గ్రామీణ దళిత మహిళ – జీవన స్థితిగతులు

– సంకినేని వెంకటయ్య, చిట్యాల వినోద (రీసెర్చ్‌ స్కాలర్స్‌)

ప్రపంచంలోనే మహోజ్వలమైన చరిత్ర ఉన్న పవిత్ర గ్రామీణ భారత దేశంలో సంస్కృతి పరంగా స్త్రీని దేవతామూర్తిగా పిలుస్తారు. దేశ జనాభాలో దాదాపు సగం మంది మహిళలే ఉన్నారు. ప్రస్తుతం పితృస్వామిక కుటుంబాలుగా చలామణి అవుతున్న భారత గ్రామీణ వ్యవస్థలో గతంలో మాతృస్వామిక కుటుంబాలు ఉండేవి. అనగా కుటుంబ యజమానురాలిగా పూర్తి భాద్యతలు స్త్రీలే వహించేవారు. స్త్రీకి ఈ దేశంలో ఎంత ప్రాధాన్యత ఉందంటే భారతదేశాన్ని భరతమాత అని పిలిచేంత గొప్పతనం, గౌరవం స్త్రీలకు ఉంది. కాని ఈ దేశంలో దళిత కుటుంబాలకు సంబంధించిన స్త్రీలు పలురకాల అణచివేతలకు, అవమానాలకు గురౌతున్నారు. దళిత స్త్రీ ఒక సాంఘీక శక్తి. ఒక సంస్కృతికి ప్రతీక. ఒక చారిత్రక నేపథ్యం. కానీ భారతదేశంలో ఈనాడు ఒక అస్పృశ్యురాలిగా సంక్షుభితమైన జీవన యాత్రలో ప్రయాణం సాగిస్తూంది. వ్యవసాయ రంగంలో ప్రముఖ పాత్ర వహిస్తూ ఆనకట్టలు, భవనాలు, రోడ్ల నిర్మాణాల్లో కూడా తమ శ్రమను దారపోస్తుంది. బట్టల మిల్లులు, బీడీ పరిశ్రమ, సిమెంట్‌ ఫ్యాక్టరీలు, ఆస్పత్రులు, క్వారీ పనులు ఇలా ఎన్నో రంగాల్లో పనిచేస్తుంది. ఒకవైపు ఇలా శ్రమిస్తూ మరోవైపు గృహజీవనానికి సంబంధించిన పనులన్నీ చేయడం వల్లే మొత్తం భారతీయ ”శ్రామిక శక్తి”లో ప్రధాన పాత్ర పోషిస్తున్నారనేది చారిత్రక సత్యం. పోషకాహార లోపం వల్ల బలహీనులై కనీసం వృద్ధాప్యంలో తమను పోషించడానికి ఒక్క బిడ్డైనా మిగలాలనే ఆశతో అనేక మంది బిడ్డలకు జన్మనిచ్చి రక్తహీనతతో మరింత బలహీనులౌతున్నారు. పగలంతా చెమటోడ్చి పొలాల్లో పనిచేస్తే పరిమితమైన కూలి లభిస్తుంది. నిత్యావసర వస్తువులు కొనడం కోసం ఆ డబ్బు చాలదు. అంతేగాక మాతృహృదయం కలిగిన వీరు భర్తకు, పిల్లలకు వడ్డించిన తరువాతనే మిగిలితే తినవలసిన పరిస్థితి తరచూ ఎదురౌతూనే ఉంది.

మండుటెండకు నెర్రెలు విచ్చిన భూమి పగుళ్ళలా ఆమె కాళ్ళు పగిలి ఉంటాయి. అన్నం చాలక కరుణార్ద్రతతో ఆమె కళ్ళు గుంటలు పడిఉంటాయి. నూనె లేక అట్టలు కట్టిన ఆమె జుట్టు శ్రమించి కాయలు కాసిన ఆమె చేతులు మానవతా రహితమైన ఈ దేశ గ్రామీణ అగ్రకులాల కర్కశత్వాన్ని గుర్తుచేస్తాయి. దళిత స్త్రీ ఒక సృజనాత్మక శక్తి. గ్రామాల్లో నులను మంచానికి అల్లుటలోను, బట్టలు నేయడంలోనూ, తాటాకులతోనూ, ఈతాకులతోనూ చాపలు అల్లడంలోనూ, కళాస్రవంతిగా, సంస్కృతీ భాండాగారంగా ఆమె నిరూపించుకుంది. వేటకత్తెగా, జాలరిగా, యుద్ధ సైనికురాలిగా మానవ జీవన చరిత్రలో అనేక పాత్రలు పోషించింది కనుకనే ప్రాచీన భారతీయ పారిశ్రామికవేత్త ఈ మహిళ. తోళ్ళపని, కుట్టు, నేత, కుండల తయారీల వంటి పనులు చేపట్టింది. గృహ, సమాజ నిర్వహణ కర్తగా ఒక ముఖ్య పాత్ర వహించింది. ఆమె రోజువారీ శ్రమను పరిశీలిస్తే శ్రామిక సంస్కృతిపై ఒక పెద్ద విజ్ఞాన గ్రంథాన్ని తయారు చేయవచ్చు. రోజుకు 18 గంటలు రక్తాన్ని, చెమటను ధారపోసి పనిచేసే దళిత స్త్రీ శ్రమ, సోమరి భారతీయుల నిర్దయపూరిత శరీరాలను పెంచి పోషిస్తుంది. వారి శ్రమ భారతీయ ఆర్థిక సాంఘిక రంగాలకు పునాది. కాని మన మేధావులు ఈ స్త్రీల జీవితాన్ని పరిశీలించడం లేదు. జీవన విధానాన్ని పరిశోధించనంతకాలం వీరికి భారతదేశ వాస్తవికత అర్థం కాదు. తమ మానవీయ ఔన్నత్యాన్ని కించపరిచే సాంఘిక అణచివేతలోనూ, ఆర్థిక సంక్షోభంలోనూ ఈనాటి దళిత స్త్రీలు ఎంతో సంఘర్షణతో జీవిస్తున్నారు.

ప్రాచీనకాలంలో భారతదేశంలో వ్యవసాయ సంస్కృతికి సంబంధించిన అంశాలన్నీ ఈ స్త్రీల జీవన విధానంలోనే మనకు ద్యోతక మవుతున్నాయి. విత్తనాలు నాటేటప్పుడు, కోతలు కోసేటప్పుడు వీరు పాడే పాటల్లో మాట్లాడే భాషలో ఎంతో సంస్కృతి దాగి వుంది. భారతదేశానికి మూలమైన భౌతిక తత్వశాస్త్రానికి మూలం వీళ్ళే. సాంఖ్యతత్వ శాస్త్రాన్ని, తాత్విక వాదాన్ని ఆచరణలో పెట్టింది దళిత స్త్రీలే. కులం పునాధుల్ని పెకిలించి కులాతీతంగా మాతృత్వాన్ని అందించిన గాథలు పురాణాలనిండా ఎన్నో ఉన్నాయి. వీరిని అణచివేసిన తరువాతే భారతదేశంలో తత్వ శాస్రానికి దారిద్య్రం వచ్చింది.

భారతీయ గ్రామాలకు మూలమైన భాషా సంస్కృతి, కళలు అన్నీ దళిత స్త్రీలోనే నిక్షిప్తమై ఉన్నాయి. మానవత్వం, దాత్రుత్వం, సౌజన్యం, సౌహార్ధం ఈమెకు సహజ లక్షణాలు. అందుకే ఆమె ఈ దేశానికి పునాది. సంస్కృతిని తన ఔధార్యంతో రక్షిస్తూ వచ్చింది. ఉమ్మడి జీవనాన్ని శిథిలం కాకుండా చూసింది. మాతృత్వంలో దాగి ఉన్న అన్ని దశలను యుద్ధం చేసి రక్షించింది. పురిటి నొప్పుల్లో కూడా భూమికి తన చెమటను ధారపోసి తన ఔన్నత్యాన్ని చాటుకుంది. నదీ నాగరికతను నిర్మించింది. భారత భౌగోళిక వాస్తవికత నుంచి సంస్కృతిని రూపొందించింది. ప్రకృతిని అనునిత్యం జీవితానికి అన్వయించిన కళాతపస్వి. హృదయ సంబంధమైన కళా ప్రపంచానికి స్త్రీదే ఆదినాయకత్వం. అందునా దళిత స్త్రీ తను అభివ్యక్తం చేయదలచుకున్న విషయాన్ని వాచక సాత్వికాభినయంతో సహా వ్యక్తీకరిస్తుంది. భారతీయ శిల్పుల, చిత్రకారుల చేతుల్లో అభివృద్ధి చెందిన కళలన్నీ ప్రాథమికంగా దళిత స్త్రీ రూపొందించినవే. సముద్రపు ఒడ్డులో ఇసుక తిన్నెలో చిత్రాలు గీసింది. రాతిని శిల్పంగా మలచింది. ప్రకృతి రమణీయకత్వానికి అనుగుణంగా శృతిని, గతిని కలిపి పాడింది. సాహిత్యానికి మూలమైన లిపిని కూడా దళిత స్త్రీయే కనుగొన్నది. లిపికి మూలమైన అంశాల్లో ఒకటైన ”పచ్చబొట్టు”ని ఈమె మొదట ప్రారంభించినట్లు చరిత్ర తెలుపుతుంది. ఇంతటి మహోదాత్తమైన ఆ దళిత తల్లి ఈనాడు గర్భవతి అయితే ఆమె కడుపులో ఉన్న బిడ్డకు జీవాన్నిచ్చే ఆహారం పెట్టుకోలేక తన బిడ్డ తన కడుపులోనే మరణించే పరిస్థితులకు అనేక సందర్భాల్లో నెట్టబడు తుందంటే తరతరాలుగా ఈ సమాజం ఏ పరిస్థితికి మన స్త్రీని నెట్టివేసిందో తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్‌ లోని అనేక ప్రాంతాల్లో జోగిని వ్యవస్థ దళిత స్త్రీలను భాదిస్తూ ఉంది. ఆదిమ జాతులను దళితులను ఈ సమాజం అస్పృశ్యులుగా చేసిన తర్వాత వీరిపై అనేక దురాచారాలను, మూఢ విశ్వాసాలను రుద్దింది. అందులో ఈ అమానుషమైన జోగిని ఆచారం ఒకటి. చిన్న వయస్సులోనే దేవాలయాలకు అంకితమవ్వడ మనే పేరుతో వారిని ”ఊరు ఉమ్మడి” బ్రతుకులుగా చేసి హింసించి అత్యాచారాలు చేసే ఈ దుర్మార్గపు ఆచారం ఇప్పటికీ ఆచరించబడుతుంది.

ఈ దేశంలో జీవితానికి సంబంధించిన ఆర్థిక, రాజకీయ, సాంఘీక కోణాలన్నింటి లోనూ దళిత స్త్రీలు దోపిడీకి, బానిసత్వానికి గురౌతున్నారు. వీరి కనీస వేతనం ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ వాళ్ళ రక్తాన్ని, స్వేదాన్ని జుర్రుకుంటున్న భూస్వాములు వారి శ్రమకు తగిన కూలి ఇవ్వడం లేదు. ఈ విధంగా దళిత స్త్రీల జీవన ప్రమాణాన్ని దిగజారు స్తున్నారు. కనుక ఈ వ్యక్తిగత ఆస్తి మూల్యాన్ని, వ్యక్తిగత ఆస్థిని బలపరుస్తున్న సాంఘిక విచక్షణను రూపుమాపే ఉద్యమంగా మారినపుడే దళిత స్త్రీల ఉద్యమం దళితులను విముక్తి చేయగలదు. భారతదేశంలోని సంస్కరణ ఉద్యమం మధ్యతరగతి స్త్రీలను దాటి శ్రామిక స్త్రీలను చేరలేక పోయింది. దళితులపై జరుగుతున్న అత్యాచారాలను, దోపిడీని ఎదిరించటానికి దళిత మహిళలు ముందు నిలిచి సింహ గర్జన చేసిన ఆ స్త్రీల నుండే ఈనాడు దళిత విముక్తికై మహోన్నతమైన ఉద్యమం జనించింది. కారంచేడు సంఘటన దీనికి నాంది అయ్యింది. తరతరాలుగా అక్కడి దళితుల శ్రమ శక్తిని దోచుకొని బలిసిన భూస్వాములు కత్తులు, గొడ్డళ్ళు, బరిసెలతో దాడి చేసి తల్లులను, బిడ్డలను, భార్యాభర్తలను కౄరంగా చంపారు. స్త్రీలపై అత్యాచారం జరిపారు. కులాధిపత్య దాడికి ఎదురు తిరిగిన ఆ స్త్రీల నుండే దళిత ఉద్యమం ప్రారంభమైంది. భర్తల శవాలను ఒడిలో పెట్టుకొని ప్రభుత్వం చేయబోయిన ఆర్థిక సహాయాన్ని తిరస్కరించిన ఆ దళిత తల్లుల త్యాగపూరిత ఆత్మగౌరవమే దళిత ఉద్యమానికి పునాది అయ్యింది. ఇటువంటి సంఘటనలు ఎన్నో దళిత స్త్రీల చైతన్యాన్ని, సంఘటిత శక్తిని రుజువు చేశాయి. దేశంలోని దళిత స్త్రీలందరు ఉద్యమిస్తే వారి బిడ్డలు, దళిత పురుషులు వారికి సంఘీభావంతో నిలిస్తే దళిత స్త్రీలందరు ఉద్యమిస్తే వారి బిడ్డలు, దళిత పురుషులు వారికి సంఘీభావంతో నిలిస్తే దళిత విముక్తి పోరాటం తన లక్ష్యాన్ని తప్పక సాధిస్తుంది. భారత సమాజంలో అత్యధిక పీడనకు, అణచివేతకు గురైన దళిత మహిళలే ఈ విముక్తి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళ గలరు విజయాన్ని సాధించగలరు.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో