ఆల్‌ విమెన్‌ ఆర్‌ క్లీనర్స్‌ కానీ…

జూపాక సుభద్ర
జూలై 21-22 న ఫెమినిస్టు ఇండియా యాహు గ్రూపు మీటింగు కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ సదరన్‌ రీజినల్‌ సెంటర్‌, రాజేంద్రనగర్‌, హైద్రాబాద్‌ ఆధ్వర్యంలో జరిగింది. పాత కొత్త ఇండియన్‌ ఫెమినిస్టులు వందమంది దాకా వచ్చారు.
వచ్చిన స్త్రీలంతా దాదాపు మెట్రో పాలిటన్‌ పట్టణాల నుంచి వచ్చిన పైకులాల, ఉన్నత మధ్య తరగతి చదువుకున్న ఎన్‌.జి.వో సంస్థల్నించి వచ్చారు. దాదాపు పదిమంది దళిత మహిళలు కూడా కనిపించారు. వారంతా దక్షిణాది రాష్ట్రాలవారే. ప్రస్తుత సామాజిక పరిస్థితుల్లో ఫెమినిస్టు ఎజెండాలు, దృక్పథాలు వినాలని అన్వేషించి అన్వేషి మిత్రులతో వెళ్లడం జరిగింది. ‘మట్టిపూల’ మహిళల ప్రాపంచిక అవగాహనలు పంచుకునే అవకాశంగా వెళ్లాను.
30 సంవత్సరాల్నించి ఫెమినిజం సాధించిన, సాధించాల్సిన అంశాల మీద మొదటిరోజు (21-7-12) న అభిప్రాయాల కలబోత జరిగింది. ప్రస్తుత గ్లోబల్‌ సామాజికంలో స్త్రీలు (అగ్రవర్ణ) ఎదుర్కొంటున్న సమస్యలు, జీవితానుభవాలు రౌండప్‌ జరిగినాయి. వారి ప్రస్థావనలో వచ్చిన విషయాలు కొన్ని…. గ్లోబల్‌ వ్యవస్థలో నిర్మాణాత్మకంగా చేయాల్సినవి చాలా అంశాలున్నవి. వికలాంగ మహిళలు, వికలాంగులైన పిల్లలున్న తల్లుల సమస్యలు, వారిమీద  పెరిగిపోతున్న హింసలు – హింసల అనుభవాలు ఒక్క మూసగా చూస్తే అర్థం కావు-అట్టడుగు అంచుల్లోకి వెళ్లి పంజెయాల్సి వుంది- దళిత ఆదివాసీ, ముస్లిం మహిళా సమస్యల మీద ఎవరూ మాట్లాడ్డం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో దళిత మహిళలకు సంబంధించిన అనేక కోణాల్నించి ప్రశ్నలొస్తున్నయి. ఫెమినిస్టు దృష్టికోణం నుంచి అనేక పరిశోధనలు జరుగుతున్నా… అనుకున్న ఫలితాలు జరగక పోవడాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి.
ఫెమినిస్టు మూవ్‌మెంట్‌లో దళిత, ఆదివాసీ, మైనారిటీ, ట్రాన్స్‌జెండర్‌, స్వలింగ సంపర్కం, లైంగికదాడులు వికలాంగుల సమస్యలు నిశ్శబ్దం చేయబడినయి. వీటన్నింటి నుంచి వస్తున్న ప్రశ్నల్ని విశ్లేషించు కోవాల్సి వుంది. వరకట్న హింసలు ఆగట్లేదు – హెల్త్‌ సానిటేషన్‌ లేకపోవడం పట్టించుకోవట్లేదు, స్త్రీల మానసిక సమస్యల్ని కూడా పట్టించుకోలేదు.
ఆధిపత్య కులాల ఆడవాల్లు దళిత మగ ఆడవాల్ల మీద దాడులు చేస్తున్న దానిమీద సీరియస్‌గా చర్చ జరగాలి (కైర్లంజి, లక్ష్మింపేట)
మహిళాభివృద్ధి కార్యక్రమాలు ఫెయిలైనవి- సంక్షేమాలు లేవు- రాజ్యం విస్మరిస్తున్న వాటి అన్నింటిమీద పోరాడాలి. యిట్లా సాగింది వివిధ అంశాల మీద అనేక దృక్పథాలు పంచుకున్నరు చర్చలు ఎక్కువగా ఏ విషయమ్మీద సాగలేక పోయింది.
2 వ రోజు (22-7-12) మాత్రం దళిత మహిళల ప్యానల్‌ డిస్కషన్‌ జరిగింది. యీ మీటింగుకు యీ డిస్కషన్‌ చాల కీలకమైందిగా భావించాలి. యీ ప్యానల్‌ని ఏపి, కేరళ, తమిళ్నాడు, కర్నాటక రాష్ట్రాల దళిత మహిళలు నిర్వహించారు. నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ దళిత విమన్‌ అధ్యక్షులు రూత్‌ మనోరమ, రేఖారాజ్‌, గోగుశ్యామల, సరస్వతి, విమలావర్థన్‌లు పాల్గొనన్నరు. మహిళల్ని ఎదగ నివ్వరు రాజకీయంలో యిక దళిత మహిళల్ని అసలే ఎదగనివ్వడు బ్రాహ్మికల్‌ సమాజము. కాని మహిళలు రాజకీయంగా ఎదగడమే మా ఎజెండా అని రూత్‌ మనోరమ ప్యానల్‌ని పరిచయం చేసింది. దళిత మహిళలు రాజకీయాల్లో వుంటే యీ కుల సమాజాధిపత్యాన్ని, మగాధిపత్యాన్ని నిర్మూలించడానికి ఎట్లాంటి సంస్కరణలు చేయగలరనేది సదాలక్ష్మి, ఈశ్వరీబాయి, సుమిత్రాదేవి నిరూపించారు. దేవాలయ ట్రస్టులో దళిత మహిళల్ని కూడా మెంబర్లుగా వుండాలని పోరాడింది. యీ ప్రజాప్రతినిధులైన దళిత మహిళలు తెలంగాణ 1969 ఉద్యమంలో లాఠీదెబ్బలు తిన్నారు. వాల్లకు అసెంబ్లీ, యిల్లు వొకటే మాకు తేడా లేదు. రెండుచోట్ల యాజమాన్యాలు అణచివేతలు ఒకేరకంగా వున్నాయనే వాస్తవాల్ని దళిత మహిళల హక్కులు మానవ హక్కులుగా నినదించినవాల్లు (ఎపి శ్యామల).
ఇక కేరళలో దళిత ఉద్యమాలు, ఫెమినిస్టు ఉద్యమాలు, కమ్యూనిస్టు ఉద్యమాలు ఎట్లా వున్నయనేది రేఖారాజ్‌ వినిపించింది. ”నేడు కేరళలో దళిత మహిళల మీద అన్ని కోణాల్నించి డిబేట్స్‌ జరుగుతున్నయి. కాని కేరళ అంటే నాయర్స్‌ రాష్ట్రం. వారి భాష, ఆట, పాట, మాట, తిండి, బట్టలు, వేషధారణ, రాజకీయాలు అన్నీ నాయర్స్‌. వారివే కేరళ సంస్కృతిగా చెలామని అవుతుంది ప్రపంచానికి. మళయాళీలంటే నాయర్స్‌ అయితే మేమెవరం? మా సంస్కృతి నాయర్ల సంస్కృతి కాదు. బైట ప్రచారమయే మళయాళీ కల్చర్‌కి మా కల్చర్‌కి సామ్యమే లేదు. కేరళలో దళిత మహిళలు లేని ఉద్యమాలు లేవు. అది కమ్యూనిస్టు ఉద్యమం కావచ్చు, దళిత ఉద్యమం, ఫెమినిస్టు ఉద్యమం కావొచ్చు. యీ ఉద్యమాల్లో మా భాగస్వామ్యాలున్నా మాకు గుర్తింపుల్లేవ్‌. కమ్యూనిస్టు ఉద్యమాలు సమానత్వం కుల రహితమంటారు కాని దానిలో కులపిచ్చి తక్కువేమీ లేదు. దళిత ఉద్యమం మా కులం ఉద్యమం అనుకుంటే అది దళిత మగస్వామ్య ఉద్యమాలుగానే సాగినవి. అట్లనే ఫెమినిస్టు ఉద్యమంలో దళిత మహిళలున్నా దళిత మహిళల సమస్యలు లేవు, వారి గుర్తింపులేవు. చెంగల్‌ భూపోరాటం దళిత మహిళలది. అనేక ఉద్యమాలు పనిచేయడం వల్ల, వాటినుంచి నేర్చుకున్న గుణ పాఠాలతో తమ స్వంత అస్తిత్వాలు కూర్చుకోడం మొదలైంది. ఆ దిశలో కేరళలో కేరళ దళిత్‌ విమెన్‌ ఫెడరేషన్‌ ఏర్పడిందనీ 20 మంది కేరళ దళిత రచయిత్రుల ఫెడరేషన్‌ నిర్మాణమైందని చెప్పింది.
సరస్వతి కర్నాటక సఫాయి కర్మచారి సంఘటన నుంచి వచ్చింది. ఆమె పారిశుద్యంలో మా కులం ఆడవాల్లు మగవాళ్లే ఎందుకున్నరు? యితర కులాల వాల్లు లేకపోడానికి ఏంటి కారణం ఆడవాల్లంత క్లీన్‌ చేసే వాల్లే.. కాని దళిత ఆడవాల్లు యింట్ల మాత్రమే కాదు పబ్లిక్‌ స్థలాల్లో మలమూత్రాలెత్తి పోయాలి. దళితేతర ఆడవాల్లు యింట్ల పారిశుద్ధ్యం చేసిన దానిమీద సమాజాన్ని నిలదీస్తున్నరు మేమెందుకు చేయాలి యీ చెత్త పని అని’ మరి మేము పబ్లిక్‌ స్థలాల్లో ఎత్తేసే మలమూత్రాల జెండర్‌ రాజకీయాల్నించి ఫెమినిస్టు ఉద్యమాలు, సామాజిక ఉద్యమాలు మొదలు కావాలి. ఫెమినిస్టు ఉద్యమం పబ్లిక్‌ చెత్త, పబ్లిక్‌ పెంట ఎత్తిపోసే జెండర్‌ రాజకీయాల్ని అప్రస్తుతం చేసింది. దీని మీద యిప్పటివరకు ఎట్లాంటి ప్రోగ్రాం లేదు. దళిత మహిళలకు పాకివృత్తే జీవికగా మార్చిన రాజకీయాల నుంచి ఉద్యమించాలి ఏ ఉద్యమాలైనా. ఫెమినిస్టు అగ్రకులాల మహిళలకు యీ దుక్కాలు అర్థంకావు. మలమూత్రాలు ఎత్తిపోసే, చెత్తవుడిచే పారిశుధ్య పనుల్ని దళితులను సంప్రదాయ వృత్తిగా చేసిన అగ్రకులాల ఎత్తుగడలు వీరి దృష్టికానవు” అని ఆ కాన్ఫరెన్స్‌ని ఉద్విగ్నం చేసింది.
యింత సైన్స్‌ ఎదిగినా కూడా మలమూత్రాల్ని చేతుల్తో ఎత్తేయడం మలం నిండిన మాన్‌హోల్స్‌లో మనుషులే (అదీ దళితులే) దిగి సాఫ్‌ చేయాల్సి రావడం ప్రాణాలు కోల్పోయినా యంత్రాలు రాకపోవడం విషాదం. పబ్లిక్‌ స్థలాల్లో చెత్తపేరకుండా, మలమూత్రాలు రోడ్డుమీద కంగాలిగా పారకుండా తమ ఆరోగ్యాల్ని ప్రాణాల్ని పనంగా బెట్టి పబ్లిక్కు పారిశుద్యాన్నిస్తున్న దళిత మహిళా రాజకీయాలే ఎజెండాగా ఫెమినిస్టు ఉద్యమం మొదలు కావాల్సి వుంది.

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో