21వ శతాబ్దంలో స్త్రీ సాధికారత – సవాలు వర్క్‌షాప్‌

ఎ.సీతారత్నం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మిసెస్‌ ఏ.వి.ఎన్‌ కళాశాల సెంటర్‌ ఫర్‌ ఉమెన్‌ స్టడీస్‌ మరియు ఉమెన్స్‌ మరియు ఉమెన్‌కస ఇండియన్‌ అసోసియేషన్‌తోతో కలిసి ”21వ శతాబ్దంలో స్త్రీ సాధికారత – సవాలు” అనే అంశంపె ఒక రోజు వర్క్‌షాప్‌ జరిగింది. దీంట్లో నాలుగు తరాల స్త్రీలు పాల్గొనడం విశేషం. ప్రముఖ సాంఘిక సేవకురాలు ఉమెన్స్‌ ఎక్సెలన్సీ అవార్డు గ్రహిత ఏ.వి.ఎన్‌ కళాశాల  కరస్పాండెంట్‌  ఇంద్రాని జగ్గారావు, ప్రముఖన్యాయస్వాతంత్ర పోరాట యోధురాలు దిగుమర్తి సరస్వతీదేవి అలాగే 1942 భారత స్త్రీ సమాజం స్థాపించబడిన నుండీ ఉన్న సభ్యులు మిగిలిన సభ్యులు, ఏవిఎన్‌ కళాశాల మహిళా అధ్యాపకులు, అధ్యేపకేతరులు ఎంపిక చేసిన విద్యార్థులు పాల్గొన్నారు. సీనియర్‌ అడ్వకేట్‌ తాళ్లూరి సుగుణ, ఇన్నర్‌ వీల్‌ సంస్థ వైస్‌ ప్రెస్‌ ప్రెసిడెంట్‌ కస్తూరి రెడ్డి ముఖ్య ప్రసంగాలు చేసారు. ముఖ్య అతిధులుగా పాల్గొన్న దిగుమర్తి సరస్వతిగారు, ఇంద్రాణి జగ్గారావు, నాటి స్త్రీల స్థితి నేడు మారిన తీరు తెన్నులు వివరించారు. ఇంద్రాణి జగ్గారావు బహుముఖ ప్రఝ్ఞాశాలిగా నేటి స్త్రీ మారినందుకు అభినందుస్తూనే-మొత్తం స్త్రీలంతా కుటుంబ పరిధి దాటి సామాజికాభివృద్ధిలో భాగస్వామ్యులవ్వాలని పిలుపు నిచ్చారు. ఉమెన్స్‌ స్టడీ సెంటర్‌ కన్వీనర్‌ డా.సీతారత్నం వర్క్‌షాప్‌ అవసరాన్ని వివరిస్తూ  స్త్రీల సాధికారత 1 కొలమానం  (స్త్రజూఖ )  అనగా స్త్రీ సామాజిక భాగస్వామ్యం, స్వయం నిర్ణయాధికారం మరియు స్త్రీ విద్య ఆరోగ్యం అనే మూడు విషయాలలో నేటి స్త్రీ పరిస్థితిని కూలంకషంగా వివరించారు.
వర్క్‌షాప్‌లో భాగంగా జండర్‌ సమానత్వవృద్ధిలో స్త్రీలు, రాజకీయ సాధికారత, ఆర్థిక సాధికారత మైక్రో రుణాలు, స్త్రీ విద్యాభివృద్ధి, సాధికారత కొలమానం అనే అంశాలపై సుధీర్షమైన చర్చ జరిగింది. ఇందులో కళ్యాణి, స్నేహ, సత్యవతి, కృష్ణకుమారి, డా. శ్యామాలాంబ, డా. సి.హెచ్‌ఎమ&.ఎస్‌.కుమారి, సుబ్బలక్ష్మి, శాంతి, కుసుమ, గ్రూప్‌ లీడర్లుగా  వ్యవహరించారు. విద్యార్ధులు పార్వతి, పుష్ప, మారతల్లి  తమ జాలరి కుటుంబాలలో ఇంకా స్త్రీల చదువు సమస్యగానే ఉందని, ఇంటర్‌ తర్వాత చదువు అనవసరమనే తల్లిదండ్రులు అంటున్నారని పెళ్ళికి ఇచ్చిన ప్రాధాన్యత చదువుకి ఇవ్వరని కుటుంబంతో పోరాడవలసి వస్తోందని తమ ఆవేదన తెలిపారు.
మొదటగా జండర్‌ సమానత్వానికి స్త్రీల బాధ్యత గురించి చర్చించారు. స్త్రీలు తమ దృక్పధాన్ని మార్చుకోవాలని పితృసామ్య స్వభావాన్ని విడనాడాలని కుటుంబం నుండే మొదట సమానత్వం రావాలని పేర్కొన్నారు. అయితే పిల్లల దగ్గర పురుషుడు మారినా భార్య దగ్గర ఇంక మారడానికి సిద్ధపడకపోవడమే గృహహింసకి మూలమని స్నేహలత (కంప్యూటర్‌ సైన్‌ లెక్చరర్‌) సి.హెచ్‌.ఎమ్‌ఎస్‌.కుమారి (తెలుగు లెక్చరర్‌) పేర్కొన్నారు. స్త్రీల అభివృద్ధికొరకు వివిధ సంస్థలు ఒక పక్క ఎడ తెరిపి లేకుండా కృషి చేస్తుంటే – పని పాటు లేకుండా ప్రతి నాయకుల లక్షణాలతో విపరీతంగా ప్రచారం చేస్తున్న టెలీ సీరియల్స్‌లోని వైనాన్ని ఖండించాలన్నారు. ఇంకా స్త్రీలు కాఫీ, టీలు అందించడానికేగానీ, ఆఫీస్‌లు పనిచేయడానికీ, కళాశాలల్లో పాఠం చెప్పడానికి, ఇన్విజిలేషన్‌ చేయడానికి తప్ప వాళ్ళ సలహాల్నీ వినే పరిస్థితి, వాళ్ళకి విలువ ఇచ్చే స్థితి లేదని చెందారు.
విడాకులు పెరిగాయని ముందు తరంవారు బాధపడితే స్త్రీలు తమ జీవితాన్ని తమ చేతిలోకి తెచ్చుకుంటున్నారని తర్వాత తరం భావించారు. అయితే పురుషులు ధోరణి మార్చుకోకపోతే కుటుంబం  అనే పద్ధతి కాలగర్బంలో కలిసి పోయే ప్రమాదం ఉందని తెలిపారు.
దీనికొరకు విద్యలో భాగంగా జండర్‌ విద్యని అందించాలని పాఠ్యాంశాలుగా చిన్నతనం నుండి సిలబస్‌లో చేర్చాలన్నారు. అలాగే భ్రూణహత్యల గురించి మాట్లాడుతూ ఆడపిల్లలు భారం కాదనేటట్టు పెంచాలని వాళ్ళే బాధ్యత పంచుకోవాలని చదువుకొని పెళ్ళి చేసుకుని వెళ్లిపోవడమే అనేటట్లు ఉండకూడదని భారతీయ స్త్రీ సమాజ సభ్యులు నొక్కి వక్కాణించారు.
దీనికొరకు స్త్రీలకి ఉన్నత విద్యవరకు ఉచిత విద్య నందించాలని అలాగయితే వృత్తి విద్యలలోకి వెళ్ళగలుగుతారని పేర్కొన్నారు. స్త్రీ, పురుషులు ఒకరి విలువలు ఒకరు కాపాడుకోవాలని పురుషులకి జండర్‌ చైతన్యం అందిస్తే వారిలో క్రూరత్వం అభివృద్ధి నిరోధకత్వ స్వభావం పోతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ పేరుతో టీనేజ్‌ లవ్‌, సమానత్వం పేరుతో డ్రగ్స్‌ మరియు తాగుడు లాంటి దురలవాట్లు నేర్చుకో కూడదని యువతికి పిలుపు నిచ్చారు.
వీటిన్నిటికిరకు ”బివేర్‌ ఆప్‌ జెండర్‌” అనే పేరుతో ఒక సిలబస్‌ తయారు చేసి ప్రాజక్టర్‌లని ఉపయోగించైనా ప్రతి 15 రోజులకి వీధి వీధిలో జండర్‌ చైతన్య కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించి చివరగా, సరదాగా విద్యార్థులు, అధ్యాపకులు కలిసి రోల్‌ఫ్లే, మ్యూజికల్‌ ఛైర్‌ ఆడి గెలుపొందిన ఫాతిమా అనే విద్యార్థికి ప్రథమ బహుమతి, స్నేహలత అనే అధ్యాపకురాలికి ద్వితీయ బహుమతిని అందించి వర్క్‌షాప్‌ సత్యవతి వందన సమర్పణతో ముగించారు.

Share
This entry was posted in రిపోర్టులు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.