‘చైతన్య భూమిక’

బి. కళాగోపాల్‌
పున్నమి చంద్రునిలా ఎదగాలనుకొన్నా
జీవితం వెన్నెల పూలై విరియాలని కలలుకన్నా..
ఒక ఛీత్కారపు చూపు బాకై గుండెలో దిగబడింది
ఆసిడ్‌ దాడి నా కోయిల పాట కంఠాన్ని కత్తిరించింది
చాకులతో, బాకులతో నా శరీరాన్ని తూట్లు పొడుస్తుంటే,
నిస్సహాయంగా నరబలికి సిద్ధమయ్యా
కట్న పిశాచి అగ్నికీలలలో మాడి మసైపోయా
సీతాకోక చిలుకల స్వేచ్ఛను అపహరించే,
వివక్ష పోరులో ద్వితీయ పౌరురాలి ముద్ర
స్కానింగ్‌ భూతం ఉనికితో నెత్తుటి ముద్ద హత్య,
పరువు హత్యలు నా కుత్తుకను బిగించాయి
మాయదారి ఉచ్చులో చిక్కుకొని వంచితనయ్యా!
బ్రతుకులోని మాధుర్యం కోల్పోయి,
మసకేసిన పున్నమిలా కారు చీకటిని మిగిల్చింది
సమాజపు కట్టుబాట్లతో ఒడిదుడుకుల గతుకుల
బ్రతుకు బండిలో ప్రయాణం,
అడుగడుగునా అస్థిత్వాన్ని ధిక్కరించే శర పరంపర !
శాపాల, పాపాల వందేళ్ళ జీవితమా? నాకొద్దు,
వంద రోజుల స్వాభిమానమానవిగా దీవించు చాలు,
వెలుగులను విరజిమ్ముతూ చైతన్య భూమికనై ఎదుగుతా!!!
కొప్పర్తి వసుంధర
ధిక్కార స్వరం
పంజరంలో చిలుక పెట్టిన పళ్ళను (గింజలను)
మాత్రమే ఏరుకొన్నట్లు
నా దేహ అవమానాలను వివరించడానికి సైతం
ప్రత్యేక పదబంధాలను ఏరుకోవాలి
ఉప్పు సముద్రంలా ఉబికివచ్చే కన్నీటిని
”మెటాఫర్‌లలో” ఇమడ్చాలి
ముల్లు గుచ్చుకొన్న బాధను
మృదువైన భాషలోనే అనువదించాలి
సంప్రదాయాన్ని విడనాడితే
నా భావం విశృంఖలైౖ పోతుంది
అయినా నేను ఊరుకుంటానా
బాధితురాలని నేను
ధిక్కార స్వరం వినిపించే పోరాట యోధురాలిని నేను
ఇప్పుడు నా గురి నాపై బాణం విసిరే వేటగాడివైపే
నా చూపు రెక్కలతో ఎగరవలసిన రేపటివైపే
నడకుర్తి స్వరూపరాణి
వర్ణార్ణవం

అమ్మ సేవలను వాడిన పువ్వులుగా చీపురుతో చిమ్మినవాడు
ఆవుకు సానుభూతి సాంబ్రాణితో ధూపం వేస్తాడా ?
ఇల్లు – వాకిలి కట్టబెట్టినా వెన్నెముక కోల్పోయి ఇల్లరికం వెళ్ళినవాడు
ఈశ్వరునికి నటరాజ రామకృష్ణ పునరుద్ధృత
‘ప్రేరిణి’ తాండవ నీరాజనాలర్పిస్తాడా?
ఉగ్గుపాలతో ప్రాణం పోసిన మాతృదేవతకు
‘పాయు విసర్జన’ నైవేద్యం పెడతానన్నవాడు
ఊయలలూపిన చేతులనుంచి కరెన్సీ నోట్ల
కట్టలు రాలడం లేదని కక్ష గట్టినవాడు
ఋణానుబంధాన్ని పేగుముడితో త్రెంచుకొన్నవాడు
”ఎమిడిక” గా కడుపున పుట్టినట్లే
ఏకుమేకై కూచున్నట్టు కనిపెంచిన కొడుకు విషసర్పమై
తండ్రి మద్దతుతో వేయి నాల్కలతో
బూతుల ఫూత్కృతులు వెదజల్లుతుంటే
ఐదువ తనమే అభిశాపమై చిన్నబోయిన మాతృత్వం
ఏటి కోళ్ళు అర్పించేది వంధ్యాత్వానికే
ఒక్కోడొక్కోడ్‌ మడిసికి జన్మనిచ్చిన ఆడది
వర్గ శత్రువుకి గర్భంలోనే వసతినిస్తుంది
ఓనమాలతో సిద్ధించిన వికటిత మేధ –
మర్మావయవాల పేర్లన్నీ
అచ్చ తెలుగులో పచ్చిపచ్చిగా వర్ణిస్తూ
తిట్ల పంచాంగంలో కవి చౌడప్పను మించటం
ఔషధం లేని పురుషాహంకార వ్రణం
అం అంటూ స్వతంత్ర స్వరమైన అమ్మను
అనుస్వారంలా ఆశ్రయించి బ్రతికిన కొడుకు
అమ్మను ‘నీయమ్మ’ అని ఔడుగరచాడంటే
వాడు సభ్యత అనే కట్టుగొయ్యను త్రెంచుకొని
కొమ్ములు విసిరే మకిరి దున్న.
అః అంటే మకిరి దున్న ముఖ గహ్వరం నుండి
తిట్ల రాళ్ళవాన కురిపిస్తున్నప్పుడు
నీవొక స్త్రీవే కాని అమ్మవు కావు అని అర్థం,
లేకుంటే సంస్కృతం లోని విసర్గలు తెచ్చి
తెలుగక్షరానికి తగిలిస్తే
పదాల సంతతి వర్ధిల్లుతుందా?
అందుకే మగజాతి నిఘంటువులో
సంస్కారం సున్న.

లక్కరాజు నిర్మల
నానీలు

అన్ని బంధాలూ
అనుబంధాలు కావు
త్యాగం లోంచే
అనురాగాలు పుడతాయి.
ఒంటరితనం
దుర్భరమే కాదనను
కాని చెడు స్నేహం కంటే
నయమే కదా !
బురద చల్లావు
బాగుంది
అది నీ చేతులకీ
అంటింది చూసుకో !
ద్వేషించే వారి నుంచి
ప్రేమను ఆశిస్తాం
మరి ప్రేమించే వారికి
దూరం – దూరం.
ప్రస్తుతంలో జీవించు
కాదనను
గతాన్ని మాత్రం
మరువకు.
ఆట – 1, 2, 3

పసుపుపచ్చని పుప్పొడి పరిచినట్టు ఆ చిన్ని చిట్టి పిల్లలు
తుమ్మెదలాడే ఆ కళ్ళు –
తురాయి చెట్టెక్కి పూలను దులిపిన ఆ చేతులు –
సుబ్బయ్య కొట్టుకాడ పప్పు, బెల్లాల కొసరులై,
కొబ్బరాకు బొమ్మల పెళ్ళి సంబరాలమై,
చిట్టి గౌనుల బెత్తాయింపులు
కార్తీకంలో గోదారి స్నానంకి, పసుపు అద్ది అమ్మకి
సాయం అయ్యే ఆరిందాతనం నాకు తెలుసు
చేపపిల్లని దోసిట్లో పట్టి గాల్లో తేలిపోవడం,
ఓసారి తుమ్మగజ్జెల నాట్యంగా
అలవోకగా వొరిగిన ఇంద్రధనుస్సు రంగుల్లో మునిగి తేలడం,
కొమ్మ కొమ్మని తాకే తడి పిచ్చుకై ఎగరడం,
మరి కావిడ బద్ద చుక్కల లెక్కతేలని రాత్రుల్లో నిదరోడాలు నాకు తెలుసు.
క్లాసురూంలోంచి బుల్లితెరపై తోయబడ్డ చైల్డ్‌ లేబర్స్‌ అట మీరు.
సాధన – విస్తృతమైన, వికృతమైన సాధన –
అంటించుకొన్న యవ్వనపు జిలుగులతో, ఒయాసిస్సుల్లేని ఎడారుల వెంట సాధన
లేత బుగ్గలకి మెరుపుల ఆశల్ని పూసితోసిన కెమెరాల నిప్పుల గుండమే అది
తారంగం – తారంగం అరుగు మీది ఆట – పెదవి విరుపుల, పైట జార్చడాల్లో కిక్కిరుసుకుపోయిందేమో
కాళ్ళాగజ్జా కంకాళమ్మా – కంటిసైగల కైపు పాటల్లో వూపిరాడకున్నాయి.
పేదరాసి పెద్దమ్మ కథలకు ఆదుర్దాపడే ఆ చిన్నపాప –
ఏమే, ఏంటే వితండవాదంతో కూరుకుపోయిందేమో…
ఆ కుందేటి సమూహాల పోటి,
ఆ లిల్లీ పూదొంతర్ల తాకట్టు,
గెలుపే లక్ష్యం అనే శిలువల్ని మోస్తూ,
చిట్టి గుండెలను ఆ కొక్కేలకు వేళ్ళాడేస్తూ
ఓటమిలో ఒరిగిన కారుమేఘమై మోకరిల్లినా
పిగిలిన పారిజాతాలై చిత్తడిగా నీరుగారినా
విరిగిన వరుస ఉసిరి పిందెల కొమ్మగా సత్తువ కోల్పోతుంటే
షో అంటే పురివిప్పిన కలల్ని కుదువ పెట్టుకోవడమేనా!
కొండంతగా వున్న స్వప్నాలకు బిరడా బిగింపులేనా!
వెనుతిరిగితే చీకటి తరుముతున్నట్టు
ఇక మిగిలిలేని మీ చిన్నతనం
పేజీలమాటు దాచిన నెమలికన్ను అయిపులేనట్లే
దంతపు భరిణలో ముక్కుపుడక ఒక్కసారిగా మాయమైనట్లే కదా!
పొట్టి పరికిణీ, పెరటి జాజుల
జెడగా మురిసి ముత్యమవ్వాల్సిన పాపాయి
నేడు అర్థనగ్న అభినయాలకు
పైశాచిక కేరింతలైన వాడు –
వాడు ఎడారిలో ఒంటెలపై పిల్లల దౌడుతీయించే అరబ్బుషేక్‌ కాదు కదా!
ప్రతి బాల్యానికి తాళ్ళు పేని వురివేసింది వాడే కదా!
వాడు అవయవాల కళేబరాల వ్యాపారే కదా!

Share
This entry was posted in కవితలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో