.
మన సమాజంలో రాజన్నలోల్లు, మందుచ్చోల్లు, కాకిపడుగుల, డక్కలి పిచ్చకుంట్ల, బుడిగజంగాలు, సిందోల్లు, మాష్టి, యానాది, కోయ, గోండు వంటి అనేక సంచారజాతుల మహిళలున్నారు. వారి జీవన స్థితిగతులు, వారి భాష, కళాసంస్కృతులు, చరితల్రు, వాల్ల మగ పెత్తనాలు, కుల అస్తిత్వాలు, కులదోపిడి, లైంగికదోపిడి, శమ్రదోపిడిని అచ్చంగా వాళ్ల అనుభవాలను నమోదు చేయడం అవసరం. రచన అంటే పెన్నుబట్టి పేపరు మీద రాసిందే కాదు. మనకు రాతబద్దంగాని గుంపులున్నయి. మౌఖికంగా వారి చుట్టూవున్న పర్యావరణానికి వేదికగా భూమిక నిలబడాల్సిన అవసరముంది. యీ మట్టి మహిళల అనుభవాలు, అనుభూతులు, సమస్యలు మెయిన్‌సీ్టమ్‌ కన్నా భిన్నమైనవి, పత్య్రేకమైనయి. వాటికి అక్షరాలు పూయించాలి. కాయించాలి.
భూమిక రచయితుల్రకు పోటీలు నిర్వహిస్తుంది. అట్లనే దళిత, ఆదివాసి, మైనారిటీ రచయితుల్రను పోత్స్రహించడానికి వారిక్కూడా పోటీ నిర్వహిస్తే ఆయా సమూహాలనుండి ఎక్కువ రచయితుల్న్రి సమీకరించే వీలవుతుంది. ఈ 20 సం||లలో మాదిగ దండోర, బీసీ, ఎంబీసీ, ఆదివాసీ, తెలంగాణ వంటి అనేక అస్తిత్వ ఉద్యమాలొచ్చినయి. ఆయా ఉద్యమాల అస్తిత్వ దృక్పథాలకు మద్దతుగా పత్య్రేక సంచికలు తీసుకొస్తే భూమిక సామాజిక బాధ్యతలు సమాజానికి స్పష్టమయ్యేవి. ‘మహిళా రిజర్వేషన్‌ బిల్లు’ విషయంలో కోటాలో కోటా పట్ల స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోయింది. ఒకరిద్దరు తప్ప అగవ్రర్ణ సీ్తలంతా కోటాలో కోటాను వ్యతిరేకించినవాళ్లే.
భూమిక అనేకచోట్లకు విహారయాతల్రు నిర్వహిస్తుంది. అక్కడ జలపాతాల సవ్వడులు, ఆకుపచ్చగా అలికిన అడవులను, అడివిపూలను, పక్రృతి అందాలను ఆనందిస్తూందే గానీ ఆ పరిసరాల పర్యావరణంలో వున్న దళిత, ఆదివాసీ సీ్తల గుండెచప్పుల్లను అప్పుడప్పుడు వినివుండొచ్చు రికార్డు చేసివుండొచ్చు. కానీ అది అప్పుడప్పుడు కాకుండా నిరంతర కార్యక్రమంగా కొనసాగాలి. అప్పుడే అణగారిన మహిళాసమాజాలపట్ల బాధ్యత నెరవేర్చినట్లయితది.
ఆధిపత్య కులాల సీ్తవాదానికి బహుజనకులాల మహిళావాదానికి మధ్యవున్న భిన్నత్వాలకు సంబంధించిన సైద్ధాంతిక చర్చలో ఒకవైపువారికే భూమిక వేదికైంది తప్ప బహుజనకులాల రచయితుల్ర భావజాలాన్ని స్వంతం చేసుకోలేకపోవడం బాధాకరం. అణగారిన కులాల మహిళల సైద్ధాంతిక భావజాలానికి, రచనలకూ ‘భూమిక’ ఇకనైనా భూమికవుతుందని ఆశపడదాం.

జూపాక సుభద్ర
గౌరవనీయులు
సత్యవతి గారికి,
ఉద్యమాభివందనలు.
గత రెండు దశాబ్దాలుగా ”భూమిక” సీ్తవాద పతిక్రను అవిచ్చిన్నంగా నిర్వహిస్తున్నందుకు కేవలం అభినందనలు మాత్రమే చెప్పడం బొత్తిగా తక్కువే.
మీ కృషి, పట్టుదల, మితుల్రను మితస్రంస్థలను కలుపుకుని పోయే తత్త్వం- తప్పక  సీ్తలందరూ (కేవలం సీ్తవాదులు మాతమ్రే కాదు) అలవర్చుకోదగిన మంచి లక్షణాలు.
లోగడ నా వ్యాసం, కవితలూ మీరు  పచ్రురించారు సంతోషం. ఉత్తరాల పేజీని కేవలం మెచ్చుకోళ్లకేగాక ఒక అభిపాయ్ర వేదికగా, చర్చావేదికగా  పచ్రురించడం గమనించాను. పతిక్రను అవిచ్ఛిన్నంగా నిర్వహిస్తూ కూడా మీరు మీ కథా సంపుటాలను రెండింటిని పచ్రురించగలిగేరు. ఏటా మైతి పూర్వక యాతల్రనూ విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ”అవగాహన” కూడా మిమ్ములను, మితుల్రందర్నీ ఆహ్వానిస్తున్నాను. ‘భూమిక’ అని చెప్పడం సత్యదూరం.
భూమిక శాశ్వతంగా నడవాలనీ, సీ్తలకు అవసరమైన మేరకు అండగా నిలవగలగాలనీ కోరుకుంటున్నాను.
సీ్తవాదం సీ్తలకోసం కాదు, మానవతా దృక్పథం, పౌరహక్కులు,  పజ్రాస్వామ్య విలువల కోసం అనే అవగాహన  మరింతగా పెంపొందేందుకు కృషి జరగాలి.
ఉద్యమాభివందనలతో
 మానేపల్లి
మీ ఉత్తరం అందింది. ధన్యవాదాలు. పార్రంభ సంచిక నుండి భూమికను చదువుతూనే ఉంటున్నాను. మీరు మనసుపెట్టి, ఎన్నెన్నో శమ్రలకోర్చి  సీ్తవాద పతిక్రను నడుపుతున్నారు. సమకాలీన సాహిత్యం మీద, సమాజం మీద వస్తున్న భూమికలోని రచనలు సగటు సంస్కారాలను ఉన్నతీకరించే దిశగా ఉన్నాయని వేరుగా చెప్పనఖ్ఖరలేదు. వాస్తవానికి ‘భూమిక’ మన సమాజంలోని చాలామంది మనస్సుల పొరల్లోని పోగొట్టుకుంటూ రావలసిన మురికిని శుభపరిచే  పయ్రత్నం చేస్తోంది.
భూమిక హెల్ప్‌లైన్‌ నిర్వహణ కూడా అపూర్వ పయ్రత్నం. భూమిక అవిచ్ఛిన్నంగా కొనసాగాలని ఆశించే మితుల్ల్రో  నేనొకణ్ణి.

కేతు విశ్వనాథరెడ్డి
సత్యవతిగారికి
మీ ఉత్తరం అందింది. రెండు దశాబ్దాలు పత్రికారంగంలో ‘భూమిక’ ఒక సంచలనం సృష్టించింది. నాకు తెలిసి సీ్తవాద పతిక్రలు ఇతరాలు తెలుగులో ‘సీ్తవాద’ ఉద్యమస్ఫూర్తితో నడిచినవి లేవు. సీ్తసేవాతత్పరత కలిగిన పత్రికలు ఉండవచ్చు. స్త్రీలల్లో అన్ని రంగాలలో నిత్యచైతన్యం కలిగించడానికి భూమిక చాలా కృషి చేసింది. ఇందులోని వ్యాసాలు, కవితలు (పురుషులు వాస్రినవి కూడా), ఆసక్తికరంగా, ఉత్తేజపూరితంగా వుండి నాకు చాలా ఆనందం కలిగించేవి. అప్పుడప్పుడు మహిళాబృందాల పర్యటన విశేషాలు కూడా నన్నాకర్షించాయి. ఏ విధమైన ఇతర సంస్థల సహాయం, వారిచే నిధులు లేకుండా మీ యీ పత్రికను నిర్వహించడం, బాధిత సీ్తలకు సముచిత సలహాలు యిస్తూ వారికి దిక్సూచిగా నిలవడం బహుశా మహిళా జర్నలిజం రంగంలో ఇది ఒక కొత్త పయ్రోగం.
రెండు దశాబ్దాలు అయినా మరో 20 దశాబ్దాలపాటు యీ పతిక్ర సజీవంగా నిలవాలని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను.
 పోతుకూచి సాంబశివరావు
సత్యవతి గారికి,
నమస్తే!
భూమిక రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా; ఇందులో మీ కృషి, పట్టుదలకు నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
సమాజంలో, దేశంలో, పప్రంచ వ్యాప్తంగా మహిళల పట్ల వివక్ష, హింస, అణచివేతలకు వ్యతిరేకంగా ‘భూమిక’ ద్వారా ఒక లక్ష్యంగా, పోరాటంగా ముందుకు సాగుతున్న మీకు, మీ సహచరులకు అభినందనలు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పత్య్రేక సంచిక తీసుకు రావాలన్న మీ సంకల్పం ఆనందదాయకం.
సమస్యలో ఉన్న  సీ్తల కోసం మీరు ఏర్పాటు చేసిన భూమిక హెల్ప్‌లైన్‌ ద్వారా పరిష్కరించబడిన వాటి వివరాలు భూమికలో చోటు కల్పిస్తే బావుంటుంది. అదేవిధంగా బాలికలు, యువతకు పత్య్రేక శీర్షికలు కేటాయించడం గురించి పరిశీలించగలరు.
యీ సందర్భంగా నా నుండి రూ. 500/- లతో బాటు మరో ముగ్గురి చందాదారులు వివరాలు తెలియపరుస్తున్నాను. వారికి చందా రెన్యువల్‌లో కొంత జాప్యం జరిగినా, భూమిక పంపడం ఆపకండి. నావంతుగా రెన్యువల్‌ పర్యవేక్షిస్తాను. ధన్యవాదాలు.
కె. రాజశ్రీ
మానవీయ పుత్రిక
చాలా సంవత్సరాలుగా ”భూమిక”ను చదువుతున్న పాఠకులలో నేనూ ఒకడిని. మీరు ”సీ్తవాద పతిక్ర” అన్నారు గాని నాకు ”భూమిక”లో మానవీయ విలువలే కనిపిస్తున్నాయి. కథలైనా, కవితలైనా, ఇతర వ్యాసాలైనా, మీ సంపాదకీయమైనా బాధితుల పట్ల సానుభూతే కనిపిస్తుందిగాని ఎవరిపట్లా ద్వేషం కనిపించదు. కొన్ని కొన్ని రచనలు ఎప్పటికీ జ్ఞాపకం వస్తుంటాయి. కోర్టు ఆవరణలో మీకు కలిగిన అనుభవం గురించి ఒకసారి వాశ్రారు. న్యాయవాదులు కూడా ఇంతేనా అనిపించింది.  విలువలతో కూడిన పత్రికను నడపటం చాలా కష్టం. కష్టమో, నష్టమో తెలియదు గాని కమ్రం తప్పక మీరు పతిక్రను వెలువరిస్తున్నందుకు, ఆలోచనాత్మకమూ, విజ్ఞానాత్మకమూ ఐన రచనలను పచ్రురిస్తున్నందుకు, కొత్త తరాలతో పాత, రోత ధోరణులను తొలగించే పయ్రత్నం చేస్తున్నందుకు మీకు అభినందనలు. మరెన్నో దశాబ్దాలు మీ సేవలు తెలుగు పాఠకులకందాలని ఆకాంక్ష.
పొత్తూరి వెంకటేశ్వరరావు
భూమిక ఇవాల్టి అవసరం
మనకీ మీడియా ఉంది. అత్యధిక సర్క్యులేషన్‌లతో అలరాడుతున్న వార్తా పతిక్రలు నిరంతరం ‘ఎబిసి’ గణాంకాల్లో మేం ముందుంటే మేం ముందున్నాం అంటూ పోటీ పడుతుంటాయి. ‘ఈ పప్రంచంలో ఒక వ్యాపారం ఉంది. ఆ వ్యాపారంలో వినియోగదారుడు తప్పనిసరిగా నష్టపోతాడు. ఆ వ్యాపారం పేరే మీడియా’ అని అమెరికన్‌ రాజకీయ వ్యాఖ్యాత రష్‌లింబా అంటారు. పస్త్రుతం పప్రంచీకరణ వ్యవస్థలో ‘మీడియా’ అన్నది చాలా ఆకర్షణీయమైన పదం. పప్రంచవ్యాప్తంంగా గ్లోబలీకరణ ఎంతగా పరివ్యాప్తమెందో తెలుసుకోవాలంటే ఈ దిశగా సంభవించిన సమాచార విప్లవాన్ని అధ్యయనం చేసి తీరాలి. సామాజిక విప్లవాల్ని ఒకప్పుడు ప్రభావితం చేసిన పస్రార మాధ్యమాలే ఇవాళ పప్రంచీకరణ ఉచ్చులో చిక్కుకుని స్వీయ స్వభావాన్ని, నిబద్ధతను పొగొట్టుకుని డొల్లగా మారాయి. సామాజిక విప్లవాలలో వాణిజ్యపరమైన మీడియా పాత ఎప్పుడూ సందేహస్పదంగానో, లేక ప్రజా సమస్యలకు వ్యతిరేకంగానో ధ్వనించడం షరా మాములైపోయింది. పజ్రలు తమ పజ్రాస్వామిక హక్కుల కోసం ఉద్యమిస్తారు. కానీ వారి డిమాండ్లకి పధ్రాన సవ్రంతిగా పేర్కొనే  మీడియా సంస్థలన్నీ ఎలాంటి పాధ్రాన్యాన్ని ఇవ్వవు. ఒకవేళ ‘మెరుగైన సమాజం’ కోసం ఉద్యమిస్తున్నట్లు కనిపించినా అలాంటి నినాదాలు కూడా మీడియా వ్యాపారంలో ఒక ‘యుఎస్‌పి’గానే ఉపయోగపడతాయి తప్ప, చిత్తశుద్ధి ఎంతమాతమ్రూ కనిపించదు. పజ్రా ఉద్యమాలు ప్రజల పయ్రోగపాలకు ఉద్దేశించినవే. కానీ ఈ పయ్రోజనాలు పభ్రుత్వ, వాణిజ్య సంస్థల పయ్రోజనాలకు భిన్నంగా ఉండడమే
ఈ  విపరీతపరిణామానికి కారణం. పభ్రుత్వాల్ని, పారిశామ్రికవేత్తల్ని, వాణిజ్యవేత్తల్ని పశ్న్రించే పజ్రా ఉద్యమాలు తప్పనిసరిగా మన పధ్రాన సవ్రంతి మీడియాకు కంటగింపుగానే ఉంటాయి. ఇవాల్టి మీడియా పజ్రల అవసరం కాదు. రాజకీయ నేతలకు, పారిశ్రామికవేత్తలకు, అగవ్రర్గాలకు, వాణిజ్యవేత్తలకు సంబంధించిన రాజకీయ, ఆర్థిక అవసరం మాతమ్రే.  రాజకీయ అవినీతికి, పజ్రా పయ్రోజనాలకు మధ్య సమతౌల్యాన్ని పాటిస్తూ, మీడియా వర్గం తన ‘జీవిక’ను కొనసాగించడం కత్తి మీద సాములాంటిది. ఈ కష్టసాధ్యమైన విషయంలో సాధారణంగా విలువలకు తిలోదకాలివ్వడమన్నదే వీరికి అతి దగ్గరి, సులభసాధ్యమైన మార్గం. ఇంతగా కలుషితమైన మీడియా వాతావరణంలో మహిళల స్థానం ఏమిటి? పజ్రా  హక్కుల్లో భాగమైన మహిళా హక్కులకు మీడియా ఇస్తున్న ప్రాధాన్యమెంత? మహిళలకు మీడియా ‘చోటెంత’? మీడియా కథనాల్లో మహిళల్ని పితృస్వామిక సామాజిక, నైతిక చటాల్ర నుంచి విడదీసి, వారి శారీరక, భౌతిక పరిస్థితుల్లోంచి చూడడమన్నది ఇవాల్టి మన మీడియాకు సాధ్యపడుతుందా? ఆంధప్రద్రేశ్‌లో మహిళోద్యమానికి ఏళ్ళూ పూళ్ళూ నిండుతున్నా ఇంకా మనం ‘కసాయి తల్లి’, ‘ముద్దుగుమ్మలు’ వంటి ఆవాచ్యాల్ని వినక, చూడక, చదవక తప్పని పరిస్థితి ఉంది. మీడియాలో జెండర్‌ స్పృహ అన్నది ఇవాల్టీకీ అందని పండే. ఇలాంటి కఠోర వాస్తవాల్ని జీర్ణించుకుంటూ ముందుకు వెళుతున్న మహిళెద్యమానికి రాష్టంలో ఊతంగా నిలబడింది భూమిక. సీ్తల దృక్కోణంలోంచి, సీ్తల చేత పూర్తి స్థాయి పజ్రాస్వామిక విలువలకు అద్దం పడుతూ వెలువడుతున్న భూమికకు హృదయపూర్వక శుభాకాంక్షలు. భూమిక వెలుగు చూడడం వెనుక భూమిక సంపాదక వర్గం ఆర్థికపరమైన ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని కూడా గంభీరంగా మహిళల పక్షాన నిలబడింది. నిలబడుతోంది. ఇవాల్టి కమర్షియల్‌ మీడియా సమాజంలో పజ్రా ఉద్యమాలకు తన గొంతుకనిచ్చి, మహిళలందరూ ‘ఇది మన పతిక్ర’ అనుకుని తమను తాము భూమికలో ఒక భాగంగా భావించేలా వారి పక్షాన నిలబడింది భూమిక. భూమిక పస్థ్రానం ఇక ముందు కూడా నిరాటంకంగా, మరంత నూతనోత్తేజంతో మున్ముందుకు సాగాలని మనసారా కోరుకుంటూ….

   పసుపులేటి గీత
ఒక వ్యక్తి జీవితంలో కాకపోవచ్చుగాని ఒక పతిక్ర జీవితంలో ఇరవయ్యేళ్లు అనేది చాలా పెద్దకాలం. నిరంతర తపస్సులాంటి పక్రియ వుంటేగాని అది సాధ్యం కాదు. నిజంగా ఆ తపస్సు సత్యవతి గారిది, వారి బృందానిది.
ఆర్థిక హస్తాలందించడం మన తెలుగువారికి అంతగా అలవాటులేని పని. అయినా సకాలంలో, నాణ్యత చెడకుండా పతిక్రను తీసుకురావడంలో నిర్వాహకులు పడే కష్టం అర్థం చేసుకోలేనిదేమీ కాదు.  వర్తమాన తెలుగు సాహిత్యంపైన ఒక ముద వెయ్యటమే కాకుండా భూమిక జెండర్‌ సీ్తని మానవ సీ్తగా చూపించటంలో విజయం సాధించిందనే చెప్పవచ్చు. అలాగే ఫెమినైన్‌ సెన్సిబిలిటీ కి అద్దం పట్టడంలో సముచిత పాతన్రు నిర్వహించిందని భావించవచ్చు.
భూమిక సత్యవతి గారికి మా గౌరవాభినందనలు.
– ఎన్‌. అరుణ, ఎన్‌. గోపి

 

Share
This entry was posted in ఎడిటర్‌కి లేఖలు. Bookmark the permalink.

One Response to భూమిక ఇవాల్టి అవసరం

  1. We need True Justice says:

    నిజంగా అభినందనీయం. కాని అసలు మగవాళ్ళు అంతా చెడ్డ వారేనా? పది మంది ఆడ వాళ్ళలో ఒక్కరైనా చెడ్డ వారుండ రా?

    మీ దగ్గరకు ఎవరైనా మహిళ వచ్చి సమస్య చెబితే (ఆమె భర్త గురించి), ఎంత నిజం వుందో, అసలు ఎవరిదీ తప్పో తెలుసుకుంటారా? లేక గుడ్డిగా ఆడది అయితే చాలా?

    నేనొప్పుకుంటాను – ఆడవాళ్ళ గొప్పతనం, ఔదార్యం. కానీ, అసలు ఎవరో మగాళ్ళను దృష్టిలో పెట్టుకొని అందరినీ అదే తాడుతో కట్టడం కరక్టేనా?

    నాకు తెలిసి ఒకామె భర్త మీద ఇష్టం లేక, కేస్త పెట్టి తనకన్నా ఎంతో చిన్న వాడైన ఓ మగాడితో వెళ్ళిపోయింది. అతనింట్లో వారు తమ మాట వినకపోతే వినకపోయారు కనీసం చట్టబద్దంగా విడాకులు తీసుకొని మీకు నచ్చినట్టు చేసుకోండి అంటే, ఆమె ఇచ్చిన సమాదానం అతని ఆస్తిలో భాగం వచ్చేవరకు డైవర్స్ తీసుకోదట. అలా అని అతనితో వెళ్ళాడట(ఆమె ఇష్టం అనుకోవచ్చు).

    రెండో పెళ్లి చేసుకున్తున్నపుడైనా ఆస్తి ఎందుకు? చట్ట బద్దంగా క్లియర్ అయితే వారికే మంచిది కదా? ఆమె నైజం ఇక్కడ కనిపిచ్న్హట్లేదా? ఆమెకు సప్పోర్ట్ చేయడం అంటే అతనికి ద్రోహం చేసినట్టు కాదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.