అమ్మ

యవ్వనంలో వున్న ఆ తల్లి తన జీవిత పధం మీద తన తొలిపాదం మోపింది.

‘‘ఈ దారి చాలా సుదీర్ఘమైందా?’’ అడిగింది. గైడ్ ఇలా అన్నాడు. ‘‘అవును ఈ దారంతా చాలా కష్టతరమైంది. అవతలి వేపు చేరేటప్పటికి నువ్వు ముసలిదానివైపోతావు. అయితే అవతలివేపు ఈ ప్రారంభం కన్నా బావుంటుంది.’’ చిన్నతల్లి సంతోషంగానే వుంది. దీనికన్నా మెరుగైందేదో వుందంటే ఆమె నమ్మలేదు. ఈ సంవత్సరాలే ఆమెకు బావున్నాయి. పిల్లలతో ఆడింది. దారి పొడుగునా పిల్లలకోసం పువ్వులేరుతూనే వుంది. సెలయేళ్ళలో వాళ్ళకి స్నానాలు చేయించింది. దీనికంటే సంతోషకరమైంది మరేదీ వుండదంటూ కేకలు వేసింది. రాత్రయ్యింది. చీకటితో పాటు తుఫాను. దారంతా అంధకారబంధురంగా వుంది. పిల్లలు భయంతో, చలితో ఒణకసాగారు. తల్లి వాళ్ళని తన గుండెల్లోకి లాక్కుంది. తన పైటతో వాళ్ళని కప్పింది. అపుడు పిల్లలన్నారు. ‘‘ అమ్మా! మాకు భయం వేయడం లేదు. మాకు నువ్వింత దగ్గరగా వున్నావు. మాకే ఆపదా రాదు’’ తెల్లారింది. ఎదురుగా పెద్ద పర్వతం, పిల్లలు గబగబ ఎక్కేసారు. అలిసిపోయారు, తల్లి అలిసిపోయింది. అయినప్పటికి ఆమె పిల్లలకి ఇలా చెబుతూనే వుంది ‘‘ కొంచెం ఓపిక పట్టండి, మనం కొండెక్కేస్తాం’’ పిల్లలు కొండమీదికెగబాగారు. శిఖరం మీదికి చేరగానే వాళ్ళన్నారు. ‘‘ అమ్మా! నువ్వు లేకపోతే మేమీ కొండ ఎక్కగలిగేవాళ్ళం కాదు’’. తల్లి ఆ రాత్రి ఆరుబయట పడుకుని నక్షత్రాల వైపు చూస్తూ అంది. ‘‘ క్రితం రోజుకన్నా ఈ రోజు చాలా బావుంది. నా పిల్లలు కష్టసమయాల్ని ఎలా అధిగమించాలో నేర్చుకున్నారు. నిన్న నేను వాళ్ళకి ధైర్యమిచ్చాను. ఈ రోజు వాళ్ళకి బలమిచ్చాను’’. ఆ మరునాటి ఉదయం విచిత్రమైన మేఘాలేవో భూమిని కమ్మేసాయి. యుద్ధమేఘాలు, అసహ్యాన్ని, చెడుని పెంచే మేఘాలు, పిల్లలు తడబడ్డారు. వెదుకులాడారు. అప్పుడు తల్లి అంది. ‘‘పైకి చూడండి. మీ కళ్ళను ఆ కాంతిమీద కేంద్రీకరించండి’’. పిల్లలు పైకి చూసారు. మేఘాల్లో అద్భుతమైన మెరుపును చూసారు. అది వారిని చీకటిలోంచి వెలుతురులోకి నడిపించింది.

రోజులు గడుస్తున్నాయి. రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అలా గడిచిపోతున్నాయి.

తల్లి పెద్దదయిపోయింది. ముసలితనం ఆమెను కుంచింపచేసింది. వంగిపోయేట్టు చేసింది. పిల్లలు పొడుగ్గా, బలిష్టంగా ఎదిగారు. ధైర్యంగా నడుస్తున్నారు.

మార్గం కష్టంగా, కరకుగా తయారైనపుడు వాళ్ళు తల్లిని ఎత్తుకున్నారు. ఆమె పక్షి రెక్కంత తేలిగ్గా అయిపోయింది. ఆమెను ఎత్తుకునే పిల్లలు ఒక పర్వతం దగ్గరికొచ్చారు. అక్కడినుండి వెలుతురుతో నిండిన ఒక రహదారి, ఆ చివర బార్లా తెరిచిన బంగారు గేట్లు స్పష్టంగా కన్పడ్డాయి.

తల్లి అంది. ‘‘ నేను నా ప్రయాణపు చివరి మజిలీకి చేరుకున్నాను. చివరి ఘట్టం మొదటి దానికన్నా బాగుంటుందని నాకిపుడు తెలుసు. నా పిల్లలు ఒంటరిగా నడవగలరు, వాళ్ళ పిల్లలు వాళ్ళననుసరించే వుంటారు’’

పిల్లలు అన్నారు. ‘‘అమ్మా! నువ్వెపుడూ మాతోనే నడుస్తావు. ఆ బంగారు గేట్లను దాటేసాక కూడా నువ్వు మాతోనే వుంటావు’’ తల్లి వంటరిగా ఆ గేట్లను దాటడం, ఆ వెంటనే అవి మూసుకుపోవడం వాళ్ళు చూస్తూనే వున్నారు.

పిల్లలన్నారు. ‘‘ ఇంక మేము అమ్మను చూడలేం. కానీ ఆమె ఎపుడూ మాతోనే వుంటుంది. మా అమ్మ ఎపుడూ ఒక జ్ఞాపకంగా మిగలదు. ఆమె ఒక సజీవ స్రవంతి…’’

నీ తల్లి ఎపుడూ నీతోనే వుంటుంది. నువ్వు నడుస్తున్నపుడు చిగురాకుల సవ్వడి మీ అమ్మే. నువ్వు అనారోగ్యంగా వున్నపుడు నీ వెన్నుమీది చెయ్యే అమ్మ. నీ నవ్వుల్లో నీ తల్లి జీవించే వుంటుంది. ప్రతి కన్నీటి బొట్టులోను ఆమె స్వచ్ఛంగా నిలిచివుంటుంది. నువ్వొచ్చింది ఆమె లోపలినుంచే. అదే నీ మొదటి ఇల్లు, మొదటి ప్రేమ, మొదటి గుండెకోత. భూమ్మీద ఏదీ నిన్ను తన నుంచి వేరు చేయలేదు. కాలం కాని, అంతరిక్షంగాని చివరికి చావుగాని.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో