లాడ్లీ మీడియా అ”వార్డ్స్‌ ఫర్‌ జండర్‌ సెన్సిటివిటి 2011-12 దక్షిణ భారతం

దక్షిణ భారతదేశానికి చెందిన రాష్ట్రాలలో పనిచేస్తున్న మీడియా నుండి నాలుగో సారి లాడ్లీ మీడియా అవార్డులు 2011-12 కోసం ఎంట్రీలను ఆహ్వానిస్తోంది పాఫ్యులేషన్‌ ఫస్ట్‌.
2007లో బొంబాయి కేంద్రంగా లాడ్లీ మీడియా అవార్డులను నెలకొల్పాం. క్రమంగా, యుఎన్‌ఎఫ్‌పిఏ సహకారంతో ఈ అవార్డుల్ని దేశం మొత్తానికి విస్తరించాం.
బాలికల మీద అమలవుతున్న వివక్షకు వ్యతిరేకంగా, మీడియాలో జండర్‌ అవగాహనతో కథనాలు రాసే జర్నలిస్ట్‌లకు, మీడియా హౌస్‌లకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ముఖ్యంగా ప్రచురణ, ప్రసార, దృశ్య, వెబ్‌, రేడియో మాధ్యమాలలో వచ్చిన సంపాదకీయాలు, వార్తా కథనాలు, ప్రకటనలు, సూక్ష్మచిత్రాలు, న్యూస్‌ఫీచర్లు, వ్యాసాలు, పరిశోధనాత్మక రిపోర్టులు ఈ అవార్డులకు అర్హమైనవి. అలాగే ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, రేడియో మాధ్యమాల్లో ప్రసారమయ్యే ప్రకటనలు, జింగిల్స్‌, సర్వీస్‌ మరియు ప్రజాప్రయోజనార్థం వచ్చే ప్రకటనలు కూడా అవార్డులకు అర్హమైనవి.
ముఖ్యంగా ఎంట్రీలు  ఈ క్రింది అంశాల మీద ఫోకస్‌ చేసినవై వుండాలి.
1. భారతీయ సమాజంలో బాలికల, మహిళల విలువ పెంచేవిగా  వుండాలి. 2. జండర్‌ మూస నమూనాలను వ్యతిరేకించేవిగా వుండాలి.
3. సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను జండర్‌ దృష్టికోణంతో విశ్లేషించేవిగా వుండాలి. 4. ప్రత్యామ్నాయాలను సూచించేవిగా, ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేవిగా వుండాలి. ఒక్కొక్కరు ఎన్ని ఎంట్రీలైనా పంపొచ్చు, అన్ని కేటగిరీలకు ఎంట్రీలను పంపవచ్చు.
ఈ ఎంట్రీలన్నీ జూలై 1, 2010 – డిసెంబరు, 31 2011 మధ్యకాలంలో పబ్లిష్‌/ ప్రసారం పొంది వుండాలి.
దక్షిణ ప్రాంతపు అవార్డులు – అండమాన్‌ మరియు నికోబార్‌, ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, కేరళ, లక్షద్వీప్‌, పాండిచ్చేరి, తమిళనాడు ప్రాంతాలకు చెందిన అడ్వర్‌టైజింగ్‌ మరియు మీడియా ప్రొఫెషనల్స్‌ కోసం కేటాయించబడినాయి. దక్షిణ ప్రాంతానికి అనుబంధ సంస్థగా కేసరి మెమోరియల్‌ జర్నలిస్ట్‌ల ట్రస్ట్‌, త్రివేండ్రం పని చేస్తుంది.
ఎంట్రీలు చేరడానికి చిట్ట చివరి తేది 15.7.2012. సమాజంలోని ప్రముఖ వ్యక్తులతో జ్యూరీ ఏర్పడుతుంది. సెప్టెంబరు నెలలో దక్షిణ ప్రాంత అవార్డుల ప్రదానోత్సవం తిరువనంతపురంలో జరుగుతుంది.
అవార్డు ప్రదానోత్సవాలు ముందుగా నాలుగు  రీజియన్‌లలో జరిగి, నవంబరు 2012లో, జాతీయ స్థాయి అవార్డుల ప్రదానం జరుగుతుంది.
బొంబాయికి చెందిన పాఫ్యులేషన్‌ ఫస్ట్‌  బాలికల హక్కుల ప్రచారం కోసం చేపట్టిన కార్యక్రమమే ‘లాడ్లీ’. లాడ్లీకి తెలుగు పదం గారాలపట్టి. సమాజంలోను, మీడియాలోను బాలికలను, మహిళలను పాజిటివ్‌ ఇమేజ్‌లో చూపించడం, దీనికోసం విద్యాసంస్థలతోను, మీడియాతోను పనిచేస్తూ స్త్రీల విలువను పెంచే విధంగా పురుషుల దృక్పధాల్లో మార్పుకోసం కృషి చెయ్యడం ముఖ్యమైనవి. లాడ్లీ మీడియా అడ్వకసీ అనేక కార్యక్రమాలతో రూపొందింది. ముఖ్యంగా మీడియా ఫెలోషిప్‌లు, జర్నలిస్ట్‌ విద్యార్థులకు, జర్నలిస్ట్‌లుగా పనిచేస్తున్నవారికి జండర్‌ సెన్సిటైజేషన్‌ వర్క్‌షాప్‌లు నిర్వహించడం, టి.వి.ఛానళ్ళ క్రియేటివ్‌ డైరక్టర్లతో ముఖాముఖి కార్యక్రమాలు, ప్రకటనలను విశ్లేషిస్తూ అడ్వర్‌టైజింగ్‌ సంస్థలతో పనిచెయ్యడం, క్రియేటివ్‌ మరియు అడ్వర్‌టైజింగ్‌ రంగాలలోని వారికి క్రియేటివ్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను ప్రదానం చెయ్యడంలాంటి ముఖ్యమైన కార్యక్రమాల్ని ఈ లాడ్లీ కాంపెయిన్‌ కింద చేస్తున్నారు.
2010-11 అవార్డుల ప్రదానోత్సవం బెంగుళూరులో జరిగింది. దక్షిణ ప్రాంతానికి సంబంధించి 22 మందికి అవార్డుల ప్రదానం చేశాం. ప్రముఖ రచయిత్రి, స్త్రీల హక్కుల కోసం పోరాడే యోధురాలు సారాజోసెఫ్‌కి జీవిత కాల సాఫల్య అవార్డు ప్రదానం చేసాం. థియేటర్‌ మాధ్యమం ద్వారా జండర్‌ స్పృహను పెంపొందించే కృషి చేస్తున్న పి.సి.రామకృష్ణకు ప్రత్యేక అవార్డు ప్రదానం చేసాం. కన్నడనటి తారా వేణుగోపాల్‌ ఈ అవార్డుల ఉత్సవానికి హాజరయ్యారు. దక్షిణ ప్రాంతానికి సంబంధించిన ఎంట్రీలన్నీ 15 జూలై 2012 తేదీ లోపు ఈ క్రింది వ్యక్తులను చేరాలి.
తెలుగు, హిందీ, ఉర్దూ ఎంట్రీలు: కొండవీటి సత్యవతి ఫోన్‌ : 27660173 / 9618771565
కేరాఫ్‌ : స్త్రీవాద పత్రిక భూమిక, హెచ్‌ఐజి -11, బ్లాక్‌ 8, ఫ్లాట్‌ 1, బాగ్‌లింగంపల్లి, వాటర్‌టాంక్‌ దగ్గర,                 హౖద్రాబాద్‌ -500044

Share
This entry was posted in ప్రకటనలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో