గులాబీపూవులారా!
Posted By భూమిక on July 21, 2007
- శ్రీవాణి వాగ్దేవి
గులాబీపూవులారా!
మీ మృదుమంజులదళములకు
పదును పెట్టుకోండి!
లేకుంటే,
దుర్మార్గం, దౌర్జన్యం
తమ ఇనుప పాదాల కింద
మిమ్మల్ని నలిపివేస్తాయి
అందుకే,
గులాబీపూవులారా!
మీ రేకులకు పదును పెట్టుకోండి
చిన్న చిన్న మాటలలో.ప్రతిభా వంతమైన
కవితాచిత్రణ,మంచి భావ వ్యక్తీకరణ.
“గులాబీ పూవులారా!అనే ఈ చిరు కవిత.
రేకులు పదునైనంత మాత్రానా ఇనుపపాదాలు నలపకుండా ఉంటాయా? భావవ్యక్తీకరణ బాగున్నా, పదచిత్రణలో కొన్ని లొసుగులున్నాయి. గమనించగలరు.