సెక్సువల్‌ పాలిటిక్స్‌

స్థూలంగా ఈ గ్రంథ సారాంశం ఇది.

రాజకీయాలంటే ఒక వర్గంపై మరొక వర్గం ఆధిపత్యం కలిగివుండడం. ఒక వర్గం అధికారంలోనూ మరొక వర్గం అనుచరంగానూ వుండడం అనుకుంటే స్త్రీ పురుష సంబంధాలు కూడా రాజకీయ సంబంధాలే. మన వ్యవస్థాగత రాజకీయా లలో ఇంతవరకూ లేనటువంటి ఒక స్పష్టమైన, సముచితమైన, మనస్తత్వ శాస్త్రాన్నీ, తత్వశాస్త్రాన్నీ మనం నిర్మించుకోవాలి. వర్గాల మధ్యా, జాతుల మధ్య, స్త్రీ పురుషుల మధ్య, ఇప్పుడున్న అధికార సంబంధాలు కాక, అవి మానవ సంబంధాలుగా ఉండే విధంగా చూడాలి. ఎందుకంటే కొన్ని వర్గాలకు రాజకీయాలలో సరైన ప్రాతినిధ్యం లేదు కనుక జన్మతో సంక్రమించే ఆధిక్యాలు క్రమేణా అదృశ్యం అవుతున్నప్పటికీ, ఇంకా స్త్రీ పురుషుల మధ్య ఈ ఆధిక్యత కొనసాగుతూనే ఉంది.

స్త్రీ పురుషుల మధ్య కొనసాగుతున్న సంబంధాలను నిష్పాక్షిక దృక్పథంతో విశ్లేషిస్తే అవి అధికార అనుచర సంబంధాలుగా ఉన్నాయని ఎవరికైనా తెలుస్తుంది. పురుషులు పాలించడానికి స్త్రీలు పాలింపబడడానికే జన్మించినట్లు కొనసాగుతోంది. చరిత్ర మొత్తం మీద స్త్రీలు మైనారిటీ వర్గంగానే వున్నారు. ఏవో కొన్ని హక్కులు సాధించుకున్నప్పటికీ కూడా నల్లజాతివారు వోటు హక్కు తెచ్చుకుని వంద సంవత్సరాలైనా వారి జీవన నాణ్యత పెరిగిన దాఖలాలు లేవు. ఈ విషయాన్ని గురించిన చర్చ గాఢంగా ఎప్పుడూ జరగదు. ఎందుకు జరగదంటే, నా ఉద్దేశ్యంలో, అది ప్రమాదకరమైంది కనుక.. అంతేకాదు, మిలిటరీ, పరిశ్రమలు, విశ్వవిద్యాలయాలు, శాస్త్రవిజ్ఞాన శాఖలు, ఆర్థిక వ్యవహారాలు, పోలీస్‌ శాఖ, మొదలైనవన్నీ కూడా పురుషుల ఆదిపత్యం లోనే ఎందుకున్నాయని కూడా ఎవరూ చర్చించరు. డబ్బూ ఆయుధాలూ పురుషులవి. ఆఖరికి భగవంతుడు కూడా పురుషుడే, శ్వేతజాతి పురుషుడు. తమది కాని సంస్కృతినీ, అలవాట్లనీ పురుషులు ఎంతగా ఎగతాళి చేస్తారో చిన్నబుచ్చుతారో మనకి తెలుసు. ”సెక్స్‌ అనేది చాలా మురికి విషయం అది స్త్రీలకి చెందిన విషయం. పురుషులు మానవులు”, ఇట్లా ఉంటాయ్‌ వాళ్ళ మాటలు – వీటి గురించి కాస్త గట్టిగా మాట్లాడమనుకోండి, ఏదో ఒక విధంగా మనం ”ఉండవలసిన” స్థానానికి మనని దించే ప్రయత్నం చేస్తారు.

జానపద సాహిత్యంలో కూడా స్త్రీలను కించపరిచే ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. వారిని గయ్యాళులుగా, పురుషులని, ఆ స్త్రీలకి లొంగి వుండే పిరికి భర్తలుగా చిత్రించిన ఎన్నో కాల్పనిక రచనలున్నాయి.

స్త్రీలను శారీరకంగా ఎదగనీయకుండా చేశే ఆచారాలు కూడా ఎన్నో వున్నాయి. చైనాలో స్త్రీల పాదాలను గుడ్డతో చుట్టి ఉంచి వాటిని పెరగనీయకుండా చెయ్యడం ముస్లిం మహిళల పర్థా, అనేక చోట్ల స్త్రీలకి గృహ నిర్భంధం, వారిపైన అత్యాచారాలు, స్త్రీలను బహిరంగంగా వేశ్యాగృహాలకు అమ్మడం, ఇలా ఎన్నో ఇంకా కొనసాగే వ్యవహారాలు. భౌతిక శక్తితో వారిని అధీనుల్ని చేసుకోడమేకాక, ఎన్నోవిధాలుగా భయపెట్టి, లొంగదీసు కోవడం. ఇంటినుండి వెళ్ళగొడతాడని భయం. విడాకులిస్తాడేమోనని భయం, ఆర్థిక అభద్రత, ఇట్లా ఎన్నో అంశాలు స్త్రీలను లొంగుబాటుకు ప్రోత్సహిస్తాయి.

పితృస్వామ్యం యొక్క ప్రధాన సంస్థ కుటుంబం. సంప్రదాయం ప్రకారం తండ్రికి తన పిల్లలపైనా భార్యపైనా సర్వాధికారా లుంటాయి. వారిని దండించే, చంపే, విక్రయించే అధికారం కూడా వుంటుంది. వారిపై దయా దాక్షిణ్యాలతో వ్యవహరించటం కూడా వారిని అణిచివుంచే ప్రయోగాలలో భాగమే. పితృస్వామ్య విలువల్ని బలవంతంగా అమలుచేసే అవసరం లేదు. ఎందుకంటే సమాజం వాటిని పూర్తిగా ఆమోదించి అనుసరిస్తోంది కనుక. మత సంబంధమైన కథలూ కల్పనలూ అన్ని కూడా స్త్రీలను ఎట్లా వక్రీకరించిందీ తెలుపుతాయి. ఒక్కొక్కసారి కొన్ని వెనక బడిన జాతులకిచ్చినట్లే స్త్రీలకి కూడా కొన్ని ఆధారాలిస్తారు. అవి తమ వర్గాన్ని తామే అదుపు చెయ్యడానికి ఉపయోగపడతాయి.

లైంగిక విప్లవం వస్తే ముందుగా సంప్రదాయానుసారం స్త్రీలపై వున్న ఆంక్షలూ నిషేధాలూ తొలగిపోవాలి. పితృస్వామ్యపు మోనోగమీ వివాహాలకు ప్రమాదం కలిగిస్తాయని భయపడే నిషేధాలని ముందు తొలిగించాలి. స్వలింగ సంబంధాలు, ”అక్రమ సంబంధాలు” వివాహేతర సంబంధాలు, మొదలైన వాటిపై వుండే అపోహలు తొలగిపోవాలి. లైంగిక సంబంధాల చుట్టూ అల్లిన ప్రతికూల భావజాలాన్ని ముందు తుడిచి వెయ్యాలి. స్త్రీ పురుషుల లైంగికత విషయంలోనూ, వేశ్యావృత్తి విషయంలోనూ అనుసరించే ద్వంద్వ విలువల్ని తుడిచిపెట్టాలి. లైంగిక స్వేచ్చ విషయంలో స్త్రీపురుషులిద్దరికీ ఒకే ప్రమాణాన్ని పాటించేలా లైంగిక విప్లవం రావాలి.

పితృస్వామ్యం, స్త్రీల ఆర్థిక లొంగు బాటుపై ఆధారపడి వుంటుంది కనుక ఆ వ్యవస్థలో ఆర్ధిక సమానత అసాధ్యం. పితృస్వామ్య కుటుంబాలలో కనపడే ఐక్యత ఈ ఆర్థిక అవసరాల నించీ ఏర్పడిందే కానీ ప్రేమానురాగ బంధంతో కాదు. ఈ విషయంలో ఏంగిల్స్‌ చెప్పింది నిజం. మిల్‌ చెప్పినట్లు స్త్రీలకు న్యాయపరమైన కొన్ని హక్కులు వచ్చినట్లయితే ఆమె లొంగుబాటు అంతమౌతుందన్నదీ ఏంగిల్స్‌ ఒప్పుకోలేదు. ఆయన దృష్టిలో స్త్రీలకు హక్కులు లేకపోవటం పితృస్వామ్యం వర్ధిల్లడానికి కారణం కాదు, పితృస్వామ్యం ప్రభావంవల్లనే వారికి హక్కులు లేకుండా పోయాయి. కొన్ని చట్టాలు చేసి నందువల్ల స్త్రీలకు సమాజంలో సమాన స్థాయిరాదనీ, పూర్తిస్థాయిలో సామాజిక ఆర్థిక సమానత్వం, ఉత్పాదక శ్రమలో పాల్గొని వ్యక్తిగత సంతృప్తిని పొందగలిగినప్పుడే స్త్రీలకు సమాన ప్రతిపత్తి లభిస్తుందనీ ఏంగిల్స్‌ అభిప్రాయం, ఆధారపడి ఉండటంలో స్వేచ్ఛ లేదనే ఆయన అభిప్రాయం సరైనది.

ఫ్రాయిడ్‌ చెప్పినట్లు స్త్రీలకు ”పీనిస్‌ ఎన్వి” (penis envy) అని (పురుషాంగం ఉన్నందుకు పురుషుల పట్ల అసూయ) అనేదేం వుండదు. కాకపోతే అది కలిగి వున్నందువల్ల సమాజంలో వారు పొందే అధిక గౌరవం పట్ల వుంటే వుండవచ్చు. ”ది లాస్ట్‌ సెక్స్‌” వంటి కొన్ని స్త్రీవాద వ్యతిరేక గ్రంథాలు కేవలం కుటుంబం, ఇల్లు, మాతృత్వం వంటి విలువలు నశించి పోతాయేమోనన్న భయం నుంచీ ఉత్పత్తి అయినవి. విడాకులు, కుటుంబ నియంత్రణ, గర్భస్రావం వంటి వాటి గురించి మాట్లాడడం వల్ల లైంగిక విప్లవం వివాహ వ్యవస్థను దెబ్బతీస్తుందని ”లాస్ట్‌ సెక్స్‌” వంటి పుస్తకాల ఉద్దేశ్యం. లైంగిక విప్లవంలో ప్రముఖ రచయిత డి.ఎచ్‌. లారెన్స్‌ రెండు అంశాలను దర్శించాడు. అది స్త్రీలకు స్వేచ్చనీ సాధి కారతనీ కల్పించవచ్చు లేదా వారిని మరింత అధీనుల్ని చేసే విధంగా పురుషులు దాన్ని మసిపూసి మారేడుకాయ చెయ్యవచ్చు.

మేథాశక్తీ, జీవితం పట్ల ప్రేమా అనేవి మానవ విలువలని మనం గుర్తుచేసుకుని మెలగవలసిన సమయం ఇది. వ్యక్తిత్వానికీ, లైంగికతకీ వుండే పరస్పర సంబంధాన్ని మనం గుర్తించాలి. అట్లాగే స్త్రీలకి అనుసరణీయా లంటూ ఆపాదింపబడుతున్న లైంగిక నిబంధ నలు కాలం చెల్లినవిగా గుర్తించాలి. మగ వారికి ఆదర్శంగా చెప్పుకునే ”మగతనం” పురుషత్వం అనే వాడుక పోవాలి. కర్కశత్వం పురుషలక్షణం కారాదు. అణచివేతను అంగీకరించే స్థితినించీ మనం బయటపడు తున్నాం. నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ విమెన్‌ వంటి సంస్థల్లో సంఘటితమౌతున్నాం. స్త్రీ పురుషుల మధ్య నిజమైన సమానత్వం నెలకొల్పాలంటే ”లైంగిక రాజకీయా”లనే పాత విధానాన్ని బద్ధలు కొట్టాలి. ఆ వ్యవస్థను మానవ విలువలతో మరింత నాగరికంగా మార్చాలి.. స్త్రీ పురుషులెదుర్కుంటున్న అన్ని రకాల అణచివేతల్ని రూపుమాపాలి.. ప్రస్తుతం అనేక ఉద్యమాలు కొనసాగుతున్నాయి. జాతి వివక్షకి విరుద్ధంగా నల్లజాతివారి ఉద్యమం, ప్రజాస్వామిక విలువల స్థాపనకోసం విద్యార్థి ఉద్యమం, ఇవన్నీ కూడా ఈ సమాజపు రూపు మార్చడానికి మరింత నివాసయోగ్యమైన సమాజస్థాపన కోసమే. ఒక గొప్ప ప్రజా స్వామిక విప్లవం కోసం.. రక్తపాతాన్ని నివారించే ఒక కొత్త ఉద్యమం కోసం. ఇప్పుడు మనం చైతన్యం పొందాలి. విలువల్ని పుననిర్మించు కోవాలి.. అన్ని రకాల అణచివేతల్ని, హింసను, ఆధిపత్యాన్ని నిర్మూలించనిదే విలువల పునర్ని ర్మాణం అసాధ్యం. మనకొక ఆశయమూ ఒక గమ్యమూ ఉన్నాయి.. మనం విప్లవాన్ని ప్రారంభిద్దాం. హింసతో ఆభి జాత్యంతో కాక ప్రేమతో ప్రారంభిద్ధాం….

Share
This entry was posted in రాగం భూపాలం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.